ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఆస్తుల విషయమై చిన్న కొడుకు మంచు మనోజ్ రచ్చ చేస్తున్నాడు. గత రెండు రోజుల నుంచి చూస్తే తొలుత మోహన్ బాబు-మనోజ్ ఒకరిని ఒకరు కొట్టుకున్నారని.. హైదరాబాద్‌లోని పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారని న్యూస్ వచ్చింది. ఇదంతా పక్కనబెడితే మంగళవారం రాత్రి మాత్రం పెద్ద గొడవ జరిగింది. జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడం, గేట్ల మూసేసరికి వాటిని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
(ఇదీ చదవండి: 'నిన్నే బాగా చూసుకున్నా.. కానీ నా గుండెలపై తన్నావ్': మోహన్ బాబు ఆవేదన)
మరోవైపు ఇంటి దగ్గరకొచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం, ఇది జరిగిన కాసేపటికి మనోజ్‌ని ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఆడియో విడుదల చేయడం.. ఇలా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఆడియోలో చెప్పినట్లు ఈ గొడవల వల్ల మోహన్ బాబు భార్య ఆస్పత్రిలో చేరింది. ఇప్పుడు ఈయన కూడా పలు అనారోగ్య సమస్యలతో గచ్చిబౌలిలోనూ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. హైబీపీ, గుండెలో నొప్పి సమస్యతో మోహన్ బాబు బాధపడుతున్నారు.
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబుతో పాటు పెద్ద కొడుకు మంచు విష్ణు ఉన్నాడు. మరి ఈ వివాదంలో బుధవారం ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికే ఇద్దరి దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్స్ తమకు సరెండర్ చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులు మోహన్ బాబుతో పాటు అతడి కొడుకుల్ని ఆదేశించారు.
బీపీ ఎక్కువ కావటంతో మోహన్ బాబుకు అస్వస్థత.. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో మోహన్ బాబు pic.twitter.com/V0GHBVpSUJ
— Telugu Scribe (@TeluguScribe) December 11, 2024
(ఇదీ చదవండి: ముదిరిన మంచు ఫ్యామిలీ గొడవ.. పోలీసుల కీలక నిర్ణయం!)
Comments
Please login to add a commentAdd a comment