వాళ్లకు అలాంటిదేం లేదు.. నీకేమైంది?.. ఊర్వశి రౌతేలాపై ఘాటు కామెంట్స్! | Urvashi Rautela Counter Attack To KRK About Her Song Critisism In Daku Maharaj | Sakshi
Sakshi News home page

Urvashi Rautela: 'ఆ సాంగ్‌ చేసినందుకు సిగ్గుపడాలి'.. ఊర్వశి రౌతేలాపై విమర్శలు!

Published Thu, Jan 9 2025 2:44 PM | Last Updated on Thu, Jan 9 2025 2:54 PM

Urvashi Rautela Counter Attack To KRK About Her Song Critisism In Daku Maharaj

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్ (Daaku Maharaaj)'. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కొత్త ఏడాదిలో మరో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) డ్యాన్స్ చేసిన 'దబిడి దిబిడి' అంచూ సాగే సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

అయితే సాంగ్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఊర్వశి రౌతేలాతో బాలయ్య అలా చేయడం కరెక్ట్‌ కాదంటూ పలువురు విమర్శించారు. అంతేకాదు శేఖర్ మాస్టర్ చెత్త కొరియోగ్రఫీ అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. ఆ స్టెప్పులేంటి అంటూ చాలా మంది బహిరంగంగానే బాలయ్యతో పాటు డాకు మహారాజ్‌ టీమ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.

‍ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్‌ కేఆర్కే(Kamal R Khan)  ఈ సాంగ్‌ను ‍ఉద్దేశించి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. తెలుగువాళ్లు అలాంటి పాటలు చేయడానికి వెనకాడరు.. కానీ ఊర్వశి రౌతేలా ఆ పాటను చేయడం చూస్తే తనకు ఎలాంటి సిగ్గులేదనిపిస్తోంది అంటూ పోస్ట్ చేశారు.  

అయితే కేఆర్కే ట్వీట్‌పై ఊర్వశి రౌతేలా స్పందించింది. జీవితంలో ఏం సాధించలేని కొందరు.. కష్టపడేవారిని విమర్శించే అర్హత ఉందనుకోవడం విడ్డూరం అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చింది. రియల్ పవర్ అంటే ఇతరులను విమర్శించడం కాదు.. అవతలి వారి పైకి తీసుకొచ్చేలా చేయడం.. వారి గొప్పదనాన్ని ఆదర్శంగా తీసుకోవడంలో ఉంటుందని' అని కౌంటర్‌ ఇచ్చిపడేసింది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.

(ఇది చదవండి: స్క్రీన్‌ టైమ్‌ గురించి ఆలోచించను: శ్రద్ధా శ్రీనాథ్‌)

కాగా.. డాకు మహారాజ్ మూవీ విషయానికి వస్తే.. దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు..

నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్‌’ (Daku Maharaj) చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Pre Release) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో నేడు అనంతపురంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు కూడా చేశారు. 

అయితే, శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్‌ రద్దు చేసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement