టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మరింత ముదరుతోంది. జల్‌పల్లిలోని ఇంటికి మంచు మనోజ్ దంపతులు వెళ్లారు. గేటు వద్దనే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోవడంతో తోసుకుని వెళ్లారు మనోజ్. దీంతో మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే తమకు రక్షణ కల్పించాలంటూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు మంచు మనోజ్ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కావాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల క్రితం మొదలైన గొడవ మరింత ముదిరి చివరికీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.
(ఇది చదవండి: ‘మంచు’ ఫ్యామిలీ వార్.. కీలక విషయాలు బయటపెట్టిన పని మనిషి)
పిల్లలు ఇంట్లోనే ఉన్నారన్న మనోజ్ దంపతులు..
తమ పిల్లలు ఇంట్లోనే ఉన్నారని మంచు మనోజ్, మౌనిక సెక్యూరిటీ సిబ్బందితో తెలిపారు. వారికోసమే తాము వచ్చామని.. లోపలికి అనుమతించాలని కోరారు. అయినప్పటికీ మనోజ్ దంపతులను ఇంటి గేటు బయటే సెక్యూరిటీ సిబ్బంది నిలిపేశారు. దీంతో మనోజ్ బలవంతంగా గేట్ తోసుకుని లోపలికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment