ఆహ్వాన పత్రిక పేరుతో వాట్సాప్‌లో లింకులు
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: సీజన్‌కు అనుగుణంగా సైబర్ కేటుగాళ్లు కొత్త పంథాలో మోసాలకు తెరదీస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇదే అంశాన్ని వారికి అనుగుణంగా మల్చుకుని కొత్త దందా మొదలుపెట్టారు. వాట్సాప్ మెసేజ్‌లలో పెళ్లి పత్రికల పేరుతో ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైల్స్‌ను క్రియేట్ చేసి పంపుతున్నట్టు పోలీసులు హెచ్చరించారు. తెలియని ఫోన్ నంబర్ల నుంచి ఆహ్వాన పత్రికల పేరిట ఇలాంటి మెసేజ్‌లు వస్తే వాటిలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దని వారు సూచిస్తున్నారు.
ఇలాంటి ఫైల్ ఓపెన్ చేయగానే సైబర్ నేరగాళ్లకు చెందిన సాఫ్ట్‌వేర్ మన ఫోన్లో ఇన్‌స్టాల్ అవడంతోపాటు మన వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, కాంటాక్ట్ నంబర్ల జాబితా సైబర్ నేరగాళ్లకు చేరుతుంది. దీంతో ఫోన్‌ను హ్యాక్ చేసి వారి చేతుల్లోకి తీసుకుంటారని, తర్వాత మన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొట్టడం..డబ్బుల కోసం డిమాండ్ చేయడం వంటి ప్రమాదాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
వాట్సాప్‌తోపాటు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల ఖాతాల నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు, వీడియోలు, డాక్యుమెంట్లు, లింకులు, ఏపీకే ఫైల్స్ వేటిపైనా క్లిక్ చేయవద్దని సూచించారు. ఒక వేళ పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment