అందుకే రాజకీయాలు మాట్లాడాల్సి వస్తోంది.. రేవంత్‌కు హరీష్‌రావు సూటి ప్రశ్నలు | Harish Rao Visits Sri Tej Injured In Sandhya Theatre Incident | Sakshi
Sakshi News home page

అందుకే రాజకీయాలు మాట్లాడాల్సి వస్తోంది.. రేవంత్‌కు హరీష్‌రావు సూటి ప్రశ్నలు

Published Thu, Dec 26 2024 6:03 PM | Last Updated on Thu, Dec 26 2024 6:37 PM

Harish Rao Visits Sri Tej Injured In Sandhya Theatre Incident

సాక్షి, హైదరాబాద్‌: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ నేతల బృందం పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ  సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ గాయపడిన శ్రీతేజ్‌ను కేసీఆర్‌ సూచనతో బీఆర్ఎస్ నేతలం పరామర్శించామని తెలిపారు.

‘‘శ్రీతేజ్ కోలుకుంటున్నారు.. వైద్యానికి స్పందిస్తున్నాడు. స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీతేజ్ కోలుకుని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నాం. కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం భాస్కర్‌ రావు నేతృత్వంలో శ్రీతేజ్‌కు మంచి వైద్యాన్ని అందిస్తోంది. తొక్కిసలాటలో మరణించిన రేవతికి మా ప్రగాఢ సానుభూతి. తాను మరణిస్తున్నా కొడుకు శ్రీ తేజ్‌ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశాo. రేవతి అందరి మనసును కరిగేలా చేసింది’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.

‘‘ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నపుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితి. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదు. గురుకులాల పిల్లల మాతృ మూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రేవంత్ కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు

..సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరు?. రేవంత్ రెడ్డి సోదరులను కనీసం పోలీస్ స్టేషన్‌కు కూడా పిలవరా?. సినీ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం చర్చల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసు.. ప్రేమానురాగాలతో మనసులు గెలవాలి కానీ భయాందోళనలు సృష్టించి కాదు. రాష్ట్రానికి మంచి జరిగితే అందరం హర్షించాలి’’ అని హరీష్‌రావు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement