
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో ఓటీటీ కోసం సినీ ప్రియులు, నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గతంలోనే ఓటీటీకి వస్తుందని భావించినా అది జరగలేదు. తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈనెల 21 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. దీంతో ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
డాకు మాహారాజ్ కథేంటంటే..
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు.
చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్‌లో సినిమా చూడాల్సిందే.
Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju!
Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025
Comments
Please login to add a commentAdd a comment