సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన బాలుడి ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వైద్యుల సలహా మేరకు అవసరమైతే విదేశాలకు తరలించైనా వైద్యం అందించాలని బన్నీ వాసు చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా.. పుష్ప-2 థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి మృతి చెందగా.. ఆమె కుమారుడైన శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అవసరమైన ఆర్థికసాయం కూడా అందించారు. అల్లు అర్జున్ సైతం వారి కుటుంబానికి రూ. కోటి రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా దర్శకుడు సుకుమార్ రూ.50లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రూ.50 లక్షలు సాయం అందించారు. శ్రీతేజ్ కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు
Comments
Please login to add a commentAdd a comment