మరో ఓటీటీకి వచ్చేస్తోన్న థ్రిల్లర్‌ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్! | Malayalam Thriller Movie Coming On This Ott In telugu | Sakshi
Sakshi News home page

Thriller Movie Ott: మరో ఓటీటీకి వచ్చేస్తోన్న థ్రిల్లర్‌ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్!

Jun 5 2025 12:29 PM | Updated on Jun 5 2025 12:29 PM

Malayalam Thriller Movie Coming On This Ott In telugu

ఓటీటీల్లో థ్రిల్లర్‌ సినిమాలంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ముఖ్యంగా హారర్ మూవీలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారికోసమే మరో సూపర్ హిట్‌ థ్రిల్లర్‌ వచ్చేస్తోంది. మలయాళంలో ఇప్పటికే అభిమానులను మెప్పించిన చిత్రం వడక్కన్‌. ఈ సూపర్  థ్రిల్లర్ మూవీ మార్చి 7, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ కిశోర్, శృతి మీనన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సజీద్ ఎ దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఈ శుక్రవారం అంటే జూన్ 6వ తేదీ నుంచి నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఆహాలో తెలుగు, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇక కథ విషయానికొస్తే అతీంద్రీయ శక్తుల గురించి శోధించే ఇద్దరు వ్యక్తులు కేరళలోని ఓ చోట జరిగిన కొన్ని అంతు చిక్కని మరణాల గురించి తెలుసుకోవడానికి వస్తారు. అక్కడ వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే వడక్కన్ స్టోరీ.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement