డాకు మహారాజ్‌ ఓటీటీ పోస్టర్‌.. ఆమె లేకపోవడంపై నెటిజన్స్ ఫైర్! | Netizens Trolls On Urvashi Rautela Not In Daaku Maharaaj OTT Poster | Sakshi
Sakshi News home page

Daaku Maharaaj Movie: ఓటీటీ డాకు మహారాజ్.. పోస్టర్‌పై వివాదం!

Published Mon, Feb 17 2025 3:58 PM | Last Updated on Mon, Feb 17 2025 4:14 PM

Netizens Trolls On Urvashi Rautela Not In Daaku Maharaaj OTT Poster

నందమూరి బాలకృష్ణ కొత్త ఏడాదిలో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన డాకు మహారాజ్‌ బాక్సాఫీస్ వద్ద రాణించింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఊర్వళి రౌతేలా ప్రత్యేక పాత్రలో మెరిసింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు.

అయితే ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్‌ఫ్లిక్ల్ వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అయితే నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌ వల్లే వివాదం మొదలైంది. డాకు మహారాజ్‌లో కీలక పాత్ర పోషించిన ఊర్వశి రౌతేలా ఫోటో లేకపోవడంపై ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ మండిపడుతున్నారు. దబిడి దిబిడి సాంగ్‌లో అభిమానులను ఓ ఊపు ఊపేసిన ఊర్వశికి ఇచ్చే గుర్తింపు ఇదేనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డాకు మహారాజ్‌ పోస్టర్‌ను ఉద్దేశించి నెటిజన్స్ ‍కామెంట్స్ చేస్తున్నారు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతదేశపు మొదటి మహిళను పోస్టర్‌ నుంచి తీసేస్తారా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ఉన్నారా?.. మరి పోస్టర్‌లో కనిపించడం లేదంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. దబిడి దిబిడి సాంగ్‌ డ్యాన్స్ చేస్తూ పోస్టర్‌ బయటికి వెళ్లిపోయిందంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తానికి డాకు మహారాజ్‌ పోస్టర్‌లో బాలీవుడ్ భామ ఫోటో లేకపోవడం ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement