'రాయలసీమ మాలుమ్ తేరేకు'.. డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ చూసేయండి | Nandamuri Balakrishna Daaku Maharaaj Release Trailer Out Now | Sakshi
Sakshi News home page

Daaku Maharaaj Release Trailer: 'ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారు..కానీ'.. డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ చూశారా?

Published Fri, Jan 10 2025 6:52 PM | Last Updated on Fri, Jan 10 2025 7:23 PM

Nandamuri Balakrishna Daaku Maharaaj Release Trailer Out Now

నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ డాకు మహారాజ్‌(Daaku Maharaaj Movie). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్‌ ట్రైలర్‌ను(Release Trailer) మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా వచ్చిన బాలయ్య మూవీ ట్రైలర్‌ను మీరు కూడా చూసేయండి

తాజాగా రిలీజైన ట్రైలర్‌ ఫ్యాన్స్‌కు మాత్రం గూస్‌ బంప్స్ తెప్పిస్తోంది. బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్‌ను ఊపేస్తున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్‌ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. 'ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారు.. నేను చంపడంలో చేశా' అనే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మాస్ డైలాగ్స్ చూస్తే సంక్రాంతికి ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అలరించేలా కనిపిస్తోంది.  

ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు బాబీ డియోల్‌, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌ , టీజర్‌పై భారీగా ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా తమన్‌ అందించిన బీజీఎమ్‌ మరో రేంజ్‌లో ఉందంటూ కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు విడుదలైన మాస్‌ ట్రైలర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. తాజాగా రిలీజ్ ట్రైలర్‌ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.

టికెట్‌ ధరల పెంపు..

జనవరి 12న విడుదల కానున్న మూవీకి  బెనిఫిట్‌ షోలతో పాటు టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.  12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో  కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్‌ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు  ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్‌ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు ఉంటాయి.

ఈ సారి డాకు మహారాజ్‌  సినిమాపై  అమెరికాలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్‌ ప్రీ సేల్‌ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు రికార్డ్‌ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్‌ డే పడనున్నాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

జనవరి 9న జరగాల్సిన డాకు మహారాజ్‌ (Dsaku Maharaaj) చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Pre Release Event) రద్దయింది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్‌ రద్దు చేసింది. ఈ నిర్ణయంతో బాలయ్య ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. 
 


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement