హీరోయిన్‌ వీడియో.. కావాలనే చేశారట! | Urvashi Rautela Says Her Video Was Intentionally Released | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ వీడియో.. కావాలనే చేశారట!

Jan 22 2025 10:56 AM | Updated on Jan 23 2025 12:48 PM

Urvashi Rautela Says Her Video Was Intentionally Released

సినీ తారలకు ట్రోలింగ్‌ మాములే. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఎలాంటి తప్పు చేయకున్నా.. ట్రోల్స్‌ చేస్తుంటారు. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా దారుణంగా అవమానిస్తారు. తీరా అసలు విషయం తెలిశాక అయ్యో..అలా జరిగిందా అంటారు. అలాంటి ఘటన బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)కు కూడా ఎదురైంది. ఆమెకు సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్‌ అయింది. అది స్వయంగా ఊర్వశీనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆమెపై నెటిజన్స్‌ తీవ్రంగా మండిపడ్డారు. నెగెటివ్‌ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. ట్రోలింగ్‌ తట్టుకోలేక ఆ వీడియోనే డిలీట్‌ చేసింది. కానీ ఆమె వీడియో లీక్‌ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. పైగా అది ఆమె ప్రైవేట్‌ వీడియో కాదు.. ఓ సినిమాలోని సన్నివేశం. మరి ఆ సీన్‌ని లీక్‌ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది?

కావాలనే లీక్‌
గతఏడాది జులై లో ఊర్వశి బాత్రూం వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసి నెటిజన్స్‌ అంతా షాకయ్యారు. ఇంత ఓపెన్‌గా బాత్రూం వీడియోను ఎలా షేర్‌ చేస్తారంటూ ఆమెపై మండిపడ్డారు. ఆ వీడియోను దారుణంగా ట్రోల్స్‌ చేయడంతో చివరకు ఊర్వశీనే అది డిలీట్‌ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వీడియో లీక్‌పై ఊర్వశీ వివరణ ఇచ్చింది. 

‘అది నా ప్రైవేట్‌ వీడియో కాదు. ఘుస్పైథియా(Ghuspaithiya) సినిమాలోని ఓ సన్నివేశం. అది మాత్రమే లీక్‌ చేయడానికి ఓ పెద్ద కారణం ఉంది. ఆ సినిమా మేకర్స్‌ ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. ఆస్తులన్నీ అమ్మి సినిమా తీశామని.. కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ చేయలేకపోయామని బాధ పడ్డారు. బాత్రూం వీడియో లీక్‌ చేస్తే సినిమాకు బజ్‌ వస్తుందని రిక్వెస్ట్‌ చేశారు.అలాగే అమ్మాయిలకు అవగాహన కలిగించినట్లు కూడా ఉంటుందని చెప్పారు. నేను ఆ ఉద్దేశంతోనే ఆ వీడియోని లీక్‌ చేశాను. ఇదంతా మేకర్స్‌ అనుమతితోనే జరిగింది. ఆ బాత్రూం సీన్‌ చూసి అమ్మాయిలు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారని అలా చేశాం. అలాగే మేకర్స్‌ కూడా అప్పుల బాధ నుంచి బయటపడతారని అలా చేశాను’ అని ఊర్వశీ చెప్పుకొచ్చింది. 

కాగా,  2018లో విడుదలైన హేట్ స్టోరి 4 లో ఓ సాంగ్ కోసం ఊర్వశీతో ఇలా కొన్ని బాత్రూం సీన్స్ షూట్ చేశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోసారి ఊర్వశీ బాత్రూం వీడియో లీక్‌ అవ్వడంతో నెటిజన్స్‌ ఫైర్‌ అయ్యారు. ఇప్పుడు అసలు విషయం తెలిసి.. మంచి పనే చేశావ్‌లే అని ఆమెను ప్రశంసిస్తున్నారు.

టాలీవుడ్‌లో ఫుల్‌ క్రేజీ
ఊర్వశీ రౌతేలాకు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ పెరిగింది. స్పెషల్‌ సాంగ్స్‌కి ఫేవరేట్‌గా మారింది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి స్పెషల్‌ సాంగ్‌కి స్టెప్పులేసిన ఊర్వశీ..తాజాగా ‘డాకు మహారాజ్‌’(Daaku Maharaaj)లో బాలయ్యతో కలిసి చిందులేసింది. ‘దబిడిదిబిడి’ అంటూ సాంగే ఈ ఐటం సాంగ్స్‌ స్టెప్పులపై కూడా దారుణమైన ట్రోలింగ్‌ జరిగింది. కానీ బాలయ్యతో పాటు ఊర్వశీ కూడా ఆ ట్రోలింగ్‌ని పట్టించుకోకుండా..సక్సెస్‌ పార్టీలోనూ అలాంటి స్టెప్పులే వేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement