Manchu mohan babu
-
మోహన్‌బాబుకు దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్ట్‌పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు హైకోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘మైక్‌తో దాడి చేసి గాయపరిచారన్నది ఆరోపణ. అనుమతి లేకుండా మోహన్‌బాబు ఇంట్లోకి వెళ్లిన కారణంగానే ఘటన జరిగింది. తొలుత బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు పెట్టిన పోలీసులు జర్నలిస్ట్ రంజిత్ వాంగ్మూలం తీసుకుని సెక్షన్ 109గా మార్చారు. మోహన్‌బాబు, రంజిత్ మధ్య ఎలాంటి వివాదం లేదు. హత్యకు ప్రయత్నించారనడానికి ఎలాంటి కారణాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు పిటిషనర్ బెయిల్‌కు అర్హుడు’అని పేర్కొన్నారు. మనోజ్ జిమ్ ట్రైనర్‌తోపాటు మరొకరి స్టేట్మెంట్ రికార్డు చేశామని ఏపీపీ జితేందర్‌రావు చెప్పారు. కౌంటర్ కూడా దాఖలు చేశామన్నారు. మోహన్‌బాబు కావాలని చేయకున్నా.. తెలిసి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.‘రంజిత్‌కు తగిలిన గాయంపై ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా సెక్షన్‌ను మార్చాల్సి వచ్చింది. వారంపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. 20 రోజుల వరకు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్ కుమారుడి ఆహ్వనం మేరకు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మోహన్‌బాబు దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. ఆయనకు జీవితకాల శిక్ష పడే అవకాశం కూడా ఉంది’అని చెప్పారు. అయితే మోహన్‌బాబు దుబాయ్ వెళ్లడం లేదని రవిచందర్ పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇరు పార్టీలను అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రవిచందర్ కోరగా, నిరాకరించారు. -
నా కుమారుడు మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన నిర్మల
మంచు మనోజ్ చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల పహాడీషరీఫ్ పోలీసులకు లేఖ రాశారు. డిసెంబర్ 14న నిర్మల పుట్టినరోజును మనోజ్ సెలబ్రేట్ చేశారు. ఆ సమయంలో విష్ణు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే, విష్ణు .. తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని మనోజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తాజాగా నిర్మల ఒక లేఖ ద్వారా ఆరోజు ఏం జరిగిందో పోలీసులకు తెలిపారు.పహాడీషరీఫ్ పోలీసులకు మంచు నిర్మల ఇలా తెలిపారు. 'డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకుని జల్పల్లిలోని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు సీసీ ఫుటేజ్‌ని బయట పెట్టి, ఆపై విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేశాడు. ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు తెలిసింది. కానీ, ఆరోజు అలాంటి ఘటన ఏమీ జరగలేదు. కేక్ కట్ చేయడం పూర్తి అయిన తర్వాత విష్ణు తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. నా చిన్న కుమారుడైన మనోజ్‌కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కుమారుడు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. ఆ సమయంలో విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ ఫిర్యాదు చేసిన దానిలో ఎలాంటి నిజం లేదు. ఇంట్లో పని చేసే వాళ్లు కూడా 'మేమిక్కడ పని చేయలేమని' వాళ్లే వెళ్లిపోయారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు.' అని తెలుపుతున్నాను అంటూ నిర్మల ఒక లేఖ విడుదల చేశారు.మనోజ్ చేసిన ఫిర్యాదు ఏంటి..?తన తల్లి నిర్మల పుట్టిన రోజున కేక్ నెపంతో శనివారం రాత్రి తన సోదరుడు మంచు విష్ణు, అతని సహచరులు-రాజ్ కొండూరు, కిరణ్ , విజయ్ రెడ్డి బౌన్సర్ల బృందంతో ఇంట్లోకి వచ్చారని మనోజ్ తెలిపారు. ఆ సమయంలో వారు ప్రధాన జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్‌ను పోశారని, దానివల్ల అర్థరాత్రి కరెంట్ పని చేయక ఇబ్బందులకు గురయ్యామని మంచు మనోజ్ ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మోహన్ బాబు 24వరకు టైమ్ అడిగారు: రాచకొండ సీపీ
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్దిరోజులుగా గొడవలు, కేసులు వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్పల్లిలో తన నివాసం వద్ద మీడియా ప్రతినిధిని మోహన్‌బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదు అయింది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్‌పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సీపీ తాజాగా మీడియాతో మాట్లాడారు.'ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 FIRలు నమోదు అయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాము. చట్టప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ, డిసెంబర్ 24 వరకు టైమ్ అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదు.మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద రెండు గన్స్ ఉన్నాయి. కానీ, రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ ఇవ్వలేదు. మరోకసారి మోహన్‌బాబుకు నోటీసు ఇస్తాం. అప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి. లేదంటే వారంటీ ఇష్యు చేస్తాము. ఒకవేళ మళ్లీ విచారణకు ఆయన రాకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.' అని సీపీ అన్నారు.లైసెన్స్డ్ గన్స్ సరెండర్ చేసిన మోహన్ బాబుమోహన్బాబు తన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్ను సరెండర్ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావడంతో తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో తన పీఆర్వో ద్వారా డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద రెండు గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ గన్‌తో పాటు స్పానిష్ మెడ్ గన్ ఉంది. -
జనసేనలోకి మంచు మనోజ్, మౌనిక?
మంచు ఫ్యామిలీ కొట్లాటలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుందా?. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఈ పొలిటికల్ అరంగేట్రానికి ఆళ్లగడ్డ వేదిక కానున్నట్టు సమాచారం.మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనోజ్, మౌనిక దంపతులకు ఆహ్వానం వెళ్లింది. అయితే వీరిద్దరూ ఏకంగా వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం, భూమా ఘాట్ నుంచి రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తారని చర్చ నడుస్తోంది. అందులో భాగంగా తమ బలం నిరూపించుకునేందుకు ఇలా ర్యాలీగా వస్తున్నారనే సమాచారం.భూమా కుటుంబంలో ప్రస్తుతం టీడీపీ నుంచి నాగిరెడ్డి పెద్ద కూతురు అఖియప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, అఖిలప్రియతో ఉన్న కొన్ని ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక.. జనసేన వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే జనసేనలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనలో ఉంటే టికెట్ కూడా దక్కే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక, మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ గతంలోనే కీలక కామెంట్స్ చేశారు. అంతకుముందు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో మనోజ్ మాట్లాడుతూ.. మౌనిక రాజకీయాల్లోకి వెళ్లితే కచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే సమయంలో తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం తనకు ఉందన్నారు.రాజకీయాల్లో భూమా ఫ్యామిలీ.. భూమా కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నేతలు.. వారి మరణం తర్వాత భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిలప్రియ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి విజయం సాధించారు. తండ్రి నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఇద్దరు టీడీపీలో చేరగా.. కొంతకాలానికి నాగిరెడ్డి మృతి చెందారు. ఇక, భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల బాధ్యతల్ని భూమా కుటుంబమే చూసుకుంటోంది. ఇప్పుడు భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. -
మంచు ఫ్యామిలీలో ‘పంచదార’ గొడవ
ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జల్పల్లిలోని మంచు మోహన్‌బాబు నివాసంలో మనోజ్, విష్ణుల మధ్య మరోసారి వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. తన తల్లి పుట్టిన రోజున కేక్ నెపంతో శనివారం రాత్రి తన సోదరుడు మంచు విష్ణు, అతని సహచరులు-రాజ్ కొండూరు, కిరణ్ , విజయ్ రెడ్డి బౌన్సర్ల బృందంతో ఇంట్లోకి వచ్చి ప్రధాన జనరేటర్ లో చక్కెరతో కలిపిన డీజిల్‌ను పోశారని, దానివల్ల అర్థరాత్రి కరెంట్ పని చేయక ఇబ్బందులకు గురయ్యామని మంచు మనోజ్ ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద చోటు హైడ్రామా చోటు చేసుకుంది. తండ్రి మోహన్ బాబు ఇంటికి ఆయన కుమారుడు మనోజ్ వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గేట్లు తోసుకుని బలవంతంగా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. మరోవైపు జర్నలిస్ట్‌పై దాడి ఘటనపై మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
జర్నలిస్ట్‌పై దాడి.. రంజిత్‌కు మోహన్‌బాబు పరామర్శ
జర్నలిస్ట్ రంజిత్‌కు సీనీ నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ని కలిసి పరామర్శించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యలను కలిసి.. తన వల్లే తప్పిదం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా రంజిత్ని కొట్టలేదని చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, రంజిత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. తనపై దాడి జరిగితే.. జర్నలిస్టు సమాజం మొత్తం అండగా నిలిచిందని, ఆ క్షమాపణలు మీడియాకే చెప్పాలని రంజిత్ కోరడంతో మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మోహన్ బాబుతో పాటు మంచు మిష్ణు కూడా ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించాడు. కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ కేసు పెట్టడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. మరోవైపు తన కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మంచు మోహన్ బాబు కూడా కేసు పెట్టాడు. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న గొడవను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేశాడు. ఈ ఘటనలో జర్నలిస్ట్ రంజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జర్నలిస్టులంతా ధర్నాకు దిగారు. పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్‌బాబు కనపడుటలేదు…! అరెస్ట్ భయంతో ఎక్కడికెళ్లారు…? ఇప్పుడు ఎక్కడున్నారు…? అంటూ రెండ్రోజులుగా రచ్చ రేగింది. దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా రంజిత్ని కలిసి పరామర్శించాడు. -
హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!
హైకోర్టులో మంచు మోహన్‌బాబు భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని మోహన్‌బాబు ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. నిన్న జరిగిన గొడవ మోహన్ బాబు కుటుంబం వ్యవహారం అని ధర్మాసనం అభిప్రాయపడింది. మోహన్ బాబు ఇంటిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. అప్పటి వరకు పోలీసుల ముందు హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా, మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోల కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.కాలి నొప్పితో బాధపడుతున్న మోహన్ బాబుఅనారోగ్య సమస్యలతో మోహన్ బాబు.. మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఆయన మెడ, కాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గురునాథ్ కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతు ఇదే విషయాన్ని చెప్పారు. 'మెడ, కాలిలో నొప్పితో పాటు బీపీ ఎక్కువయ్యేసరికి మోహన్ బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయనకు నిద్రలేదు. బీపీలో ఇప్పటికే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. -
మా నాన్న దేవుడు: మంచు మనోజ్
సాక్షి, హైదరాబాద్: మీడియా మిత్రులపై మా నాన్న(మంచు మోహన్‌బాబు) దాడి చేయడం బాధాకరమని, ఆయన తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను అన్నారు మంచు మనోజ్. మీడియాపై మోహన్‌బాబు చేసిన దాడిని ఖండిస్తూ ధర్నాకు దిగిన జర్నలిస్టులకు ఆయన మద్దతు తెలిపారు. తన కోసం వచ్చిన మీడియా మిత్రులపై దాడి చేయడం దారుణమన్నారు. తనపై మోహన్‌బాబు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ‘నేను ఆస్తుల కోసం ఏ రోజు కూడా గొడవ చేయలేదు. నా సొంత కాళ్లపై నిలబడుతున్నాను. నేను మద్యానికి బానిసై కొడుతున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా నాన్న దేవుడు.. ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదు. ఆయన భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాలుస్తున్నారు. మా బంధువులపై దాడి చేశారు. నా భార్య, ఏడు నెలల పాపను గొడవలోకి లాగుతున్నారు. ఈ గొడవల మధ్య మా అమ్మ నలిగిపోతుంది. ఇన్ని రోజులు ఆగాను.. ఇక ఆగలేను. అసలేం జరిగింది? గొడవ దేనికోసం అనేది ఈ రోజు(డిసెంబర్ 11) సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాను’ అని మంచు మనోజ్ అన్నారు.(చదవండి: నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు)కాగా, సీనియర్ నటుడు మోహన్‌బాబు ఫ్యామిలీ గొడవలు మంగళవారం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద నిన్న రాత్రి వరకు హైడ్రామా నడిచింది. మంచు విష్ణు, మనోజ్‌ల బౌన్సర్ల మోహరింపు.. తోపులాటలతో ‘మంచు టౌన్’హీటెక్కింది. ఈ గొడవను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి చేశాడు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్టులు అక్కడే ధర్నాకు దిగారు. -
‘మంచు’ ఫ్యామిలీ వార్.. కీలక విషయాలు బయటపెట్టిన పని మనిషి
మంచు ఫ్యామిలీ వివాదంపై కీలక విషయాలు బయటకు వచ్చాయి. మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు గొడపడ్డారని వారింటి పని మనిషి తెలిపారు. ఇద్దరు ఒకరినొకరు నెట్టుకున్నారని, ఆ సమయంలో మనోజ్ భార్య మౌనికతో పాటు అతని తల్లి కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. తండ్రికొడుకుల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయని.. ఇన్నాళ్లకు అది బయటి ప్రపంచానికి తెలిసిందన్నారు. (చదవండి: మంచు ఫ్యామిలీ వివాదం.. మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత)‘మోహన్ బాబు ఫ్యామిలీలో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మనోజ్ వ్యవహార శైలీ మోహన్ బాబుకు అస్సలు నచ్చదు. మౌనికను పెళ్లి చేసుకోవడం కూడా ఆ కుటుంబంలో ఎవరికి నచ్చలేదు. అప్పటి నుంచే ఈ గొడవలు మరింత ఎక్కువైయ్యాయి. ఆదివారం గొడవ జరిగిన సమయంలో మనోజ్ భార్య, తల్లి అక్కడే ఉన్నారు. మోహన్ బాబు, మనోజ్ ఒకరినొకరు నెట్టుకున్నారు. మంచు లక్ష్మి వచ్చి మనోజ్‌కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. మోహన్ బాబు అంటే విష్ణుకు చాలా ఇష్టం. ఆయనను ఏమైనా అంటే ఊరుకోరు’ అని పని మనిషి చెప్పారు. కొనసాగుతున్న సస్పెన్స్మంచు కుటుంబ వివాదంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తనపై దాడి చేశారని మంచు మనోజ్.. కొడుకుతో ప్రాణ హానీ ఉందని మోహన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. మంచు లక్ష్మి రంగంలోకి దిగి తమ్ముడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక నేడు మంచు విష్ణు విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. వచ్చీ రావడంతోనే మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్న మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించేశాడు. ఇది మా ఇంటి గొడవ అని, మేమే పరిష్కరించుకుంటామని విష్ణు, మోహన్ బాబు చెప్పినా.. ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. మరికాసేపట్లో మంచు మనోజ్ డీసీపీని కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు మోహన్ బాబుపై ఇటు మనోజ్‌పై కేసులు నమోదయ్యాయి. ఆస్తి కోసం మోహన్ బాబు, ఆస్థిత్వం కోసం మనోజ్ చేసిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టారు. -
ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా : మంచు మనోజ్
టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తనపై దాడి చేశారని మంచు మనోజ్.. చిన్న కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసుకు ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ శివార్లలోని జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఫామ్‌హౌస్ ‘మంచు టౌన్’కి మనోజ్‌తో పాటు మంచు విష్ణు కూడా బౌన్సర్లను పంపించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి బౌన్సర్లను బయటకు పంపించారు.(చదవండి: చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు) అయితే తన అనుచరులను మాత్రమే పోలీసులు బెదిరిస్తున్నాడని మంచు మనోజ్ ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అనుచరుల పేర్లు రాసుకొని మరీ బయటకు పంపిస్తున్నారని, వాళ్ల(మోహన్ బాబు, విష్ణు) బౌన్సర్లను మాత్రం లోపలికి పంపిస్తున్నారని ఆరోపించారు. ‘నేను డబ్బు కోసమో, ఆస్తుల కోసమో పోరాటం చేయడం లేదు.. ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాను. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. న్యాయం కోసం అందరిని కలుస్తాను’ అని మంచు మనోజ్ మీడియాతో తెలిపారు. అనంతరం భార్యతో కలిసి మోహన్‌బాబు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. -
చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదంపై మోహన్ బాబు స్పందించారు. తమ ఇంట్లో జరుగుతున్నది చిన్న తగాదా అని.. అది తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన పెద్ద కొడుకు మంచు విష్ణుకు స్వాగతం పలికేందుకు మంగళవారం ఉదయం మోహన్ బాబు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అనంతరం విష్ణుతో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ ఇంట్లో నైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతాయి. మా ఇంట్లో కూడా అలాంటి చిన్న గొడవే జరిగింది. అది అంతర్గతంగా చర్చించుకుంటాం. మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను నేను పరిష్కరించాను. అందరిని కలిపే ప్రయత్నం చేశాం. మా ఫ్యామిలీ సమస్యను కూడా త్వరనే పరిష్కరించుకుంటాం’అని అన్నారు.కొడుకుపై ఫిర్యాదు.. స్పందించిన మనోజ్గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ సోమవారం పోలీసుకుల ఫిర్యాదు చేయడంతో మంచు ఫ్యామిలీ గొడవ మరింత పెద్దదైంది. మనోజ్ ఫిర్యాదు చేసిన గంటలోనే మోహన్ బాబు కొడుకు మనోజ్‌పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చిన్న కుమారుడు మనోజ్‌తో ప్రాణహానీ ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మనోజ్‌తో పాటు అతని భార్య మౌనికపై కూడా చర్యలు తీసుకోవాలని కోరాడు.తండ్రి ఫిర్యాదుపై మనోజ్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశాడు. తనపై, తన భార్య మౌనికపై మోహన్ బాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ‘నా పరువు తీయడానికి, నా గొంతు నొక్కడానికే మా నాన్న మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు’ అంటూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ సుదీర్గమైన పోస్ట్ పెట్టారు. -
మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ రియాక్షన్ ఇదే..
సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో వివాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సోమవారం రాత్రి.. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. కానీ, తనపై దాడి చేసింది ఎవరో ఆయన పేర్కనలేదు. అయితే, అది జరిగిన గంటలోనే మోహన్‌బాబు వాట్సాప్ ద్వారా రాచ కొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు పంపారు. తన కుమారుడు మనోజ్ వల్ల ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ క్రమంలో మనోజ్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను మోహన్‌బాబు కోరారు. దీంతో పోలీసులు మనోజ్‌పై 329,351,115 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఆపై క్రైం నెంబర్ 644/2024 పహడి షరీఫ్ పోలీసులు కేటాయించారు. తండ్రి చేసిన ఆరోపణలపై తాజాగా మంచు మనోజ్ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు.మోహన్ బాబు ఫిర్యాదు తర్వాత మనోజ్ పత్రికా ప్రకటన చేశారు. 'నాపై, నా భార్య మౌనికపై నా తండ్రి డాక్టర్ ఎం. మోహన్ బాబు చేసిన దురుద్దేశపూరితమైన, తప్పుడు ఆరోపణలు నాకు చాలా బాధ కలిగించింది. నా తండ్రి చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవాలు. నా పరువు తీయడానికి, నా గొంతును నొక్కడానికి,కుటుంబ కలహాలు సృష్టించడానికి ఉద్దేశపూర్వక చేసే ప్రయత్నంలో ఇదొక భాగం. నాకు, నా భార్యకు వ్యతిరేకంగా ఆయన చేసిన వాదనలు పూర్తిగా కల్పితం. అంటూ మనోజ్ కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చారు.నేను ఎప్పుడూ ఆర్థిక సహాయం కోసం నా కుటుంబంపై ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తులను కోరలేదు. నేను ప్రస్తుతం ఒక సంవత్సరం నుండి మా నాన్న ఇంట్లోనే నివసిస్తున్నాను.నా సోదరుడు దుబాయ్‌కి వెళ్లిన తర్వాత మా అమ్మ ఒంటరిగా ఉన్నందున నన్ను ఇంటికి రమ్మని మా నాన్న పిలిచారు. అప్పుడు నేను మా నాన్నకు చెందిన ఇంట్లోకి మారాను. ఏడాదికిపైగా అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. నేను తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చినట్లు నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. ఫిర్యాదులో నన్ను, నా భార్యను తప్పుగా ఇరికించే ఉద్దేశ్యంతో ఆరోపణ చేశారు. నేను ఆ ఇంట్లో నివసిస్తున్నానని నిర్ధారించుకోవడానికి గత సంవత్సరం నుంచి నా మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్‌ను ధృవీకరించాల్సిందిగా అధికారులను అభ్యర్థిస్తున్నాను.ఈ గొడవలోకి నా 7నెలల కుమార్తెను లాగడం చాలా బాధకరమైనది, అమానవీయం ఘటన. ఇలాంటి వివాదంలోకి నా పిల్లలను లాగడం వెనకున్న ఉద్దేశం ఏంటి..?కుటుంబ పెద్దల పట్ల అత్యంత గౌరవం చూపే నా భార్యకు ఉద్దేశాలు ఆపాదించబడడం దురదృష్టకరం.ఇంట్లో పనిచేసే మహిళాలపై మా నాన్న చాలా ఎక్కువగానే తిడుతూ ఉంటారు. దీంతో వారు భయపడిపోవడమే కాకుండా తీవ్రమైన మనోవేదనకు గురయ్యేవారు కూడా.. ఇంట్లో మా నాన్న అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో జీవిస్తారు. అందుకు అవసరమైన అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కూతుర్ని పట్టించుకోకుండా వదిలేశామని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మా అమ్మ పర్యవేక్షణతో పాటు ఆయా వద్ద మా కూతురిని ఉంచాం. నా భార్య, నేను కేవలం నాకు తగిలిన గాయాల వైద్య చికిత్స కోసం ఆ సమయంలో హాస్పిటల్‌కి వెళ్ళాం.విష్ణుకు సహచరులు విజయ్‌రెడ్డి, కిరణ్‌లు సీసీటీవీ డ్రైవ్‌లను ఎందుకు తొలగించారు..? ఈ వివాదంలో వారు ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు..? ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరుతున్నాను.నేను ఎల్లప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను, నా కృషి, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల ఆశీర్వాదం వల్ల నా వృత్తిని నిర్మించుకున్నాను. నేను ఎనిమిదేళ్లకు పైగా మా నాన్న, సోదరుల చిత్రాల కోసం అవిశ్రాంతంగా పని చేశాను. ఈ క్రమంలో అనేక పాటలు, ఫైట్లు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను. తరచుగా కమర్షియల్ హీరోగా నా స్థాయికి తగ్గ పాత్రలను పోషిస్తున్నాను. ఒక్క రూపాయి తీసుకోకుండా, పూర్తిగా నా కుటుంబ ప్రయోజనాల కోసమే ఇదంతా చేశాను. అహం బ్రహ్మాస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా విధ్వంసానికి గురయ్యాయి. నా సోదరుడు విష్ణు… ఇప్పటికీ నాన్న నుంచి మద్దతు, ప్రయోజనం పొందుతూనే ఉన్నాడు.నేను ఎప్పుడూ ఆస్తులు లేదా వారసత్వం ఆస్తులు కోసం అడగలేదు. నేను అడిగి ఉంటె సాక్ష్యాలు అందించమని నేను ఎవరినైనా సవాలు చేస్తున్నాను. నా జీవితం, నా స్వంత యోగ్యతతో కుటుంబ సంపదపై ఆధారపడకుండా నా పిల్లలను గౌరవంగా పోషించుకుంటుంన్నందుకు నేను గర్వపడుతున్నాను.విష్ణు, అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ ద్వారా మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థులు దోపిడీకి గురవుతున్నారు. వారికి మద్దతుగా నేను బహిరంగంగా మాట్లాడటంతోనే ఈ ఫిర్యాదు చేశారు. వారి ఆర్థిక అవకతవకలకు సంబంధించిన పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తాను.నా తండ్రి ఎప్పుడూ కూడా విష్ణుకు మద్దతుగానే ఉంటూ వచ్చారు. కుటుంబ విషయంలో నా త్యాగాలు ఉన్నప్పటికీ ప్రతిసారి నాకు అన్యాయం జరుగుతూనే వస్తుంది. ఇప్పటికే పరువు నష్టంతో పాటు పలుమార్లు వేధింపులకు గురయ్యాను. విష్ణు స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకుంటూ వచ్చాడు. కానీ, నేనెప్పుడూ స్వతంత్రంగానే జీవిస్తూ వస్తున్నాను. నేను పైన చెప్పిన వాటి విషయంలో అధికారులకు పూర్తి ఆధారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.My humble request to serve justice through a transparent and righteous investigation.@ncbn Garu @naralokesh Garu @PawanKalyan Garu @Anitha_TDP Garu @revanth_anumula Garu @Bhatti_Mallu Garu @TelanganaCMO @TelanganaDGP Garu 🙏🏼 https://t.co/M3xbNALZje pic.twitter.com/BBokLPLNEP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 9, 2024 -
పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ హీరో మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం జరిదగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తనపై జరిగిన దాడిపై పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. కాగా.. అంతకుముందు ఆదివారం మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. తన కాలికి గాయం కావడంతో భార్యతో కలిసి ఆస్పత్రికి వచ్చారు. చికిత్స అనంతరం ఆస్పత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తనపై దాడి జరిగిన ఘటనపై ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ప్రాణహాని ఉంది.. మంచు మనోజ్అయితే మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు. తన తండ్రి మోహన్ బాబు పేరు కూడా ఫిర్యాదులో ప్రస్తావించలేదు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారు. తాను ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి తమపై దాడి చేశారు అని ఫిర్యాదులో వెల్లడించారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో తనకు గాయాలైనట్లు పోలీసులకు తెలిపారు.కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు..పహాడీ షరీఫ్ సీఐ గురువారెడ్డిఅయితే మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సీఐ గురువారెడ్డి వెల్లడించారు. డయల్ 100కు కాల్ రావడంతో తాము ఘటనాస్థలికి వెళ్లామని పహాడీ షరీఫ్ సీఐ తెలిపారు. ఘటనా స్థలంలో విజయ్ రెడ్డి, కిరణ్ అనే వ్యక్తులు సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారని.. ఈ ఘటనపై పూర్తిస్తాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి పేర్కొన్నారు. -
‘మంచు’ కుటుంబంలో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో ఆదివారం హైడ్రామా నడిచింది. చిన్న కుమారుడు మనోజ్‌పై మోహన్‌బాబు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఉదయం డయల్–100కు కాల్ చేసిన మనోజ్ తనపై దాడి జరిగిందని చెప్పడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మనోజ్ నడలేని పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో అసలేం జరిగిందనే ఉత్కంఠ నెలకొంది.మనోజ్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, మెడికో లీగల్ కేసుగా పరిగణిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మాత్రం ఈ అంశంపై తమకు ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదని, డయల్–100కు కాల్ చేసిన మనోజ్ తనపై దాడి జరిగిందని మాత్రం చెప్పారని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హోరెత్తిన సోషల్ మీడియా 5పహడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలోని జల్పల్లిలో ఉన్న ఇంట్లో తనతో పాటు తన భార్యపై దాడి జరిగిందంటూ మనోజ్ పంపినట్లుగా ఉన్న ఓ సందేశం ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు జల్పల్లిలోని ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మోహన్‌బాబు, మనోజ్ తదితరులు ఇది తమ ఇంటి విషయమని, కుటుంబ వివాదమని చెప్పారని, దాంతో వెనుతిరిగినట్లు సమాచారం.కొద్దిసేపటికే మోహన్‌బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు, విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ దాడి చేసినట్లుగా మనోజ్ పేరుతో ఒక ప్రకటన బయటకు వచి్చంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, అలాంటిది ఏం జరగలేదని మంచు కుటుంబం పేరుతో మరో ప్రకటన వచి్చంది. దీంతో మనోజ్‌పై దాడి ఊహాజనితం అయి ఉండచ్చని అంతా భావించారు. కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే మనోజ్ తన భార్యతో కలిసి నడవలేని స్థితిలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. కాలికి, మెడపై స్వల్ప గాయాలు భార్య, సహాయకుడి సహకారంతో మనోజ్ కుంటుతూ లోనికి వెళ్లడంతో ఏదో జరిగిందనేది మాత్రం స్పష్టమయ్యింది. భూమా మౌనిక మాత్రం సాధారణంగానే కనిపించారు. మనోజ్ కాలికి గాయమైందని, మెడపై కూడా స్పల్ప గాయాలున్నట్లు గుర్తించిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రి కొందరు సినీ, రాజకీయ పెద్దలు మంచు కుటుంబ సమస్యల్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ పరిణామాలన్నింటిపై ఎవరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం గమనార్హం. -
మోహన్‌బాబు@50
నటుడు–నిర్మాత మంచు మోహన్‌బాబు సినీ జర్నీ గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి అడుగుపెట్టింది. యాభై ఏళ్ల కెరీర్లో ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో ఘనవిజయాలను చూశారు మోహన్‌బాబు. నేటితో సినీ పరిశ్రమలో హీరోగా 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. సినిమాల్లోకి రాక ముందు ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేశారు. అయితే సినీ పరిశ్రమపై ఎనలేని ఆసక్తితో మద్రాస్ వెళ్లి, అవకాశాల కోసం ఎంతో శ్రమించారు మోహన్‌బాబు. అలా ఒకట్రెండు సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించిన మోహన్‌బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘స్వర్గం నరకం’ (1975). డా. దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబరు 22న విడుదలైన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమా విడుదలై, గురువారంతో నలభైతొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. ‘స్వర్గం నరకం’తో హీరోగా వెండితెరకు పరిచయమైన మోహన్‌బాబు కెరీర్ మొదట్లో ఎక్కువగా విలన్ పాత్రలనే పోషించారు. 1975–1990 సమయంలో విలన్‌గా విజృంభించారు. హీరోగా ‘అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. 75 సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మోహన్‌బాబు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. -
అందుకే జ్యోతిర్లింగాలను సందర్శించాం: మంచు విష్ణు
‘‘పరమ శివుడి పరమ భక్తుడి కథగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. అందుకే ఈ చిత్రం విడుదలకు ముందే 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్‌కు రావడం ఆనందంగా ఉంది. మా ఎపిక్ యాక్షన్ చిత్రమైన ‘కన్నప్ప’ విడుదల కోసం యూనిట్ అంతా ఎదురుచూస్తున్నాం’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా ‘కన్నప్ప’ చిత్రయూనిట్ పన్నెండు జ్యోతిర్లింగాల సందర్శన యాత్రను చేపట్టింది. రిషికేశ్ సందర్శనతో వారి ప్రయాణం ముగిసింది. ఈ యాత్రలో మోహన్‌బాబు, విష్ణు, ముఖేష్ కుమార్ సింగ్, నటుడు అర్పిత్ రంకా పాల్గొన్నారు. ‘‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ వంటి ఇతిహాసాల స్ఫూర్తితో ‘కన్నప్ప’ రూపొందింది. భక్తి, శౌర్యం, ఆధ్యాత్మిక అన్వేషణతో కూడిన ప్రయాణంగా ఈ మూవీ ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
మోహన్ బాబు విద్యాసంస్థలపై ఫిర్యాదు చేసిన పేరెంట్స్ కమిటీ
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన విద్యాసంస్థలపై ఫిర్యాదు అందింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మోహన్ బాబుకు విద్యాసంస్థలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్య సిబ్బంది అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అఖిల భారత సాంకేతిక విద్యామం డలి (ఏఐసిటిఈ)కి పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసింది.మోహన్ బాబు విద్యాసంస్థల్లో విద్యార్థుల నుంచి అడ్డుగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేరెంట్స్ కమిటీ పేర్కొంది. విద్యార్థుల చేత బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేపిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డే స్కాలర్స్ ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం మెస్‌లోనే చేయాలని రూల్ పెట్టడం ఏంటి అని తల్లిదండ్రుల కమిటీ ప్రశ్నిస్తుంది. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. యాజమాన్యం చెప్పినట్లు విద్యార్థులు వినకపోతే బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారని ఏఐసిటిఈకి ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. నాణ్యతలేని చదువులు బోధిస్తున్నారని వారు తెలిపారు. మోహన్ బాబు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్‌కు సరైన సమయానికి వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఏఐసిటిఈకి పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసింది. -
కంపడు, గవ్వరాజు ఎవరో చెప్పిన 'కన్నప్ప'
డైనమిక్ హీరో మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీ ప్రమోషన్స్ అప్టేట్స్‌ను నిరంతరం అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొద్ది నెలలుగా ప్రతి సోమవారం చిత్రం నుంచి ముఖ్యమైన అప్డేట్ను ప్రకటిస్తున్నారు. సినిమాలో కీలకమైన, విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న దిగ్గజ నటీనటుల లుక్స్‌కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ, వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తూ సినిమా పట్ల అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ముఖేష్ రుషి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు మరో ప్రముఖ నటుడు బ్రహ్మజీ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ ఈ చిత్రంలో కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ముఖేష్ రిషితో పాటు బ్రహ్మాజీ కూడా కనిపించారు. పోస్టర్లో వారి లుక్ ఫెరోషియస్‌గా కనిపిస్తుంది. కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. "కన్నప్ప" అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందే విధంగా, మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఇక సినిమా పట్ల అంకితభావంతో.. ఇష్టంతో విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకుడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి.. ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలు, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ విజువల్ వండర్‌ను డిసెంబర్లో పాన్ ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
మోహన్‌బాబు చేతిలో రాజదండం.. ఫోటో వైరల్
భక్తవత్సలం నాయుడు అనగానే కొద్దిమందికే తెలుసు. అదే మోహన్‌బాబు అనగానే వెంటనే కలెక్షన్ల కింగ్ అనేస్తారు. అలా ఆయన పేరు ప్రేక్షకుల మదిలో సుస్థిరంగా నిలబడిపోయింది. నటుడిగా, నిర్మాతగా చిత్రసీమకు ఎనలేని సేవలు ఆయన చేశారు. నటనలో రాణించాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెహన్‌బాబు ఎన్నో అవరోధాలను అధిగమించి ఎనలేని కీర్తిని గడించారు. తాజాగా ఆయన పంచుకున్న ఫోటో నెట్టంట ట్రెండ్ అవుతుంది.సుమారు 50 ఎళ్లకు పైగా మోహన్‌బాబు సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. ఇప్పటి వరకు 500పైగా చిత్రాల్లో ఆయన నటించారు. రాజదండం చేత పట్టుకుని ఉన్న తన ఫోటోను మోహన్‌బాబు అభిమానులతో పంచుకున్నారు. 'ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల అపురూప రాజదండం నాకు అందడం నా పూర్వజన్మ సుకృతం. ఈ రాజ దండం ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో అతి త్వరలో వివరాలు తెలియజేస్తాను.' అని తన ఎక్స్ పేజీలో ఆయన పేర్కొన్నారు.1980 దశకంలో మోహన్‌బాబు సినిమా విడుదలైంది అంటే చాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రికార్డ్‌లు నమోదు కావాల్సిందే. అలా ఆయన నుంచి వచ్చిన సినిమాలు నిర్మాతలకు భారీగా లాభాలను తెచ్చిపెట్టాయి. ఆయన నటుడే కాదు మంచి అభిరుచి ఉన్న నిర్మాత కూడా అలా తన కూతురు లక్ష్మి మంచు పేరుతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై 90కి పైగా చిత్రాలు నిర్మించారు. ఇప్పడు కన్నప్ప చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. మోహన్‌బాబుకు విద్యారంగం అంటే గౌరవం. అందుకే ఆయన 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక స్కూల్స్, కాలేజీలు స్థాపించారు. ఈ క్రమంలో మోహన్‌బాబుని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో 2007లో సత్కరించింది. ఇప్పుడు ఆయన చేతికి అందిన రాజదండం ప్రత్యేకత ఏంటో అనేది త్వరలో మోహన్‌బాబు వెళ్లడించనున్నారు.ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల అపురూప రాజ దండం నాకు అందడం నా పూర్వజన్మ సుకృతం. pic.twitter.com/bRTK1j7m9X— Mohan Babu M (@themohanbabu) July 11, 2024 -
రాజకీయాలపై 'మంచు మోహన్‌బాబు' సంచలన లేఖ
కొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ విలక్షణ నటులు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఒక లేఖ విడుదల చేశారు. ఏ పార్టీ వారైనా తన పేరును వారి సొంత ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ఆయన ఇలా విజ్ఞప్తి చేశారు. 'ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని కోరుతున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తున్నాను.శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటున్నాను. ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను.' అని మంచు మోహన్ బాబు ఒక లేఖను తన ఎక్స్పేజీలో విడుదల చేశారు. విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5 — Mohan Babu M (@themohanbabu) February 26, 2024 -
ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు ఇంద్ర భవనమే.. ఎలా ఉందో చూశారా?
యాంకర్, నటి మంచు లక్ష్మి కొన్ని నెలల క్రితం ముంబైకి షిఫ్ట్ అయింది. హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబైకి మార్చేసింది. వృత్తిపరమైన పనుల రీత్యా అక్కడకు షిఫ్ట్ అయినట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమె అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసేందుకు ప్లాన్ చేస్తుంది. మంచు లక్ష్మి ఎక్కడ ఉన్నా తన ఇంటిని చాలా యూనిక్‌గా ఉండేలా చూసుకుంటుంది. హైదరాబాద్‌లోని తన ఇంటితో పాటు మోహన్‌బాబు ఇంటిని కూడా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఇదే క్రమంలో తాజాగా ముంబైలో తాను ఉంటున్న ఇంటిని వీడియో తీసి అభిమానుల కోసం విడుదల చేసింది. ఎక్కడున్నా ఎవరికైనా ఇల్లే స్వర్గం.. ముంబైకి షిఫ్ట్ అయ్యాక తన అభిరుచులకు తగిన ఇంటి కోసం దాదాపు వారం రోజులపాటు 28 ఫ్లాట్స్ చూసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.. ఫైనల్‌గా ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఉద్దేశించి దీనిని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పింది. కానీ అక్కడ వస్తువులన్నీ చాలావరకు హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి తెచ్చుకున్నవే అని ఆమె తెలిపింది. ఎంతో అద్భుతంగా ఉన్న మంచు లక్ష్మీ ఇంటిని మీరూ చూసేయండి. ముంబైకి షిఫ్ట్ అయ్యాక లక్ష్మి ఏం చెప్పింది అంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్‌లో చాలా రకాల రోల్స్ చేశాను. కానీ అవి కొన్ని పరిమితులకు లోబడే ఉన్నాయి ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ముంబైలో అయితే అది వీలవుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆడిషన్స్‌కు కూడా సిద్ధమే! ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ముంబైలో నేను స్టార్ కిడ్‌ను కాదు. ఇక్కడ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకిదే సరైన సమయమని భావిస్తున్నాను. నిజానికి నేను లాస్ ఏంజిల్స్ వెళ్లిపోదామనుకున్నాను. అని గతంలో తెలిపింది. -
అంతా శివోహం... అదిరిపోయిన 'కన్నప్ప' పోస్టర్
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటేడ్ చిత్రాల్లో 'కన్నప్ప' ఎప్పుడో చేరిపోయింది. మంచు విష్ణుకు 'కన్నప్ప' చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఆయన చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లోకి కథకు తగినట్లు దేశంలోని స్టార్ నటీనటులను మంచు విష్ణు ఎంపిక చేశారు. నేడు (నవంబర్ 23) మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'కన్నప్ప' చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన షేర్ చేశారు. 'కన్నప్ప' పోస్టర్ చూడగానే చాలా అద్భుతంగా ఉంది అని ఎవరైన కొనియాడాల్సిందే అనేలా రూపొందించారు. ఈ పోస్టర్లో మంచు విష్ణు కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తుంటే.. అతనివైపునకు మెరుపు వేగంతో కొన్ని వందల బాణాలు దూసుకొస్తున్నాయి. శివలింగం ఆకారంలో రెండు కొండల మధ్య ఆ జలపాతం చాలా బాగుంది. కన్నప్ప టైటిల్ ఆర్ట్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఏదేమైన భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతన్న కన్నప్ప చిత్రం హిట్ కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కన్నప్ప కోసం వివిధ పరిశ్రమలకి చెందిన సీనియర్ నటులు భాగం అవుతున్నారు. మలయాళం నుంచి మెహన్‌లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, కోలీవుడ్ నుంచి నయనతార, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్‌బాబు,శరత్‌కుమార్‌లు ఇందులో నటిస్తున్నారు. శివభక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. స్టార్ ప్లస్‌లో 'మహాభారతం' సిరీస్‌ని కూడా ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH — Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023 -
కన్నప్పలో ఎంట్రీ
సీనియర్ నటులు మంచు మోహన్‌బాబు, శరత్‌కుమార్ ‘కన్నప్ప’ మూవీ సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. హీరో ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా నటుడు మంచు మోహన్‌బాబు, శరత్ కుమార్ ‘కన్నప్ప’లో భాగమైనట్లు ప్రకటించి, వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోని విడుదల చేశారు. ‘‘శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మంచు విష్ణుకు గాయాలు.. అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ సహా పలువురు స్టార్ హీరోలు నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే రెండు రోజుల క్రితం న్యూజిలాండ్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో మంచు విష్ణు గాయపడ్డట్లు ప్రచారం జరిగింది. యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ విష్ణు మీదకు రావడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్ క్యాన్సిల్ అవగా మంచు విష్ణు చికిత్స పొందుతున్నాడు. తాజాగా అతడి తండ్రి మోహన్ బాబు.. మంచు విష్ణు హెల్త్ అప్డేట్ గురించి ట్వీట్ చేశాడు. 'కన్నప్ప షూటింగ్లో గాయపడ్డ విష్ణు పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, మద్దతుకు ధన్యవాదాలు. భగవంతుడి దయతో అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొంటాడు' అని ట్వీట్ చేశాడు. ఇకపోతే బుల్లితెరపై మహాభారతం సీరియల్ తీసిన ముఖేశ్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ మూవీలో మంచు విష్ణు కన్నప్పగా కనిపించనున్నాడు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ రచనా సహకారం అందిస్తున్నారు. Grateful for all the love, wishes, and concern during @iVishnuManchu accident on the set of #Kannappa in New Zealand. By God's grace, he's on the road to recovery and will be back to shooting soon. Thank you for your support. 🙏 Har Har Mahadev! — Mohan Babu M (@themohanbabu) November 1, 2023 చదవండి: ఎనిమిది నెలల గర్భిణి.. బిడ్డను చూడకుండానే కన్నుమూసిన నటి -
ముంబైకి మకాం మార్చిన మంచు లక్ష్మి, అవకాశాల కోసమే!
యాంకర్, నటి మంచు లక్ష్మి ముంబైకి చెక్కేసింది. హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబైకి మార్చేసింది. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది. 'ముంబై.. కొత్త నగరం, కొత్త ప్రపంచం.. ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు ఎంతో కృతజ్ఞతలు. నాపై నమ్మకముంచి నా మీద ఎల్లవేళలా ప్రేమాభిమానాలు కురిపించే అభిమానులందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్ చేసింది. అయితే టాలీవుడ్లో తనకు అవకాశాలు సన్నగిల్లాయని బాలీవుడ్‌కు మకాం మార్చేయలేదు. తన నటనా పరిధిని విస్తృతపరిచుకునేందుకే ముంబైకి షిఫ్ట్ అయినట్లు పేర్కొంది. ఆఫీసుకు రమ్మన్నా వస్తాను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్‌లో చాలా రకాల రోల్స్ చేశాను. కానీ అవి కొన్ని పరిమితులకు లోబడే ఉన్నాయి ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ముంబైలో అయితే అది వీలవుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆడిషన్స్‌కు కూడా సిద్ధమే! ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ముంబైలో నేను స్టార్ కిడ్‌ను కాదు. ఇక్కడ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకిదే సరైన సమయమని భావిస్తున్నాను. నిజానికి నేను లాస్ ఏంజిల్స్ వెళ్లిపోదామనుకున్నాను. నాన్న అలాగే భయపడ్డాడు కానీ మా అమ్మ ఒకరకంగా భయపడి బెంగపెట్టేసుకుంది. సరే, అయితే ముంబైకి షిఫ్ట్ అవుతానని చెప్పా.. అమ్మ సరేనంది. తను ఎప్పుడూ నా నిర్ణయాన్ని అంగీకరిస్తుంది. నాన్న మాత్రం ముంబై అనగానే అక్కడ మాఫియా ఉంటుంది.. అక్కడికి ఎందుకు? అని అడిగాడు. కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతుందంటే ప్రతి తండ్రి ఎలా భయపడతాడో మా నాన్న కూడా అలాగే భయపడ్డాడు' అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్లో మకాం పెట్టిన మంచు లక్ష్మి ఆదివారం నాడు తన స్నేహితులకు బర్త్‌డే పార్టీ ఇచ్చింది. చదవండి: సినిమా కోసం ఇల్లు కూడా అమ్మేశా, ఆయనను కలిసిన తెల్లారే హత్య.. అలా కేసులో ఇరుక్కున్నా