హైదరాబాద్: ఇప్పటికే ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై మరో కేసు నమోదైంది. నిన్న(గురువారం) ఏసీబీ(ACB) విచారణకు హాజరైన కేటీఆర్.. విచారణ ముగిసిన తర్వాత ర్యాలీగా వచ్చారు.
దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే కారణంతో కేటీఆర్‌పై నమోదైంది. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఏసీబీ విచారణ తర్వాత ఆ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్ కార్యాలయం వరకూ కేటీఆర్ ర్యాలీగా వచ్చారు. దీనిపైనే ఇప్పుడు కేసు నమోదైంది.
తీవ్ర ఉత్కంఠ రేపిన కేటీఆర్ విచారణ
ఏసీబీ విచారణకు కేటీఆర్ విచారణకు హాజరైన క్రమంలో తీవ్ర ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. కేటీఆర్ను అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో విచారణ తర్వాత ఆయన తిరిగి వచ్చేవరకూ ఉత్కంఠ కొనసాగింది. విచారణ ముగించుకుని కేటీఆర్ బయటకు వస్తున్నారనే వార్తలు వచ్చిన వెంటనే బీఆర్‌ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
కేటీఆర్‌ను ఏసీబీ విచారించే క్రమంలో ముఖ్యనేతలంతా పార్టీ కార్యాలయంలోనే ఉండి చర్చల్లో మునిగితేలారు. గురువారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తును నందినగర్ నివాసానికి చేరుకుని ఏం జరుగుతుందో అనే అంశాన్ని నిశితంగా పరిశీలించారు.
మరొకవైపు మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కేటీఆర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన తర్వాత నందినగర్ నుంచి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
ఇదీ కూడా చదవండి: ఇది తొలి పాడ్‌కాస్ట్.. కాస్త బెరుకుగా ఉంది: ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment