కలెక్షన్ల దంచుడు.. బాలకృష్ణతో హీరోయిన్‌ బర్త్‌డే పార్టీ | Pragya Jaiswal Birthday Celebration with Daaku Maharaaj Movie Team | Sakshi
Sakshi News home page

సెంచరీకి చేరువలో డాకు మహారాజ్‌.. హీరోయిన్‌కు బ్లాక్‌బస్టర్‌ బర్త్‌డే

Published Wed, Jan 15 2025 9:03 PM | Last Updated on Wed, Jan 15 2025 9:18 PM

Pragya Jaiswal Birthday Celebration with Daaku Maharaaj Movie Team

డాకు మహారాజ్‌ (Daaku Maharaaj Movie).. మొదట ఈ సినిమాకు అసలు హైపే లేదు. ఎప్పుడైతే దబిడి దిబిడి పాట విడుదలైందో వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దబిడి దిబిడి పాటలో బాలకృష్ణ.. హీరోయిన్‌ ఊర్వశి రౌతేలాను కొడుతున్నట్లుగా అసభ్యకరమైన స్టెప్పులేశాడు. దీనిపై ట్రోలింగ్‌ జరిగే క్రమంలోనే డాకు మహారాజ్‌ సినిమా ప్రచారంలోకి వచ్చింది.

ఏదైతేనేం జనవరి 12న సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రానికి మంచి కలెక్షన్లే వస్తున్నాయి. తొలి రోజు రూ.56 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది. మూడు రోజుల్లోనే రూ.92 కోట్లకు పైగా వసూలు చేసింది. రేపటితో వంద కోట్ల మార్క్‌ను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

బర్త్‌డే వేడుకలు
బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్‌ (Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. సినిమా రిలీజ్‌ రోజే హీరోయిన్‌ ప్రగ్యా బర్త్‌డే. దీంతో చిత్రయూనిట్‌ ఆమె పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా జరిపింది. బాలకృష్ణ కేక్‌ కట్‌ చేసి తనకు తినిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రగ్యా జైస్వాల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

'12 -01 -2025.. ఇది నా బెస్ట్‌ బర్త్‌డే. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారికి, మా సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇంత మంచి పుట్టినరోజు కానుకను ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది నాకు బ్లాక్‌బస్టర్‌ బర్త్‌డేగా మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. డాకు మహారాజ్‌పై మీరు చూపిస్తున్న ప్రేమ మరువలేనిది' అని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ వేడుకల్లో హీరోలు విశ్వక్‌ సేన్‌, సిద్ధు జొన్నలగడ్డ కూడా పాల్గొనడం విశేషం.

 

 

 

చదవండి: పెద్దోడి సినిమాపై చిన్నోడి ప్రశంసలు.. గర్వంగా ఉందంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement