![Daaku Maharaaj OTT Streaming Release Date Late](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/daaku.jpg.webp?itok=bRXXmZdL)
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన చిత్రం 'డాకు మహారాజ్'.. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే చాలాచోట్ల థియటర్ రన్ ముగిసింది. కానీ, ఓటీటీలో ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి రేసులో వచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇప్పటికే ఓటీటీలో రన్ అవుతుంది. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్‌కు రావచ్చని చిత్ర యూనిట్ సమాచారం ఇచ్చింది. కానీ, డాకు మహారాజ్( Daaku Maharaaj) ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు మరింత సమయం పట్టేలా ఉంది.
డాకు మహారాజ్ ఓటీటీ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని నెట్టింట భారీగా వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని తేలిపోయింది. డాకు మహారాజ్ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ, స్ట్రీమింగ్ వివరాలను ఎక్కడా కూడా ప్రకటించలేదు. అందుకు ప్రధాన కారణం సినిమా నిర్మాతలతో చేసుకున్న ఒప్పందమే అని తెలుస్తోంది.
డాకు మహారాజ్ సినిమా విడుదలైన రోజు నుంచి 50 రోజుల థియేటర్ రన్ పూర్తయిన తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిబంధనను చిత్ర యూనిట్ పాటిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు, హిందీ వర్షన్‌లో విడుదలైంది. అయితే, ఓటీటీ కోసం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారు. ఆ భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయట. అవి పూర్తి అయ్యేందుకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఓటీటీ కోసం మరికొన్ని సీన్లు కూడా అధనంగా జోడించనున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా మార్చి 4న 'డాకు మహారాజ్' ఓటీటీ ఎంట్రీ ఉండొచ్చని తెలుస్తోంది.
బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషించారు. వీరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించగా భారీ బడ్జెట్‌తో నాగవంశీ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment