సాక్షి, హైదరాబాద్: మాజీ స్పీకర్ పోచారం ఇంటికెళ్లిన బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదైంది. 12 మంది నేతలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోకి బీఆర్‌ఎస్ నాయకులు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు పలువురు హంగామా సృష్టించారు.
తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మరోవైపు.. మాజీ స్పీకర్ పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం శ్రీనివాస్‌కు నివాసం వద్దకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ శ్రేణులు చేరుకున్నారు.
పోచారం కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో వారంతా ధర్నాను దిగారు. ఇక, అంతకుముందు సీఎం రేవంత్ కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment