ఇటీవల మలయాళం సినిమాలకు తెలుగులోనూ ప్రేక్షకాదరణ దక్కుతోంది. చిన్న సినిమాలైన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సైతం టాలీవుడ్‌లో రాణించాయి. ఓటీటీలోనూ మలయాళ చిత్రాలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా టోవినో థామస్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.
గతేడాది థియేటర్లలో విడుదలైన నీలవెలిచమ్ మూవీ దాదాపు 16 నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా త్వరలోనే తెలుగు ఆడియన్స్‌ను అలరించనుంది. భార్గవి నిలయం పేరుతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 5 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రానికి ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. ఇందులో రీమా, రోషన్ మ్యాథ్యూ, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు.
Our Tovino is ready to entertain you with
'#BhargaviNilayam premieres on #aha from Sep 5th.🏠🎬@roshanmathew22 @PoojaMohanraj @ttovino @shinetomchacko_ @rimakallingal pic.twitter.com/leMWbAJURc— ahavideoin (@ahavideoIN) September 3, 2024
Comments
Please login to add a commentAdd a comment