సాక్షి, హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun)కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. పుష్ప2 సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో ఆయనపై బీఎన్‌ఎస్ 105 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నాంపల్లి కోర్టు బన్నీకి 14రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు.
ఆపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఒకరాత్రి జైలులో గడిపిన ఆయన మరుసటిరోజు విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే, రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన కోర్టు అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. రూ.50 వేలు, రెండు పూచీకత్తులు సమర్పించాలని బన్నీని ఆదేశించింది.
ఏం జరిగింది?
డిసెంబర్ 4న ‘పుష్ప2’ బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి మరణించగా ఆమె కుమారుడు ఇప్పటికీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. దీంతో వారి కుటుంబానికి అల్లు అర్జున్ పేరుతో అల్లు అరవింద్ భారీ సాయం ప్రకటించారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రూ. 1 కోటి సాయం ప్రకటించారు. డైరెక్టర్ సుకుమార్ రూ. 50 లక్షలు అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మొత్తం రూ. 2 కోట్ల రూపాయలు చెక్కులను తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్ రాజుకు చిత్ర యూనిట్ అందించింది.
చదవండి: హీరోయిన్‌ను దబిడి దిబిడి ఆడేసుకున్న బాలకృష్ణ.. ఇదేం కర్మరా సామీ!
Comments
Please login to add a commentAdd a comment