మంచు ఫ్యామిలీ వివాదంపై కీలక విషయాలు బయటకు వచ్చాయి. మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు గొడపడ్డారని వారింటి పని మనిషి తెలిపారు. ఇద్దరు ఒకరినొకరు నెట్టుకున్నారని, ఆ సమయంలో మనోజ్ భార్య మౌనికతో పాటు అతని తల్లి కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. తండ్రికొడుకుల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయని.. ఇన్నాళ్లకు అది బయటి ప్రపంచానికి తెలిసిందన్నారు.
(చదవండి: మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత)
‘మోహన్ బాబు ఫ్యామిలీలో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మనోజ్ వ్యవహార శైలీ మోహన్ బాబుకు అస్సలు నచ్చదు. మౌనికను పెళ్లి చేసుకోవడం కూడా ఆ కుటుంబంలో ఎవరికి నచ్చలేదు. అప్పటి నుంచే ఈ గొడవలు మరింత ఎక్కువైయ్యాయి. ఆదివారం గొడవ జరిగిన సమయంలో మనోజ్ భార్య, తల్లి అక్కడే ఉన్నారు. మోహన్ బాబు, మనోజ్ ఒకరినొకరు నెట్టుకున్నారు. మంచు లక్ష్మి వచ్చి మనోజ్‌కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. మోహన్ బాబు అంటే విష్ణుకు చాలా ఇష్టం. ఆయనను ఏమైనా అంటే ఊరుకోరు’ అని పని మనిషి చెప్పారు.
కొనసాగుతున్న సస్పెన్స్
మంచు కుటుంబ వివాదంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తనపై దాడి చేశారని మంచు మనోజ్.. కొడుకుతో ప్రాణ హానీ ఉందని మోహన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. మంచు లక్ష్మి రంగంలోకి దిగి తమ్ముడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక నేడు మంచు విష్ణు విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. వచ్చీ రావడంతోనే మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్న మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించేశాడు. ఇది మా ఇంటి గొడవ అని, మేమే పరిష్కరించుకుంటామని విష్ణు, మోహన్ బాబు చెప్పినా.. ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. మరికాసేపట్లో మంచు మనోజ్ డీసీపీని కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు మోహన్ బాబుపై ఇటు మనోజ్‌పై కేసులు నమోదయ్యాయి. ఆస్తి కోసం మోహన్ బాబు, ఆస్థిత్వం కోసం మనోజ్ చేసిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment