విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. స్నేహితులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరగ్గా, బుధవారం (మార్చి 4) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
అతిథులు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి తదితరులు హాజరయ్యారు.
అలాగే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలకు చెందిన చిరంజీవి, నాగార్జున- అమల, వెంకటేశ్, రవితేజ, రామ్‌చరణ్- ఉపాసన, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని- అంజలి, రానా- మిహికా, కార్తీ, మహేశ్‌బాబు సతీమణి నమ్రత, కుమార్తె సితార, దర్శకుడు శేఖర్ కమ్ముల, సుకుమార్, ఆయన సతీమణి తబిత, నాగ్ అశ్విన్, నిర్మాత దిల్ రాజు, ఆయన సతీమణి వైఘా, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, నటి నీనా గుప్తా తదితరులు పాల్గొన్నారు.


