![Manchu Manoj Shared Emotional Post On His Mother Birthday - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/15/manchu.gif.webp?itok=FWNeo7cp)
ఆ ఫోటోలో గోరు ముద్దలు తింటున్న పిల్లాడు ఇప్పుడు స్టార్ హీరో. టాలీవుడ్ పలు సినిమాల్లో తనదైన నటనతో మెప్పించాడు. అయితే కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత ఇంతవరకు సినిమా చేయలేదు. ఆ మధ్య ‘అహం బ్రహ్మాస్మి’ అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించినా ఇంతవరకు అది పట్టాలెక్కలేదు. ఇంతకీ ఎవరో గుర్తుకు వచ్చారా? తాజాగా ఆ టాలీవుడ్ హీరో మదర్ పుట్టిన రోజు సందర్భంగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఆ ఫోటోలోని చిన్నారి ఎవరో కాదు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్. తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మంచు మనోజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..' నా ప్రాణానికి ప్రాణం అయిన అమ్మ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా. అమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు.
అయితే మంచు మనోజ్ త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. కానీ మనోజ్ మాత్రం తన నెక్ట్స్ మూవీ గురించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల ‘అహం బ్రహ్మాస్మి’ గురించి అప్‌డేట్ అడగ్గా.. మనోజ్ ఒక స్మైలీ ఎమోజీని షేర్ చేశాడు. మరి ఈ ప్రాజెక్ట్ నుంచి మనోజ్ తప్పుకున్నాడా? లేక మరైదేనా సినిమా అనౌన్స్ చేయనున్నాడా అన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment