సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'సీతాకళ్యాణ వైభోగమే'. సతీష్ పరమవేద దర్శకత్వం వహించగా.. రాచాల యుగంధర్ నిర్మించారు. ఏప్రిల్ 26న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అలా చిత్ర టీజర్‌ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు.
(ఇదీ చదవండి: మరో తెలుగు సినిమాలో సన్నీ లియోన్.. అలాంటి కథతో!)
'టీజర్ చాలా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి' అని కోరుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించగా.. సహజమైన లొకేషన్లలో, ఎంతో సహజంగా సినిమాని తీసినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలు జోడించి తీసిన ఈ మూవీ కుటుంబ సమేతంగా చూసేలా ఉంది. ఏప్రిల్ 26న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది.
(ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!)
Comments
Please login to add a commentAdd a comment