telugu movie
-
శృతి హాసన్ కాదు.. 'డెకాయిట్'లో మృణాల్
అంతా ఫిక్స్ అయిన తర్వాత సినిమాల విషయంలో కొన్నిసార్లు చేర్పులు మార్పులు జరుగుతుంటాయి. అయితే హీరో లేదా హీరోయిన్ని మాత్రం ఎప్పడో ఓసారి జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ తెలుగు సినిమా నుంచి హీరోయిన్గా శృతి హాసన్‌ని తీసేసి మృణాల్ ఠాకుర్‌ని ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్)2022లో 'మేజర్' సినిమా వచ్చింది. దీని తర్వాత అడివి శేష్ ఏ సినిమాలు చేస్తున్నాడో కనీసం చిన్న అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. మధ్యలో 'గూఢచారి 2' గురించి చెప్పారు గానీ. అది ఏ స్టేజీలో ఉందనేది క్లారిటీ లేదు. మరోవైపు కొన్నాళ్ల క్రితం 'డెకాయిట్' అనే సినిమాను ప్రకటించిన శేష్.. శృతి హాసన్‌తో కనిపించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు.కట్ చేస్తే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ మారిపోయింది. శృతి ప్లేసులోకి మృణాల్ వచ్చి చేరింది. మరి కావాలనే తప్పించారా? లేదా శృతి హాసన్ తప్పుకొందా అనేది తెలియాల్సి ఉంది. మూవీ పోస్టర్‌తో పాటు 'అవును వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అని మృణాల్ క్యాప్షన్ పెట్టింది. మరోవైపు శేష్ కూడా ఈ పోస్టర్స్ షేర్ చేస్తూ.. 'అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు..! ఇడిచిపెట్టను...తేల్చాల్సిందే' అని క్యాప్షన్ పెట్టాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)అవును వదిలేసాను..కానీ మనస్పూర్తిగా ప్రేమించానుHappy Birthday, @AdiviSesh ✨Let's kill it - #DACOIT pic.twitter.com/tH4trCr0Fe— Mrunal Thakur (@mrunal0801) December 17, 2024 -
ఓ తండ్రి తీర్పు.. ఆ రోజే విడుదల
వివ రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. ఏవికె ఫిలింస్ బ్యానర్‌పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్నాడు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డాక్టర్ కెవి రమణ చారి ఆశీస్సులతో విడుదలకు సిద్ధమవుతోంది.తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ పేరెంట్స్‌పై లేకపోవటం ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది. ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. హీరో వివ రెడ్డి చేస్తున్న పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 27న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హీరోయిన్ మీనాక్షి 'అద్దె' గోల.. రూమర్సా? నిజమా?
ప్రస్తుతం టాలీవుడ్లో ట్రెండింగ్ హీరోయిన్ అంటే మీనాక్షి చౌదరినే. ఎందుకంటే గత మూడు నెలల్లో ఈమె చేసిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మరొకటి యావరేజ్ అనిపించుకుంది. మరో రెండు ఫ్లాప్ అయ్యాయి. మూవీస్ రిజల్ట్ సంగతి పక్కనబెడితే ఈమె యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఇవన్నీకాదు మరో విషయమై మీనాక్షి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)తెలుగు సినిమాల్లో చాలావరకు ఉత్తరాది హీరోయిన్లే నటిస్తుంటారు. షూటింగ్ కోసమని హైదరాబాద్ వస్తే వీళ్ల కోసమని నిర్మాతలు పెట్టే ఖర్చు కూడా గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో వరస అవకాశాలు అందుకుంటున్న మీనాక్షి.. రీసెంట్‌గానే హైదరాబాద్‌లో కొత్తగా ఓ ఫ్లాట్ కొనుక్కుందట. అయితే హైదరాబాద్‌లో షూటింగ్ జరిగినన్నీ రోజులు.. రోజుకు రూ.18 వేలు.. రెంట్లా డిమాండ్ చేస్తోందట.సొంతింట్లో ఉన్నాసరే నిర్మాతల దగ్గర నుంచి మీనాక్షి చౌదరి డబ్బులు డిమాండ్ చేస్తోందనే రూమర్స్ అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరోవైపు మీనాక్షి వరకు కొన్ని అవకాశాలు పక్కకెళ్లిపోతున్నాయట. త్వరలో 'విరూపాక్ష' దర్శకుడితో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా తొలుత మీనాక్షినే అనుకున్నారట. ఇప్పుడు ఆ ఛాన్స్ వేరే వాళ్లకు వెళ్లిపోయినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ రెండు విషయాలకు సంబంధం ఏమైనా ఉందా? లేదే ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది!(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు) -
రెండేళ్ల తర్వాత 'జాతిరత్నాలు' అనుదీప్ కొత్త సినిమా
'జాతిరత్నాలు' సినిమాతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్.. ఆ తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్‌తో 'ప్రిన్స్' అనే మూవీ చేశాడు. ఇది అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. దీంతో అనుదీప్ మరో మూవీ చేయలేకపోయాడు. మధ్యలో 'మ్యాడ్', 'కల్కి' మూవీస్‌లో అతిథి పాత్రల్లో కనిపించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత తన కొత్త మూవీని మొదలుపెట్టాడు.(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు)యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో అనుదీప్ సినిమా చేయబోతున్నాడు. బుధవారం లాంఛనంగా పూజా కార్యక్రమం జరిగింది. 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తీస్తున్న మూవీకి 'ఫంకీ' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.లెక్క ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలవ్వాలి. కానీ పలువురు నిర్మాతల దగ్గరకు వెళ్లారు కానీ ఎక్కడా సెట్ కాలేదు. చివరగా సితార సంస్థ దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు లాంఛనంగా మొదలైంది. వచ్చే ఏడాదిలో రిలీజ్ ఉండే అవకాశముంది. ప్రస్తుతం విశ్వక్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు) -
‘ఆహా’లో హారర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాల డబ్బింగ్ విషయంలో సౌలభ్యం బాగా పెరిగిపోయింది. థియేటర్లలో కంటే డబ్ చేసిన నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. అలా ఇప్పుడు హారర్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా చిత్రం?(ఇదీ చదవండి: 'పుష్ప 2' కాదు.. అసలు కథ ముందుంది!)'7జీ బృందావన కాలనీ' సినిమా పేరు చెప్పగానే హీరోయిన్ సోనియా అగర్వాల్ గుర్తొస్తుంది. అయితే ఈ మూవీ తర్వాత కథానాయికగా ఏం సినిమాలు చేసిందో తెలీదు. సహాయ పాత్రల్లో అయితే అడపాదడపా కనిపిస్తోంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా '7/జీ: ద డార్క్ స్టోరీ'. ఈ ఏడాది జూలైలో తమిళంలో రిలీజైంది.తమిళ వెర్షన్ ఆగస్టులో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వెర్షన్‌ని నేరుగా ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు (డిసెంబరు 12) నుంచి స్ట్రీమింగ్ అవుతుందని పోస్టర్ రిలీజ్ చేశారు. కథ పరంగా రొటీన్ హారర్ మూవీ లాంటిదే. ఓ ఇంట్లోకి ఫ్యామిలీ వస్తారు. అదే ఇంట్లో దెయ్యం ఉంటుంది. ఇంతకీ ఎవరా దెయ్యం? ఏంటి సంగతి అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)Switch to '7/G - The Dark Story' 👻 🏘⏰ Stay connected on this Thursday! pic.twitter.com/Fa3NruRrh4— ahavideoin (@ahavideoIN) December 10, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ సినిమా.. తెలుగులోనూ
ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా వచ్చేసింది. కొన్నిరోజుల క్రితం కేవలం తమిళ వెర్షన్.. అమెజాన్ ప్రైమ్‌లోకి రాగా, ఇప్పుడు తెలుగు వెర్షన్ మరో ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు కూడా ఉంది. ఇంతకీ ఇదే సినిమా? తెలుగు వెర్షన్ ఎందులో ఉంది?'జైలర్' దర్శకుడు నెల్సన్ నిర్మించిన లేటెస్ట్ తమిళ సినిమా 'బ్లడీ బెగ్గర్'. కవిన్ హీరోగా నటించిన ఈ డార్క్ కామెడీ మూవీ.. తెలుగులో నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. తొలుత దీని తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)ప్రస్తుతానికి మన దగ్గర తప్పితే మిగతా దేశాల్లో సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు. మరికొన్ని రోజుల్లో భారత్‌లోనూ 'బ్లడీ బెగ్గర్' మూవీ తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయి.'బ్లడీ బెగ్గర్' విషయానికొస్తే.. కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). ఓ రోజు దినం భోజనాల కోసమని ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. తిరిగి ఇంటికి వెళ్లకుండా దొంగచాటుగా బంగ్లాలోకి దూరుతాడు. కాసేపు బాగానే ఎంజాయ్ చేస్తాడు కానీ ఊహించని విధంగా లోపల ఇరుక్కుపోతాడు. తర్వాత ఏమైంది? బంగ్లా ఓనర్స్ ఇతడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ') -
సడన్‌గా రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా.. ఎలాంటి హడావుడి లేకుండా ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. కేవలం రెండే పాత్రలు ప్రధానంగా తీసిన ఈ చిత్రం.. పలు అంతర్జాతీయ చిత్రాత్సోవాల్లో 60కి పైగా అవార్డులు గెలుచుకోవడం విశేషం. థియేటర్లలో రిలీజైనప్పుడు మనోళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి చూసేయొచ్చు. ఇంతకీ ఇది ఏ సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?నటుడు అయిపోదామనే ఆలోచన, డబ్బే సర్వస్వం అనుకునే ఓ కుర్రాడు.. జీవితం విలువను, ఆనందాన్ని ఎలా తెలుసుకున్నాడు అనే పాయింట్‌తో తీసిన సినిమా 'నరుడు బ్రతుకు నటన'. తెలుగు సినిమానే కానీ మూవీ అంతా కేరళలోనే జరుగుతూ ఉంటుంది. సీన్లలో ఉంటే నేచురాలిటీ చూసి మలయాళ మూవీని భ్రమపడిన ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప 2' చూసిన రష్మిక)శివ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న హీరోలుగా నటించిన ఈ సినిమాకు రిషికేశ్వర్ యోగి దర్శకుడు. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ హీరోయిన్లుగా చేశారు. అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాగా.. గురువారం (డిసెంబరు 6న) ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది.'నరుడు బ్రతుకు నటన' విషయానికొస్తే.. సినిమా నటుడు కావాలనేది సత్య(శివ రామచంద్రవరపు) డ్రీమ్. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క అవకాశం రాదు. నటుడు కావాలంటే ముందుగా మనిషిగా మారాలని, ఎమోషన్స్ తెలుసుకోవాలని ఫ్రెండ్ తిట్టేసరికి ఒంటరిగా కేరళ వెళ్లిపోతాడు. డబ్బు కొద్దిరోజుల్లోనే అయిపోతుంది. ఫోన్ దొంగిలిస్తారు. సత్య చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి కష్ట సమయంలో సత్య జీవితంలోకి సల్మాన్ (నితిన్ ప్రసన్న) వస్తాడు. ఇంతకీ ఇతడెవరు? సల్మాన్ వల్ల సత్య.. జీవితం గురించి ఏం తెలుసుకున్నాడనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు) -
పుష్ప 2 కళ్లచెదిరే కలెక్షన్స్... రష్మిక సెంటిమెంట్ వర్కౌట్ ...
-
టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!
టీమిండియా స్పిన్నర్ చాహల్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన బౌలింగ్, ఫన్ మూమెంట్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అటు ఐపీఎల్‌లోనూ చాలామంది స్టార్ క్రికెటర్లతో ఇతడికి మంచి బాండింగ్ ఉంది. కొన్నేళ్ల క్రితం ధనశ్రీ వర్మ అనే యూట్యూబర్‌ని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈమెనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారబోతుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్‌తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్‌లోనూ ఈమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈమె తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు.చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైంది. డ్యాన్స్ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా డ్యాన్స్ కచ్చితంగా రావాల్సిన హీరోయిన్ పాత్ర ఉంది. దాని కోసమే ధనశ్రీని అడగ్గా.. ఆమె ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ఈమెకు సంబంధించిన షూటింగ్ కూడా కొంతమేర జరిగినట్లు సమాచారం. ఏదేమైనా టీమిండియా క్రికెటర్ భార్య.. టాలీవుడ్లో హీరోయిన్ అంటే వినడానికే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా!(ఇదీ చదవండి: మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్ రెహమాన్ కొడుకు) -
తెలుగులో తొలి మూవీ ప్లాఫ్.. ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్
సాధారణంగా హీరోయిన్లు నటించిన సినిమాలు ప్లాఫ్ అయితే కొత్తగా అవకాశాలు రావడం తక్కువ. అలాంటిది 'మిస్టర్ బచ్చన్' బ్యూటీకి మాత్రం క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు వస్తున్నాయి. భాగ్యశ్రీ.. తొలుత 'యారియన్ 2' అనే హిందీ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది. రవితేజ మూవీతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అయిపోయింది. మూవీ డిజాస్టర్ అయినప్పటికీ.. భాగ్యశ్రీ డ్యాన్సులు, గ్లామర్‌కి మార్కులు పడ్డాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)ఇప్పుడదే గ్లామర్ మరికొన్ని అవకాశాలు తీసుకొస్తోంది. ఇప్పటికే దుల్కర్ 'కాంత' సినిమాలో భాగ్యశ్రీ నటిస్తుండగా.. తాజాగా రామ్ పోతినేని కొత్త మూవీలోనూ ఈమెనే హీరోయిన్గా తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు.'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీతో ఆకట్టుకున్న డైరెక్టర్ మహేశ్ బాబు.. రామ్-భాగ్యశ్రీ సినిమాని తీస్తున్నాడు. నవంబర్ 21న ఈ ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా
రీసెంట్గా రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా.. మూడు రోజుల క్రితం ఒక ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా మరో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ సంగతేంటి? ఏయే ఓటీటీల్లో ఉందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్)ఒకప్పుడు తెలుగులో హీరోగా చేసిన అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా ప్రస్తుతం కన్నడలో హీరో. ఇతడి లేటెస్ట్ మూవీ 'మార్టిన్'. దసరాకి కన్నడతో పాటు తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఘోరమైన కంటెంట్ వల్ల దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియనంత వేగంగా మాయమైపోయింది.మొన్న శుక్రవారం ఈ సినిమాని ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించారు. థియేటర్లలో అంటే చూడలేకపోయారు గానీ ఓటీటీలో కాబట్టి తెలుగు ఆడియెన్స్ ఓ లుక్కేస్తారేమో? విజువల్స్ పరంగా సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ 'కేజీఎఫ్'ని కాపీ కొట్టాలనుకోవడం ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)Experience the thrilling tale of Dhruva, where patriotism meets passion 🔥❤️! Watch #Martin now! 🎥👊 ▶️https://t.co/MviUsUzc3u pic.twitter.com/tgi24PYIdm— ahavideoin (@ahavideoIN) November 19, 2024 -
సుడిగాలి సుధీర్ ప్రయత్నం.. కట్ చేస్తే ప్రభాస్ సినిమాలో
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీ చేస్తున్నాడు. ఇమాన్వి అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా చేస్తోంది. స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమెకు ఇదే తొలి మూవీ. సినిమా లాంచింగ్ రోజే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి గురించి ఇప్పుడు కమెడియన్ గెటప్ శీను ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు.'జబర్దస్త్' ఫేమ్ సుడిగాలి సుధీర్.. తన కొత్త సినిమా 'G.O.A.T'లో ఇమాన్విని హీరోయిన్గా పెట్టాలని అనుకున్నారట. కాకపోతే ఎంత ప్రయత్నించినా సరే ఆమె వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి వదిలేశారట. ఈ విషయం గెటప్ శీను.. ఓ షోలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)సుడిగాలి సుధీర్ సినిమాలో ఛాన్స్ వద్దనుకున్న ఇమాన్వి.. ప్రభాస్-హను మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈమె షూటింగ్లో పాల్గొంది. ఓ పాట, కొన్ని సీన్సు షూట్ చేయగా.. ఇమాన్వి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని తెలుస్తోంది. ప్రభాస్-ఇమాన్వి కెమిస్ట్రీ కూడా సూపర్ అని లీక్ ఒకటి బయటకొచ్చింది.ఏదేమైనా సుడిగాలి సుధీర్ ప్రయత్నించాడు. ఒకవేళ ఓకే అనుకుంటే ఎందరో హీరోయిన్లలో ఒకరిగా మిగిలిపోయేది. ఇప్పుడు ప్రభాస్ మూవీ చేస్తోంది. ఈ మూవీ గనక హిట్ అయితే మాత్రం పాన్ ఇండియా స్టార్ అయిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
'ఈసారైనా?!' సినిమా రివ్యూ
విప్లవ్ అనే కుర్రాడు.. హీరో, డైరెక్టర్, నిర్మాత, మాటల రచయితగా చేసిన సినిమా 'ఈసారైనా!?'. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. తాజాగా (నవంబర్ 8న) థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?డిగ్రీ చేసిన రాజు (విప్లవ్).. నాలుగేళ్లుగా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. అదే ఊరిలో ఉండే శిరీష(అశ్విని) గవర్నమెంట్ టీచర్‌గా చేస్తుంటుంది. విప్లవ్, శిరీషని ప్రేమిస్తుంటాడు. ఆమె తండ్రి మాత్రం గవర్నమెంట్ జాబ్ వస్తేనే పెళ్లి చేస్తానని కండీషన్ పెడతాడు. మరి రాజు.. గవర్నమెంట్ జాబ్ కొట్టాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)ఎలా ఉందంటే?అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమా తీశారు. రాజు-శిరీష పాత్రల మధ్య లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్ యూత్‌కి కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్‌లో వచ్చే పాట బాగుంది. హీరో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా క్యూట్ అండ్ స్వీట్‌గా తెరకెక్కించారు. అక్కడక్కడ కొన్ని సీన్లు సాగదీతగా అనిపించాయి. అలానే తెలిసిన ముఖాలు కూడా లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు.ఎవరు ఎలా చేశారంటే?హీరో విప్లవ్ కుర్రాడిలా అద్భుతంగా నటించాడు. అశ్విని చూడటానికి బాగుంది. తండ్రి పాత్రలో ప్రదీప్ రాపర్తి పర్లేదనిపించాడు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే చాలా విభాగాలని దగ్గరుండి చూసుకున్న విప్లవ్ ఆకట్టుకున్నాడు. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫీ ఓకే. పచ్చని పల్లెటూరిలో ప్రశాంతంగా అనిపించే యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇది.(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి పోస్ట్ వైరల్) -
'రహస్యం ఇదం జగత్' మూవీ రివ్యూ
టైటిల్: రహస్యం ఇదం జగత్నటీనటులు: రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ తదితరులుదర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్సంగీతం: గ్యానీఎడిటర్: ఛోటా కే ప్రసాద్సినిమాటోగ్రఫీ: టైలర్ బ్లూమెల్నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతులవిడుదల తేదీ : 8 నవంబర్ 2024సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్‌కు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి గిరాకీ ఉంది. అలా ఈ జానర్లో వచ్చిన సినిమానే రహస్యం ఇదం జగత్. పురాణ ఇతిహాసాలను తెరపై చూపిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించేందుకు ప్రయత్నించామంటున్నాడు దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్. మరి ఆయన ప్రయత్నం ఏమేరకు ఫలించిందో రివ్యూలో చూసేద్దాం..కథకథ మొత్తం అమెరికాలోనే జరుగుతుంది. ఇండియాలో ఉన్న తండ్రి చనిపోవడంతో తల్లి కోసం స్వదేశానికి తిరిగి వద్దామనుకుంటుంది అకీరా (స్రవంతి). ఈమె బాయ్ ఫ్రెండ్ అభి (రాకేష్) కూడా తనతోపాటు ఇండియా వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. వెళ్లే ముందు స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలనుకుంటాడు. అలా అడవిలో ఉండే చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడ వాళ్లు బుక్ చేసుకున్న హోటల్ క్లోజ్ అవడంతో ఓ ఖాళీ ఇంట్లో బస చేస్తారు. ఆ స్నేహితులలో సైంటిస్ట్ అయిన అరు మల్టీ యూనివర్స్ పై రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. దీని గురించి మాట్లాడుకునే క్రమంలో అభి, విశ్వకు గొడవ జరుగుతుంది. అదే సమయంలో విశ్వ ఓ భయంకరమైన డ్రగ్ తీసుకొని అకీరా, కళ్యాణ్ లను చంపేస్తాడు. మరోవైపు మల్టీ యూనివర్స్‌కు వెళ్లే దారి ఆ ఊళ్ళోనే ఉందని తెలుసుకొని అభిని తీసుకొని వెళ్తుంది అరు. తీరా అక్కడికెళ్లాక ఆమెను ఎవరో చంపేస్తారు. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగానే మల్టీ యూనివర్స్ ఉందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే!విశ్లేషణతక్కువ బడ్జెట్లో మంచి అవుట్ పుట్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ తెరకెక్కించిన సినిమానే రహస్యం ఇదం జగత్. ఈ సినిమాను అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు నిర్మించారు. హాలీవుడ్ చిత్రాల నుంచి ప్రేరణ పొంది తీసినట్లు ఉంటుంది. మన ప్రేక్షకులకు కనెక్ట్ అవడానికి పురాణాలను వాడుకున్నారు. హనుమంతుడు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళడం.. కృష్ణుడు ఒకేసారి చాలా చోట్ల కనిపించడం.. శ్రీచక్రం నుంచి వామ్ హోల్ ఏర్పడటం వంటివి చూపించారు.సినిమా నెమ్మదిగా మొదలవుతుంది. ఫ్రెండ్స్ ట్రిప్.. గొడవలు.. చంపుకోవడాలు.. ఇవన్నీ కాస్త సాగదీసినట్లుగానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ముందు అభి స్నేహితులు చనిపోవడంతో.. వాళ్ళను కాపాడుకోవడానికి వామ్ హోల్ కి వెళ్లడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఆసక్తి కలుగుతుంది. సెకండాఫ్‌లో ఆ సస్పెన్స్ కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు. రొటీన్ సినిమా కాకుండా.. కొత్త మూవీ చూసినట్లు అనిపించకమానదు.ఎవరెలా చేశారంటే?షార్ట్ ఫిలింస్‌లో నటించి మెప్పించిన రాకేష్ హీరోగా నటించాడు. వామ్ హోల్లోకి ట్రావెల్ చేసి వచ్చే వ్యక్తిగా బాగా నటించాడు. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే అయినా అందులో స్రవంతి తన యాక్టింగ్‌తో మెప్పించింది. సైంటిస్ట్ పాత్రకు అరు చక్కగా సరిపోయింది. భార్గవ్ కామెడీతో నవ్వించేందుకు ప్రయత్నించాడు. కార్తీక్ విలన్‌గా బాగానే చేశాడు. అయితే వీళ్లంతా అమెరికాలోనే సెటిల్ అయినవాళ్లు కావడంతో మన ఆడియన్స్‌కు కొత్తముఖాలుగా అనిపిస్తారు. పైగా అమెరికన్ యాసలోనే మాట్లాడారు.టెక్నికల్ టీమ్సినిమాటోగ్రఫీ బాగుంది. అమెరికాలో ఉన్న మంచి మంచి లొకేషన్స్ వెతికి మరీ చూపించినట్లుగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు ఏవీ అంతగా ఆకట్టుకోవు. డబ్బింగ్‌పై కాస్త ఫోకస్ చేయాల్సింది. డబ్బింగ్‌ను పట్టించుకోకపోవడమే ఈ సినిమాకు మైనస్. కొన్నిచోట్ల బీజీఎమ్ డైలాగులను డామినేట్ చేసింది. దర్శకుడికి తొలి చిత్రం కావడంతో అక్కడక్కడా కాస్త తడబడ్డట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
'జాతర' సినిమా రివ్యూ
సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా 'జాతర'. దీయా రాజ్ హీరోయిన్. రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. రగ్డ్, ఇంటెన్స్ డ్రామాతో చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్లో జరిగే జాతర నేపథ్యంలో సినిమాని తీశారు. తాజాగా నవంబర్ 8న థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఆలయ పూజారి పాలేటి. అతని కొడుకు చలపతి (సతీష్ బాబు రాటకొండ) ఓ నాస్తికుడు. అదే ఊరికి చెందిన వెంకట లక్ష్మి (దీయ రాజ్)తో చలపతి ప్రేమలో ఉంటాడు. ఓరోజు పాలేటి కలలోకి గంగావతి గ్రామదేవతలు వచ్చి ఇక్కడే ఉండి గ్రామాన్ని దురాచారాల నుండి రక్షించమని కోరుతుంది. ఆ తర్వాత గ్రామం నుండి అదృశ్యమవుతుంది. గ్రామ దేవత అకస్మాత్తుగా గ్రామాన్ని విడిచిపెట్టడం చెడు సంకేతం అని ప్రజలు నమ్ముతారు. మరోవైపు గంగిరెడ్డి (ఆర్కే నాయుడు) గ్రామ కార్యకలాపాలను చేపట్టడం, గ్రామ దేవతలను శాశ్వతంగా ఉండడానికి తన ఇంటికి ఆహ్వానించడం లాంటివి చేస్తాడు. ఇంతకీ గంగిరెడ్డి, పాలేటి కుటుంబానికి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?)ఎలా ఉందంటే?పల్లెటూరి సంస్కృతి, ఊర్లో జాతరను తలపించేలా ఈ సినిమా ఉంటుంది. అందరినీ కట్టిపడేసేలా, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఈ చిత్రాన్ని అందించడంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కథను చెప్పడంలో పర్లేదనిపించాడు. సంగీతంతో పాటు సినిమాలో పల్లెటూరి అందాలని, దేవత సన్నివేశాలను బాగా చూపించారు.సినిమా నెమ్మదిగా మొదలైనప్పటికీ తక్కువ సమయంలో స్టోరీకి ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా దేవత సన్నివేశాలు, బీజీఎం.. సినిమా మొత్తం ఆడియెన్స్‌ని వెంటాడతాయి. సినిమాలో చాలా సర్ప్రైజ్లు, ట్విస్ట్‌లు ఉన్నాయి. ప్రారంభంలో, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.ఎవరెలా చేశారు?సతీష్ బాబు.. నటుడు, రచయిత, దర్శకుడిగా తన ప్రతిభ చూపించారు. హీరోయిన్గా చేసిన దీయా రాజ్ పర్లేదనిపించింది. గంగిరెడ్డి పాత్రలో ఆర్కే నాయుడు సూట్ అయిపోయాడు. మిగిలిన పాత్రధారులు న్యాయం చేశారు.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ) -
థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఎమ్4ఎమ్ సినిమా
థ్రిల్లింగ్ సబ్జెక్టుతో రాబోతున్న మరో తెలుగు సినిమా ఎమ్4ఎమ్ (మోటివ్ ఫర్ మర్డర్). తెలుగుతో పాటు ఐదు భాషలలో దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల తీసిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఒకే ఒక కిల్లర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ పోస్టర్ చూస్తుంటే ఈ కిల్లర్ పూర్తిగా డిఫరెంట్‌గా.. నా రూటు వేరు అన్నట్లు ఉంది.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో సినిమా తీశామని.. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అమెరికాలోనూ ప్రమోషన్స్ మొదలయ్యాయని చెప్పారు. వసంత్ అందించిన మ్యూజిక్, ఆనంద్ పవన్ చేసిన ఎడిటింగ్, సంతోష్ షానమోని కెమెరా పనితనం.. వంటి తమ టీమ్ వర్క్ హాలీవుడ్ రేంజ్లో వచ్చాయని ప్రశంసించారు. (ఇదీ చదవండి: హైదరాబాద్‌లోని హనుమాన్ గుడిలో జాన్వీ ప్రత్యేక పూజలు) -
హాలీవుడ్ రేంజ్ లో టాలీవుడ్ బడ్జెట్స్
-
ఈ 'పెళ్లి పుస్తకం' మనోరంజకం
సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవన ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని, కుటుంబ విలువల్ని చాటి చెప్పే మనోరంజకమైన సకుటుంబ కథాచిత్రం 'పెళ్లి పుస్తకం'. రాజేంద్రప్రసాద్ హీరోగా దివ్యవాణి హీరోయిన్గా ప్రముఖ దర్శకులు బాపు తీర్చిదిద్దిన ఓ కుటుంబ కావ్యం. బాపు గీత గీసి, ముళ్లపూడి వెంకటరమణ రాత రాసి, శ్రీకారం చుట్టిన 'పెళ్లి పుస్తకం' 1991 ఏప్రిల్ 1న విడుదలై చరిత్ర సృష్టించింది. కొత్తగా పెళ్లి చేసుకున్న కృష్ణమూర్తి అంటే రాజేంద్రప్రసాద్ ముంబైలోని ఓ సంస్థలో కళా దర్శకుడుగా పని చేస్తుంటాడు. ఇతని భార్య సత్యభామ అంటే దివ్యవాణి కేరళలో స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తుంటుంది. అయితే... తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వీరిద్దరూ కలిసి ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంటారు. అలా ఓ పెద్ద సంస్థలో చేరడం కోసం తాము అవివాహితులమని ఆ సంస్థ యజమాని గుమ్మడికి అబద్ధం చెబుతారు. అక్కడ చేరిన తర్వాత వీరు ఎదుర్కొనే సమస్యలే ఈ చిత్రంలోని ప్రధానాంశం.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) కడుపుబ్బా నవ్వించిన రచనకంపెనీ యజమానిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నేనూ... అంటూ మాటమాటని కట్ చేసి వెరైటీ స్లాంగ్‌తో మాట్లాడుతుంటే... గుమ్మడి సంస్థలో పని చేసే ఉద్యోగుల చేత బాబాయిగా పిలిపించుకుంటూ... ఈ సినిమాకు కథను అందించిన రావి కొండలరావు బధిర వార్తలు చదువుతున్నట్లు సైగలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. ఇక గిరి పాత్రలో నటించిన శుభలేఖ సుధాకర్ విషయానికొస్తే... గుమ్మడి బావమరిదిగా.. దివ్యవాణిపై మనసు పడి ఆ తర్వాత అక్కతో తన్నులు తినే సన్నివేశాలు లోలోన నవ్వు పుట్టిస్తాయి.చప్పట్లు కొట్టించిన మాటలుసెకండ్ హీరోయిన్గా వచ్చిన గుమ్మడి కుమార్తె వసుంధర పాత్రలో నటించిన సింధుజా కూడా హీరో రాజేంద్రప్రసాద్ వెంట పడి అతని భార్య దివ్యవాణి అసూయకు కారణమవుతుంది. కానీ సింధుజాది అంతా నటన అని చివరకు తెలుసుకుంటుంది. అలాగే చిత్రంలోని బ్రహ్మచారి గదులకు భామలే అందం, పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం, నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు... ఏడుపుచ్చినప్పుడు నవ్వేవాడే హీరో, అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటర్, నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతులాగే వినిపిస్తుంది... లాంటి డైలాగులు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)ఏ పెళ్లిలోనైనా ఆ పాటేపాటలైతే చెప్పనక్కరలేదు.. ఆరుద్ర చేతి నుంచి జాలు వారిన 'శ్రీరస్తూ శుభమస్తూ' పాట... అప్పటి వరకు తెలుగు లోగిళ్లలో ఎక్కడ పెళ్లి బాజా మోగినా వినిపించే 'సీతారాముల కళ్యాణం చూతమురా రండి' అంటూ సాగే పాటనే పక్కకు నెట్టేసింది. ఇప్పటికీ తెలుగువారి పెళ్లిళ్లలో ఈ పాటే వినిపిస్తుండడం విశేషం. మామ కేవీ మహాదేవన్ సంగీత దర్శకత్వంలో ట్యూన్ కట్టిన ‘అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనస్సులాయో...’, ‘కృష్ణం కలయ సఖి సుందరం...’, ‘పప్పు దప్పళం అన్నం నెయ్యి...’, ‘హాయి హాయి శ్రీరంగ సాయి...’, ‘సరికొత్త చీర ఊహించినాను...’ వంటి పాటలు ప్రేక్షక మహాశయులనే కాదు... సంగీత ప్రియులను కూడా ఓలలాడించాయి. పెళ్లికి అర్థాన్నీ, పరమార్థాన్నీ సున్నితంగా, హృద్యంగా అందంగా, రొమాంటిక్‌గా, అన్నింటినీ మించి హాస్యరసభరితంగా చెప్పిన చిత్రం ఈ ‘పెళ్లి పుస్తకం’.– ఇంటూరు హరికృష్ణ -
'జ్యువెల్ థీఫ్' సినిమా సెన్సార్ పూర్తి
సూపర్ స్టార్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి హీరోగా నటించిన సినిమా 'జ్యువెల్ థీఫ్'. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్. పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మించారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు.ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే నవంబర్ 8న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. 10 నెలల తర్వాత
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చాలా నెలల తర్వాత కూడా స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా గతేడాది డిసెంబరు చివర్లో రిలీజైన ఓ తెలుగు మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. డబ్బు చుట్టూ తిరిగే ఆంథాలజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఇంతకీ దీని సంగతేంటంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో 'దేవర'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?)డబ్బులున్న ఓ ఇనుప పెట్టె.. ఓ దొంగతో ఎనిమిది కథలు చెబుతుంది. మనిషి డబ్బు కోసం ఏమేం చేస్తాడు? ఎలా ప్రవర్తిస్తాడు? అనే కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం 'కరెన్సీ నగర్'. గతేడాది డిసెంబరు 29న థియేటర్లలో రిలీజైంది. చిన్న మూవీ కావడం, పెద్దగా పేరున్న యాక్టర్స్ ఎవరూ లేరు. దీంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయినా నేరుగా స్ట్రీమింగ్ చేయకుండా ఈ చిన్న మూవీని కూడా అద్దె విధానంలో పెట్టడమేంటో అర్థం కాలేదు. ఏదైతేనేం ఓటీటీలోకి కొత్త తెలుగు మూవీ వచ్చేసింది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు.(ఇదీ చదవండి: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!) -
ఈ 18న థియేటర్లలో 'రివైండ్' మూవీ రిలీజ్
సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'రివైండ్'. కళ్యాణ్ చక్రవర్తి నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించారు. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు.జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈనెల 18న ఈ సినిమాని సౌత్ ఇండియా మొత్తం లో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. -
'కాక్రోచ్'.. ఓ యాక్షన్ లవ్ స్టోరీ మూవీ
పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తీస్తున్న కొత్త సినిమా 'కాక్రోచ్'. విజయదశమి సందర్భంగా చిత్ర బృందం టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే వయలెంట్ యాక్షన్ ప్రేమ కథ అని అంటున్నారు. పాత కొత్త నటీనటుల మేళవింపుతో విభిన్న కథాంశంతో సాగుతుంది.(ఇదీ చదవండి: హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు)బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెబుతూ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం) -
హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు
దసరా సందర్భంగా పలు చిన్న చిత్రాలు నుంచి అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో బిగ్‌బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా చేస్తున్న మూవీ ఒకటి కాగా.. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు ప్రధాన పాత్ర పోషించిన మూవీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు.సీరియల్ నటుడిగా అందరికీ తెలిసిన అమర్దీప్.. గతేడాది బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా ఇప్పటికే ఓ మూవీ చేస్తుండగా.. ఇప్పుడు 'నా నిరీక్షణ' పేరుతో మరో చిత్రాన్ని మొదలుపెట్టాడు. దసరా సందర్భంగా ఇది ప్రారంభమైంది. లిషి గణేష్ కల్లపు హీరోయిన్ కాగా సాయి వర్మ దాట్ల దర్శకుడు. పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)'ఎర్రచీర' రిలీజ్ ఎప్పుడంటే?నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్వి నటించిన కొత్త సినిమా 'ఎర్రచీర'. తల్లి సెంటిమెంట్ కథతో తీసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ డిసెంబరు 20న థియేటర్లలో మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సుమన్ బాబు దీనికి దర్శకుడు.'పెన్ డ్రైవ్' మూవీ షురూవిష్ణు వంశీ, రియా కపూర్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న సినిమా 'పెన్ డ్రైవ్'. ఎంఆర్ దీపక్ దర్శకుడు. కె.రామకృష్ణ నిర్మాత. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కుతోంది. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.(ఇదీ చదవండి: ప్రముఖ నేత దారుణ హత్య.. బిగ్‌బాస్ షూటింగ్ రద్దు)'ప్రేమలు' బ్యూటీ తెలుగు సినిమా'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు చేస్తున్న తొలి తెలుగు సినిమా 'డియర్ కృష్ణ'. దినేష్ బాబు దర్శకుడు. కొత్తోళ్లు అక్షయ్, ఐశ్వర్యతో మమిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ కృష్ణుడి నమ్మే ఓ భక్తుడి స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
7 నెలల తర్వాత ఓటీటీలోకి పూరీ తమ్ముడి సినిమా
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ స్ట్రీమింగ్కి రెడీ అయిపోయింది. అప్పుడెప్పుడో మార్చిలో థియేటర్లలో రిలీజైతే.. ఇన్నాళ్లకు డిజిటల్ మోక్షం కలిగిందనే చెప్పాలి. ఇంతకీ ఇది ఏ సినిమా? ఏ ఓటీటీలోకి రానుంది?స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్.. చాన్నాళ్లుగా నటిస్తున్నాడు. కానీ హిట్ కొట్టలేకపోతున్నారు. ఇతడి చేసిన చివరి మూవీ 'వెయ్ దరువెయ్'. మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కథతో తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ కోసం జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓటీటీలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్.. అమ్మాయిని గర్భవతి చేశాడు: పూనమ్ కౌర్)దాదాపు ఏడు నెలల తర్వాత అంటే అక్టోబరు 11 నుంచి 'వెయ్ దరువెయ్' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ వీకెండ్ చూడటానికి ఓ తెలుగు సినిమా వచ్చేసిందనమాట.'వెయ్ దరువెయ్' కథ విషయానికొస్తే నకిలీ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందాలని యువత ఎలా అడ్డదారులు తొక్కుతున్నారనే పాయింట్‌తో సినిమా తీశారు. సాయిరామ్ శంకర్, యశ్న, సునీల్, సత్యం రాజేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా?)Get ready for a thrilling ride! 🎢 #VeyDharuvey premieres on October 11th. 🎉🍿 @YashaShivakumar @ihebahp @dirnaveenreddy @actordevaraj @LyricsShyam pic.twitter.com/2RmkYzhUFl— ahavideoin (@ahavideoIN) October 8, 2024 -
'లవ్ రెడ్డి' మూవీ.. కైలాష్ ఖేర్ ఎమోషనల్ సాంగ్ రిలీజ్
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'లవ్ రెడ్డి'. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. స్మరన్ రెడ్డి దర్శకుడు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)ఈ సినిమాలోని 'ప్రాణం కన్నా..' అనే లిరికల్ పాటని తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ పాడిన ఈ హార్ట్ బ్రేకింగ్ ఎమోషనల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. 'ప్రాణం కన్నా ప్రేమించినా..ఆ ప్రేమనే తెంచావుగా....' అంటూ ప్రేమికుడి బాధను వ్యక్తం చేస్తూ సాగుతుందీ పాట. 'ప్రాణం కన్నా..' పాటకు 'లవ్ రెడ్డి' మూవీలో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: మరో వివాదంలో నయనతార.. నిర్మాతలు ఎందుకు డబ్బులివ్వాలి?)