నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. ఈ చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందులో తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్‌లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. అంతేకాకుండా ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా ఈ మూవీ నుంచి రెండో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డాకు మహారాజ్ నుంచి చిన్నీ చిన్నీ అంటూ సాంగే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment