
మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే గత వారం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు వారం తిరగకుండానే స్ట్రీమింగ్ అయిపోతోంది. ఈ వీకెండ్‌లో 30కి పైగా చిత్రాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాగా.. ఇప్పుడు ఈ లిస్టులో ఈ మూవీ కూడా చేరింది. రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.
రుద్ర వీరాజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'వీరరాజు 1991'. అర్జన, అజయ్ ఘోష్, బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 22న థియేటర్లలో మూవీ రిలీజ్ కాగా.. అక్కడికి వారం తర్వాత అంటే మే 30న ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. రెండు గంటల కంటే తక్కువ నిడివితో ఉన్న ఈ చిత్రం సముద్ర తీర ప్రాంతంలో జరిగే ఓ కథతో తీశారు. థియేటర్లలో అనుకున్నంత రీచ్ లేకపోవడంతో త్వరగానే ఓటీటీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)
ఈ సినిమాలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రుద్ర వీరాజ్‌ది ఆదోని. ఇక మూవీ విషయానికొస్తే.. నెల్లూరు కృష్ణలంకలో చేపలు పట్టే వీరరాజు.. అదే ఊరిలోని అన్యాయాలు చేస్తున్న రాజకీయ నాయకుడికి ఎదురుతిరుగుతాడు. చివరకు ఏమైంది? వీరరాజు ఏం చేశాడనేదే మిగతా స్టోరీ. ఇందులో అజయ్ ఘోష్ తప్పితే సగటు ప్రేక్షకుడికి తెలిసిన నటీనటులు పెద్దగా లేరు.
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే హిట్ 3, రెట్రో, తుడరుమ్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, డీమన్ తదితర స్ట్రెయిట్-డబ్బింగ్ చిత్రాలు పలు ఓటీటీల్లోకి వచ్చాయి. వీటిలో చాలావరకు రీసెంట్ టైంలో రిలీజై ప్రేక్షకుల్ని అలరించడం విశేషం.
(ఇదీ చదవండి: శిరీషతో పెళ్లి ఎప్పుడంటే.. ప్రకటించిన నారా రోహిత్)