
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తోన్న తాజా చిత్రం బజూక. డినో డెన్సిస్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో మమ్ముట్టి యాక్షన్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు.
ట్రైలర్‌లో ఫైట్స్ సీక్వెన్స్, మమ్ముట్టి యాక్షన్ చూస్తుంటే అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. అజిత్ మూవీతో మమ్ముట్టి బజూక సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment