
60 ఏళ్లనాటి పోచారం లగ్నపత్రిక
బాన్సువాడ రూరల్(నిజామాబాద్): రాష్ట్ర ప్రభుత్వ వ్యవసా య సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైవాహిక జీవితంలోకి అడుగిడి అరవై ఏళ్లవుతోంది. 1965 మే 12న బాన్సువాడ మండలంలోని ఇబ్రాహీంపేట్‌కు చెందిన పుష్పవతితో ఆయన వివాహం జరిగింది. కాగా వీరి పెళ్లి పత్రికను పోచారం శ్రీనివాస్‌రెడ్డి బావమరిది ఇబ్రాహీంపేట్ మాజీ సర్పంచ్ మాలెపు నారాయణరెడ్డి ఫ్రేం కట్టించి భద్రపరచుకున్నారు.
30 కిలోల మీనం
డొంకేశ్వర్(ఆర్మూర్) : ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో ఓ మత్స్యకారుడి వలకు బొచ్చ రకానికి చెందిన 30 కిలోల భారీ చేప చిక్కింది. డొంకేశ్వర్ మండలం చిన్నయానం గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు ఆదివారం గోదావరిలో చేపల వేటకు వెళ్లారు. భరత్ అనే మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. దీనిని వ్యాపారులకు విక్రయించాడు. ప్రతి వేసవిలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గి 20 నుంచి 30 కిలోల పైబడిన చేపలు మత్స్యకారులకు చిక్కుతున్నాయి.