వివ రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. ఏవికె ఫిలింస్ బ్యానర్‌పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్నాడు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డాక్టర్ కెవి రమణ చారి ఆశీస్సులతో విడుదలకు సిద్ధమవుతోంది.
తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ పేరెంట్స్‌పై లేకపోవటం ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది. ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. హీరో వివ రెడ్డి చేస్తున్న పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 27న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment