sri tej
-
అందుకే రాజకీయాలు మాట్లాడాల్సి వస్తోంది.. రేవంత్‌కు హరీష్‌రావు సూటి ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ గాయపడిన శ్రీతేజ్‌ను కేసీఆర్ సూచనతో బీఆర్ఎస్ నేతలం పరామర్శించామని తెలిపారు.‘‘శ్రీతేజ్ కోలుకుంటున్నారు.. వైద్యానికి స్పందిస్తున్నాడు. స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీతేజ్ కోలుకుని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నాం. కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం భాస్కర్ రావు నేతృత్వంలో శ్రీతేజ్‌కు మంచి వైద్యాన్ని అందిస్తోంది. తొక్కిసలాటలో మరణించిన రేవతికి మా ప్రగాఢ సానుభూతి. తాను మరణిస్తున్నా కొడుకు శ్రీ తేజ్‌ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశాo. రేవతి అందరి మనసును కరిగేలా చేసింది’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.‘‘ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నపుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితి. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదు. గురుకులాల పిల్లల మాతృ మూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రేవంత్ కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు..సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరు?. రేవంత్ రెడ్డి సోదరులను కనీసం పోలీస్ స్టేషన్‌కు కూడా పిలవరా?. సినీ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం చర్చల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసు.. ప్రేమానురాగాలతో మనసులు గెలవాలి కానీ భయాందోళనలు సృష్టించి కాదు. రాష్ట్రానికి మంచి జరిగితే అందరం హర్షించాలి’’ అని హరీష్‌రావు చెప్పారు. -
పాయల్ రాజ్‌పుత్ 'మంగళవారం' నుంచి పవర్ఫుల్ సాంగ్ రిలీజ్
‘అమ్మా డంగురు డంగురు డంగురుమా... అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా... హారతందుకో... మమ్ము ఆదుకో..’ అంటూ మొదలవు తుంది ‘గణ గణ మెగాలిరా..’ పాట లిరికల్ వీడియో. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మంగళవారం’ చిత్రంలోనిదీ పాట. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించారు. అజయ్ భూపతి నిర్మాణ భాగస్వామిగా, స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘గణ గణ మెగాలిరా..’ పాట లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరచిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా వీఎం మహాలింగం పాడారు. ‘‘కొన్నేళ్లపాటు జాతరలలో ఈ పాట వినిపిస్తుంది’’ అన్నారు అజయ్ భూపతి. ‘‘ఓ కీలక సందర్భంలో ఈ పాట వస్తుంది’’ అన్నారు నిర్మాతలు. -
Actor Shritej Latest Interview: నటుడు శ్రీతేజ్ ఫుల్ ఇంటర్వ్యూ
-
నటుడు శ్రీతేజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో
-
మహానేత వైఎస్సార్‌కు శ్రీతేజ్ నివాళి
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘లక్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ‘వంగవీటి’లో దేవినేను నెహ్రూ, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూడు పాత్రల్లో ఒదిగిపోయిన నటుడు శ్రీతేజ్. ఈ పాత్రల ద్వారా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే దివంగత మహానేత వైఎస్సార్ 70వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ.. శ్రీతేజ్ కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ‘ఎన్టీఆర్’బయోపిక్ సందర్భంగా వైఎస్సార్ పాత్రలో నటించిన శ్రీ తేజ్.. అప్పటి షూటింగ్ సమయంలో దిగిన ఫోటోలను తన అధికారిక ట్విటర్లో షేర్ చేశాడు. ‘ఒక్క సారి నేను ఆయన పాత్రలోకి ప్రవేశిస్తే నాకు వేరే ప్రపంచమే తెలియదు’అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా బయోపిక్ కోసం వైఎస్సార్ పాత్రకు తనను ఎంపిక చేశాక ఆ మహానేతకు సంబంధించిన అనేక ఫోటోలను కలెక్ట్ చేశానని తెలిపారు. షూటింగ్ సమయంలో వీలుచిక్కినప్పుడల్లా వైఎస్సార్‌లా ఉండేందుకు ప్రయత్నించేవాడినని తెలిపాడు. ఇక ప్రస్తుతం శ్రీతేజ్ హీరోగా నటించిన ‘అక్షర’ విడుదలకు సిద్దంగా ఉంది. వైస్సార్ గారి జయంతి సందర్భంగా మారువలేని కొన్ని విషయాలు #NTRBIOPIC Sep 4th 2018 నన్ను శ్రీ వైస్సార్ గారి రోల్ కి సెలక్ట్ చేసుకున్న రోజు నుండి కలెక్ట్ చేసిన కొన్ని పిక్స్ pic.twitter.com/9WXIMNW6tP — Actor Shritej (@Shritejofficial) July 8, 2019 అసెంబ్లీలో నిలుచొని పోడియం ముందు మాట్లాడినప్పుడు Shri dr #YSR gari ga pic.twitter.com/doPhiQaK3Q — Actor Shritej (@Shritejofficial) July 8, 2019 వేలాదిమంది ఉన్న సభలో ప్రసంగించినప్పుడు Shri dr #YSR gari ga pic.twitter.com/UksrZc0jJS — Actor Shritej (@Shritejofficial) July 8, 2019 లొకేషన్లో ఎప్పుడు టైం దొరికిన అయనలా Shri Dr #YSR gari ga pic.twitter.com/zxr8nkeXH7 — Actor Shritej (@Shritejofficial) July 8, 2019 ఒక్కసారి నేను ఆయన పాత్రలోకి ప్రేవేసిస్తే నాకు వేరేయ్ ప్రపంచము తెలీదు... pic.twitter.com/wimPKB76Nh — Actor Shritej (@Shritejofficial) July 8, 2019 -
ఏ సినిమా చూసినా అందులో నేనే హీరోని!
వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, దేవినేని నెహ్రూ.. ఈ మూడు పాత్రల్లో ఒదిగిపోయిన నటుడు శ్రీ తేజ్. ఈ పాత్రల ద్వారా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలో విడుదల కానున్న ‘అక్షర’లో హీరోగా నటించడంతో పాటు మరికొన్ని చిత్రాలు సైన్ చేసిన శ్రీతేజ్ చెప్పిన విశేషాలు. ► ‘కథానాయకుడు, మహానాయకుడు’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కన్నా ముందే నేను ‘నా సామి రంగా’, ‘తీయని కలవో’, ‘కదిలే బొమ్మల కథ’ సినిమాల్లో హీరోగా చేశా. అవి హిట్ కాలేదు. సినిమా హిట్ అయితేనే మేం జనంలోకి వెళ్లగలుగుతాం. లేకుంటే అది ఎంతమంచి సినిమా అయినా వెళ్లలేం. హిట్‌కి, ఫ్లాప్‌కి ఉన్న డిఫరెన్స్ అదే. ఎన్టీఆర్ ‘కథానాయకుడు, మహానాయకుడు’ సినిమాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాత్ర చేశాను. అది మంచి పేరు తెచ్చింది. అలాగే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చేసిన చంద్రబాబునాయుడిగారి పాత్ర కూడా ప్రశంసలు తెచ్చింది. ► నాది విజయవాడ. బీకాం చదువుకున్నా. చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనే ఫ్యాంటసీలో ఉండేవాణ్ణి. ‘టెర్మినేటర్’ సినిమాని ఇంట్లో వీసీఆర్లో నాన్నగారు చూపించారు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేనే హీరోలా ఫీలై, ప్యాడ్‌ని గన్లా పట్టుకునేవాణ్ణి. ఏ సినిమా చూసినా అందులో హీరో పాత్రలో నన్ను ఊహించుకుంటూ అనుకరించేవాణ్ణి. ► ఏడాదికి 365 రోజులు అయితే అప్పట్లో నాకు 35రోజులే పని. మిగతా రోజుల్లో ఖాళీ. ఈ టైమ్‌లోనే మానసికంగా బలంగా ఉండాలి. ఈలోపు మైండ్ ఖాళీగా ఉంటుంది. ఒక యాక్టర్‌కి ఎంత బాధ ఉన్నాసరే ఆ బాధ మొహంలో కనిపించకూడదు.. బాడీ ఫిట్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడూ బ్రెయిన్లో ఒత్తిడి ఉండకూడదు. అందుకని సోషియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే... డబ్బులు ఖర్చు పెట్టకపోయినా ఫిజికల్‌గా అయినా నా సహకారం ఉంటుంది కదా అని నా ఫ్రెండ్‌తో కలిసి హెల్పింగ్ నేచర్ వర్క్స్ ఉంటే చేసేవాణ్ణి. మొదటి నుంచీ హెల్పింగ్ నేచర్ ఉన్నవాణ్ణి నేను. క్రమశిక్షణగా ఉండటానికి ఎన్సీసీ ఉపయోగపడింది. స్పోర్టివ్‌గా ఉండటానికి స్పోర్ట్స్.. సినిమాలు చూస్తే ఒత్తిడి ఉండదు. ఒక మనిషిని అభివృద్ధి చేయడానికి ఒక్కో అంశం ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ► విడుదలకు సిద్ధమైన ‘అక్షర’లో హీరోగా చేశాను. అయితే అన్ని సినిమాల్లోనూ హీరోగానే చేయాలని ఫిక్స్ కాలేదు. కథని ముందుకు నడిపించడానికి ప్రాధాన్యత ఉన్న ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధం. హిందీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ ఖాన్.. వీళ్లంతా మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. వాళ్లలా చేయాలనుకుంటున్నాను. -
ఆ ప్రశంసను మరచిపోలేను
‘‘నాటకాల్లో నేను అచ్చం ఎన్టీఆర్‌గారిలా చేస్తానని ఎవరో రామ్‌గోపాల్ వర్మగారికి చెప్పారు. అప్పుడు వర్మగారు నాకు ఓ డైలాగ్ పంపించి ఎన్టీఆర్‌గారిలా చేసి పంపమన్నారు. పంపిన వీడియో చూసి ఎన్టీఆర్‌గారి పాత్రకు తీసుకున్నారు’’ అన్నారు విజయ్‌కుమార్. యజ్ఞాశెట్టి, శ్రీతేజ్, విజయ్ కుమార్ ముఖ్య తారలుగా రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా మార్చి 29న ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్‌లో నటించిన విజయ్ కుమార్ (ఎన్టీఆర్), యజ్ఞాశెటి ్ట(లక్ష్మీ పార్వతి), శ్రీతేజ్ (బాబు) హైదరాబాద్‌లో సోమవారం విలేకరులతో ముచ్చటించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘నాకు 45ఏళ్ల నాటకానుభవం ఉంది. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను కానీ సరైనవి రాలేదు. ఎన్టీఆర్‌గారి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన వర్మగారికి థ్యాంక్స్. సినిమాలకు పునాది నాటకాలు. నాటకాలకు ఇప్పుడు కూడా ప్రజాదరణ ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో వందలకొద్దీ కళా పరిషత్‌లు ఉన్నాయి. నాటకానుభవం ఉండటంతో సినిమాలో నటించడం కష్టం అనిపించలేదు. రెండు మూడు రోజులు కొత్తగా అనిపించిందంతే. ఓసారి నా నాటకం చూసిన సి.నారాయణరెడ్డిగారు ‘మా అన్నగారు (ఎన్టీఆర్) కనిపించారు’ అన్నారు. ఆ ప్రశంస మరచిపోలేను. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చేస్తున్నప్పుడు వర్మగారితో మాట్లాడుతుంటే నటరాజుతో మాట్లాడినట్టు అనిపించింది. ‘ఎన్టీఆర్‌గారి పాత్రకు మిమ్మల్ని ఎంపిక చేసుకోవడంతో చాలామంది నన్ను తప్పుబట్టారు. నేను చెప్పినదాంట్లో మీరు కనీసం 50 శాతం నటిస్తే చాలనుకున్నా. కానీ 100 శాతం చేశారు’ అని వర్మగారు చెప్పడం నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్. నటులకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆర్టిస్ట్‌ని ఆర్టిస్ట్‌గానే చూడాలి’’ అన్నారు. శ్రీతేజ్ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నేను కెరీర్ స్టార్ట్ చేసి 13ఏళ్లయినా సరైన బ్రేక్ రాలేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా నా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్. ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడుగారి పాత్ర చాలా బాగా చేశావంటూ అందరూ అభినందిస్తుంటే సంతోషంగా ఉంది. ‘వంగవీటి’లో దేవినేని నెహ్రూగారి పాత్ర, ‘యన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిగారి పాత్ర, ఈ సినిమాలో చంద్రబాబుగారి పాత్ర చేశా. వరుసగా బయోపిక్ చిత్రాల్లో నటిస్తుండటం ఎగై్జటింగ్‌గా ఉంది. నేను రెగ్యులర్ యాక్టర్‌గా ఉండకూడదనుకుంటున్నా. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, నాగభూషణం, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్గార్లలా విలక్షణమైన పాత్రలు చేయాలని ఉంది. ఈ తరంలో మేము వారిలా గొప్ప పాత్రలు చేయడం లేదు. బాలీవుడ్ నుంచి ఇర్ఫాన్‌ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి విలక్షణమైన నటులను టాలీవుడ్‌కి తెచ్చుకుంటున్నాం. వారిలా విలక్షణమైన పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం. ఈ ఏడాది మార్చి 29వ తేదీ శుక్రవారం నా భవిష్యత్‌ని మార్చేసింది. ఇందుకు వర్మగారికి, అగస్త్యమంజుగారికి ధన్యవాదాలు. కొన్ని సినిమాలకు చర్చలు జరగుతున్నాయి’’ అన్నారు. యజ్ఞాశెట్టి మాట్లాడుతూ– ‘‘వర్మగారితో ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా చేశా. ఆ తర్వాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ చేసి, ఓకే చేశారు. ఇందులో లక్ష్మీ పార్వతిగారి పాత్ర నాకు ఓ చాలెంజ్. కథ చాలా సెన్సిటివ్. నాకు తెలుగు రాదు. కానీ, తెలుగు లిటరేచర్ని పెట్టుకుని డైలాగ్స్ నేర్చుకున్నాను. ఈ సినిమా నా కెరీర్లో ఓ మైలురాయి. ప్రస్తుతం బాలాజీ దర్శకత్వంలో ‘9 డైరీస్’ అనే ద్విభాషా చిత్రం (తెలుగు, కన్నడ) చేస్తున్నా’’ అన్నారు. హరికృష్ణ పాత్రధారి గంగాధర్ పాల్గొన్నారు. -
వర్మచెప్పిన ఎన్టీఆర్ కథ
ఎన్టీఆర్ జీవితంలో వెన్నుపోట్ల వెనుక ఉన్న కథను ప్రేక్షకులకు చెప్తానని ప్రకటించిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తాను అనుకున్నది చేసి చూపించాడు. ఎన్టీఆర్ జీవితంలో అందరికీ తెలియాల్సిన క్రూరపథకాలు ఉన్నాయని ఈ సినిమాతో చెప్పాడు. పత్రికలు ఈ విషయాలను ఎప్పుడూ రాయలేదని తొక్కిపెట్టాయని చాటింపు వేశాడు. నిజం నివురుకప్పి ఉన్నా ఎప్పుడో ఒకసారి అగ్నిని వెదజల్లుతుందని ఈ సినిమాతో తేల్చి చెప్పేందుకు ప్రయత్నించాడు. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న కష్టకాలాన్ని, దుఃఖకాలాన్ని, ఆయనను క్షోభకు గురి చేసిన కాలాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో తెర మీదకు తీసుకువచ్చి గతకాలపు జర్నీ చేయించాడు. వర్తమానం పట్ల ప్రేక్షకులకు ఆలోచన కలిగించాడు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో మినహా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం భారీ ఓపెనింగ్స్‌తో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ (ట్యాగ్ లైన్ అసలు కథ) విడుదలైంది. ఏపీలో విడుదల కోర్టు పరిధిలో ఉంది. కథ విషయానికొస్తే... ఇది ఎన్టీఆర్ కథనా లేదా లక్ష్మీ పార్వతి కథనా లేదా లక్ష్మీపార్వతికి తెలిసిన ఎన్టీఆర్ కథనా లేక లోకానికి తెలియని ఎన్టీఆర్ కథనా అనేది సినిమా చూశాకనే ప్రేక్షకులకు తెలుస్తుంది. నిన్నమొన్న వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు (కథానాయకుడు, మహానాయకుడు) వదిలిపెట్టిన అనేక విషయాలు ఈ సినిమాలో కనిపించాయని ప్రేక్షకులు అనుకుంటారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అనే అభిమాని ఎంటరైనప్పటి నుంచి ఎన్టీఆర్ మరణించే వరకు జరిగిన సంఘటనలు ఈ సినిమాలో ప్రధాన కథ. సినిమా కథ ప్రకారం ‘మనదేశం’ పార్టీ స్థాపించి తెలుగువారి విజేతగా నిలిచిన ఎన్టీఆర్ (సినిమాలో నటుడు విజయకుమార్) 1989లో మొదటిసారి ఓడిపోయినప్పుడు చేదు పరిస్థితులు ఎదుర్కొంటాడు. సొంత కుటుంబం, తను నిర్మించుకున్న రాజకీయ కుటుంబం ఒక్కసారిగా దూరం కావడంతో పలకరించే దిక్కు లేక ఇక రాజకీయాలు వద్దు, జీవితాన్ని ఏదో ఒకలా బతికేస్తానని అనుకుంటాడు. ఆ సమయంలో ఆయన జీవితంలోకి వస్తుంది లక్ష్మీపార్వతి (నటి యజ్ఞా శెట్టి). ఆయన జీవిత చరిత్రను రాయడమే తన జీవితాశయమని చెప్పి ఎన్టీఆర్ మనసు ఆకట్టుకుంటుంది. ‘మీరు మామూలు మనిషి కాదు స్వామీ, మీలో చాలా గొప్ప శక్తి ఉంది’ అని ఆయన్ని ఉత్తేజపరుస్తుంది. అలా అడుగుపెట్టిన ఆమె రోజురోజుకూ∙ఆయన జీవితానికి ఎంత దగ్గరయిందీ ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ ఆమెని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందీ కథలో చూపిస్తారు. ఇదంతా ఫస్ట్‌హాఫ్‌లో ఉంటుంది. అయితే వారి బంధాన్ని అప్పటి మీడియా సహకారంతో ఎన్టీఆర్ అల్లుడైన బాబు (సినిమాలో శ్రీతేజ్) లక్ష్మీపార్వతిపై విషం చిమ్మడంతో కథపై పట్టు బిగియటం సెకండ్ హాఫ్‌లో మొదలవుతుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల తరపున రాయబారిలా ఎన్టీఆర్ వద్దకు వెళ్లిన బాబు మీరు చేస్తున్నది తప్పు అని ఎన్టీఆర్‌ను హెచ్చరిస్తాడు. అప్పటి నుంచి బాబుని దూరం పెడతాడు ఎన్టీఆర్. ఆ టైమ్‌లో ఎన్టీఆర్‌ని ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా చేయమని అడుగుతాడు ఒక ఆత్మీయ నటుడు. ఆ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఆ సినిమా 100 రోజుల వేడుక తిరుపతిలో భారీగా చేస్తున్నానని ఆ నటుడు ఆహ్వానితుల జాబితాని ఎన్టీఆర్‌కి చూపిస్తాడు. ఆ జాబితాలో లేని లక్ష్మీపార్వతి పేరుని ఎన్టీఆర్ స్వయంగా రాస్తాడు. అది తెలుసుకున్న బాబు ఎలాగైనా ఆ సభకి ఆమె రాకుండా అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులందర్నీ ఎన్టీఆర్ వద్దకు తీసుకొచ్చి, ఆమె సభకి వచ్చినా ఫర్వాలేదు కానీ, స్టేజ్‌పైకి రానివ్వద్దని ఆంక్షలు విధిస్తాడు. సరేనన్న ఎన్టీఆర్ తిరుపతి సభలో ఆమె గురించి ప్రస్తావించడమే కాక ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తాడు. దాంతో కుటుంబ సభ్యులతో పాటు అందరూ నివ్వెరపోతారు. అక్కడి నుంచి బాబు తన రాజకీయ చదరంగాన్ని ప్రారంభిస్తాడు. ఆమెను అనేకసార్లు దూషించిన బాబు ఆమెకే ఫోను చేసి, సంధి చేసుకుని ఎన్టీఆర్‌కి మళ్లీ దగ్గరవుతాడు. 1994లో మళ్లీ ఎన్టీఆర్ తన చరిష్మాతో అత్యధిక సీట్లు గెలుచుకుని సీఎంగా పగ్గాలు చేపడతాడు. ఇది ఓర్వలేని బాబు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి కుట్రలు పన్నాడు? ఎంతమందిని పావులుగా వాడుకున్నాడు? మీడియాని ఎలా హస్తగతం చేసుకున్నాడు? సీఎంగా ఉన్న ఎన్టీఆర్‌ని ఎలా వెన్నుపోటు పొడిచాడనేది ప్రీ క్లైమాక్స్. సినిమాలో వైశ్రాయ్ ఉదంతాన్ని ఎమోషనల్‌గా చూపించాడు వర్మ. 74 ఏళ్ల వయస్సులో ఒక సీఎం పదవిలో ఉండి ఎంతో జీవితాన్ని చూసిన ఎన్టీఆర్ ఏడుస్తూ ఉండే సంఘటన చూసిన ఎవరైనా చలించిపోతారు. ‘సొంత కొడుకులు, సొంత కూతుళ్లు, అల్లుళ్లు, నా బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు నన్ను వెన్నుపోటు పొడిచారు. చెప్పులతో దాడి చేశారు. ఆ సంఘటన జరిగిన రోజునే నేను చచ్చిపోయాను లక్ష్మీ’ అని ఎన్టీఆర్ అంటారు. విశ్లేషణ ఇది దర్శకుడు వర్మ తాను పరిశోధించి తాను యదార్థమని తలిచి చెప్పిన కథ. ఎన్టీఆర్ వంటి ఓ గొప్పనాయకుడు ఎందుకు ఒంటరివాడయ్యారు? ఆ సమయంలో లక్ష్మీ పార్వతికి ఎలా దగ్గర అయ్యారు? వారి మధ్య ప్రేమ చిగురించడానికి దారితీసిన సంఘటనలు ఏంటి? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది? ఆ కుట్రలకు ముఖ్య కారకులు ఎవరు? ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? వంటి అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టేట్టు చూపించారు. ఎవరెలా చేశారంటే... పాత్రల ఎంపిక విషయంలో వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్టీఆర్ పాత్ర చేసిన రంగస్థల నటుడు పి.విజయ్ కుమార్ ఆహార్యం, హావభావాలు, డైలాగ్ డెలివరీ అచ్చం ఎన్టీఆర్‌ను తలపించింది. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి ఆకట్టుకుంది. ఎన్టీఆర్ పట్ల ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం.. ఇలా అన్ని భావాలను అద్భుతంగా పలికించింది. బాబు పాత్ర చేసిన శ్రీతేజ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించే లా ఉన్నాయి. సాంకేతిక నిపుణుల పనితీరు... నిజజీవిత కథలను తెర మీద మలచడం వర్మకు బాగా తెలుసు. అందుకు నిదర్శనం ఆయన తీసిన ‘రక్తచరిత్ర‘, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ తదితర చిత్రాలు. ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో వర్మ ఈ కథను నడిపారు. ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం, నేపథ్య సంగీతం మరో ప్లస్ పాయింట్. రమ్మీ అందించిన ఫోటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. డైలాగులు... ► నా 70 ఏళ్ల జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం.. ► పాముకు పాలుపోసి పెంచినా అది విషంతోనే కాటేస్తుంది.. వాడూ అంతే... ► జీవితం ఎప్పుడు ఎందుకు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు ► మీరు నా పిల్లలు అయ్యుండి కూడా వాడితో చేరారా సిగ్గు లేకుండా ఛీ.. ► తమ్ముళ్లూ.. వాడి మాట వినకండి.. మీకు నేనున్నా.. ధైర్యంగా బయటకు రండి ► ఇక పార్టీలో ఏ నిర్ణయమైనా నాకు తెలీయకుండా జరగడానికి వీల్లేదు. ► అబద్ధానికి నోరు పెద్దది.. అన్యాయానికి చేతులు పెద్దవి. తారాగణం: విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్ దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాత: రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంగీతం: కల్యాణీ మాలిక్ -
ప్రేమలోని గొప్పతనం
‘‘తియ్యని కల లాంటి ప్రేమకథా చిత్రమిది. ప్రతి సన్నివేశం నవ్విస్తూనే ప్రేమలోని గొప్పతనాన్ని చాటుతుంది’’ అని ‘తీయని కలవో’ చిత్ర దర్శకుడు శివాజి. యు చెప్పారు. ఆయన దర్శకత్వంలో శివకేశవ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బలమూరి రామ్మోహనరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30 విడుదల కానుంది. అఖిల్ కార్తీక్, శ్రీతేజ్, హుదాషా ముఖ్యతారలు. యువతకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని నిర్మాత తెలిపారు. అనుకున్న నిర్మాణ వ్యయంతో తక్కువ సమయంలో సినిమా పూర్తి చేశారని అఖిల్ కార్తీక్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రవీంద్ర ప్రసాద్, కెమెరా: జశ్వంత్, మాటలు: గుర్తి మల్లికార్జున్.