నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాబీ కొల్లి డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద రాణించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది.
తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ వారంలోనే డాకు మహారాజ్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
కాగా.. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషించారు. వీరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
#DaakuMaharaj OTT Release Sets to Premeire This Sunday on Netflix
In Tamil Telugu Malayalam Kannada pic.twitter.com/SQbZvxNEqM— SRS CA TV (@srs_ca_tv) February 3, 2025
Comments
Please login to add a commentAdd a comment