హీరోయిన్‌ను దబిడి దిబిడి ఆడేసుకున్న బాలకృష్ణ.. ఇదేం కర్మరా సామీ! | Netizens Trolls On Nandamuri Balakrishna Dabidi Dibidi Song For Vulgar Dance Steps, Deets Inside | Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna: కూతురి వయసున్న నటితో చెండాలమైన డ్యాన్స్‌.. దబిడి దిబిడి ఆడేస్తున్న నెటిజన్లు

Published Fri, Jan 3 2025 4:33 PM | Last Updated on Fri, Jan 3 2025 5:48 PM

Netizens Slam Nandamuri Balakrishna Dabidi Dibidi Song For Vulgar Choreography

తెలుగు చలనచిత్ర పరిశ్రమ పాన్‌ ఇండియా ట్రెండ్‌ను పరిచయం చేసింది. బాహుబలి, పుష్ప, హనుమాన్‌, కల్కి 2898 ఏడీ.. ఇలా ఎన్నో సినిమాలు టాలీవుడ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ అయితే ఇంటర్నేషనల్‌ లెవల్‌లోనూ సత్తా చాటింది. ఇలా ప్రపంచమంతా మనవైపు చూస్తున్న సమయంలో ఓ పాట టాలీవుడ్‌ (Tollywood)ను బెంబేలెత్తిస్తోంది. ఇన్నాళ్లు సంపాదించుకున్న గౌరవం ఏమైపోతుందోనని భయపడిపోతుంది.

కూతురి వయసున్న నటితో చెండాలమైన డ్యాన్స్‌
దీనికంతటికీ ముఖ్య కారణం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ డాకు మహారాజ్‌. బాబీ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాలో తాజాగా దబిడి దిబిడి (Dabidi Dabidi Song) అనే పాట రిలీజ్‌ చేశారు. ఇందులో 64 ఏళ్ల వయసున్న బాలయ్యతో 30 ఏళ్ల వయసున్న బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్టెప్పులేసింది. ఆ స్టెప్పులు చూడటానికే చెండాలంగా ఉన్నాయంటూ నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. పాటలో బాలకృష్ణ డ్యాన్స్‌కు బదులు నటిని కొట్టడమే ఎక్కువగా కనిపిస్తోంది. 

(చదవండి: ఆ హీరోయిన్‌ ఆస్తులు 4600 కోట్లు.. అమితాబ్‌ కంటే ఎక్కువే!)

నీచమైన స్టెప్పులు
ఒక ఎమ్మెల్యే అయి ఉండి డ్యాన్స్‌ పేరుతో ఇంత ఘోరంగా ప్రవర్తిస్తాడా? అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు. తన కూతురి వయసున్న హీరోయిన్‌తో ఇలాంటి నీచమైన స్టెప్పులు వేస్తారా? అని మండిపడుతున్నారు. కొరియోగ్రఫీ దరిద్రంగా ఉందని, డ్యాన్స్‌ పేరుతో ఇంత నీచమైన పనులు చేయిస్తారా? అని దుమ్మెత్తిపోస్తున్నారు. అభిమానులు సైతం దయచేసి ఈ పాటను డిలీట్‌ చేయండంటూ వేడుకుంటున్నారు.

ట్రెండింగ్‌
అటు చిత్రయూనిట్‌ మాత్రం దబిడి దిబిడి పాట ట్రెండింగ్‌లో ఉందని, 5 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయని జబ్బలు చరుచుకోవడం గమనార్హం. తమన్‌ సంగీతం అందించిన ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశాడు. కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ రాశాడు. ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

-

 

 

 

చదవండి: స్వ్కిడ్‌ గేమ్‌ 3 రిలీజ్‌ డేట్‌.. నెట్‌ఫ్లిక్స్‌ కావాలనే లీక్‌ చేసిందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement