టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం జరిదగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తనపై జరిగిన దాడిపై పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు.
కాగా.. అంతకుముందు ఆదివారం మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. తన కాలికి గాయం కావడంతో భార్యతో కలిసి ఆస్పత్రికి వచ్చారు. చికిత్స అనంతరం ఆస్పత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తనపై దాడి జరిగిన ఘటనపై ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రాణహాని ఉంది.. మంచు మనోజ్
అయితే మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు. తన తండ్రి మోహన్ బాబు పేరు కూడా ఫిర్యాదులో ప్రస్తావించలేదు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారు. తాను ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి తమపై దాడి చేశారు అని ఫిర్యాదులో వెల్లడించారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో తనకు గాయాలైనట్లు పోలీసులకు తెలిపారు.
కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు..పహాడీ షరీఫ్ సీఐ గురువారెడ్డి
అయితే మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సీఐ గురువారెడ్డి వెల్లడించారు. డయల్ 100కు కాల్ రావడంతో తాము ఘటనాస్థలికి వెళ్లామని పహాడీ షరీఫ్ సీఐ తెలిపారు. ఘటనా స్థలంలో విజయ్ రెడ్డి, కిరణ్ అనే వ్యక్తులు సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారని.. ఈ ఘటనపై పూర్తిస్తాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment