ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్ అంటే మీనాక్షి చౌదరినే. ఎందుకంటే గత మూడు నెలల్లో ఈమె చేసిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మరొకటి యావరేజ్ అనిపించుకుంది. మరో రెండు ఫ్లాప్ అయ్యాయి. మూవీస్ రిజల్ట్ సంగతి పక్కనబెడితే ఈమె యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఇవన్నీకాదు మరో విషయమై మీనాక్షి వార్తల్లో నిలిచింది.
(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)
తెలుగు సినిమాల్లో చాలావరకు ఉత్తరాది హీరోయిన్లే నటిస్తుంటారు. షూటింగ్ కోసమని హైదరాబాద్ వస్తే వీళ్ల కోసమని నిర్మాతలు పెట్టే ఖర్చు కూడా గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో వరస అవకాశాలు అందుకుంటున్న మీనాక్షి.. రీసెంట్‌గానే హైదరాబాద్‌లో కొత్తగా ఓ ఫ్లాట్ కొనుక్కుందట. అయితే హైదరాబాద్‌లో షూటింగ్ జరిగినన్నీ రోజులు.. రోజుకు రూ.18 వేలు.. రెంట్‌లా డిమాండ్ చేస్తోందట.
సొంతింట్లో ఉన్నాసరే నిర్మాతల దగ్గర నుంచి మీనాక్షి చౌదరి డబ్బులు డిమాండ్ చేస్తోందనే రూమర్స్ అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరోవైపు మీనాక్షి వరకు కొన్ని అవకాశాలు పక్కకెళ్లిపోతున్నాయట. త్వరలో 'విరూపాక్ష' దర్శకుడితో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా తొలుత మీనాక్షినే అనుకున్నారట. ఇప్పుడు ఆ ఛాన్స్ వేరే వాళ్లకు వెళ్లిపోయినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ రెండు విషయాలకు సంబంధం ఏమైనా ఉందా? లేదే ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది!
(ఇదీ చదవండి: హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు)
Comments
Please login to add a commentAdd a comment