Daaku Maharaaj Movie
-
డాకు మహారాజ్ బ్యూటీకి అన్యాయం? ఓటీటీలో ఆమె సీన్స్ కట్!
సంక్రాంతి హిట్ బొమ్మ డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie) మరికొద్ది గంటల్లో ఓటీటీలోకి రానుంది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. థియేటర్లో అదరగొట్టిన ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 21న) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. అయితే ఇటీవల ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్లో ఊర్వశి రౌతేలాను మిస్ చేయడంతో ఫ్యాన్స్ ఫైరయ్యారు. దీంతో మరో పోస్ట్‌లో ఊర్వశి రౌతేలా సహా డాకు మహారాజ్ మూవీలో నటించిన ప్రధాన పాత్రలు అందరూ ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు.ఊర్వశికి అన్యాయం?ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఈ మూవీలో కేవలం ఐటం సాంగ్‌లో ఆడిపాడటమే కాకుండా ఓ కీలక పాత్రలోనూ నటించింది. ప్రతి ప్రమోషనల్ ఈవెంట్‌కూ హాజరైంది. సినిమా కోసం ఎంతో కష్టపడ్డ ఆమెకు మరోసారి భంగపాటు ఎదురుకానుందట! ఆమె నటించిన సీన్లు ఓటీటీలో కనిపించవంటూ ప్రచారం జరుగుతోంది. ఊర్వశి నటించిన సన్నివేశాలను నెట్‌ఫ్లిక్స్ నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోందని రూమర్లు వ్యాపిస్తున్నాయి. ఈ ప్రచారంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఎంతో కష్టపడిందని, ప్రతి ప్రమోషన్‌కు హాజరైందని, అలాంటి తనకు ఎందుకింత అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. డాకు మహారాజ్అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. థియేటర్లో ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని యథాతథంగా ఓటీటీలోనూ విడుదల చేస్తున్నారట. అంటే ఊర్వశితో బాలయ్య నటించిన సన్నివేశాలు, డ్యాన్స్ స్టెప్పులు ఓటీటీలోనూ చూడొచ్చన్నమాట! డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు.చదవండి: 19 ఏళ్ల వయసులో బట్టతల.. భరించలేకపోయా: ఛావా నటుడు -
డాకు మహారాజ్ ఓటీటీ పోస్టర్.. ఆమె లేకపోవడంపై నెటిజన్స్ ఫైర్!
నందమూరి బాలకృష్ణ కొత్త ఏడాదిలో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రాణించింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఊర్వళి రౌతేలా ప్రత్యేక పాత్రలో మెరిసింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు.అయితే ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్ల్ వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అయితే నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన పోస్టర్ వల్లే వివాదం మొదలైంది. డాకు మహారాజ్లో కీలక పాత్ర పోషించిన ఊర్వశి రౌతేలా ఫోటో లేకపోవడంపై ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ మండిపడుతున్నారు. దబిడి దిబిడి సాంగ్‌లో అభిమానులను ఓ ఊపు ఊపేసిన ఊర్వశికి ఇచ్చే గుర్తింపు ఇదేనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డాకు మహారాజ్ పోస్టర్‌ను ఉద్దేశించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతదేశపు మొదటి మహిళను పోస్టర్ నుంచి తీసేస్తారా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ఉన్నారా?.. మరి పోస్టర్లో కనిపించడం లేదంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. దబిడి దిబిడి సాంగ్ డ్యాన్స్ చేస్తూ పోస్టర్ బయటికి వెళ్లిపోయిందంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తానికి డాకు మహారాజ్ పోస్టర్లో బాలీవుడ్ భామ ఫోటో లేకపోవడం ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju! Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025 -
నిరీక్షణకు తెరపడింది.. డాకు మహారాజ్ ఓటీటీ డేట్ ఫిక్స్
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో ఓటీటీ కోసం సినీ ప్రియులు, నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గతంలోనే ఓటీటీకి వస్తుందని భావించినా అది జరగలేదు. తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈనెల 21 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. దీంతో ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.డాకు మాహారాజ్ కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju! Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025 -
ఓటీటీలో 'డాకు మహారాజ్' ఆలస్యం.. ఆ రూల్ పాటిస్తున్న బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన చిత్రం 'డాకు మహారాజ్'.. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే చాలాచోట్ల థియటర్ రన్ ముగిసింది. కానీ, ఓటీటీలో ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి రేసులో వచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇప్పటికే ఓటీటీలో రన్ అవుతుంది. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్కు రావచ్చని చిత్ర యూనిట్ సమాచారం ఇచ్చింది. కానీ, డాకు మహారాజ్( Daaku Maharaaj) ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు మరింత సమయం పట్టేలా ఉంది.డాకు మహారాజ్ ఓటీటీ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్కు వస్తుందని నెట్టింట భారీగా వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని తేలిపోయింది. డాకు మహారాజ్ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ, స్ట్రీమింగ్ వివరాలను ఎక్కడా కూడా ప్రకటించలేదు. అందుకు ప్రధాన కారణం సినిమా నిర్మాతలతో చేసుకున్న ఒప్పందమే అని తెలుస్తోంది.డాకు మహారాజ్ సినిమా విడుదలైన రోజు నుంచి 50 రోజుల థియేటర్ రన్ పూర్తయిన తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిబంధనను చిత్ర యూనిట్ పాటిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు, హిందీ వర్షన్లో విడుదలైంది. అయితే, ఓటీటీ కోసం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారు. ఆ భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయట. అవి పూర్తి అయ్యేందుకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఓటీటీ కోసం మరికొన్ని సీన్లు కూడా అధనంగా జోడించనున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా మార్చి 4న 'డాకు మహారాజ్' ఓటీటీ ఎంట్రీ ఉండొచ్చని తెలుస్తోంది.బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషించారు. వీరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించగా భారీ బడ్జెట్‌తో నాగవంశీ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
నెల రోజుల్లోపే ఓటీటీకి డాకు మహారాజ్.. ఆ డేట్ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద రాణించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ వారంలోనే డాకు మహారాజ్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.కాగా.. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషించారు. వీరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.#DaakuMaharaj OTT Release Sets to Premeire This Sunday on Netflix In Tamil Telugu Malayalam Kannada pic.twitter.com/SQbZvxNEqM— SRS CA TV (@srs_ca_tv) February 3, 2025 -
ఓటీటీలో సంక్రాంతి సినిమాలు.. ఫిబ్రవరిలో మళ్లీ పోటీ
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా విడుదలైన టాప్ సినిమాలు ఫిబ్రవరి నెలలో ఓటీటీకి రానున్నాయి. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ విడుదలయ్యాయి. అయితే, వీటన్నింటిలో వెంకటేశ్ మూవీనే సంక్రాంతి విన్నర్‌గా నిలిచిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో కూడా ఈ చిత్రమే పైచెయి సాధించింది. ఇప్పుడు మళ్లీ ఈ మూడు సినిమాలు ఓటీటీలో పోటీ పడనున్నాయి.'గేమ్ ఛేంజర్'-- అమెజాన్ ప్రైమ్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్ ఛేంజర్ (Game Changer) చేరిపోయింది. అయితే, ఫేక్ కలెక్షన్స్ ఇచ్చారంటూ నెట్టింట భారీగా ట్రోల్స్ రావడంతో తరువాతి రోజుల్లో వాటి వివరాలు ప్రకటించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ఫిబ్రవరి 14న గేమ్ ఛేంజర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.'డాకు మహారాజ్'--నెట్ఫ్లిక్స్నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్'(Daaku Maharaaj) బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే, నైజాం, హిందీ ఏరియాలో ఏమాత్రం కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. బాబీ లొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న విడుదలైంది. సుమారు రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ డేట్‌పై రూమర్లు స్ట్రాంగ్‌గానే వినిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్(Netflix) వేదికగా ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ వంటి స్టార్స్ నటించారు.'సంక్రాంతికి వస్తున్నాం'-- జీ5విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam). ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ మార్క్‌కు దగ్గరలో ఉంది. ఈ సినిమాతో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్‌కు మంచి లాభాలు వచ్చాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకుంది. వాస్తవంగా ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలోకి రావాలి. కానీ, థియటర్ రన్ మెరుగ్గా ఉండటంతో వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కావచ్చు. -
మీ తెలుగోడు నా జీవితాన్నే మార్చేశాడు.. డైరెక్టర్‌తో బాబీ డియోల్
బాబీ డియోల్(Bobby Deol) ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరో.. ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేసిన నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. 1995లో విడుదలైన 'బర్సాత్' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత సోల్జర్,రేస్ 3,ఓం శాంతి ఓం, క్రాంతి,దోస్తానా, కిస్మత్, హీరోస్, హౌస్‌ఫుల్ 4 వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. అయితే, కెరీర్ పరంగా ఒకానొక సమయంలో వరుస పరాజయాలు దక్కడంతో సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఎంతో కుంగుబాటుకు గురయ్యారు. చివరకు భార్య సంపాదన మీద ఆధారపడుతున్నాడు అనే మాటలు కూడా ఆయనపై వచ్చాయి. ఒక్క ఛాన్స్‌తో రీ ఎంట్రీ కోసం ఎన్నో నిర్మాణ సంస్థలను కలిశారు. కానీ, ఎవ్వరూ ఇవ్వలేదు. కానీ, ఒక్క సినిమాతో ఆయన జీవితం మారిపోయింది. ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపుగా 15 ఏళ్లు ఇంట్లోనే కూర్చున్న బాబీ డియోల్‌కు ఇప్పుడు మళ్లీ ఛాన్సులు వస్తున్నాయి. ఇదంతా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వల్లే జరిగిందని బాబీ డియోల్ అన్నట్లు ప్రముఖ తెలుగు దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli) చెప్పారు.యానిమల్( Animal) సినిమా తర్వాత డాకు మహారాజ్‌తో బాబీ డియోల్ తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. అయితే, ఆయన జీవితానికి సంబంధించిన పలు విషయాలు డైరెక్టర్ బాబీ కొల్లి ఇలా చెప్పారు. 'యానిమల్ సినిమా తర్వాత బాబీ డియోల్ బిజీ అయిపోయాడు. మళ్లీ వరుస సినిమా ఛాన్సులతో స్పీడ్ పెంచాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని తెలిసిందే. ఇదే విషయాన్ని బాబీ డియోల్ కూడా బహిరంగంగానే ఒప్పుకున్నాడు. మీ తెలుగోడు నా జీవితాన్ని మార్చేశాడు అంటూ.. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనం ఆయన్ను టచ్ చేస్తే చాలు ఏడ్చేస్తున్నాడు. అంతలా మన తెలుగువారిని బాబీ డియోల్ ప్రేమిస్తున్నాడు.' అని డైరెక్టర్ బాబీ కొల్లి పంచుకున్నారు.బాబీ డియోల్ కన్నీళ్లకు కారణాలు కూడా ఉన్నాయి. 2012 తర్వాత ఆయనకు సరైన సినిమాలు లేవు. ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ, పలితం దక్కలేదు. దీంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. తన భార్య సంపాదనతోనే ఉండేవాడని ఒక బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది. ఒక ఇంటర్వ్యూలో తన కుమారుడి మాటలను ఆయన ఇలా గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ' నేను ఇంట్లో ఉండగానే నా కుమారుడు తన తల్లి వద్దకు వెళ్లి నాన్న ఎప్పుడూ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు..? ఎలాంటి పని చేయడా..? అని ప్రశ్నించాడు. అప్పుడు చాలా బాధ అనిపించింది. వాడు పుట్టక ముందే నేనొక సూపర్‌స్టార్. కానీ, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఫెయిల్యూ స్టార్‌ని అని నా మనసులో అనుకున్నా.' అని బాబీ డియోల్ గతంలో పంచుకున్నాడు. (ఇదీ చదవండి: మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్)సరిగ్గా అలాంటి సమయంలోనే ఆయనకు యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆయన దశ తిరిగింది. పాన్ ఇండియా రేంజ్లో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందుకే సందీప్ రెడ్డి అంటే బాబీ డియోల్‌కు చాలా ఇష్టం. యానిమల్ తర్వాత అతని లైఫే మారిపోయింది. హరిహర వీరమల్లు, హౌస్‌ఫుల్ 5, ఆల్ఫా, విజయ్ 69 ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝕍𝕠𝕟𝕘𝕠𝕕 𝕗𝕠𝕣𝕖𝕧𝕖𝕣 ♾️🛐 (@vongod_forever) -
Pragya Jaiswal : గోల్డ్ కలర్ టాప్‌లో ‘డాకు’ బ్యూటీ
-
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
హీరోయిన్ వీడియో.. కావాలనే చేశారట!
సినీ తారలకు ట్రోలింగ్ మాములే. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఎలాంటి తప్పు చేయకున్నా.. ట్రోల్స్ చేస్తుంటారు. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా దారుణంగా అవమానిస్తారు. తీరా అసలు విషయం తెలిశాక అయ్యో..అలా జరిగిందా అంటారు. అలాంటి ఘటన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)కు కూడా ఎదురైంది. ఆమెకు సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అయింది. అది స్వయంగా ఊర్వశీనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడ్డారు. నెగెటివ్ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. ట్రోలింగ్ తట్టుకోలేక ఆ వీడియోనే డిలీట్ చేసింది. కానీ ఆమె వీడియో లీక్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. పైగా అది ఆమె ప్రైవేట్ వీడియో కాదు.. ఓ సినిమాలోని సన్నివేశం. మరి ఆ సీన్‌ని లీక్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది?కావాలనే లీక్గతఏడాది జులై లో ఊర్వశి బాత్రూం వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసి నెటిజన్స్ అంతా షాకయ్యారు. ఇంత ఓపెన్‌గా బాత్రూం వీడియోను ఎలా షేర్ చేస్తారంటూ ఆమెపై మండిపడ్డారు. ఆ వీడియోను దారుణంగా ట్రోల్స్ చేయడంతో చివరకు ఊర్వశీనే అది డిలీట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వీడియో లీక్‌పై ఊర్వశీ వివరణ ఇచ్చింది. ‘అది నా ప్రైవేట్ వీడియో కాదు. ఘుస్పైథియా(Ghuspaithiya) సినిమాలోని ఓ సన్నివేశం. అది మాత్రమే లీక్ చేయడానికి ఓ పెద్ద కారణం ఉంది. ఆ సినిమా మేకర్స్ ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. ఆస్తులన్నీ అమ్మి సినిమా తీశామని.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయామని బాధ పడ్డారు. బాత్రూం వీడియో లీక్ చేస్తే సినిమాకు బజ్ వస్తుందని రిక్వెస్ట్ చేశారు.అలాగే అమ్మాయిలకు అవగాహన కలిగించినట్లు కూడా ఉంటుందని చెప్పారు. నేను ఆ ఉద్దేశంతోనే ఆ వీడియోని లీక్ చేశాను. ఇదంతా మేకర్స్ అనుమతితోనే జరిగింది. ఆ బాత్రూం సీన్ చూసి అమ్మాయిలు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారని అలా చేశాం. అలాగే మేకర్స్ కూడా అప్పుల బాధ నుంచి బయటపడతారని అలా చేశాను’ అని ఊర్వశీ చెప్పుకొచ్చింది. కాగా, 2018లో విడుదలైన హేట్ స్టోరి 4 లో ఓ సాంగ్ కోసం ఊర్వశీతో ఇలా కొన్ని బాత్రూం సీన్స్ షూట్ చేశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోసారి ఊర్వశీ బాత్రూం వీడియో లీక్ అవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు అసలు విషయం తెలిసి.. మంచి పనే చేశావ్లే అని ఆమెను ప్రశంసిస్తున్నారు.టాలీవుడ్లో ఫుల్ క్రేజీఊర్వశీ రౌతేలాకు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ పెరిగింది. స్పెషల్ సాంగ్స్‌కి ఫేవరేట్‌గా మారింది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌కి స్టెప్పులేసిన ఊర్వశీ..తాజాగా ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj)లో బాలయ్యతో కలిసి చిందులేసింది. ‘దబిడిదిబిడి’ అంటూ సాంగే ఈ ఐటం సాంగ్స్ స్టెప్పులపై కూడా దారుణమైన ట్రోలింగ్ జరిగింది. కానీ బాలయ్యతో పాటు ఊర్వశీ కూడా ఆ ట్రోలింగ్‌ని పట్టించుకోకుండా..సక్సెస్ పార్టీలోనూ అలాంటి స్టెప్పులే వేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
డాకు మహారాజ్లో ప్రగ్యా జైస్వాల్ షూటింగ్ స్టిల్స్ (ఫోటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే?
సంక్రాంతి బరిలో దిగిన గేమ్ ఛేంజర్ సినిమా సైలెంట్ అయిపోయింది. మొదట్లో డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie) బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టగా దాన్ని సైతం వెనక్కు నెడుతూ టాప్ ప్లేస్‌లో నిలబడింది సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie). జనవరి 14న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వరద పారిస్తోంది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.165 కోట్లకు పైగా రాబట్టింది. ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డుకెక్కిందని చిత్రయూనిట్ ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్ధలు కొట్టింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. యూకెలో 1,95,628 పౌండ్లు వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.డాకు మహారాజ్ కలెక్షన్స్ ఎంత?డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి ఎనిమిది రోజుల్లో రూ.156 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌లో మెరిసింది. తమన్ సంగీతం అందించగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరించాడు. #SankranthikiVasthunam is redefining MASS with it’s CLASS FAMILY ENTERTAINMENT🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam joins the elite 100Crore+ share club in just 6 days 💥💥💥ALL TIME HIGHEST FOR VICTORY @Venkymama ❤️🔥ALL TIME #2 HIGHEST FOR Hit Machine @AnilRavipudi ❤️🔥… pic.twitter.com/zjjrKwNoJk— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025Victory @venkymama is firing on all cylinders with #SankranthikiVasthunam at the box office🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam has now become the ALL-TIME HIGHEST COLLECTED FILM IN AP & TS on its 6th day💥💥💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶… pic.twitter.com/dv97e3aeVl— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025The KING OF SANKRANTHI roars louder with every passing day 🪓🔥#DaakuMaharaaj storms past 𝟏𝟓𝟔+ 𝐂𝐫𝐨𝐫𝐞𝐬 Gross Worldwide in 8 DAYS 💥Celebrate the unstoppable reign of 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna in cinemas near you ❤️🔥… pic.twitter.com/hHvfs5Ac28— Sithara Entertainments (@SitharaEnts) January 20, 2025 చదవండి: వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను! -
'గేమ్ ఛేంజర్' డిజాస్టర్‌గా మిగిలింది.. డాకు మహారాజ్ బ్యూటీ కామెంట్స్
బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) మరోసారి తన మాటలతో వైరల్ అవుతుంది. కొద్దిరోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పింది. తాజాగా గేమ్ ఛేంజర్( Game Changer) సినిమా రిజల్ట్ గురించి ఊర్వశి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి రేసులో పోటీ పడిన చిత్రాల్లో గేమ్ ఛేంజ్ర్ కాస్త నిరాశ పరిచిన మాట వాస్తవమే అయినప్పటికీ ఊర్వశి చేసిన కామెంట్లు చరణ్ అభిమానుల్లో కోపాన్ని తెప్పించేలా ఉన్నాయి.డాకు మహరాజ్(Daaku Maharaaj) సినిమాలో బాలకృష్ణతో స్టెప్పులేసిన ఊర్వశికి మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆమె తాజాగా బాలీవుడ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. సినిమాలో తన పాత్రకు మంచి మైలేజ్ వచ్చిందని ఇలా మాట్లాడింది. 'బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయ్యింది. కానీ, నేను నటించిన డాకు మహరాజ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో నా తప్పు అయితే లేదు. సినిమా బాగా లేకున్నప్పటికీ పెయిడ్ పీఆర్లు సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకున్నా జనాలు తిప్పికోడతారు.' అని ఊర్వశి చెప్పుకోచ్చింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.(ఇదీ చదవండి: అదివారం నాడు ఒక సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ)చాలామంది ఈ రెండు సినిమాల గురించి సోషల్‌మీడియాలో పలు కామెంట్లు చేస్తున్నారని ఊర్వశి పేర్కొంది. కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిందని అంటూనే ఊర్వశి రౌటేలా నటించిన డాకు మహారాజ్ సూపర్ హిట్ అయిందని చాలామంది తెలుపుతున్నారని ఆమె తెలిపింది. శంకర్ సర్ చాలా ప్రసిద్ధ దర్శకుడని ఆమె చెప్పింది. ఆయనతో ఇండియన్ 2లో కూడా పనిచేశానని గుర్తుచేసింది. ఆ సినిమాకు కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ, అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించలేదని ఆమె అభిప్రాయపడింది.వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్- కియారా అద్వానీ జంటగా గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించారు. సుమారు రూ. 450 కోట్లతో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పరంగా పెద్దగా రాబట్టలేకపోయింది. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ (10రోజులు) ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సక్నిల్క్ వెల్లడించింది. అయితే, తొలి రోజే ఈ చిత్రానికి రూ. 186 కోట గ్రాస్ వచ్చినట్లు మూవీ టీమ్ పేర్కొంది. దాంతో సోషల్‌మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత కలెక్షన్స్ వివరాలను మూవీ టీమ్ వెల్లడించలేదు.Kiara's #GameChanger is a disaster and my film #DaakuMaharaaj is a blockbuster. - @UrvashiRautela pic.twitter.com/ieKUHB9UIP— Telugu Chitraalu (@TeluguChitraalu) January 19, 2025 -
అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ
'డాకు మహారాజ్'(Daaku Maharaaj) భారీ విజయం సాధించడంతో బాలకృష్ణ (Balakrishna) ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ. 130 కోట్లు సాధించింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు. సినిమా సక్సెస్‌లో భాగంగా మూవీటీమ్ తాజాగా యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే, బాలయ్యకు సండేతో(Sunday) ఉన్న ఒక సెంటిమెంట్ గురించి పంచుకున్నారు.నిజ జీవితంలో ఒక సెంటిమెంట్ అనుసరిస్తానని బాలకృష్ణ ఇలా అన్నారు. ఆదివారం రోజు నేను నలుపు రంగు దుస్తులు అసలు ధరించను. ఆదివారం అంటే నాకు బ్లాక్ డేంజర్. ఒకవేళ అలా వేసుకుంటే నాకు చాలా ప్రమాదం. నాది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దానిని పాటిస్తున్నాను. ప్రత్యాది దేవతలు ఉంటారనేది నమ్ముతాను. అందుకే ఆదివారం నలుపు ధరించను. అయితే, ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ ధరించాల్సి వచ్చింది. అయితే, ఈ డ్రెస్ వద్దని నేను ముందే చెప్పాను. కానీ, దర్శకులు చెప్పారు కాబట్టి తప్పలేదు. ఏదో నష్టం జరగబోతుందని ముందే గ్రహించాను. అదేరోజు రాక రాక బాలసుబ్రమణ్యం కూడా షూటింగ్ సెట్స్‌లోకి వచ్చారు. ఆయన కళ్ల ముందే కిందపడిపోవడంతో నా నడుము విరిగింది. అయితే, ఆయన రావడం వల్లే ఇలా జరిగిందనుకొని ఆ తర్వాత బాలసుబ్రమణ్యం మళ్లీ షూటింగ్ ప్రాంతంలోకి రాలేదు. ఆయన కూడా చాలా కంగారుపడ్డారు.' అని ఆదివారంతో తనకు ఉన్న సెంటిమెంట్‌ను బాలయ్య పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానున్న నయనతార, సిద్ధార్థ్ సినిమా)యాంకర్ సుమతో మూవీ టీమ్ పాల్గొన్న ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది. బాలకృష్ణతో పాటు ఈ సినిమా డైరెక్టర్ బాబీ, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. తాను షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని బాలయ్య వెల్లడించారు. ఇంటి పక్కనే షూటింగ్ జరుగుతున్నా కూడా అక్కడి ఆహారమే తింటానని ఆయన చెప్పారు.బాలకృష్ణ జాతకాలను ఎక్కువగా నమ్ముతారనే సంగతి చాలామందికి తెలిసిందే.. ఏదైనా ఒక శుభకార్యం అంటూ మొదలుపెడితే ముహూర్తాలను అనుసరిస్తూనే ప్లాన్ చేసుకుంటారు. సినిమా రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్ విషయంలో కూడా బాలయ్య సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయన మెడలో రుద్రాక్షతో పాటు చేతికి జాతక ఉంగరాలు ధరిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామునే తన ఇంట్లో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాతే దిన చర్య ప్రారంభిస్తారు. -
తెలుగు సినిమా స్థాయి పెరిగింది: బాలకృష్ణ
‘‘ఇతర దేశస్తులు కూడా మన సినిమాలను చూసి, ప్రశంసించే స్థాయికి తెలుగు చలన చిత్రసీమ ఎదిగింది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆదరిస్తారు. ‘డాకు మహారాజ్’ విజయంతో ఇది మరోసారి రుజువైంది’’ అని బాలకృష్ణ అన్నారు. ఆయన టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’.ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయింది. రిలీజైన ఐదు రోజుల్లోనే రూ. 114 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌తో ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్‌గా ప్రదర్శితమవుతోందని చిత్రబృందం పేర్కొంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రతి సినిమాని ఓ చాలెంజ్‌గా తీసుకుని చేస్తాను.వరుసగా ఇది నాకు నాలుగో (‘అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్’) విజయం. ప్రతి నటుడి నుంచి అందమైన హావభావాలను రాబట్టుకోగలిగాడు బాబీ. తమన్ ఇంటి పేరును అభిమానులు మార్చేశారు. నేనైతే ఎన్బీకే తమన్ అని నామకరణం చేస్తున్నాను. అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన ఉన్న నాగవంశీ నా అభిమాని కావడం నాకు గర్వంగా ఉంది’’ అని మాట్లాడారు. ‘‘బాలకృష్ణగారి ఫిల్మోగ్రఫీలో గుర్తుండిపోయే సినిమాలా ‘డాకు మహారాజ్’ ఉండాలని మొదలుపెట్టాం.డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు రావడం చాలా ఆనందంగా ఉంది. ఓ దర్శకుడికి ఇంతకన్నా ఆనందం మరొకటి ఉండదు’’ అన్నారు దర్శకుడు బాబీ. ‘‘జనవరి 12న ‘డాకు మహారాజ్’ విడుదలైతే, సంక్రాంతి పండగ రోజుకే మా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌కి వెళ్లిపోయారు. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చినప్పుడే నిర్మాతలకు నిజమైన ఆనందం’’ అని పేర్కొన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. -
ట్రోలర్స్‌పై తమన్ ఆవేదన.. చిరంజీవి కామెంట్స్
డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ (Thaman) చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమాను ట్రోల్ చేస్తున్న వారిని చూస్తుంటే భయంతో పాటు సిగ్గుగా ఉందని ఆయన అన్నారు. ట్రోల్స్ చేసుకుంటూ మన సినిమాను మనమే చంపేస్తున్నామని తమన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా సోషల్ మీడియా వేదికగా తమన్ కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు.'డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అనిపించింది. (ఇదీ చదవండి: కలిసి మాట్లాడుకుందాం.. నేను ఒంటరిగానే వస్తా: మనోజ్)విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఉచితమే, ఒక్కోసారి ఆ మాటలు కొందరికి స్ఫూర్తిగా నిలిస్తే.. మరొకరిని నాశనం చేస్తాయి. అయితే, ఆ మాటల ఎంపిక మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది' అని చిరు అన్నారు. ట్రోలర్స్‌పై తమన్ వ్యాఖ్యలుసినిమాలపై ట్రోలింగ్ గురించి తమన్ ఇంకా ఏమన్నారంటే.. జీవితంలో విజయం చాలా గొప్పది. అది లేకపోతే మనుషుల్ని తక్కువ చేసి చూస్తారు. మేమంతా కూడా ఆ విజయం కోసం పోరాడుతుంటాం. జీవితం ముందుకు సాగడానికి విజయం దోహదపడుతుంది. ప్రస్తుతం ఒక నిర్మాత విజయాన్ని అందుకుంటే దాని గురించి బహిరంగంగా మాట్లాడటం కష్టంగా మారింది. నిర్మాతలు మనకు దేవుళ్లతో సమానం. కాబట్టి హీరోలతో పాటు ఫ్యాన్స్, చిత్ర పరిశ్రమలో ఉన్న అందరూ వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతోంది. అలాంటి వాటి వల్ల సినిమా చాలా నష్టపోతుంది. నేను బాలీవుడ్, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు వెళ్ళినప్పుడు అక్కడివారు ఏదైనా మంచి తెలుగు సినిమా చేయాలని ఉందని నాతో అంటూ ఉంటారు. కానీ, మనవాళ్లు తెలుగు సినిమాలను చులకనగా చూస్తున్నారు. ఇది ఎంతో దారుణమైన విషయం. మనమే మన సినిమాని చంపేస్తుంటే ఎలా..? ఒక సినిమా విజయం గురించి కూడా బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. మీకేవైనా ఇబ్బందులు ఉంటే.. వ్యక్తిగతంగా మీరు మీరు తిట్టుకోండి. కానీ, సినిమాను మాత్రం చంపొద్దు' అని అన్నారు.Dear @MusicThaman నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025"ఏం బతుకు బతుకుతున్నామో అర్థంకావట్లేదు... మనమే మన సినిమాని చంపేస్తున్నాం..." - Thaman pic.twitter.com/wmNpyakIf1— Aryan (@chinchat09) January 18, 2025 -
‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ ఈవెంట్ (ఫొటోలు)
-
కియారా సినిమా డిజాస్టర్.. ఊర్వశి మూవీ బ్లాక్‌బస్టర్.. బ్యూటీ రియాక్షనిదే!
ఎప్పుడొచ్చామన్నది కాదు హిట్టు కొట్టామా? లేదా? అన్నదే ముఖ్యం! ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వచ్చాయి. అందులో మొట్ట మొదట రిలీజైన మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer Movie). రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు భారీగానే వసూళ్లు రాబట్టినా మిక్స్డ్ టాక్ వల్ల రెండో రోజు నుంచి డీలా పడిపోయింది.దబిడి దిబిడి పాటపై ట్రోలింగ్రెండు రోజుల గ్యాప్‌తో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ (Daaku Maharaaj Movie)తో థియేటర్లలో అడుగుపెట్టాడు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు జోరందుకున్నాయి. దబిడి దిబిడి పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో బాలయ్య చేసిన స్టెప్పులపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కానీ అవేవీ సినిమా విజయానికి అడ్డుగా నిలవలేదు.సంక్రాంతి విన్నర్?చివరగా జనవరి 14న విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam)తో వచ్చాడు. వస్తూనే పండగ మోసుకొచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. మౌత్ టాక్‌తోనే ప్రేక్షకుల్ని థియేటర్ల వద్దకు రప్పించగలిగాడు. రూ.100 కోట్లు అందుకోవడానికి డాకు మహారాజ్‌కు నాలుగు రోజులు పడితే సంక్రాంతికి వస్తున్నాం మాత్రం మూడు రోజుల్లోనే సెంచరీ క్లబ్లో చేరింది.(చదవండి: కట్టెలపొయ్యి మీద చేపల పులుసు వండిన నాగచైతన్య)అభిప్రాయాలు గౌరవిస్తాఇకపోతే దబిడి దిబిడి సాంగ్‌లోని స్టెప్పులపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. సక్సెస్ వెంట విమర్శలు కూడా ఉంటాయి. ఈ పాటపై జరుగుతున్న చర్చను నేను అర్థం చేసుకోగలను. నందమూరి బాలకృష్ణతో చేసిన డ్యాన్స్ విషయానికి వస్తే.. మా పర్ఫామెన్స్ గురించి పలువురూ పలురకాలుగా అభిప్రాయపడుతున్నారు. అందరి అభిప్రాయాలను నేను గౌరవిస్తాను.అది ఒక కళఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో డ్యాన్స్ అంటే కేవలం పర్ఫామెన్స్ మాత్రమే కాదు.. కళపై నాకున్న గౌరవాన్ని సెలబ్రేట్ చేసుకోవడంగా ఫీలవుతాను. ఇదంతా కళలో ఒక భాగం. . మేము వేసిన ప్రతి స్టెప్ కూడా మమ్మల్ని మరింత అందంగా చూపించింది. ఆయనతో పని చేయడం వల్ల నా కల నిజమైనట్లుగా ఉంది అని చెప్పుకొచ్చింది.నేనేం చేయలేదుకియారా అద్వానీ గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడుతూ.. మనం నటించిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మనకంటూ ఓ క్రేజ్ తీసుకొస్తాయి. ఉదాహరణకు.. 2025లో రూ.100 కోట్లు రాబట్టిన ఫస్ట్ అవుట్‌సైడర్ నటిగా ఓ రికార్డు ఇచ్చారు. ఇది మనకు ఇండస్ట్రీ ఇచ్చే గుర్తింపు. దీనివల్ల మన యాక్టింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. నేను కొన్ని ట్వీట్స్ చూశాను.. కియారా అద్వానీ సినిమా డిజాస్టర్ అయింది. కానీ ఊర్వశి సినిమా బ్లాక్‌బస్టర్ అని రాశారు. అందులో నా హస్తం ఏమాత్రం లేదు అని ఊర్వశి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) చదవండి: సారీ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు.. ఎందుకో తెలుసా? -
హీరోయిన్ బర్త్‌డే పార్టీలో బాలయ్య సందడి (ఫోటోలు)
-
సంక్రాంతి ప్రత్యేకం
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగతో చిత్ర పరిశ్రమకు ప్రత్యేక అనుబంధం ఉంది. సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడుతుంటారు. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని తమ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్, లుక్స్‌ని విడుదల చేశారు పలువురు మేకర్స్. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... రాజా సాబ్ ఆగయాప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో రూపొందుతోన్న ‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. షూటింగ్ తుదిదశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.అందమైన లైలాహీరో విశ్వక్ సేన్ లైలాగా మారారు. ఆయన అబ్బాయిగా, అమ్మాయిగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీలో తొలిసారి లైలా అనే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా నుంచి లైలాగా విశ్వక్ సేన్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జాస్మిన్ వచ్చేశారు‘బబుల్ గమ్’ మూవీ ఫేమ్ రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’ మూవీతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ , టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. సంతానప్రాప్తిరస్తువిక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నుంచి విక్రాంత్, చాందినిల స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
కలెక్షన్ల దంచుడు.. బాలకృష్ణతో హీరోయిన్ బర్త్‌డే పార్టీ
డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie).. మొదట ఈ సినిమాకు అసలు హైపే లేదు. ఎప్పుడైతే దబిడి దిబిడి పాట విడుదలైందో వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దబిడి దిబిడి పాటలో బాలకృష్ణ.. హీరోయిన్ ఊర్వశి రౌతేలాను కొడుతున్నట్లుగా అసభ్యకరమైన స్టెప్పులేశాడు. దీనిపై ట్రోలింగ్ జరిగే క్రమంలోనే డాకు మహారాజ్ సినిమా ప్రచారంలోకి వచ్చింది.ఏదైతేనేం జనవరి 12న సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రానికి మంచి కలెక్షన్లే వస్తున్నాయి. తొలి రోజు రూ.56 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది. మూడు రోజుల్లోనే రూ.92 కోట్లకు పైగా వసూలు చేసింది. రేపటితో వంద కోట్ల మార్క్‌ను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.బర్త్‌డే వేడుకలుబాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సినిమా రిలీజ్ రోజే హీరోయిన్ ప్రగ్యా బర్త్‌డే. దీంతో చిత్రయూనిట్ ఆమె పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా జరిపింది. బాలకృష్ణ కేక్ కట్ చేసి తనకు తినిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.'12 -01 -2025.. ఇది నా బెస్ట్ బర్త్‌డే. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారికి, మా సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇంత మంచి పుట్టినరోజు కానుకను ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది నాకు బ్లాక్‌బస్టర్ బర్త్‌డేగా మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. డాకు మహారాజ్‌పై మీరు చూపిస్తున్న ప్రేమ మరువలేనిది' అని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ వేడుకల్లో హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కూడా పాల్గొనడం విశేషం. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) The King of Sankranthi Delivers Big 🔥#DaakuMaharaaj clocks 𝟗𝟐 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟑 𝐃𝐚𝐲𝐬 - Ruling the box office and hearts alike! 💥💥A PERFECT SANKRANTHI treat packed with high octane action and heartwarming family emotions! ❤️… pic.twitter.com/duMQ4H4zm6— Sithara Entertainments (@SitharaEnts) January 15, 2025 చదవండి: పెద్దోడి సినిమాపై చిన్నోడి ప్రశంసలు.. గర్వంగా ఉందంటూ.. -
'డాకు మహారాజ్' సినిమాలోని పాప ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
Pragya Jaiswal: డాకు మహారాజ్ మూవీ హీరోయిన్ అదిరిపోయే స్టిల్స్ (ఫోటోలు)
-
డాకు మహారాజ్లో నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie). బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న థియేటర్లలో విడుదల కాగా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. హీరోకు బాబీ ఇచ్చిన ఎలివేషన్స్, తమన్ బీజీఎమ్ అదిరిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.డాకు మహారాజ్‌లోని చిన్నారి ఎవరు?ఈ సినిమాలో వైష్ణవిగా నటించిన చిన్నారి నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయి. ఈ పాప సినిమా సెట్స్‌లో బాలకృష్ణను పట్టుకుని ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆ చిన్నారి ఎవరని పలువురూ ఆరా తీస్తున్నారు. ఈ బేబీ వైష్ణవి పేరు వేద అగర్వాల్ (Veda Agrawal). తను నటి మాత్రమే కాదు, సింగర్ కూడా! ప్రముఖ గాయకుడు మాధవ్ అగర్వాల్ కూతురే వేద.(డాకు మహారాజ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఉప్పొంగిపోయిన సింగర్తన గారాలపట్టి ఇంత పెద్ద సినిమాలో భాగం కావడంతో తండ్రిగా ఉప్పొంగిపోయాడు మాధవ్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. నేను ఆగ్రాలో పుట్టినా పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! నా ఎనిమిదేళ్ల కూతురు తెలుగులో నటించిన పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేను పెరిగిన హైదరాబాద్‌లోని థియేటర్లలో ఆడుతోంది. ఎంత యాదృచ్చికం.కల నెరవేరినట్లుగా ఉందిఈ ప్రయాణం నాకు సంపూర్ణమైన అనుభూతినిస్తోంది. మా భావోద్వేగాలు ఆగడం లేదు. హైదరాబాద్ నగరంలో బిగ్ స్క్రీన్‌పై తనను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నా కల నెరవేరినట్లుగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు. డాకు మహారాజ్లో వైష్ణవిగా కట్టిపడేసింది వేద. ఈ సినిమాతో తనకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.డాకు మహారాజ్ సినిమా విశేషాలుడాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌తో మెరిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతి కానుకగా ముందుకు వచ్చిన ఈ మూవీకి తొలి రోజే సక్సెస్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. సక్సెస్ పార్టీపైగా జనవరి 10న రిలీజైన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీకి వస్తున్న మిక్స్డ్ టాక్ డాకు మహారాజ్‌కు కలిసొచ్చినట్లైంది. తొలి రోజే బాలకృష్ణ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో చిత్రబృందం పార్టీ చేసుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పార్టీలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరోసారి సందడి చేసింది. దబిడి దిబిడి సాంగ్‌తో అలరించిన ఈ బ్యూటీ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. అటు ఆన్ స్క్రీన్‌లో, ఇటు ఆఫ్ స్క్రీన్‌లో బాలకృష్ణ.. ఊర్వశిని దబిడి దిబిడి ఆడేసుకున్నారు. View this post on Instagram A post shared by Madhav Agrawal (@abmadhav) View this post on Instagram A post shared by Veda Agrawal (@veda.agrawal) View this post on Instagram A post shared by Veda Agrawal (@veda.agrawal) చదవండి: పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ? -
బాలయ్య డాకు మహారాజ్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే సక్సెస్ టాక్ రావడంతో అందరి దృష్టి కలెక్షన్లపై పడింది.డాకు మహారాజ్ మొదటి రోజు వసూళ్ల పరంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది. యూఎస్‌లో అరుదైన రికార్డ్..బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ అరుదైన ఘనత సాధించింది. తొలిరోజే యూఎస్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మొదటి రోజే అమెరికాలో 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది.డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.ఆకట్టుకుంటున్న బాలయ్య డైలాగ్స్బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్‌కు ఆకట్టుకుంటున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. 'సింహం నక్కల మీద కొస్తే వార్ అవ్వదు'.. 'వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి, చచ్చేవాడు కాదు’.. లాంటి డైలాగ్స్ నెట్టింట వైరలవుతున్నాయి.కాగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు.దేశీయంగా నెట్ వసూళ్లు ఎంతంటే?ఇండియా వ్యాప్తంగా చూస్తే రూ.22.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాత్రలో అభిమానులను అలరించింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీ..డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో చిత్రబృందం పార్టీ చేసుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పార్టీలో మూవీ టీమ్ అంతా సందడి చేసింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరోసారి సందడి చేసింది. దబిడి దిబిడి సాంగ్‌తో అలరించిన ముద్దుగుమ్మ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.సాంగ్‌పై విమర్శలు..డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్‌తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. #DaakuMaharaaj sets the box office on fire and owns SANKRANTHI with Thunderous BLOCKBUSTER ❤️🔥𝟓𝟔 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐨𝐧 𝐃𝐀𝐘 𝟏 🪓🔥#BlockbusterHuntingDaakuMaharaaj – THE BIGGEST OPENING for #NBK garu 🧨That’s how 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/nz3eSZM46a— Sithara Entertainments (@SitharaEnts) January 13, 2025 -
మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు!
‘దబిడి దిబిడి’ పాట స్టెప్పులపై సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో అందరికి తెలిసిందే. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అలాంటి స్టెప్పులేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అభిమానులు కూడా ఆ స్టేప్పులను తప్పుపట్టారు. అయితే ఇందులో బాలయ్య కంటే ఎక్కువగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్నే ఎక్కువగా ట్రోల్ చేశారు. ఓ ఎమ్మెల్యే, సీనియర్ హీరో అయిన బాలకృష్ణతో అలాంటి అసభ్యకరమైన స్టెప్పులేయించాండంటూ శేఖర్ మాస్టర్‌ను ఏకిపారేశారు. మరికొంతమంది నెటిజన్స్ అయితే కూతురు వయసు ఉన్న ఊర్వశీ రౌతేలాతో బాలయ్య అలాంటి స్టెప్పులేయడం అసభ్యకరంగా ఉందని కామెంట్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్‌ని చిత్ర యూనిట్‌తో సహా బాలయ్య కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఓ పార్టీ ఈవెంట్లో ఊర్వశీతో బాలయ్య మళ్లీ అదే స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.సక్సెస్ పార్టీతో వికృత స్టెప్పులు!హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ప్రగ్యా జైశ్వాల్, శ్రధ్ధాశ్రీనాథ్ హీరోయిన్. . శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో యూనిట్ అంతా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఓ హోటల్లో జరిగిన ఈ పార్టీకి బాలయ్యతో సహా చిత్రబృందం అంతా హాజరైంది. ఈ సందర్భంగా ఊర్వశీతో బాలయ్య స్టెప్పులేశాడు. ‘దబిడి దిబిడి’ పాటకు డ్యాన్స్ చేస్తూ మళ్లీ అసభ్యకరమైన స్టెప్పులేశారు. బాలయ్య ఆ స్టెప్పులేస్తూ ఆమె దగ్గరకు రాగానే.. ఊర్వశీ పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ వీడియోని ఊర్వశీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) ముద్దులతో ముంచేసిన బాలయ్య`డాకు మహారాజ్`పార్టీలో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ముద్దులతో ముంచేశాడు బాలకృష్ణ. సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తూ `కంగ్రాట్చ్యూలేషన్స్ టూ డాకు మహారాజ్` అని విశ్వక్ సేన్ అనగా.. థ్యాంక్యూ ‘లైలా ’అంటూ విశ్వక్ సేన్‌కి బాలయ్య ముద్దు పెట్టాడు. విశ్వక్ కూడా తిరిగి బాలయ్యకు ముద్దు పెట్టారు. పక్కనే ఉన్న సిద్దు కూడా ‘నాకు పెట్టలేదు(కిస్) అనగానే..బాలయ్య లాక్కొని సిద్దుకి కూడా కిస్ ఇచ్చాడు. ఈ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు దర్శకుడు బాబీకి కూడా కిస్ ఇచ్చాడు బాలయ్య. పార్టీ మూడ్‌లో బాలయ్య ఇలా రెచ్చిపోవడంతో ఆ వీడియోలన్నీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. -
డాకు మహారాజ్లో ఊర్వశి రౌతేలా.. బాలయ్యతో మరోసారి చిందులు!
బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించింది. అంతేకాకుండా దబిడి దిబిడి అంటూ సాగే ఐటమ్ సాంగ్‌లో బాలయ్య సరసన మెప్పించింది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లింది.సాంగ్‌పై విమర్శలు..డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్‌తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.పట్టించుకోని ఊర్వశి రౌతేలా..అయితే సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వస్తున్నా పిచ్చ లైట్ అంటోంది బాలీవుడ్ భామ. తాజాగ ఇన్‌స్టా వేదికగా మరో వీడియోను పోస్ట్ చేసింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో కలిసి దబిడి దిబిడి సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఊర్వశి రౌతేలాపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాలో రాస్తూ..' డాకు మహారాజ్ సక్సెస్ బాష్. దబిడి దిబిడి సాంగ్ 20 మిలియన్ల వ్యూస్ సాధించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ న్యూయర్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
డాకు మహారాజ్‌కు హిట్ టాక్. తొలిరోజే ఓవర్సీస్లో క్రేజీ రికార్డ్
నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్'(Daaku Maharaaj Movie). బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. జనవరి 12న బాక్సాఫీస్ బరిలో దిగిన డాకు మహారాజ్ తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాలయ్య మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు.తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. తొలిరోజే యూఎస్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మొదటి రోజే అమెరికాలో 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది.డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్‌కు ఆకట్టుకున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది.కాగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు.(ఇది చదవండి: Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)తమన్ బీజీఎంపై ప్రశంసలు..తొలిరోజు డాకు మహారాజ్ వీక్షించిన ప్రేక్షకులు మూవీపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా తమన్ బీజీఎం అదిరిపోయిందని కామెంట్స్ చేశారు. మరోసారి తమన్ వేరే లెవెల్‌కు తీసుకెళ్లారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బాలయ్య ఖాతాలో మరో సూపర్ హిట్ పడిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే యూఎస్‌లో 10 లక్ష డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది.అమెరికాలో రికార్డ్ ప్రీ సేల్స్..ఈ సారి డాకు మహారాజ్ సినిమాకు అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్స్‌లో రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని దాదాపు 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్ రోజే ప్రదర్శించారు. అనంతపురంలో సక్సెస్ మీట్డాకు మహారాజ్ (Daaku Maharaaj) సక్సెస్ మీట్‌ను అనంతపురంలో నిర్వహిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) ప్రకటించారు. ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం వల్ల సక్సెస్ మీట్ అక్కడే నిర్వహించనున్నట్లు నాగవంశీ వెల్లడించారు. టికెట్ ధరల పెంపునకు అనుమతి..డాకు మహారాజ్ మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500 కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు ఉంటాయి.#DaakuMaharaaj crosses $1M+ Gross in the USA and continues its BLOCKBUSTER HUNTING spree! 💥💥This is just the start of NBK’s storm! 🦁#BlockbusterHuntingDaakuMaharaaj 🔥USA Release by @ShlokaEnts Overseas Release by @Radhakrishnaen9 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/82Kkd5ZnHN— Sithara Entertainments (@SitharaEnts) January 13, 2025 -
బాలయ్య 'డాకు మహారాజ్'.. ఏ ఓటీటీకి రానుందంటే?
నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్. బాలీ కొల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిదంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంతో తమన్ మరోసారి తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడని చెబుతున్నారు.డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ఓటీటీ గురించి అప్పుడే చర్చ మొదలెట్టారు. బాలయ్య మూవీ ఏ ఓటీటీకి రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఓ టాక్ నడుస్తోంది. బాలకృష్ణ డాకు మహారాజ్ హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. (ఇది చదవండి: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)టికెట్ ధరల పెంపు..జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.ఈ సారి డాకు మహారాజ్ సినిమాపై అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ప్రదర్శించారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుజనవరి 9న జరగాల్సిన డాకు మహారాజ్ (Dsaku Maharaaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) రద్దయింది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది. ఈ నిర్ణయంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. డైరెక్టర్ బాబీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నా. యాక్షన్‌తోపాటు మంచి వినోదం, భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది' అని అన్నారు. ఈ నెల 12న నా బర్త్ డే కానుకగా ఈ చిత్ర విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కోరారు. -
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
టైటిల్: డాకు మహారాజ్నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సత్య తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: బాబీ కొల్లిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్విడుదల తేది: జనవరి 12, 2025కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..బాలయ్య చేసే మాస్ యాక్షన్ సినిమాల నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది. విలన్ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం.. దాన్ని హీరో అడ్డుకోవడం. అన్ని కథలు ఇలానే ఉంటాయి. డాకు మహారాజ్(Daaku Maharaaj Review) కూడా అలాంటి కథే. అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఓ కళ. అందులో దర్శకుడు బాబీ ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు. రొటీన్ కథనే అయినా హీరో ఫ్యాన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తాడు.బాలయ్య తాలుకు ఇమేజ్‌ని దృష్టిలో ఫక్తు కమర్షియల్ ఫార్మెట్లో డాకు మహారాజ్ కథనాన్ని సాగించాడు. ప్రతి పది నిమిషాలకొక యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్లు కూడా కొత్తగా ఉంటాయి. గత సినిమాల మాదిరి బాలయ్య ఇందులో గట్టిగా అరవడం.. ఒంటి చేత్తో వందమందిని నరకడం లాంటివి ఉండవు. డీసెంట్ యాక్షన్ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు. అయితే కథనం ఊహకందేలా సాగడం.. పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోదు. అలాగే మెయిన్ విలన్ని సెకండాఫ్ వరకు దాచడంతో హీరో, విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఎత్తుగడ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశారు. మొదటి పావుగంట కృష్ణమూర్తి ఫ్యామిలీ, ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది. నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని ఊహించినా.. అదేంటి అనేది సెకండాఫ్ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సివిల్ ఇంజనీర్ సీతారాం, డాకు మహారాజ్ కథంతా ద్వితియార్థంలోనే వస్తుంది. చంబల్ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఊచకోత ఉంటుంది. అది బాలయ్య అభిమానులను అలరిస్తుంది. ఎమోషన్ కోసం చిన్న పిల్లల పాత్రలను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు. అయితే ద్వితియార్థం ప్రారంభమైన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుందని ఊహించొచ్చు. క్లైమాక్స్‌ని ఇంకాస్త షార్ఫ్ గా కట్ చేస్తే బాగుండేదేమో. బాలయ్య అభిమానులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. బాలయ్యకు యాక్షన్ సినిమాలు కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాల్లో మరింత దూకుడుగా నటిస్తాడు. డాకు మహారాజ్లో కూడా అదే స్థాయితో నటించాడు. నానాజీగా, సీతారాంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించాడు. యాక్షన్ సీన్లలో ఎప్పటి మాదిరే అదరగొట్టేశాడు. ఇందులో గత సినిమాల మాదిరి పెద్ద పెద్ద డైలాగ్స్, అరవడాలు ఉండవు. బాలయ్య చెప్పే డైలాగ్ తీరు కొత్తగా ఉంటుంది. బల్వంత్ ఠాకూర్‌గా బాబీ డియోల్ తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ విలనిజాన్ని చూపించాడు. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రధ్ధా శ్రీనాథ్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అయితే తెరపై మాత్ర ప్రగ్యానే ఎక్కువసేపు కనిపిస్తుంది. ఎమ్మెల్యే త్రిమూర్తులుగా రవికిషన్ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో ఆయన విలనిజం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ఆకట్టుకుంటుంది. ఊర్వశీ రౌతేలా పాటకే దబిడిదిబిడి పాటతో ఆకట్టుకోవడమే కాకుండా.. గ్లామర్‌తో యూత్‌ని అలరించింది. సచిన్ ఖేడ్కర్, చాందీనీ చౌదరితో పాటు వైష్ణవి పాత్ర పోషించిన చిన్నారి కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య సినిమా అంటే తమన్ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదరిపోయే బీజీఎం అందించాడు. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాలయ్యతో కొత్త స్టంట్స్ చేయించారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ
వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ . నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే షో పడిపోయింది. తెలంగాణలో మాత్రం ఉదయం 8 గంటలకు ఫస్ట్ షో పడనుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డాకు మహారాజు కథ ఏంటి..? ఎలా ఉంది..? బాలయ్య ఖాతాలో హిట్ పడిందా లేదా..? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో డాకు మహారాజుకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. ఆశించన స్థాయిలో సినిమా లేదని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.Good mass bomma delivered by #Bobby Good visualsVijay Kannan’s best DOPThaman’s powerful BGM💥Bobby Kolli’s good directorialBut Predictable & dragged climaxMay be a fourth hit for #BalayyaRating: 3.25/5 #DaakuMaharaaj #DaakuMaharaajOnJan12th #DaakuMaharaajReview pic.twitter.com/mFVZmjnKxg— IndianCinemaLover (@Vishwa0911) January 11, 2025‘డైరెక్టర్ బాబీ ఓ మంచి మాస్ బొమ్మను అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ పవర్ఫుల్ బీజీఎం అందించాడు. బాబీ డైరెక్షన్ బాగుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ఊహకందేలా,సాగదీతగా అనిపిస్తుంది. బాలయ్య ఖాతాలో హిట్ పడొచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ 3.25 రేటింగ్ ఇచ్చాడు.#DaakuMaharaaj is a passable stylistic mass entertainer that works well till a point in the second half after which it feels dragged. The film is technically very strong and is filled with mass elevations blocks that work well. Balayya and Thaman combo deliver yet again in…— Venky Reviews (@venkyreviews) January 11, 2025డాకు మహారాజ్ మంచి మాస్ ఎంటర్టైనర్.కానీ సెకండాఫ్ మాత్రం సాగదీశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య, తమన్ కాంబో మరోసారి సాలిడ్ మాస్ మూమెంట్స్‌ని అందించారు. డైరెక్టర్ బాబీ బాలయ్యను సెట్ అయ్యే కథనే ఎంచుకున్నాడు. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి కథనం సాగదీశారు. ఊహకందేలా కథనం సాగుతుంది. చివరి 30 నిమిషాలు మాత్రం సాగదీసినట్లుగా అనిపిస్తుంది’అంటూ మరో నెటిజన్ 2.75 రేటింగ్ ఇచ్చాడు.Blockbuster bomma 🏆🏆🔥🔥Excellent screen PlayQuality Picture @MusicThaman sava dengav ayya 🔥@dirbobby 🙏🤍@vamsi84 Production quality 👌#DaakuMaharaaj - A slick mass entertainer with stunning visuals and #Thaman's powerful score.#NBK is exceptional, delivering electrifying moments for fans.Director #Bobby ensures commercial highs, making it a festive treat despite a predictable climax.— CHITRAMBHALARE (@chitrambhalareI) January 12, 2025uMaharaaj?src=hash&ref_src=twsrc%5Etfw">#DaakuMaharaaj #BlockBusterDaakuMaharaaj — kalyan ᴹᵃʰᵃʳᵃᵃʲ 🦁 (@kalyan_1405) January 12, 2025 #DaakuMaharaj First Half Review #NBK #Balayya #Balakrishna #NandamuriBalakrishana #DaakuMahaaraaj #DaakuMaharaaj #BuzzbasketReviews pic.twitter.com/kOAR1cdHPQ— BuzZ Basket (@theBuzZBasket) January 12, 2025Hahahahhahh 😂😂 ! My First Review of #DaakuMaharaaj proved “ TRUE ” !! I’m the Most Honest Film Critic in India 🇮🇳 today! Go & Watch Mass Masala this #Sankranthi 😃💥 https://t.co/DTUMdx5AOS— Umair Sandhu (@UmairSandu) January 11, 2025Oora Mass BGM From Teddy 🔥🔥Balayya Screen Presence > Nandamuri #DaakuMaharaaj pic.twitter.com/X6sNmHL5ZM— విక్రమ్ (@imVicky____) January 11, 2025A film that strikes the perfect balance between class and mass, cherished by the Maharaj🦁మళ్లీ సంక్రాంత్రి బుల్లోడు మా బాలయ్య బాబు🔥❤️Finally Good Output @dirbobby and @MusicThaman 🌟💫#DaakuMaharaaj 🦁🎇 pic.twitter.com/5E8UWwtbFa— ShelbY ᴹᵃʰᵃʳᵃᵃʲ⚔️ (@manishini9) January 11, 2025Naaku first half ye nachindhi ..Second half dabbulu return cheyi ra chintu #DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025Last 45 min sleep veyochuRest 🔥Routine story 😢Elevations 👍 Bgm 🔥🔥🔥#DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025 -
పొగిడితే కళ్లతోనే కనిపెట్టేస్తారు: దర్శకుడు బాబీ
‘‘సెట్స్‌లో నేను ఫ్యాన్ బాయ్‌లా ఉండను. అలా ఉంటే కొన్ని పనులు మనం అనుకున్నట్లుగా సాగవు. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ గార్లతో వర్క్ చేశాను. ఇద్దరూ పని రాక్షసులు. వీరికి అపారమైన అనుభవం ఉంది. పొగడ్తలతో మాట్లాడితే మన అంతరంగాన్ని కళ్లతోనే కనిపెట్టేస్తారు. కాబట్టి నేను సెట్స్‌లో ఓ దర్శకుడిగా నిజాయితీతోనే ఉండాలనుకుంటాను. అప్పుడు మనపై గౌరవం పెరుగుతుంది.చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌గార్ల వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు బాబీ కొల్లి. బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు (ఆదివారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు బాబీ చెప్పిన విశేషాలు...⇒ డాకు మహారాజ్‌గా సీతారామ్ ఎలా మారాడు? అన్నది ఈ సినిమా కథనం. బాలకృష్ణగారి ఇమేజ్, ఆయన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఉండే అంచనాలను దృష్టిలో పెట్టుకునే ‘డాకు మహారాజ్’ కథ రాయడం జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణగారిని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. ‘నరసింహనాయడు, సమరసింహారెడ్డి’ చిత్రాల తర్వాత నాకు బాలకృష్ణగారి ‘సింహా’ అంటే చాలా ఇష్టం. ‘సింహా’లో బాలకృష్ణగారు డాక్టర్ రోల్‌ను చాలా సెటిల్డ్‌గా చేశారు⇒ ‘డాకు మహారాజ్’ చిత్రంలో హీరోయిన్స్ శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ల పాత్రలతో పాటు ఓ చిన్న పాప రోల్ కూడా కీలకంగా ఉంటుంది. ఓ విధంగా ఈ పాప చుట్టూనే కథ తిరుగుతుంది. అయితే మరో హీరోయిన్ చాందినీ చౌదరి సీన్స్ కొన్ని ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ విషయం ఆమెకు తెలియజేశాం. ఆమె ఏమీ అభ్యంతరం తెలుపలేదు. ఈ చిత్రంలో బాబీ డియోల్‌గారు మంచి రోల్ చేశారు. ⇒ మంచి కథ రాసుకోవడం, సీరియస్ స్క్రీన్‌ప్లేని డీల్ చేయడంలో నేను బాగా చేస్తాననే పేరు తెచ్చుకోగలిగాను. కానీ విజువల్స్ పరంగా నా ప్రతిభ గురించి ఆడియన్స్ మాట్లాడుకునేలా చేయలేకపోయానేమో? అనే చిన్న ఆలోచన నాలో ఉండేది. అందుకే ఇప్పుడు ‘డాకు మహారాజ్’ సినిమా విజువల్స్ బాగున్నాయని అంటుంటే హ్యాపీగాఉంది. ‘జైలర్’ డీఓపీ విజయ్ కన్నన్గారు ఈ సినిమాకు వర్క్ చేశారు. విజయ్‌గారు కథను ఓన్ చేసుకుంటారు. అందుకే విజువల్స్ అంత బాగా వచ్చాయి. -
రెడ్ కలర్ శారీలో గులాబీలా మెరిసిపోతున్న ఊర్వశి రౌతేలా (ఫొటోలు)
-
చిరంజీవి, బాలకృష్ణ..ఇద్దరు పని రాక్షసులే: బాబీ
‘నేను చిరంజీవి(వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ ఇద్దరితో కలిని పని చేశాను. ఇద్దరిలో ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. ఇద్దరూ పని రాక్షసులే. సినిమా కోసం ఎంతైనా కష్టపడుతుంటారు. నిర్మాలతకు అసలు నష్టం రానివ్వకూడదనే ఉద్దేశంతో పని చేస్తుంటారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటింరు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు(జనవరి 12) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ బాబీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ బాలకృష్ణ గారి ఇమేజ్ ని, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో ఉంచుకొని 'డాకు మహారాజ్' (Daaku Maharaaj )సినిమా చేయడం జరిగింది. అయితే బాలకృష్ణ గారి గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాము. బాలయ్య గారు సెటిల్డ్ గా డైలాగ్ లు చెప్తే చాలా బాగుంటుంది. 'నరసింహానాయుడు', 'సమరసింహారెడ్డి' తర్వాత 'సింహా' ఎలా అయితే గుర్తుండే సినిమా అయిందో.. డాకు మహారాజ్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. చాలా నిజాయితీగా కథను చెప్పాము.→ హీరోకి ఆయుధం అనేది కీలకం. ముఖ్యంగా బాలకృష్ణ(Nandamuri Balakrishna) గారి సినిమాల్లో గొడ్డలి వంటి పవర్ ఫుల్ ఆయుధం బాగా ఫేమస్. ఈ సినిమాలో ఆలాంటి శక్తివంతమైన ఆయుధం ఉండాలి, కానీ అది కొత్తగా ఉండాలి అనుకున్నాము. అందుకు తగ్గట్టుగానే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు అద్భుతమైన ఆయుధాలను డిజైన్ చేశారు.→ నా గత సినిమాలతో బాబీ కథాకథనాలు బాగా రాస్తాడు అనే పేరు తెచ్చుకోగలిగాను. అయితే హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకునేలా చేయలేకపోయాను. ఇప్పుడు 'డాకు మహారాజ్'తో విజువల్స్ పరంగా గొప్ప పేరు వస్తుంది.→ ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరు హీరోయిన్లు మంచి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. వారివి రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్రలు కావు. నటనకు ఆస్కారమున్న పాత్రలు. ఇద్దరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.→ రెగ్యులర్ విలన్ పాత్రలా కాకుండా బాబీ డియోల్ గారి పాత్ర కొత్తగా ఉంటుంది. ఆయన నిబద్ధతగల నటుడు. పాత్రకి న్యాయం చేయడం కోసం సెట్ లో ఎంత సమయాన్ని అయినా కేటాయిస్తారు. అలాగే బాబీ డియోల్ గారు ఎన్టీఆర్ గారిని, బాలకృష్ణ గారిని ఎంతో గౌరవిస్తారు.→ నిర్మాత నాగవంశీ, బాలకృష్ణ గారిని ఎంతో అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే తమ బ్యానర్ లో వచ్చే సినిమా వైవిధ్యంగా ఉండాలి అనుకున్నారు. అలాగే ఒక దర్శకుడిగా నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేలా చేయాలి అనుకున్నాము. డీఓపీ విజయ్ కన్నన్ తో నాకు ముందే పరిచయముంది. అప్పుడు ఆయన జైలర్ సినిమాకి పని చేస్తున్నారు. నాగవంశీ గారు కూడా విజయ్ పేరు చెబితే వెంటనే ఓకే అని, ఆయనతో మాట్లాడారు. అలా విజయ్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేస్తారు. కథను ఓన్ చేసుకుంటారు. అందుకే విజువల్స్ అంత అద్భుతంగా వచ్చాయి.→ బాలకృష్ణ గారి నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే బాలకృష్ణ గారు గౌరవిస్తారు. అభిమానులు తనను చూడటానికి వస్తారు కదా అని, డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు. మొండి గుర్రాన్ని సైతం కంట్రోల్ చేస్తూ, స్వయంగా స్వారీ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. -
హీరో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
ఊహలకు మించి ఉంటుంది: బాలకృష్ణ
‘‘సంక్రాంతి పండగకి విడుదలైన నా సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈ సంక్రాంతి కానుకగా రిలీజవుతున్న ‘డాకు మహారాజ్’ కూడా ఘన విజయం సాధిస్తుంది. ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఏం ఊహించుకుంటున్నారో అంతకు మించి ఈ సినిమా ఉంటుంది’’ అని బాలకృష్ణ చెప్పారు. బాబీ కొల్లి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ రేపు (ఆదివారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘తిరుపతి తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’.. ఇలా వరుస ఘన విజయాల తర్వాత వస్తున్న ‘డాకు మహారాజ్’తో మరో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు. బాబీ కొల్లి మాట్లాడుతూ–‘‘నా టీమ్‌తో కలిసి ఎంతో శ్రద్ధగా ‘డాకు మహారాజ్’ కథని సిద్ధం చేశాను. బాలకృష్ణగారితో ఒకసారి పని చేస్తే మళ్లీ పని చేయాలనిపిస్తుంటుంది’’ అని చెప్పారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ఐదేళ్ల క్రితం వైకుంఠ ఏకాదశి రోజున ‘అల వైకుంఠపురములో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి, జనవరి 12న ఆదివారం సినిమా విడుదల చేశాం.ఇప్పుడు ‘డాకు మహారాజ్’కి కూడా అదే జరిగింది. ‘అల వైకుంఠపురములో’లాగే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ప్రాణం పెట్టి సంగీతం చేయాలనిపిస్తుంది. అలాంటి సినిమా ‘డాకు మహారాజ్’’ అన్నారు. ఈ వేడుకలో వైజాగ్ ఎంపీ భరత్, బాలకృష్ణ కుమార్తె తేజస్విని, కెమెరామేన్ విజయ్ కన్నన్, రచయిత మోహన్ కృష్ణ తదితరులు పాల్గొని, ‘డాకు మహారాజ్’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు. -
'రాయలసీమ మాలుమ్ తేరేకు'.. డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ చూసేయండి
నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను(Release Trailer) మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా వచ్చిన బాలయ్య మూవీ ట్రైలర్‌ను మీరు కూడా చూసేయండితాజాగా రిలీజైన ట్రైలర్ ఫ్యాన్స్‌కు మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్‌ను ఊపేస్తున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. 'ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారు.. నేను చంపడంలో చేశా' అనే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మాస్ డైలాగ్స్ చూస్తే సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైనర్గా అలరించేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్‌పై భారీగా ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉందంటూ కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు విడుదలైన మాస్ ట్రైలర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. తాజాగా రిలీజ్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.టికెట్ ధరల పెంపు..జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు ఉంటాయి.ఈ సారి డాకు మహారాజ్ సినిమాపై అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్ డే పడనున్నాయి.ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుజనవరి 9న జరగాల్సిన డాకు మహారాజ్ (Dsaku Maharaaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) రద్దయింది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది. ఈ నిర్ణయంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. MASS is a mood and he’s the MASTER🔥🪓#DaakuMaharaaj 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 𝐓𝐑𝐀𝐈𝐋𝐄𝐑 is here to set your screens on fire! 🔥 — https://t.co/849jh9BlA0𝐉𝐀𝐍 𝟏𝟐, 𝟐𝟎𝟐𝟓 ~ A SANKRANTHI EXPLOSION awaits in cinemas ❤️🔥𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol… pic.twitter.com/qsTNfHjpPm— Sithara Entertainments (@SitharaEnts) January 10, 2025 -
వాళ్లకు అలాంటిదేం లేదు.. నీకేమైంది?.. ఊర్వశి రౌతేలాపై ఘాటు కామెంట్స్!
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్ (Daaku Maharaaj)'. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కొత్త ఏడాదిలో మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) డ్యాన్స్ చేసిన 'దబిడి దిబిడి' అంచూ సాగే సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.అయితే సాంగ్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఊర్వశి రౌతేలాతో బాలయ్య అలా చేయడం కరెక్ట్ కాదంటూ పలువురు విమర్శించారు. అంతేకాదు శేఖర్ మాస్టర్ చెత్త కొరియోగ్రఫీ అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. ఆ స్టెప్పులేంటి అంటూ చాలా మంది బహిరంగంగానే బాలయ్యతో పాటు డాకు మహారాజ్ టీమ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ కేఆర్కే(Kamal R Khan) ఈ సాంగ్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. తెలుగువాళ్లు అలాంటి పాటలు చేయడానికి వెనకాడరు.. కానీ ఊర్వశి రౌతేలా ఆ పాటను చేయడం చూస్తే తనకు ఎలాంటి సిగ్గులేదనిపిస్తోంది అంటూ పోస్ట్ చేశారు. అయితే కేఆర్కే ట్వీట్‌పై ఊర్వశి రౌతేలా స్పందించింది. జీవితంలో ఏం సాధించలేని కొందరు.. కష్టపడేవారిని విమర్శించే అర్హత ఉందనుకోవడం విడ్డూరం అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చింది. రియల్ పవర్ అంటే ఇతరులను విమర్శించడం కాదు.. అవతలి వారి పైకి తీసుకొచ్చేలా చేయడం.. వారి గొప్పదనాన్ని ఆదర్శంగా తీసుకోవడంలో ఉంటుందని' అని కౌంటర్ ఇచ్చిపడేసింది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.(ఇది చదవండి: స్క్రీన్ టైమ్ గురించి ఆలోచించను: శ్రద్ధా శ్రీనాథ్)కాగా.. డాకు మహారాజ్ మూవీ విషయానికి వస్తే.. దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు..నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో నేడు అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది.It’s ironic how some who’ve achieved nothing feel entitled to criticize those who work tirelessly. Real power isn’t in tearing others down it’s in lifting them up and inspiring greatness. @kamaalrkhan https://t.co/kS3tdXFk0a— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) January 9, 2025 -
ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్: ప్రగ్యా జైస్వాల్
జనవరి 12న నా బర్త్‌డే. ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్. ఎందుకంటే అదే రోజు బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్ విడుదల అవుతుంది. ఆయనతో కలిసి నేను నటించిన సినిమా నా బర్త్‌డేకి రిలీజ్ అవ్వడం నా అదృష్టం. ఇది నా పుట్టినరోజుకి బాలయ్య ఇస్తున్న ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను’ అన్నారు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal ). బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు నటించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రగ్యా జైస్వాల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 2015 లో తెలుగులో నా సినీ ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసి, సినిమా గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పలు మంచి సినిమాల్లో భాగమయ్యాను. మరిన్ని మంచి సినిమాలతో అలరించడానికి ప్రయత్నిస్తున్నాను.→ బాలకృష్ణ గారితో వరుసగా సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. కోవిడ్ సమయంలో ఎవరూ పెద్దగా సినిమా చేయలేదు. అలాంటి సమయంలో బోయపాటి శ్రీను గారు అఖండ కథ చెప్పి, అంత గొప్ప సినిమాలో నన్ను భాగం చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించి, నా సినీ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు డాకు మహారాజ్( Daaku Maharaaj Movie) లాంటి మరో మంచి సినిమాలో బాలకృష్ణ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. డాకు మహారాజ్ కూడా ఘన విజయం సాధిస్తుందని, ఈ చిత్రంలోని నా పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను.→ డాకు మహారాజ్ లో నేను నేను కావేరి పాత్ర పోషించాను. నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర ఇది. డీ గ్లామరస్ రోల్ చేశాను. నేను ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. కావేరి పాత్రను బాబీ గారు డిజైన్ చేసిన తీరు బాగుంది. ఈ పాత్ర నాకు నటిగా ఛాలెంజింగ్ గా అనిపించింది. కావేరి పాత్రతో పాటు ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది.→ బాబీ(bobby kolli) గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం ఇంత కాలానికి వచ్చింది. బాబీ గారు అద్భుతమైన దర్శకుడు. మంచి మనిషి. సెట్స్ లో చాలా కూల్ గా ఉంటారు. నటీనటులను ఒత్తిడికి గురి చేయకుండా, వారి పనిని తేలిక చేసి, మంచి నటనను రాబట్టుకుంటారు. బాబీ గారు కథ చెప్పినప్పుడే ఇది మంచి చిత్రం అవుతుందని నమ్మాను. నేను ఊహించిన దానికంటే గొప్పగా ఈ చిత్రాన్ని రూపొందించారు. బాలకృష్ణ గారిని సినిమాలో చాలా కొత్తగా చూపించారు. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.→ మన సినీ పరిశ్రమలో ఉన్న గొప్ప సంగీత దర్శకులలో తమన్(ss thaman) గారు ఒకరు. ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమాల్లో ఆయన సంగీతం మరింత గొప్పగా ఉంటుంది. 'డాకు మహారాజ్' చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. నాకు ది రేజ్ ఆఫ్ డాకు సాంగ్ ఎంతగానో నచ్చింది. దబిడి దిబిడి, చిన్న సాంగ్స్ కూడా బాగున్నాయి. పాటలతో పాటు ఈ చిత్ర నేపథ్య సంగీతం కూడా బాగుంటుంది.→ ఎస్.ఎస్. రాజమౌళి గారు, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దర్శకులు తీసే భారీ సినిమాలలో శక్తివంతమైన పాత్రలు పోషించాలని ఉంది. అలాగే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలని ఉంది. -
స్క్రీన్ టైమ్ గురించి ఆలోచించను: శ్రద్ధా శ్రీనాథ్
‘‘ఏ సినిమాలోనైనా నా స్క్రీన్ టైమ్ గురించి నేను ఆలోచించను. మనసుకి నచ్చి చేసిన పాత్రకు ఓ నటిగా వంద శాతం న్యాయం చేశామా? లేదా అని మాత్రమే ఆలోచిస్తాను. ‘డాకు మహారాజ్’ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా... ఇలా మిగతా పాత్రలు కూడా ముఖ్యంగానే ఉంటాయి’’ అన్నారు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్(shraddha srinath). బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) మూవీలో నందిని అనే ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేశాను. చాలా ఓర్పు ఉన్న పాత్ర. అదే సమయంలో ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు స్పష్టంగా మాట్లాడుతుంది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది.→ నా గత చిత్రాలతో పోల్చినప్పుడు ఈ చిత్రం నాకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పాను. ఈ మూవీలో బాలకృష్ణ, బాబీ డియోల్గార్లతో నటించాను. నటిగా కొత్త విషయాలు నేర్చుకున్నాను.→ సెట్స్ లో బాలకృష్ణ అందరితో సరదాగా ఉంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాను, నేనొక బిగ్ స్టార్ ని అనే అహం బాలకృష్ణ గారిలో కొంచెం కూడా ఉండదు. తనకంటే చిన్నా పెద్దా అని చూడకుండా దర్శకుడికి ఆయన ఎంతో గౌరవం ఇస్తారు. సినిమా కోసం దర్శకుడు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.→ నటిగా ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇందులో డైలాగ్ లు కరెక్ట్ మెజర్ లో ఉంటాయి. డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాను. ప్రతి డైలాగ్ మీద ఎంతో కేర్ తీసుకొని డబ్బింగ్ చెప్పించారు.→ బాబీ గారు ప్రతిభగల దర్శకుడు. సినిమా పట్ల ఆయనకు ఎంతో పాషన్ ఉంది. అలాగే, బాబీ గారిలో మంచి నటుడు కూడా ఉన్నాడు. అద్భుతమైన సూచనలు ఇస్తూ, నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకుంటారు.→ సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘జెర్సీ’ మూవీ చేశాను. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ చేశాను. ‘జెర్సీ’లో నేను చేసిన సారా, ‘డాకు మహారాజ్’లోని నందిని... ఈ రెండు పాత్రలు వేటికవే ప్రత్యేకం.→ ఇక పదేళ్లుగా ఇండస్ట్రీలో స్థిరంగా రాణిస్తున్నాను. కేవలం ఇది లక్ మాత్రమే కాదు... నా పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఓ నటిగా అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. ఇంకా పొన్నియిన్ సెల్వన్’ లాంటి పీరియాడికల్ మూవీలో నటించాలని ఉంది. -
'డాకు మహారాజ్' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు
నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో నేడు అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది.ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిఅనంత వేదికగా జనవరి 9న డాకు మహారాజ్ ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముందుగానే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు శ్రీనగర్‌కాలనీ అయ్యప్పస్వామి ఆలయ సమీపంలో ఖాళీ ప్రాంతంలో ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎస్పీ జగదీశ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఐటీశాఖ మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హజరుకానున్నారని అధికారికంగా కూడ ప్రకటించారు. అయితే, తిరుపతిలో జరిగిన ఘటనతో ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మమ్మిల్ని తీవ్రంగా బాధించింది: డాకు మహారాజ్ మేకర్స్తిరుపతిలో జరిగిన విషా సంఘటన మమ్మిల్ని తీవ్రంగా బాధించింది. మన కుటుంబాల సంప్రదాయాల్లో వెంకటేశ్వర స్వామి ఒక భాగం. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే భక్తులు దర్శనం కోసం వెళ్తారు. అక్కడ ఇలాంటి సంఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అనుకున్న విధంగా కొనసాగించడం సరికాదని మేము భావిస్తున్నాము. బరువెక్కిన హృదయంతో దేవునిపై ప్రజల్లో ఉన్న భక్తి, మనోభావాల పట్ల అత్యంత గౌరవంతో, మేము నేటి కార్యక్రమాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాము.' అని వారు పేర్కొన్నారు.(ఇదీ చదవండి: నా కుటుంబంపై తప్పుగా ప్రచారం చేస్తున్నారు: చాహల్ సతీమణి) -
‘డాకు మహారాజ్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది: సూర్యదేవర నాగవంశీ
‘‘డాకు మహారాజ్’లో యాక్షన్ సీన్స్ బాగుంటాయి. తెలుగుతోపాటు తమిళ్లోనూ ఈ నెల 12న మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. బాలకృష్ణగారి కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి హీరోయిన్లుగా నటించగా, బాబీ డియోల్ కీలకపాత్ర చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.మంగళవారం జరిగిన సమావేశంలో బాబీ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. యాక్షన్‌తోపాటు మంచి వినోదం, భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ నెల 12న నా బర్త్ డే కానుకగా ఈ చిత్ర విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అని ప్రగ్యా జైస్వాల్ చెప్పారు. ‘‘ఈ సినిమా నా జర్నీలో ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాను’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. -
బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ HD మూవీ స్టిల్స్
-
ఎవర్నువ్వు..!
‘అనగనగ ఒక రాజు ఉండేవాడు... చెడ్డవాళ్లంతా ఆయన్ను డాకు అనేవారు. మాకు మాత్రం మహారాజు...’ అంటూ మొదలవుతుంది ‘డాకు మహారాజ్’ సినిమా ట్రైలర్. బాలకృష్ణ(Daaku Maharaaj) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ ( Daaku Maharaaj ). ఈ చిత్రంలో బాబీ డియోల్, మకరంద్ దేశ్‌పాండే, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లో ‘డాకు మహారాజ్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవర్నువ్వు... నానాజీ అమ్మా.., నీకు నువ్వే జీ అని పెట్టుకుంటే... నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా...’, ‘చెప్పింది వినాలి... ఇచ్చింది తీసుకోవాలి’, ‘వాడి ముందు నువ్వు కాదు... నేనుండాలి’, ‘అసలు ఎవడ్రా నువ్వు... మైఖేల్ జాక్సన్’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ట్రైలర్‌లోని సన్నివేశాలను బట్టి ‘డాకు మహారాజ్’ చిత్రంలోని బాలకృష్ణ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘‘యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్
‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj ) సినిమా నుంచి తాజాగా విడుదలైన 'దబిడి సాంగ్'లో బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా కలిసి వేసిన స్టెప్పులు ప్రేక్షకులలో వెగటును తెప్పించేలా ఉన్నాయి. గతంలో పైసా వసూల్ అంటూ చేతి వెకిలి సైగల స్టెప్పులే మేలు అనేలా ఇప్పుడు విడుదలైన సాంగ్ ఉందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అయితే, ఇదీ చాలదన్నట్లు జూ.ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య సినిమాపై భగ్గుమంటున్నారు. డాకు మహారాజ్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీనంతటికీ కారణాలు కూడా ఉన్నాయని వారు తెలుపుతున్నారు.డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్‌లో బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షోలో చిత్ర దర్శకుడు బాబితో పాటు నాగవంశీ, తమన్ (Thaman S) గెస్టులుగా వెళ్లారు. అందుకు సంబంధించిన ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్కు వచ్చింది. బాబి ఇప్పటి వరకు డైరక్ట్ చేసిన సినిమాలతో పాటు అందులో నటించిన హీరోల గురించి మాట్లాడారు. అయితే బాబి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన జై లవకుశ సినిమా, ఎన్టీఆర్ గురించి మాత్రం ప్రస్తావించలేదు. బాలయ్య సూచనమేరకే ఈ టాపిక్ రాలేదని వైరల్ అయింది. ఈ షోకు గెస్టులుగా ఎవరు వచ్చినా సరే.. ఎవరూ కూడా ఎట్టి పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావద్దని బాలయ్య చెప్పాడని వైరల్ అయింది. బాబి తను తీసిని సినిమా హీరోల అందరి పేర్లు ప్రస్తావించి ఎన్టీఆర్ పేరు తెరపైకి తీసుకురాకపోవడంతో తారక్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఎట్టిపరిస్థితిల్లోనూ డాకు మహారాజ్ సినిమాకు వెళ్లొద్దని తారక్ ఫ్యాన్స్‌కు సూచన చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'డాకు మహారాజ్' ఊచకోత ట్రైలర్ వచ్చేసింది)సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిర్మాత నాగవంశీకి (Suryadevara Naga Vamsi) అసలు విషయం అర్థమైనట్లు ఉంది. నెట్టింట ఇలాగే కొనసాగితే డాకు మహారాజ్‌కు డ్యామేజ్ తప్పదని గ్రహించిన ఆయన ఇలా ట్వీట్ చేశారు. 'ఇది మన అందరి సినిమా.. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్‌బస్టర్ చేసేందుకు ప్రయత్నిద్దాం.' అంటూ రాసుకొచ్చారు. దీంతో నాగవంశీపై కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్‌కు వీరాభిమానినని అన్నావ్.. కేవలం తారక్‌పై ఇష్టంతోనే దేవర సినిమా రైట్స్ తీసుకున్నానని చెప్పుకున్నావ్. మళ్లీ ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్‌గా చెప్పుకోవడం ఏంటి అంటూ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో తాము డాకు మహారాజ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నామని కామెంట్ చేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరికొందరు మాత్రం ‘ఈ ఒక్కసారి నీ సినిమా చూడం’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంతకూ డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇంతకీ మీరు ఏం సినిమా తీసినారో చెప్పలేదంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే, బాలకృష్ణ అభిమానులు కూడా తమకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ అక్కర్లేదంటూ తిరిగి సమాధానంగా చెప్పుకొస్తున్నారు.ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద blockbuster success అవ్వటానికి ప్రయత్నిద్దాం. మీNaga Vamsi— Naga Vamsi (@vamsi84) January 4, 2025 -
'డాకు మహారాజ్' ట్రైలర్ రిలీజ్
-
'డాకు మహారాజ్' ఊచకోత ట్రైలర్ వచ్చేసింది
బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమా 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది. 'చెడ్డ వాళ్లకు మాత్రమే డాకు.. మంచివాళ్లకు మాత్రం మహారాజ్' అంటూ వచ్చే డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు బాబీ డియోల్, చాందిని చౌదరి తదితరులు నటించారు.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్‌పై భారీగా ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉందంటూ కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు విడుదలైన మాస్ ట్రైలర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.'డాకు మహారాజ్' టికెట్ ధరలుజనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు ఉంటాయి.ఈ సారి డాకు మహారాజ్ సినిమాపై అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్ డే పడనున్నాయి. -
సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్ ధరలు పెంపు
కొత్త ఏడాది ప్రారంభంలోనే మూడు టాప్ సినిమాలు విడుదల కానున్నాయి. రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్), బాలకృష్ణ (డాకు మహారాజ్), వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. అయితే, ఏపీలో ఈ చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. బెనిఫిట్ షోలతో పాటు అదనపు ఆటలకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.గేమ్ ఛేంజర్ టికెట్ ధరలు ఇలారామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో నిర్మాత దిల్ రాజ్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 10న తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్ షో వేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది. అయితే, మొదటి రోజు 4గంటల ఆట నుంచి టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.175, సింగిల్ థియేటర్స్‌లలో రూ.135 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. ఫస్ట్ డే నాడు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ రోజుకు 5 షోలు ఉండనున్నాయి. పెంచిన ధరలు 23వ తేదీ వరకు ఉంటాయి. 'డాకు మహారాజ్' టికెట్ ధరలునందమూరి బాలకృష్ణ- బాబీ సినిమా 'డాకు మహారాజ్'. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 23 వరకు ఈ ధరలు ఉంటాయి.సంక్రాంతికి వస్తున్నాం టికెట్ ధరలువెంకటేశ్- అనిల్ రావిపూడి హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. రోజుకు ఐదు షోలు నిర్వహించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి కల్పించింది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.125, సింగిల్ థియేటర్స్‌లలో రూ.100 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 28 వరకు ఈ ధరలు ఉంటాయి. -
హీరోయిన్గా బ్రాహ్మణికి ఆఫర్.. కానీ, నో చెప్పింది: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్ ప్రారంభం అయింది. కేవలం ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో నాలుగు వేల టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్ డే పడనున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలయ్య వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ లో చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్ , నిర్మాత నాగవంశీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై తన పెద్ద కూతురు బ్రాహ్మిణి గురించి ఆయన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.అన్‌స్టాపబుల్ సీజన్ 4లో బాలయ్యకు ఒక ప్రశ్న ఎదురైంది. 'మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు' అని తమన్ అడిగారు. అందుకు సమాధానంగా వారిద్దరినీ చాలా గారాబంగానే పెంచానంటూ ఆయన అన్నారు. ఈ క్రమంలో బ్రాహ్మిణికి మణిరత్నం నుంచి వచ్చిన సినిమా ఛాన్స్‌ను ఆయన గుర్తు చేసుకున్నారు. 'గతంలో ఒక సినిమా కోసం హీరోయిన్గా బ్రాహ్మణి నటిస్తారా అని మణిరత్నం గారు నన్ను అడిగారు. సరే అని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పాను. నా ముఖం అంటూ సమాధానమిచ్చి వెళ్లిపోయింది. అవునూ.. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని మళ్లీ చెప్పాను. ఫైనల్‌గా తనకు అలాంటి ఆసక్తి లేదని చెప్పేసింది. అయితే, తేజస్విని మాత్రం ఇంట్లో అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటూ నటించేది. ఆ సమయంలో తనైనా నటిగా వస్తుందని ఆశించాను. ఇప్పుడు ఈ షో కోసం ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తుంది. ఇంట్లో నేను ఎక్కువగా భయపడేది మాత్రం బ్రాహ్మిణికే' అని బాలయ్య అన్నారు.దేవిశ్రీ ప్రసాద్ కంటే తమన్ సంగీతం అంటే చాలా ఇష్టమని అదే వేదికపై బాలకృష్ణ అన్నారు. దర్శకులలో బాబీ, బోయపాటి శ్రీను ఇద్దరూ ఇష్టమేనని ఆయన తెలిపారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు అమెరికాలో జరగనుంది. అక్కడే ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. -
బాలకృష్ణ దబిడి దిబిడి ఆడేసుకుంది ఈ బ్యూటీతోనే! (ఫోటోలు)
-
హీరోయిన్ను దబిడి దిబిడి ఆడేసుకున్న బాలకృష్ణ.. ఇదేం కర్మరా సామీ!
తెలుగు చలనచిత్ర పరిశ్రమ పాన్ ఇండియా ట్రెండ్‌ను పరిచయం చేసింది. బాహుబలి, పుష్ప, హనుమాన్, కల్కి 2898 ఏడీ.. ఇలా ఎన్నో సినిమాలు టాలీవుడ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాయి. ఆర్ఆర్ఆర్ అయితే ఇంటర్నేషనల్ లెవల్లోనూ సత్తా చాటింది. ఇలా ప్రపంచమంతా మనవైపు చూస్తున్న సమయంలో ఓ పాట టాలీవుడ్ (Tollywood)ను బెంబేలెత్తిస్తోంది. ఇన్నాళ్లు సంపాదించుకున్న గౌరవం ఏమైపోతుందోనని భయపడిపోతుంది.కూతురి వయసున్న నటితో చెండాలమైన డ్యాన్స్దీనికంతటికీ ముఖ్య కారణం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తాజాగా దబిడి దిబిడి (Dabidi Dabidi Song) అనే పాట రిలీజ్ చేశారు. ఇందులో 64 ఏళ్ల వయసున్న బాలయ్యతో 30 ఏళ్ల వయసున్న బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్టెప్పులేసింది. ఆ స్టెప్పులు చూడటానికే చెండాలంగా ఉన్నాయంటూ నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. పాటలో బాలకృష్ణ డ్యాన్స్‌కు బదులు నటిని కొట్టడమే ఎక్కువగా కనిపిస్తోంది. (చదవండి: ఆ హీరోయిన్ ఆస్తులు 4600 కోట్లు.. అమితాబ్ కంటే ఎక్కువే!)నీచమైన స్టెప్పులుఒక ఎమ్మెల్యే అయి ఉండి డ్యాన్స్ పేరుతో ఇంత ఘోరంగా ప్రవర్తిస్తాడా? అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు. తన కూతురి వయసున్న హీరోయిన్‌తో ఇలాంటి నీచమైన స్టెప్పులు వేస్తారా? అని మండిపడుతున్నారు. కొరియోగ్రఫీ దరిద్రంగా ఉందని, డ్యాన్స్ పేరుతో ఇంత నీచమైన పనులు చేయిస్తారా? అని దుమ్మెత్తిపోస్తున్నారు. అభిమానులు సైతం దయచేసి ఈ పాటను డిలీట్ చేయండంటూ వేడుకుంటున్నారు.ట్రెండింగ్అటు చిత్రయూనిట్ మాత్రం దబిడి దిబిడి పాట ట్రెండింగ్‌లో ఉందని, 5 మిలియన్ల వ్యూస్ వచ్చాయని జబ్బలు చరుచుకోవడం గమనార్హం. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశాడు. ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.-Who approves such choreography? Why do actors agree to do such steps? Extremely CRINGE! pic.twitter.com/5SAFOSHcnr— Aavishkar (@aavishhkar) January 2, 2025Shekhar master ki yeni trolls chesina Siggu vastaleda ? Mr bhachan peeling song ippudu #DaakuMaharaaj Endhuku ee latkor cheroghraphy #daa— kiran kumar (@shiningkiran) January 3, 2025 What on earth did I just watch? 🤮🤮 A grown man dancing so inappropriately with someone who could be his daughter? Who even comes up with such 'genius' choreography, and why did the hero agree to this? Absolutely disgusting🙏🏻🙏🏻#DabidiDibidi #DaakuMaharaaj pic.twitter.com/BlENomwL0A— Mastikhor 🤪 (@ventingout247) January 2, 2025 చదవండి: స్వ్కిడ్ గేమ్ 3 రిలీజ్ డేట్.. నెట్‌ఫ్లిక్స్ కావాలనే లీక్ చేసిందా? -
Daaku Maharaaj: దబిడి దిబిడి పాట వచ్చేసింది
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం 'డాకు మహారాజ్ (Daaku Maharaaj)'. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. గురువారం (జనవరి 2న) మూడో పాట రిలీజైంది. 'డాకు మహారాజ్' చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'దబిడి దిబిడి' సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.నందమూరి బాలకృష్ణ అంటే డైలాగ్‌లకు పెట్టింది పేరు. అలా బాలకృష్ణ చిత్రాల్లోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్‌తో రూపుదిద్దుకున్న పాటే 'దబిడి దిబిడి'. ఈ సాంగ్‌లో ఊర్వశి రౌతేలా కాలు కదిపారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను వాగ్దేవి ఆలపించారు. విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్, శేఖర్ వీజే అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ పాటను మాస్ ట్రీట్‌లా మార్చింది.డాకు మహారాజ్ మూవీ విషయానికి వస్తే.. దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. చదవండి: ఆ హీరో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మందు తాగాడు: ఖుష్బూ -
బాలకృష్ణ 'డాకు మహారాజ్'.. న్యూ ఇయర్ అప్డేట్ ఇదే
నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. ఈ చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. అయితే ఇప్పటికే రెండు పాటలు కూడా మేకర్స్ విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితమే చిన్నీ చిన్నీ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. డాకు మహారాజ్‌లోని మూడో సింగిల్‌ను జనవరి 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దబిడి దిబిడి అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నిర్మాత నాగవంశీ.కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. A GUARANTEED MASS BLAST that will have you going ballistic in theatres this Sankranthi! 😎🤘#DaakuMaharaaj 𝟑𝐫𝐝 𝐒𝐢𝐧𝐠𝐥𝐞 ~ #DabidiDibidi is going to Lit up your speakers from TOMORROW! 🕺💃🔥A @MusicThaman Vibe 🥁A @dirbobby Film 💥In Cinemas Worldwide from Jan 12,… pic.twitter.com/4wMgXN1F7m— Sithara Entertainments (@SitharaEnts) January 1, 2025 -
గుర్తుండిపొతుంది
‘‘డాకు మహారాజ్’ సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఊహించినదానికంటే బ్రహ్మాండమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. అలాగే వినోదం, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. బాలకృష్ణగారి నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది’’ అని డైరెక్టర్ బాబీ కొల్లి చెప్పారు. బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్’.ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి హీరోయిన్లుగా నటించగా, బాబీ డియోల్ కీలక పాత్ర చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ –‘‘బాలకృష్ణగారి కెరీర్లో గుర్తుండిపొయే చిత్రాల్లో ఒకటిగా ‘డాకు మహారాజ్’ నిలుస్తుంది. జనవరి 2న హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల వేడుక, 4న అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక చేసి, ఒక పాట విడుదల చేయాలనుకుంటున్నాం. 8న ఏపీలో ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నాం’’ అని తెలిపారు. -
బాలయ్య డాకు మహారాజ్.. ఆ సాంగ్ వచ్చేసింది!
నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. ఈ చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందులో తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. అంతేకాకుండా ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి రెండో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డాకు మహారాజ్ నుంచి చిన్నీ చిన్నీ అంటూ సాంగే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. -
చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు: నాగవంశీ
ఎప్పటికప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేసే నిర్మాత నాగవంశీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తనని తిట్టుకున్నా పర్లేదని అన్నారు. ఇదంతా కూడా బాలకృష్ణ 'డాకు మహారాజ్' మూవీ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ సంగతేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)బాలకృష్ణ 'డాకు మహరాజ్'.. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే జనవరి 4న అమెరికాలో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. మరో ఈవెంట్ విజయవాడలో నిర్వహిస్తామని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇతడి గత చిత్రం 'వాల్తేరు వీరయ్య'. గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ.. హిట్ అయింది.అయితే బాబీ.. 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' సినిమాని బాగా తీశారని నిర్మాత నాగవంశీ అన్నారు. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ తనని తిట్టుకున్నా పర్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాతే కాదు గతంలో దర్శకుడు బాబీ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరు-బాలయ్యతో సినిమాలు చేయడం గురించి చెప్పారు. చిరంజీవి అయితే స్ట్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తారని, బాలకృష్ణ మాత్రం డైరెక్టర్ చెప్పింది ఫాలో అయిపోతారని అన్నాడు. అప్పుడు బాబీ.. ఇప్పుడు నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: సన్నీ లియోన్ పేరిట మోసం) -
'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్ రిలీజ్.. తమన్ మ్యూజిక్‌పై ప్రశంసలు
బాలకృష్ణ నటిస్తున్న 'డాకు మహారాజ్' ప్రకటన వెలువడిన సమయం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందులో తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.బాలకృష్ణ నటించిన గత మూడు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించి, ఆ ఘన విజయాలలో కీలక పాత్ర పోషించిన తమన్ 'డాకు మహారాజ్' చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి 'ది రేజ్ ఆఫ్ డాకు' పేరుతో మొదటి గీతం విడుదలైంది. బాలకృష్ణ, తమన్ కలయిక అంటే, సంగీత ప్రియుల్లో ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, తమన్ ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు. 'డాకు మహారాజ్' పాత్ర తీరుని తెలియజేసేలా గీత రచయిత అనంత శ్రీరామ్ అర్థవంతమైన, శక్తివంతమైన సాహిత్యాన్ని అందించారు. "డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా" వంటి పంక్తులతో మరోసారి తన కలం బలం చూపించారు. ఇక గాయకులు భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి. రావు, కె. ప్రణతి తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు.లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. విజువల్‌గా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం కనిపిస్తోంది. అలాగే ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, బలమైన భావోద్వేగాలతో సినిమా అద్భుతమైన అనుభూతిని పంచనుందని లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'డాకు మహారాజ్' చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. -
'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్ ప్రోమో.. తమన్ మాస్ ర్యాంప్
బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 'డాకు మహారాజ్' నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రద్ధాశ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ మూవీలో విలన్‌గా కనిపించబోతున్నాడు. తాజాగా విడుదలైన 'డాకుస్ రేజ్' ప్రోమో అదిరిపోయింది. తమన్ అందించిన బీజీఎమ్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే అనేలా ఈ సాంగ్ ఉండనుంది. ఈ సాంగ్‌కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా నాకాశ్ అజీజ్ ఆలపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా డాకు మహారాజ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
బాలకృష్ణ 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్
కొన్నిరోజులుగా అనుకుంటున్నట్లే బాలకృష్ణ కొత్త సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దాదాపు 96 సెకన్ల నిడివి ఉన్న టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో నల్లని గుర్రంపై కనిపించిన బాలయ్యకు.. డైరెక్టర్ బాబీ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు. దానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే రేంజ్ అనేలా కొట్టాడు.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)'ఈ కథ వెలుగుని పంపే దేవుడిది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు, ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది.. కండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది.. మరణాన్నే వణికించిన మహారాజుది' అనే వాయిస్ ఓవర్ ఆగగానే.. 'మహారాజ్, డాకు మహారాజ్' అని బాలకృష్ణ చెప్పడం ఆకట్టుకుంది.ఇందులో బాలయ్యతో పాటు చౌందిని చౌదరి, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)