
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ శుక్రవారం 30కి పైగా కొత్త చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. శనివారం నాడు సడన్ గా మరో తెలుగు మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చింది. ఇంతకీ ఏంటా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.
(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్)
గతేడాది డిసెంబరు 27న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'కర్ణ పిశాచి'. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని భరత్ సిగిరెడ్డి నిర్మించగా, విజయ్ మల్లాది దర్శకత్వం వహించారు. ప్రణవి, రమ్యశ్రీ, నిఖిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని నిర్మించిన భరత్ సిగిరెడ్డి.. కీలక పాత్రలోనూ నటించారు. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంది.
కర్ణ పిశాచి విషయానికొస్తే.. ప్రేమతో పాటు జీవితంలోనూ ఓ యువకుడు ఫెయిల్ అవుతాడు. దీంతో తాగుబోతుగా మారిపోతాడు. ఓ సందర్భంలో అనుకోకుండా తన పూర్వీకులకు సంబంధించిన ఓ గ్రంథం ఈ కుర్రాడికి దొరుకుతుంది. ఆ పుస్తకం కారణంగా యువకుడి జీవితం ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్)