ఫ్యామిలీ వివాదం మరింత ముదరడంతో మోహన్ బాబు స్పందించారు. తన ఇంటివద్ద పరిస్థితి ఉద్రిక్తతు దారితీయడంతో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై మోహన్ బాబు ఆడియో విడుదల చేశారు. అందరికంటే ఎక్కువగా మనోజ్‌నే గారాబంగా పెంచినట్లు తెలిపారు. మనోజ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.
అందరికంటే బాగా చూసుకున్నా..
మోహన్ బాబు మాట్లాడుతూ..' మనోజ్ నిన్ను ఎంతో గారాబంగా పెంచాను. అందరికంటే నిన్నే బాగా చూసుకున్నా. కానీ ఈ రోజు నా గుండెల మీద తన్నావు. నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చాను. కానీ ఈ రోజు నా మనసు ఆవేదనకు గురైంది. ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉంటాయి. నీవల్ల ఈ రోజు మీ అమ్మ ఆస్పత్రిలో చేరింది. నీ ప్రవర్తన చూసి మీ అమ్మ ఏడుస్తోంది. జల్‌పల్లి ఇల్లు నా కష్టార్జితం.. నీకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు నువ్వు మద్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తావా? మన విద్యాలయాల్లో ఎంతమంది గొప్పవాళ్లుగా ఎదిగారు. నువ్వు నటుడిగా ఎంతో గొప్పవాడిగా ఎదిగావ్. నువ్వు మన పనివాళ్లపై ఎందుకు దాడి చేస్తున్నావ్. నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు ఎందుకిలా చేస్తున్నావ్? నా ఆస్తి ఎవరికీ ఇవ్వాలన్నది నా ఇష్టం. ఒకప్పుడు నువ్వు నాకు ఏమి వద్దు అన్నావ్? మరీ ఈ రోజు ఎందుకిలా చేస్తున్నావ్? నువ్వు నా పరువు, ప్రఖ్యాతులు మంటగలిపావ్' అని ఆవేదన వ్యక్తం చేశారు.
(ఇది చదవండి: మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్.. గేట్లు బద్దలు కొట్టిన మనోజ్!)
నా బిడ్డ నన్ను కొట్టలేదు..మోహన్ బాబు
నా బిడ్డ మనోజ్ నన్ను కొట్టలేదని మోహన్ బాబు తెలిపారు. ఈ విషయంపై ఎవరూ కూడా రాద్ధాంతం చేయొద్దని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. నా ఆస్తులు ఎవరికీ ఇవ్వాలనేది నా వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్లు.. లేదంటే ఇక్కడే క్షేమంగా ఉంటుందని వెల్లడించారు. దయచేసి మా ఇంటిలో జరిగిన గొడవపై అసత్యాలు ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులు, పోలీసులను మోహన్ బాబు కోరారు.
నా ఆస్తులు నా ఇష్టం..
మోహన్ బాబు మాట్లాడుతూ..' మనోజ్ నువ్వు తప్పు చేయనని చెప్పి మళ్లీ ఇంట్లోకి వచ్చావ్. ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకు తెలుసు. ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం. మోహన్ బాబు విశ్వవిద్యాలయం దేవాలయంతో సమానం. కాలేజీలో తప్పు జరిగితే ప్రభుత్వం చూసుకుంటుంది. కాలేజీని నెంబర్ వన్‌గా చేయాలని మీ అన్న ఎంతో కష్టపడుతున్నాడు. నాకు ఆస్తులేమీ వద్దని యాక్టింగ్‌లోకి వచ్చావ్. ఎంతో ఖర్చుతో విశ్వవిద్యాలయం 30 ఏళ్ల నుంచి నడుపుతున్నాం. నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదు. నన్ను ఎవరు మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమేనా నేను చేసిన పాపం. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అనేది నా ఇష్టం. మందు తాగొచ్చు. నేను ఒకటి రెండు పెగ్గులు తీసుకుంటా. కానీ మందు తాగి ఎవరిని కొట్టలేదని' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment