మంచు ఫ్యామిలీ గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు, మంచు విష్ణు లైసెన్స్ గన్స్ సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజుల క్రితం మొదలైన ఫ్యామిలీ వివాదం మరింత ముదిరింది. దీంతో ఒకరిపై ఒకరు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి జల్‌పల్లిలోని నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని వారిని అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీకి, మనోజ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బలవంతంగా గేటు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ గొడవ మరింత తీవ్రరూపం దాల్చడంతో అప్రమత్తమైన పోలీసులు మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేయాలని ఆదేశించారు. రేపు ఉదయం తమ ముందు హాజరు కావాలని రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం ఉదయం గం. 10.30ని.లకు గన్ సరెండర్ చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment