తెలుగు సినిమాల్లో టీనేజీ ప్రేమకథలు బోలెడు. 'కొత్త బంగారు లోకం' నుంచి 'బేబి' వరకు చాలా మూవీస్ వచ్చాయి. ఈ తరహా స్టోరీతోనే వచ్చిన మరో మూవీ 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. ప్రభాస్ 'కల్కి' థియేటర్లలో రిలీజ్ కావడానికి వారం ముందు వచ్చింది. హడావుడిలో ఇదొకటుందనే ఎవరూ పట్టించుకోలేదు. ఓ మాదిరిగా పర్లేదనిపించింది. ఇప్పుడిది ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ)
ఆహా ఓటీటీలో ప్రస్తుతం 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే గతంలో వచ్చిన చాలా తెలుగు సినిమా ఛాయలు ఇందులో కనిపిస్తాయి. సీన్లు కూడా అరె ఎక్కడో చూశామే అనిపించేలా ఉంటాయి. కాకపోతే చూస్తున్నంతసేపు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే టైమ్ పాస్ అయిపోతుంది.
'ప్రభుత్వ జూనియర్ కళాశాల' విషయానికొస్తే.. 2004లో రాయలసీమలో పుంగనూరు అనే ఊరు. ఇంటర్ చదివే వాసు.. అదే కాలేజీలో చదువుతున్న కుమారితో ప్రేమలో పడతాడు. కానీ ఆమె గురించి కొన్ని విషయాలు తెలిసేసరికి ఆమెతోనే గొడవ పడతాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఇంతకీ వాసుకి ఏం తెలిసింది? చివరకు వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ)
Comments
Please login to add a commentAdd a comment