‘దబిడి దిబిడి’ పాట స్టెప్పులపై సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో అందరికి తెలిసిందే. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అలాంటి స్టెప్పులేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అభిమానులు కూడా ఆ స్టేప్పులను తప్పుపట్టారు. అయితే ఇందులో బాలయ్య కంటే ఎక్కువగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌నే ఎక్కువగా ట్రోల్ చేశారు. ఓ ఎమ్మెల్యే, సీనియర్ హీరో అయిన బాలకృష్ణతో అలాంటి అసభ్యకరమైన స్టెప్పులేయించాండంటూ శేఖర్ మాస్టర్‌ను ఏకిపారేశారు. మరికొంతమంది నెటిజన్స్ అయితే కూతురు వయసు ఉన్న ఊర్వశీ రౌతేలాతో బాలయ్య అలాంటి స్టెప్పులేయడం అసభ్యకరంగా ఉందని కామెంట్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్‌ని చిత్ర యూనిట్‌తో సహా బాలయ్య కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఓ పార్టీ ఈవెంట్‌లో ఊర్వశీతో బాలయ్య మళ్లీ అదే స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
సక్సెస్ పార్టీతో వికృత స్టెప్పులు!
హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ప్రగ్యా జైశ్వాల్, శ్రధ్ధాశ్రీనాథ్ హీరోయిన్. . శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో యూనిట్ అంతా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఓ హోటల్‌లో జరిగిన ఈ పార్టీకి బాలయ్యతో సహా చిత్రబృందం అంతా హాజరైంది. ఈ సందర్భంగా ఊర్వశీతో బాలయ్య స్టెప్పులేశాడు. ‘దబిడి దిబిడి’ పాటకు డ్యాన్స్ చేస్తూ మళ్లీ అసభ్యకరమైన స్టెప్పులేశారు. బాలయ్య ఆ స్టెప్పులేస్తూ ఆమె దగ్గరకు రాగానే.. ఊర్వశీ పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ వీడియోని ఊర్వశీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.
ముద్దులతో ముంచేసిన బాలయ్య
`డాకు మహారాజ్`పార్టీలో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ముద్దులతో ముంచేశాడు బాలకృష్ణ. సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తూ `కంగ్రాట్చ్యూలేషన్స్ టూ డాకు మహారాజ్` అని విశ్వక్ సేన్ అనగా.. థ్యాంక్యూ ‘లైలా ’అంటూ విశ్వక్ సేన్‌కి బాలయ్య ముద్దు పెట్టాడు. విశ్వక్ కూడా తిరిగి బాలయ్యకు ముద్దు పెట్టారు. పక్కనే ఉన్న సిద్దు కూడా ‘నాకు పెట్టలేదు(కిస్) అనగానే..బాలయ్య లాక్కొని సిద్దుకి కూడా కిస్ ఇచ్చాడు. ఈ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు దర్శకుడు బాబీకి కూడా కిస్ ఇచ్చాడు బాలయ్య. పార్టీ మూడ్‌లో బాలయ్య ఇలా రెచ్చిపోవడంతో ఆ వీడియోలన్నీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment