నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్. బాలీ కొల్లి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిదంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంతో తమన్ మరోసారి తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడని చెబుతున్నారు.
డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ఓటీటీ గురించి అప్పుడే చర్చ మొదలెట్టారు. బాలయ్య మూవీ ఏ ఓటీటీకి రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో ఓ టాక్ నడుస్తోంది. బాలకృష్ణ డాకు మహారాజ్ హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
(ఇది చదవండి: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)
టికెట్ ధరల పెంపు..
జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.
ఈ సారి డాకు మహారాజ్ సినిమాపై అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ప్రదర్శించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
జనవరి 9న జరగాల్సిన డాకు మహారాజ్ (Dsaku Maharaaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) రద్దయింది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది. ఈ నిర్ణయంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
డైరెక్టర్ బాబీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నా. యాక్షన్‌తోపాటు మంచి వినోదం, భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది' అని అన్నారు. ఈ నెల 12న నా బర్త్ డే కానుకగా ఈ చిత్ర విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment