Malayalam film
-
ఏడాది తర్వాత ఓటీటీకి వచ్చేసిన కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సీనియర్ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జలధార పంప్‌సెట్ సిన్స్ 1962'. గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రాన్ని సెటైరికల్ కామెడీగా తెరకెక్కించారు. ఈ మూవీకి ఆశిష్ చిన్నప్ప దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది.ఈ సినిమా సెప్టెంబర్ 15 నుంచే జియోసినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన దాదాపు 13 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కేవలం మలయాళంలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఊర్వశితో పాటు ఇంద్రన్స్, సనుషా, సాగర్ రాజన్, జానీ ఆంటోనీ, టీజీ రవి, విజయరాఘవన్, నిషా సారంగ్, జయన్ చేర్తలా కీలకపాత్రలు పోషించారు. ఓ చిన్న కేసు కూడా కోర్టుల్లో ఎన్నేళ్లు కొనసాగుతుందో సెటైరికల్‌గా ఈ చిత్రంలో చూపించారు. The court is now in session! Witness Mrinalini’s long fight for justice. #JaladharaPumpsetSince1962, now streaming, exclusively on #JioCinema #Urvashi #SagarRajan #Indrans #SanushaSanu #TGRavi #JohnyanTony #AlthafSalim #WonderframesFilmland#JaladharaPumpsetSince1962… pic.twitter.com/iM8I7MGAuQ— JioCinema (@JioCinema) September 15, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల మలయాళం సినిమాలకు తెలుగులోనూ ప్రేక్షకాదరణ దక్కుతోంది. చిన్న సినిమాలైన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సైతం టాలీవుడ్లో రాణించాయి. ఓటీటీలోనూ మలయాళ చిత్రాలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా టోవినో థామస్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.గతేడాది థియేటర్లలో విడుదలైన నీలవెలిచమ్ మూవీ దాదాపు 16 నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా త్వరలోనే తెలుగు ఆడియన్స్‌ను అలరించనుంది. భార్గవి నిలయం పేరుతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 5 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రానికి ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. ఇందులో రీమా, రోషన్ మ్యాథ్యూ, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు. Our Tovino is ready to entertain you with'#BhargaviNilayam premieres on #aha from Sep 5th.🏠🎬@roshanmathew22 @PoojaMohanraj @ttovino @shinetomchacko_ @rimakallingal pic.twitter.com/leMWbAJURc— ahavideoin (@ahavideoIN) September 3, 2024 -
ఓటీటీకి సలార్ నటుడి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల కాలంలో ఓటీటీలే సినీ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వచ్చాక భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు థియేటర్లు మాత్రమే కాదు.. ఓటీటీలోనూ దూసుకెళ్తున్నాయి. మరి ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అందుకే అక్కడ హిట్ అయిన చిత్రాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు.అందుకే మలయాళంలో హిట్ అయిన చిత్రాలు దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన కామెడీ చిత్రం గురువాయుర్ అంబలనాదయిల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈనెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓవర్సీస్ అభిమానుల కోసం సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు.కాగా.. ఈ ఏడాది మే 16న మలయాళంలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.90 కోట్లు వసూళ్లు సాధించింది. జూన్ 27న మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను విపిన్ దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో బసిల్ జోసెఫ్, రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. #GuruvayoorAmbalaNadayil Will Be Streaming From June 27 On @DisneyPlusHS @PrithviOfficial @basiljoseph25#PrithvirajSukumaran pic.twitter.com/aJssR3jqG2— Shaham (@SHAHAMMUHAMMED1) June 24, 2024 -
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వజక్కు. 2021లోనే ఈ చిత్రం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. దీనికి కారణం దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్, హీరో టొవినో థామస్ మధ్య వివాదమే. అయితే మూడేళ్ల పాటు ఓపికగా ఉన్న డైరెక్టర్ సడన్‌గా షాకిచ్చాడు. ఈ సినిమాను ఓ వీడియో ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశాడు.తాజాగా వజక్కు చిత్రాన్ని వీమియో అనే ప్లాట్ఫామ్లో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ అప్లోడ్ చేశారు. ఈ ప్లాట్‌ఫామ్ కూడా దాదాపు యూట్యూబ్ లాగే ఉంటుంది. వీమియోలో ఈ చిత్రాన్ని యూజర్లు ఉచితంగా చూసేలా అందుబాటులోకి తెచ్చారు. అయితే మొదట వజక్కు చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు హీరో టొవినో థామస్ అంగీకరించలేదని శశిధరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కెరీర్‌పై ప్రభావం చూపుతుందనే కారణంతో థియేటర్లలోనూ.. ఓటీటీలోనూ ఈ మూవీని రిలీజ్ చేయకుండా థామస్ అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారుస్పందించిన టొవినో థామస్సనల్ శశిధరన్ చేసిన ఆరోపణలకు హీరో టొవినో థామస్ స్పందించారు. ఈ సినిమా నిర్మాణం కోసం తాను రూ.27లక్షలను ఖర్చు చేశానని.. తనకు ఎలాంటి లాభం రాలేదని అన్నారు. ఈ సినిమా విడుదల కాకపోవడానికి డైరెక్టరే కారణమని చెప్పారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించేందుకు కూడా ఆయన అంగీకరించలేదని టొవినో చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో కునీ కుశృతి, సుదేవ్ నాయర్, అజీస్ నెడుమంగద్, బైజూ నీటో కీలకపాత్రలు పోషించారు. పారట్ మౌంట్ పిక్చర్స్, టొవినో థామస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మించిన ఈ మూవీకి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు. -
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
మలయాళ స్టార్ మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న మోహన్‌లాల్ ఇప్పటికే వందల చిత్రాల్లో నటించారు. తాజాగా మోహన్ లాల్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టడం విశేషం. స్టార్ నటుడిగా ఎదిగిన ఆయన తన అనుభవానంతా రంగరించి బరోస్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.బాలలను అలరించేలా ఫాంటసీ కథాంశంతో 3డీ ఫార్మెట్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్కోడిగామాకు చెందిన విలువైన వస్తువులను కాపాడే రక్షకుడు బరోస్ అనే వ్యక్తి ఇతివృత్తంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి నేపథ్య సంగీతాన్ని అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిర్వహించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్రాన్ని ఓనం పండుగ సందర్భంగా సెపె్టంబరు 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా మోహన్‌లాల్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడంతో బరోస్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో నటుడు గురు సోమసుందరం, నటి మీరాజాస్మిన్, ఆంథోని పెరంబావుర్, రబేల్ అమర్కో తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, లిడియన్ సంగీతం అందిస్తున్నారు.#Barroz Releasing On September 12,2024 ( Onam Release)A Film By @Mohanlal 💥 pic.twitter.com/fJsh3OwDew— Akshay 𓃵 (@Akshayk_2255) May 6, 2024 -
కాన్స్ చిత్రోత్సవంలో భారతీయ చిత్రాలు
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం చరిత్ర సృష్టించింది. కాన్స్ చలన చిత్రోత్సవంలో ప్రధాన విభాగంగా భావించే పామ్ డ ఓర్’ అవార్డు పోటీలో నిలిచింది ఈ మలయాళ చిత్రం. ముంబైకి చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డ ఓర్’ అవార్డు కోసం పోటీలో నిలిచినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఏడాది కాన్స్ చిత్రోత్సవం మే 15 నుంచి 25 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన అవార్డులు, స్క్రీనింగ్ కానున్న సినిమాల జాబితాను ప్రకటించారు నిర్వాహకులు. కాన్స్‌లో అత్యధిక బహుమతిని అందించే పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’తో పాటు అమెరికన్ ఫిల్మ్ ‘అనొర’, యూకే ఫిల్మ్ ‘ఓహ్.. కెనడా’, ఫ్రెంచ్ ఫిల్మ్ ‘బీటింగ్ హార్ట్స్’, పోర్చుగల్ ఫిల్మ్ ‘గ్రాండ్ టూర్’ వంటి దాదాపు 20 చిత్రాలు నిలిచాయి. ఇక ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో బ్రిటిష్ ఇండియన్ దర్శకురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’, బల్గేరియన్ దర్శకుడు కోన్స్టాటిన్ బోజనోవ్ దర్శకత్వంలో భారతీయ నటీనటులు భాగమైన ‘ది షేమ్‌లెస్’ చిత్రాలతో పాటు చైనా ఫిల్మ్ ‘బ్లాక్‌డాగ్’, ‘సెప్టెంబర్ సేస్’, జపాన్ ఫిల్మ్ ‘మై సన్‌షైన్’ వంటి 15 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక ‘అవుట్ ఆఫ్ కాంపిటిషన్’ విభాగంలో ‘ఫూరియోషియా: ది మ్యాడ్మాక్స్ సాగ’, ‘రూమర్స్’తో పాటు మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మిడ్నైట్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది సఫర్’తో కలిసి నాలుగు చిత్రాలు, కాన్స్ ప్రీమియర్‌లో ‘ఇట్స్ నాట్ మీ’తో పాటు ఆరు చిత్రాలు, స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది బ్యూటీ ఆఫ్ ఘాజా’తో కలిపి ఐదు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ పోటీ పడుతోంది. ఈ విభాగంలో 1994లో మలయాళ చిత్రం ‘స్వాహం’ నామినేషన్‌ను దక్కించుకున్నా, అవార్డు గెల్చుకోలేకపోయింది. ఈ సినిమాకు షాజీ నీలకంఠన్ కరుణ్ దర్శకత్వం వహించారు. అలాగే ఇదే విభాగంలో అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రం ‘నీచా నగర్’. 1946లో విడుదలైన ఈ హిందీ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. ‘నీచా నగర్’ చిత్రం తర్వాత ‘అమర్ భూపాలి’, ‘ఆవారా’ వంటి చిత్రాలు పామ్ డ ఓర్’కు నామినేషన్ దక్కించుకున్నా అవార్డు గెల్చుకోలేకపోయాయి. 30 ఏళ్లకు ఈ విభాగంలో పోటీ పడుతున్న భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’కు అవార్డు వస్తుందా? అనేది చూడాలి. ఈసారి పామ్ డ ఓర్’ విభాగంలో విజేతను నిర్ణయించే జ్యూరీ అధ్యక్షురాలిగా అమెరికన్ నటి గ్రెటా గెర్విక్ వ్యవహరిస్తున్నారు. ఆల్ వీ ఇమాజిన్... కథేంటంటే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ప్రభ, అనులు ముంబైలో పని చేస్తుంటారు. ఈ ఇద్దరూ వారి వారి రిలేషన్షిప్స్లో ఇబ్బందులు పడుతుంటారు. అలా ఈ ఇద్దరూ ఓ రోడ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశమని సమాచారం. ఈ మలయాళ చిత్రానికి రచయిత–దర్శకురాలు, ఎడిటర్ పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఇక పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. గతంలో పాయల్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ 2015లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్‌కు ఎంపిక అయింది. అలాగే పాయల్ దర్శకత్వంలో వచ్చిన మరో డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ 2021లో జరిగిన కాన్స్ ఫెస్టివల్లో ‘గోల్డెన్ ఐ’ అవార్డును గెలుచుకుంది. మరి.. ఈసారి కూడా పాయల్ అవార్డును గెలుస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సంతోష్ కథేంటంటే... బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరికి దర్శకురాలిగా ‘సంతోష్’ తొలి చిత్రం. ఉత్తర భారతదేశంలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. వితంతువు సంతోష్‌కి తన భర్త చేసే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం దక్కుతుంది. బలహీన వర్గానికి చెందిన ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచారం, ఆ పై హత్యకు సంబంధించిన కేసుని ఛేదించే దర్యాప్తు బృందంలో సంతోష్ భాగం అవుతుంది. ఈ కేసుని ఆమె ఎలా హ్యాండిల్ చేసింది? అనేది కథాంశం. మరి.. ఈ చిత్రం కూడా అవార్డు దక్కించుకుంటుందా? చూడాలి. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నిర్మాత గాంధీమతి బాలన్ (66) కన్నుమూశారు. 1980ల్లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన ఆయన గాంధీమతి పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మలయాళంలో 'సుఖమో దేవి', 'పంచవడి పాలం' 'తూవనతుంబికల్', మూన్నం పక్కం, నంబరతి పూవు, సుఖమో దేవి, ఇదిరి నేరమ్ ఒతిరి కార్యం వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. బాలన్ కేవలం ఇరవై ఏళ్ళ వయసులో నిర్మాతగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. మలయాళంలో నిర్మాతగా దాదాపు 33 చిత్రాలు నిర్మించారు. కొన్నేళ్ల క్రితం బాలన్ తన కుమార్తెతో కలిసి సైబర్-ఫోరెన్సిక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. -
రూ.100 కోట్ల క్లబ్లో సలార్ హీరో మూవీ..!
సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడుజీవితం. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఆడియన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. మలయాళ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా వంద కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా చూస్తే మలయాళ చిత్రసీమలో ఈ మైలురాయిని సాధించిన ఆరో చిత్రంగా ఆడుజీవితం నిలిచింది. గతంలో రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకోవడానికి '2018' సినిమాకు 11 రోజులు పట్టగా.. ఆ రికార్డును అధిగమించింది. 'లూసిఫర్', 'మంజుమ్మెల్ బాయ్స్' 12 రోజుల్లో ఈ ఫీట్ సాధించాయి. ఇటీవల హిట్‌గా నిలిచిన 'ప్రేమలు చిత్రానికి ఈ క్లబ్లో చేరడానికి 31 రోజులు పట్టింది. అలాగే 'పులిమురుగన్' సినిమాకు 36 రోజులు పట్టింది. అంతే కాకుండా మలయాళ చిత్రసీమలో అత్యంత వేగంగా రూ.50 కోట్ల మార్కును క్రాస్ చేసిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాదిలో ‘ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ తర్వాత రూ.100 కోట్ల మైలురాయి చేరుకున్న మూడో చిత్రంగా ఆడుజీవితం నిలిచింది. కాగా.. ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. 100 Cr and counting at the Global Box Office! Thank you for this unprecedented success! ❤️🙏 #Aadujeevitham #TheGoatLife @DirectorBlessy @benyamin_bh @arrahman @Amala_ams@Haitianhero @rikaby @resulp @iamkrgokul @HombaleFilms @AAFilmsIndia @PrithvirajProd @RedGiantMovies_… pic.twitter.com/6H1gynVIJ6 — Prithviraj Sukumaran (@PrithviOfficial) April 6, 2024 -
అఫీషియల్: ఓటీటీకి స్టార్ హీరో డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం మలైకోట్టై వాలిబన్. జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ తక్కువ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లిజో దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోను స్ట్రీమింగ్ చేయనున్నారు. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.25 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. మోహన్ లాల్ కెరీర్లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే థియేటర్లలో ఈ మూవీ కేవలం మలయాళంలో మాత్రమే రిలీజైంది. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. An epic tale of a warrior overcoming every challenge thrown his way - Malaikottai Vaaliban streaming from 23rd Feb in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada. https://t.co/zHnUR7TwM4 — Disney+ Hotstar (@DisneyPlusHS) February 19, 2024 -
తెలుగులోనూ బ్లాక్ అండ్ వైట్ హారర్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం భ్రమయుగం. మలయాళంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీని రాహుల్ సదాశివన్ దర్శకత్వం తెరకెక్కించారు. సరికొత్త పీరియాడిక్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన ఈ మూవీపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో తెలుగు వర్షన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 23న సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తెలుగులో టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు వర్షన్ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని త్వరలోనే కన్నడ, తమిళ, హిందీ భాషల్లోను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. -
మెగాస్టార్ సరికొత్త హారర్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'భ్రమయుగం'. ఈ చిత్రానికి 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పోస్టర్స్ 'భ్రమయుగం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ఈ సినిమా కథ కేరళలో మాయ/తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక సింగర్ జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా.. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందించారు. ఈ చిత్రంలో విలన్లు, హీరోలు లేరని మెగాస్టార్ మమ్ముట్టి అన్నారు. విలన్లు, హీరోలు అనే కాన్సెప్ట్ కూడా లేని కాలంలో 'భ్రమయుగం' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనా పాత్ర చాలా మిస్టరీగా ఉంటుందని తెలిపారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో భాగమైనందుకు మమ్ముట్టి సంతోషం వ్యక్తం చేశారు. మమ్ముట్టి మాట్లాడుతూ.. 'గతంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చాలా వచ్చాయి. ఫ్లాష్‌బ్యాక్‌లను బ్లాక్ అండ్ వైట్‌లో చూపించేవాళ్లం. ఇప్పటికీ చాలా మంది చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాల జోలికి వెళ్లకపోవడం వల్ల యువత పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో సినిమా చూడటం ఇప్పుడు కొత్త అనుభూతిని కలిగిస్తుంది' అని అన్నారు. -
స్టార్ హీరో లేటేస్ట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బిగ్ షాక్!
మలయాళ స్టార్ మోహన్‌లాల్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో కనిపించారు. అయితే ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని షాకిచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఝలక్ ఇచ్చింది. కేవలం రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. దీంతో మలయాళంలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది మలైకోట్టై వాలిబన్. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోన్న మెగా వారసురాలు.. ఆ సినిమాతోనే!
మెగా వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి నిహారిక. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన మెగా డాటర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతంలో వెబ్ సిరీస్‌తో అలరించిన నిహారిక.. తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైతన్య జొన్నలగడ్డతో తన వైవాహిక బంధానికి ముగింపు పలికిన తర్వాత తొలిసారి హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో నటనకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. అయితే అది అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేపోయింది. అంతే కాకుండా టాలీవుడ్లో నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా నిహారిక మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తే మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళ హీరో షేన్ నిగమ్‌కు జంటగా కనిపించనుంది. మద్రాస్కారన్ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలోనే రీ ఎంట్రీపై వార్తలు గతేడాదిలోనే ఆమె మళ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని వార్తలొచ్చాయి. ఈ విషయంపై ఇప్పుడు ఇండస్ట్రీలో భారీగానే ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆమె మొదట సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గానే ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఆమె సక్సెస్ కాలేకపోయింది. మళ్లీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై నిహారిక మెరిసేందుకు సిద్ధమైంది. View this post on Instagram A post shared by Shane Nigam (@shanenigam786) -
హీరోయిన్గా ఊర్వశి వారసురాలు ఎంట్రీ?
ముందానై ముడిచ్చు చిత్రంతో కథానాయకిగా పరిచయమై తన చిలిపితనంతో కూడిన నటనతో అందరినీ ఆకర్షించిన మలయాళ నటి ఊర్వశి. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. 1980-90 ప్రాంతంలో ప్రముఖ కథానాయకిగా వెలిగిన ఆమె తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్‌కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?) నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే మలయాళ నటుడు మనోజ్ కే.జయన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుంజట్టా అనే కూతురు ఉంది. అయితే కొన్నేళ్లకే మనస్పర్థల కారణంగా ఊర్వశి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అయినా కూతురు ఇద్దరి వద్ద ఉంటూ పెరుగుతూ వచ్చింది. కాగా.. ఆ తరువాత ఊర్వశి రెండో పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమె కూతురు కుంజట్టాతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో ఊర్వశి వారసురాలు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. కుంజట్టాకు కథనాయకికి కావలసిన అన్ని లక్షణాలు ఉండడంతో తర్వాత హీరోయిన్ అనే ప్రచారం ఊపందుకుంది. ఊర్వశి ఉద్దేశం కూడా అదే కావచ్చు అంటున్నారు ఫ్యాన్స్. అందుకే ఇన్నాళ్లకు తన కూతురితో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కుంజట్టాను హీరోయిన్గా పరిచయం చేయడానికి కొందరు దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే ఈ విషయంపై ఊర్వశి ఎలాంటి ప్రకటన చేయలేదు. (ఇది చదవండి: ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్! ) -
సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న సమరా.. రిలీజ్ డేట్ ఫిక్స్!
రెహ్మాన్, భరత్ కలిసి నటించిన తాజా చిత్రం సమరా. పీకాక్ ఆర్ట్ హౌస్ పతాకంపై ఎంకే.సుభాకరన్, అనూస్ వర్గీస్ విల్యాడత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి చార్లెస్ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. బజరంగీ భాయిజాన్, జాలి ఎల్ఎల్బీ 2, విశ్వరూపం -2 చిత్రాలతో ఫేమస్ అయిన నటుడు మీర్ సర్వార్ ప్రతి నాయకుడిగా నటించారు. చిత్ర పురాణం దర్శకుడు మాట్లాడుతూ.. రెహ్మాన్ వైవిధ్య కథ పాత్రలను ఎంచుకొని నటిస్తున్నారని కొనియాడారు. అలా ఆయన నటించిన తాజా చిత్రమే సమరా అని పేర్కొన్నారు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందించిన ఇందులో రెహ్మాన్ పాత్ర అన్ని వర్గాలను అలరిస్తుందని అన్నారు. ఈచిత్రానికి శీను శతాబ్దం, దీపక్ వారియర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని గోపిసుందర్ అందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసి.. ఈ చిత్రాన్ని ఈనెల 13న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో ఇంతకుముందు లాక్ డౌన్ నైట్స్ చిత్రాన్ని నిర్మించిన 2 ఎం సినిమా సంస్థ అధినేత వినోద్ శబరీస్ విడుదల చేస్తున్నారని చెప్పారు. ఈ చిత్రంలో టామ్ కాడ్ బిజాల్ ప్రసన్న, కేనల్ మ్యాథ్వీ జార్జ్, సోనాలి సుడన్, టీనీజ్ విల్యా, శ్రీలా లక్ష్మి, శీను సిద్ధార్థ సంజన దీపు రాహుల్ ముఖ్యపాత్రలు పోషించారు. -
Holy Wound Movie OTT Release Date: ఓటీటీలోకి లెస్బియన్ చిత్రం `హోలీ వుండ్`
‘బిగ్‌బాస్’ ఫేమ్ జానకి సుంద అమృతా వినోద్, సాబు ప్రౌదిక్ ప్రధాన పాత్రల్లో అశోక్ ఆరాన్ తెరకెక్కించిన చిత్రం.`హోలీవుండ్`. సహస్ర సినిమాస్ ప్రై. లి సమర్పణలో సందీప్ ఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లెస్బియన్ నేపథ్యంలో రూపొందిన ఈ మలయాళ చిత్రం ఓటీటీ విడుదల తేది ఖరారైంది. ఆగస్ట్ 12 నుంచి ఎస్ ఎస్ ఫ్రేమ్స్(SS Frames) ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. (చదవండి: ‘థ్యాంక్యూ’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు.. ఎక్కడ?) ఈ సందర్భంగా నిర్మాత సందీప్ ఆర్ మాట్లాడుతూ.. `చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఇద్దరు అమ్మాయిలు..కొంత కాలంగా కలిసి ఉండటంతో ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడుతంది. సృష్టికి విరుద్దంగా వారు లైంగిక సంతృప్తి చెందుతుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది సినిమా. డీప్ ప్రేమలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు అనే అంశాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. మా సినిమా ఎన్నో వివాదాల్లో చిక్కుకొని ..వాటన్నింటినీ దాటుకొని ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. మాటలు లేని ఈ సైలెన్స్ లెస్బియన్ సినిమా మీ అందర్నీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం’ అన్నారు. -
పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ 'దొంగాట' చూడాల్సిందే..
టైటిల్: దొంగాట నటీనటులు: ఫాహద్ ఫాజిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్, అలెన్సియర్ లే లోపెజ్ తదితరులు నిర్మాతలు: సందీప్ సేనన్, అనీష్ ఎం థామస్ కథ: సజీవ్ పజూర్ దర్శకత్వం: దిలీష్ పోతన్ సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి సంగీతం: బిజిబాల్ విడుదల తేది: మే 06, 2022 (ఆహా) చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుల్లో మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ఒకరు. కరోనా సమయంలో ఆడియెన్స్ ఓటీటీలకు అలవాటు కావడంతో ఒక్కసారిగా ఫాహద్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. పాత్ర బలంగా ఉంటే ఎలాంటి సినిమా అయినా చేసేందుకు వెనుకాడరు. 'పుష్ప: ది రైజ్' సినిమాలో భన్వర్ సింగ్ షేకవాత్ అనే పోలీసు పాత్రలో ఎంతలా ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంటర్టైన్ చేస్తున్న ఫాహద్ ఫాజిల్ నటించిన మలయాళ చిత్రం 'తొండిముత్యాలుం దృక్సాక్షియుం'. 2017లో విడుదల మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో 'దొంగాట' పేరుతో 'ఆహా' ఓటీటీలో విడుదల చేశారు. ఫహద్ ఫాజిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్ కీలకపాత్రల్లో నటించారు. మూడు జాతీయ పురస్కారాలను అందుకున్న ఈ 'దొంగాట' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: ఒక మిస్అండర్స్టాండింగ్ కారణంగా దగ్గరైన ప్రసాద్ (సూరజ్ వెంజరమూడ్), శ్రీజ (నిమిషా సజయన్) ప్రేమించి గుడిలో పెళ్లి చేసుకుంటారు. తర్వాత వేరే కాపురం పెడతారు. వ్యవసాయం పండించడానికని నీళ్ల కోసం బోర్ వేసేందుకు శ్రీజ దగ్గర ఉన్న తాళి తాకట్టు పెట్టేందుకు బస్సులో వెళ్తారు. బస్సులో ప్రయాణించేటప్పుడు శ్రీజ మెడలోని బంగారు గొలుసును (తాళి) ప్రసాద్ (ఫాహద్ ఫాజిల్) అనే దొంగ కొట్టేస్తాడు. అది గమనించిన శ్రీజ.. ప్రసాద్‌ను పట్టుకుని నిలదీస్తే తాను దొంగలించలేదని బుకాయిస్తాడు. దీంతో బస్సులోని వారి సహాయంతో ప్రసాద్‌ను (ఫాహద్ ఫాజిల్) పోలీస్‌లకు అప్పగిస్తారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ప్రసాద్-శ్రీజ దంపతులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. గొలుసు కొట్టేసిన ప్రసాద్ అనే దొంగ నేరం ఒప్పుకున్నాడా ? ఆ తాళి శ్రీజ-ప్రసాద్‌లకు చేరిందా ? ఇలాంటి కేసుల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు? అనే అంశాలతో తెరకెక్కిందే ఈ 'దొంగాట'. విశ్లేషణ: ఇద్దరు దంపతులు, ఒక దొంగ, చిన్న కేసు, పోలీసులు అనే చిన్న కథను చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ దిలీష్ పోతన్. ఒక దొంగతనాన్ని పోలీసులు ఎలా చేధిస్తారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫాహద్ ఫాజిల్ బంగారు తాళిని దొంగతనం చేయడంతోనే అసలు కథ ప్రారంభవుతుంది. తర్వాత వచ్చే సీన్లు, దొంగలు, సాక్షులు, సామాన్యులతో పోలీసులు వ్యవహరించే తీరు బాగా అలరిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా తమకు ఎలాంటి సమస్య రాకుండా పోలీసుల ప్రవర్తనా శైలీ ఆలోచింపజేసేలా ఉంటుంది. అమాయకంగా ఉంటూ చివరివరకు నేరాన్ని ఒప్పుకోని దొంగల తీరు, తమకు నష్టం కలిగినా ఇంకొకరికి అన్యాయం జరగకూడదనే భావించే మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనలను చాలా బాగా చూపించారు. అక్కడక్కడా సినిమా కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే ? దొంగలు పారిపోతే పోలీసులు వెతికే తీరు, పై అధికారులకు సమాధానం ఇచ్చేటప్పుడు వారికి కలిగే భయం, దొంగతనం చేసిన కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండే దొంగల ప్రవర్తన వంటి అంశాలను నటీనటులు వారి నటనతో చాలా చక్కగా చూపించారు. దొంగ పాత్రలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా నటించాడు. 'చివరివరకు బయటపడకూడదు అనేదే తన స్టైల్' అని చెబుతూ అమాయకపు చూపులు, పోలీసులతో మాట్లాడే వైఖరీ, ఎవరు లేనప్పుడు అసలైన దొంగలా ప్రవర్తించే ఫాహద్ నటన ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి వ్యక్తుల్లా సూరజ్, నిమిషా కూడా చాలా చక్కగా ఒదిగిపోయి నటించారు. మిగతా పోలీసు పాత్రలు సైతం వారి నటనతో మెప్పించారు. పోలీసు వ్యవస్థలోని లొసుగులు, మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనా ధోరణి, సమస్యలు ఎదురైనప్పుడు వారు రాజీపడే విధానాన్ని చూపించి దర్శకుడు దిలీప్ పోతన్ మంచి మార్కులు కొట్టేశారనే చెప్పవచ్చు. అయితే ఫాహద్ ఫాజిల్ దొంగగా మారడానికి కారణాలు, తర్వాత మంచివాడిలా మారేందుకు ప్రేరేపించిన కారణాలు అంతగా చూపించలేకపోయాడు. సజీవ్ పజూర్ అందించిన కథ, శ్యామ్ పుష్కరణ్ డైలాగ్‌లు ఓకే అనిపించాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, బిజిబాల్ సంగీతం పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో నటనకు గానూ ఫాహద్ ఫాజిల్‌కు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సజీవ్ పజూర్ కూడాల జాతీయ అవార్డును అందుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును సైతం అందుకుంది ఈ మూవీ. ఫైనల్‌గా ఏంటంటే కాస్త నెమ్మదిగా సాగిన ఈ 'దొంగాట' ఓసారి చూడాల్సిందే. -
మలయాళంలో అమల
దాదాపు 20 ఏళ్ల తరువాత మలయాళ తెరపై మెరవనున్నారు అక్కినేని అమల. చాలాకాలంగా తెరకు దూరంగా ఉంటున్న ఆమె.. శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మలయాళ సినిమాలో అమల నటించనున్నారు. నూతన దర్శకుడు ఆంటోనీ సోనీ సెబాస్టియన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'కేరాఫ్ సైరాబాను' చిత్రంలో అమలా కీలకమైన పాత్రలో కనిపిస్తారట. లాయర్‌గా నటించనున్నారని వినికిడి. సైరాబాను పాత్రను నటి మంజు వారియర్ పోషిస్తుంది. ఓ సాధారణ ముస్లిం గృహిణికి, ఆమె కుమారుడికి మధ్య ఉన్న అనుబంధమే చిత్ర కథనంగా తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరులో సెట్స్ పైకి వెళ్లనుంది. -
రెండు దశాబ్దాల తరువాత అమల అక్కినేని
చెన్నై: మాజీ హీరోయిన్, టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేని సతీమణి అమల అక్కినేని రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. అమల తాజాగా ఓ మలయాళ సినిమాలో న్యాయవాది పాత్రను పోషిస్తున్నారట. ఆంటోనీ సోనీ సారధ్యంలో డెబ్యూ మూవీగా వస్తున్న చిత్రం 'కేరాఫ్ సైరాబాను' అనే చిత్రంలోఆమె నటించనున్నారట. ఆనీ జాన్ అనే న్యాయవాది పాత్రలో ఆమె కనిపించబోతున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రముఖ ప్రవక్త సైరాబాను పాత్రను మంజు వారియర్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ త్వరలోనే మొదలు కానుందని వివరించాయి. కాగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడుగా 1991లో వచ్చిన ' ఉల్లడక్కం' సినిమాలో అమల నటించారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అమల హమారీ అధూరీ కహానీ బాలీవుడ్ చిత్రంలో ఆఖరిసారిగా నటించిన సంగతి తెలిసిందే. -
మలయాళ సినిమా రచయిత కన్నుమూత
కొండోటి: ప్రముఖ మలయాళ సినిమా కథా రచయిత టీఏ రజాక్ అంత్యక్రియలు నేడు ముగిశాయి. మలప్పురం జిల్లాలోని కొండోటిలో అధికార లాంఛనాలతో ఆయన పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. 58 ఏళ్ల రజాక్ అనారోగ్యంతో సోమవారం రాత్రి ఆస్పత్రిలో కన్నుమూశారు. సన్నిహితులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయన కడసారి వీడ్కోలు పలికారు. అంతకుముందు కోజికోడ్ లో రజాక్ మృతదేహానికి సినీ ప్రముఖులు మమ్మట్టి, మనోజ్ కె జయన్, దర్శకులు కమల, శిబి మలయాయిల్ తదితరులు శ్రధ్ధాంజలి ఘటించారు. 1991లో మోహన్ లాల్, ఊర్వశి జంటగా నటించిన 'విష్ణులోకం'తో కెరీర్ ప్రారంభించిన రజాక్ 30పైగా సినిమాలకు పనిచేశారు. స్క్రిప్ట్, కథ, మాటలు అందించారు. కేరళ ప్రభుత్వ అవార్డుతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. ఈ ఏడాది విడుదలైన 'సుఖమైరుకథే' ఆయన పనిచేసిన చివరి సినిమా. -
'ప్రేమమ్' పైరసీ కేసులో కొత్త ట్విస్ట్
తిరువనంతపురం: మలయాళం సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్' పైరసీ కేసు కీలక మలుపు తిరిగింది. సెన్సార్ బోర్డు నుంచే ఈ సినిమాను పైరసీ చేసినట్టు కేరళ పోలీసులు గుర్తించారు. పైరసీకి పాల్పడ్డారన్న ఆరోపణలతో ముగ్గురు సెన్సార్ బోర్డులో పనిచేస్తున్న ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి పాత్ర ఉందనియ పోలీసులు శాస్త్రీయంగా నిర్ధారించుకున్నారు. మే నెల చివరి వారంలో విడుదలైన 'ప్రేమమ్' రికార్డులన్నింటినీ తిరగరాసింది. విడుదలైన కొద్ది రోజులకే సెన్సార్ బోర్డు వాటర్ మార్కుతో ఈ సినిమా ఇంటర్నెట్ లో రావడంతో కలకలం రేగింది. పైరసీపై అన్నివైపుల నుంచి ఆందోళన పెరగడంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. 'ప్రేమమ్' పైరసీ వెనుక సెన్సార్ బోర్డు సిబ్బంది హస్తం ఉందని ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ అందరి కంటే ముందు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తన స్టూడియోలో జరగడంతో ఆయనపైనా ఆరోపణలు వచ్చాయి. ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసిన ముగ్గురు స్కూల్ విద్యార్థులను అంతకుముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసులో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశముంది. -
ఇంటర్నెట్ లో హిట్ సినిమా; ముగ్గురు అరెస్ట్
తిరువనంతపురం: మలయాళం సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్'ను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసిన ముగ్గురు స్కూల్ విద్యార్థులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లామ్ లో మంళవారం తెల్లవారుజామున వీరిని యాంటీ పైరసీ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా, ఆకతాయితనంగా చేశారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ప్రేమమ్' సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది. రిలీజైన రెండు వారాల్లో... ఒక్క కేరళలోనే రూ. 20 కోట్లు వసూలు చేసి టాక్ ఆఫ్ ది సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది. రూ. 50 కోట్ల పైగా వసూళ్ళు సాధించి, 'మల్లు' ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిల్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
రోమ్‌లో మొదలైంది....
ప్రేమ అనేది ఎప్పుడు? ఎలా? ఎవరిపై కలుగుతుందో తెలియదు. నటి అమలాపాల్, దర్శకుడు విజయ్‌ల ప్రేమ వ్యవహారం గురించి కొంత కాలంగా బోల్డంత ప్రచారం జరుగుతోంది. వీరి ప్రేమ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. అయితే వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ పడిందెక్కడో తెలుసా? రోమ్ నగరంలో విజయ్, అమలాపాల్ మధ్య ప్రేమ మొలకెత్తింది. అయితే తన ప్రేమ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి నటి అమలాపాల్ చాలా మదనపడ్డారట. మరి వీరి ప్రేమ రహస్యాలేమిటి? ఈ జంట మనసు విప్పారిలా. విజయ్: మైనా చిత్రంలో లంగా ఓణీ ధరించి, తలనిండా నూనె రాసుకున్న అమలాపాల్‌ను చూడగానే నాకు బాగా నచ్చేసింది. అమలాపాల్ : విజయ్ మదరాసుట్టణం చిత్రం నాకు బాగా నచ్చింది. అప్పుడే తొలిసారిగా ఆయనతో మాట్లాడాను. ఆ తరువాత విజయ్ దర్శకత్వంలో దైవతిరుమగళ్ చిత్రంలో నటిం చాను. ఆ సమయంలో మా మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మా స్నేహం చూసి నటుడు విక్రమ్ మీ మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. మీరు వివాహం చేసుకుంటారని అప్పుడే చెప్పారు. ఆ తరువాత తలైవా చిత్రంలో మళ్లీ కలిసి పని చేశాం. ఆ చిత్రం షూటింగ్ సిడ్నీలో నెల రోజులకు పైగా జరిగింది. ప్రతి రోజు వేకువ జామున ఇద్దరం జాగింగ్‌కు వెళ్లేవాళ్లం. అప్పుడు మమ్మల్ని చూసిన నృత్య దర్శకురాలు బృందాకు మేము ప్రేమలో పడ్డామనే సందేహం కలిగింది. తలైవా చిత్రంలో తాడు పట్టుకుని డ్యాన్స్ చేసే సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సన్నివేశంలో నటిస్తుండగా అనూహ్యంగా కిందపడిపోయాను. అప్పుడు నాకంటే ఎక్కువ బాధపడింది విజయ్‌నే. అప్పుడు సెట్లో ఉన్నవారందరికీ మా ప్రేమ గురించి తెలిసిపోయింది. విజయ్: స్నేహం ప్రేమగా మారడం మంచి పరిణామం. స్నేహం ఉన్న చోట కల్మషం ఉండదు. అలాంటప్పుడే ఇద్దరిలోని ప్లస్‌లు, మైనస్లూ తెలుస్తాయి. అమలాపాల్: మా ప్రేమ పెళ్లితో ముగుస్తుందని మాకు తెలుసు. అయినా నేను మరో మూడేళ్లు నటించాలని భావించాను. విజయ్ కూడా నువ్వు మంచి నటివి. మరో మూడే ళ్లు నటించమని చెప్పారు. అయితే ఆయన ఇంటిలో పెళ్లిపై ఒత్తిడి పెరిగింది. విజయ్ ఇంకా వేచి ఉండలేని పరిస్థితి. దీంతో నాకు కాస్త సంకట పరిస్థితి. ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాలు చేస్తున్నాను వివాహానంతరం ఈ చిత్రాలు పూర్తి చేసి ఆపై నటనకు స్వస్తి చెబుతాను. విజయ్: ఒక మంచి నటి, ఇంత చిన్న వయసులోనే నటనకు దూరం అవడం సరైనదేనా? అని అమలాపాల్‌ను అడిగాను. అందుకామె నాకు సినిమా కంటే జీవితమే ముఖ్యం అన్నారు. తమ మాటలు నా మనసును తాకారుు. అమలాపాల్: నేను జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయం విజయ్‌తో వివాహమే. విజయ్ను కలుసుకునే వరకు నాకు పెళ్లి ఆలోచనే లేదు. భగవంతుడు నాకు చిన్నతనం నుంచే మంచి అవకాశాలను అందించారు. అందులో వివాహం ఒకటి. దీన్ని నేను చక్కగా సద్వినియోగం చేసుకుంటాను. ఇంతకీ మా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ పడిందెక్కడో తెలుసా? రోమ్ నగరంలో. అదెలాగంటే విజయ్‌తో ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అన్న ఒక రకమైన భయంతోనే కుటుంబ సభ్యులతో కలిసి పారిస్ వెళ్లాను. అక్కడ నుంచి అమ్మ నాన్నలతో రోమ్కు వెళ్లాం. అక్కడ ఊహించని విధంగా దేవాలయం ముందు విజయ్ ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆయన తన ప్రేమకు పచ్చజెండా ఊపారు. -
కన్నీళ్లు పెట్టిన శ్వేతా మీనన్
కొచ్చి: కొల్లాం లోక్‌సభ సభ్యుడు ఎన్ పితాంబర కురుప్(73) తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కొల్లాం నుంచి వచ్చిన పోలీసుల బృందం ఈ ఉదయం 9 గంటలకు శ్వేతా మీనన్ నివాసంలో ఆమె వాంగూల్మం నమోదు చేసింది. ఈ సందర్భంగా శ్వేతా మీనన్ కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం. అయితే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. రెండు రోజుల క్రితం కొల్లాంలో జరిగిన పడవల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కురుప్, శ్వేతా మీనన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పట్ల కురుప్ అభ్యంతర కరంగా ప్రవర్తించారని శ్వేతా మీనన్ నిన్న ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఒమెన్ చాందీకి లేఖ కూడా రాశారు. మంగళవారం ముఖ్యమంత్రిని ఆమె కలవనున్నారు. రాజకీయ ప్రత్యర్థుల ప్రోత్సాహంతోనే తాను ఆరోపణలు చేశానని కురుప్ వ్యాఖ్యనించడాన్ని ఆమె కొట్టి పారేశారు. ఫిర్యాదు వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.