Virosh
-
హనీమూన్ కాదు బడ్డీమూన్.. నయా ట్రెండ్ సెట్ చేసిన విరోష్
ప్రస్తుతం దేశంలో ‘బడ్డీమూన్ ‘ ట్రెండ్ గణనీయంగా ప్రాచుర్యం పొందుతోంది. కేవలం జంట మాత్రమే కాకుండా, సన్నిహిత స్నేహితులను కూడా తమ హనీమూన్ లో చేర్చుకోవడం ద్వారా, పెళ్లి తర్వాత చేసే సాంప్రదాయ విహారయాత్రకు ఇది సరికొత్త రూపాన్ని ఇస్తోంది. ఇటీవలి కాలంలో ఊపందుకున్న ఈ ట్రెండ్‌కి స్టార్ కపుల్ విరోష్ జంట.. రష్మిక మందన్న విజయ్ దేవరకొండలు స్టార్ డమ్ తీసుకొచ్చారు.వీరు సాంప్రదాయ హనీమూన్ కు బదులుగా, థాయ్‌లాండ్‌లోని కో సముయ్‌లో ‘బడ్డీమూన్ ‘ను ఎంచుకోవడం ఒక్కసారిగా ఈ సరికొత్త ట్రెండ్‌కి ఊపుని అందించింది.బడ్డీమూన్ అంటే?పెళ్లి అంటే వధూవరులకు ఓ జీవితకాల జ్ఞాపకం పెళ్లి నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి పూర్తయే వరకూ అందులో బోలెడన్ని వేడుకలు, సంబరాలు ఇమిడి ఉంటాయి. అది వధూవరులకు అంతో ఇంతో అలసట కూడా అందించకమానదు. ఆ తర్వాత వారిద్దరే పూర్తి ఏకాంతంగా విశ్రాంతిగా గడపడానికి పుట్టుకొచ్చిన సంప్రదాయ యాత్రే హనీమూన్ . అయితే దీనికి బదులుగా, జంటలు తమ పెళ్లి తర్వాత ఆనందాన్ని పంచుకోవడానికి అత్యంత సన్నిహిత స్నేహితులను వెంట తీసుకువచ్చి, ‘ఎంచుకున్న కుటుంబం‘ తో కలిసి చేసే విహార యాత్రకే ఇప్పుడు బడ్డీమూన్ గా నామకరణం చేశారు.ఎలా జరగుతుంది?దీనికి తాజా సెలబ్రిటీ జంట బడ్డీ మూన్ ను ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. తమ బడ్డీమూన్ కు సంబంధించి రష్మిక , విజయ్‌లు కొన్ని విశేషాలను పంచుకున్నారు. థాయ్‌ల్యాండ్‌లోని సముయ్‌లో బస చేసిన విల్లా కో కూన్ వేదిక గా అద్భుతమైన సముద్ర తీర దశ్యాలు, ఇన్ఫినిటీ పూల్, ప్రశాంతమైన వాతావరణాన్ని వీరు సన్నిహితులతో ఆనందంగా ఆస్వాదించారు. ఈ ట్రెండ్‌లో భాగంగా, ‘హౌస్ పార్టీ‘ వాతావరణం ఉంటుంది. , విందులు, వినోదాలు, పూల్ గేమ్స్ వంటి కార్యకలాపాల కోసం బడ్డీమూన్ బృందం ఒక పెద్ద, ప్రైవేట్ విల్లాను అద్దెకు తీసుకుంటారు.క్రేజ్‌కు కారణం ఇదే...పదులు, వందల సంఖ్యలో బంధుమిత్రులతో సందడి గా గడిపిన పెళ్లి వేడుక పూర్తయిన వెంటనే అకస్మాత్తుగా పూర్తి నిశ్శబ్దానికి మారడాన్ని నవతరం అంతగా ఇష్టపడడం లేదు. పెళ్లి తర్వాత వచ్చే ‘బ్లూస్‘ (స్తబ్ధత) ను వీరు నివారించాలనుకుంటున్నారు. స్నేహితులతో కలిసి ‘డీలాక్‘ (ఒత్తిడిని తగ్గించుకోవడం) చేయడానికి ఇది ఒక మార్గంగా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా పెళ్లి హడావుడిలో బాగా దగ్గరి బంధువులు, స్నేహితులతో రిలాక్స్డ్గా గడపడం సాధ్యం కాదు. దాంతో పెళ్లి తర్వాత ఆ లోటును తీర్చుకోవాలని భావించే జంటలు ఈ ట్రెండ్‌ను ఎంచుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాలలో బస ఏర్పాట్లు చూసే ఎయిర్బర్బ్ అనే కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతీయ వినియోగదారులు ఇప్పుడు గ్రూప్ బుకింగ్‌లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇది సామూహిక ప్రయాణ అనుభవాల వైపు జరుగుతున్న మార్పును సూచిస్తోంది. ఈ పెరిగిన బుకింగ్స్‌లో పెళ్లి తర్వాత స్నేహితులతో ’బడ్డీమూన్స్ ’ కూడా ఉన్నాయి.ఉపసంహారం...ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ మొదటి విహారయాత్ర కోసం ఇలాంటి ట్రిప్‌ను ఎందుకు ఎంచుకున్నారో రష్మిక విజయ్ వెల్లడించారు. ‘‘సన్నిహితులతో ఒకే చోట ఉండడం వల్ల సరదాగా గడిపాం ఆటలు పాటలతో పాటు పూల్‌లో ఎంజాయ్ చేశాం. సూర్యోదయాలు, సూర్యాస్తమయాన్ని చూశాము, మంచి రుచులను చవిచూశాం. మరియు స్థానిక సంస్కతిని మరింత వాస్తవికంగా, అనుభవించాం ఇది కేవలం సందర్శించడంలామాత్రమే కాదు ఆ ప్రదేశంలో జీవిస్తున్నట్లు అనిపించేలా చేసింది’’ అన్నారు.ఒక బంధం గా ఉండటం వల్ల ఆ ప్రదేశంతో మరింత లోతుగా మమేకమవ్వడానికి సహాయపడిందన్నారు. ఈ తరహా ఆలోచనలు మరిన్ని జంటలకు స్ఫూర్తిని అందిస్తే.. హనీమూన్ స్థానంలో బడ్డీ మూన్ ఓ సంప్రదాయంగా స్థిరపడినా ఆశ్చర్యం లేదు. -
అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)
-
మాట నిలబెట్టుకున్న విజయ్.. చిన్నారిని ఇంటికి పిలిచి మరీ..
పెళ్లంటే ఇలా ఉండాలి అన్నంత అద్భుతంగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. వైభవంగా పెళ్లిదేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తామని ప్రకటించాడు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్ల పంపిణీ కూడా చేశారు. హైదరాబాద్‌లో మార్చి 4న గ్రాండ్‌గా రిసెప్షన్ జరుపుకున్నారు. అయితే ఇంత గొప్పగా పెళ్లి చేసుకున్న విరోష్ జోడీ తననెందుకు పిలవలేదని ఓ చిన్నారి అలిగింది. లడ్డూలు ఇవ్వొచ్చు కదా!నేను కూడా విజయ్‌కు అభిమానినే కదా.. నన్ను కూడా పెళ్లికి పిలవచ్చు కదా.. లడ్డూలు ఇవ్వొచ్చు కదా.. అంటూ క్యూట్‌గా రిక్వెస్ట్ చేసింది. ఇంకేముంది, ఆ వీడియో రౌడీబాయ్ కంటపడింది. బుజ్జితల్లి.. మా ఇంటికి రా.. నీకు నచ్చిన ఫుడ్, స్వీట్స్.. అన్నీ ఇంట్లోనే నీకోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తా అన్నాడు. అనడమే కాదు చేసి చూపించాడు కూడా! విప్రేమతో ముద్దుల వర్షంరోష్ జోడీ ఆ బుజ్జితల్లిని ఇంటికి పిలిచి తనకు నచ్చిన భోజనం వడ్డించారు. లడ్డూలు తినిపించారు. విజయ్ ఆ పాపను ఆప్యాయంగా ఎత్తుకుంటే రష్మిక తనపై ప్రేమతో ముద్దుల వర్షం కురిపించింది. ఇప్పటినుంచి మనం కూడా ఫ్రెండ్సే అంటూ పాపతో సంభాషించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మనం కూడా ఫ్రెండ్సేకదా.. అనుకుంటూనే మొత్తానికి సాధించావ్, విరోష్‌ను కలిశావ్ అంటూ జనం కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by urs lucky thalli 😍 (@urs_luckythalli) చదవండి: తెలుగు హీరోలని కొడతారెందుకు? ఎందుకంత కోపం? హీరోయిన్ ఆన్సరిదే! -
రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)
-
అలిగిన చిన్నారికి ఆహ్వానం భోజనానికి ఇంటికి పిలిచిన విజయ్
-
పెళ్లి వద్దన్నాడు, ఆరోజు బోరున ఏడ్చాడు: విజయ్ మేనమామ
చాలామంది పెళ్లంటేనే జంకుతారు. మ్యారేజ్ అనేది మాకు సెట్టవదు, దాని జోలికి వెళ్లమని బీరాలు పలుకుతారు. కానీ అందరికంటే ముందు వారే పెళ్లిపీటలెక్కుతారు. హీరో విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరిగింది. వివాహం అంటే నాలుగడుగులు వెనక్కు వేసే విజయ్ ఫిబ్రవరి 26న రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే గతంలో మాత్రం తనకు పెళ్లి సెట్ అవదని అంటుంటేవాడని విజయ్ మేనమామ, నటుడు, నిర్మాత యశ్ రంగినేని చెప్తున్నాడు.పెళ్లి వద్దని..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన విజయ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. యశ్ రంగినేని మాట్లాడుతూ.. విజయ్ పెళ్లి గురించి పాజిటివ్‌గా ఉండేవాడు కాదు. కెరీర్ చూసుకోకుండా పెళ్లి అవసరమా? అనేవాడు. కానీ, రష్మిక పరిచయమయ్యాక అతడి ఆలోచన విధానమే మారిపోయింది. డియర్ కామ్రేడ్ నుంచి విరోష్ (విజయ్- రష్మిక) మధ్య ప్రేమ మొదలైంది. ఇంట్లో చెప్పగానే..ఇప్పుడు వాళ్లిద్దరినీ జంటగా చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది. విరోష్ పెళ్లి పట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. విజయ్.. రష్మికతో ప్రేమలో ఉన్నానని చెప్పినప్పుడు ఇంట్లో కొంత కంగారుపడ్డారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక గొడవ(విడాకులు) జరుగుతూనే ఉంది. ఆ భయమైతే మా అందరిలో ఉంది. విజయ్ అమ్మానాన్న ఈ విషయం గురించి మాట్లాడారు. కానీ రష్మిక చాలా మంచి అమ్మాయి. తలరాత చెప్పలేంఈ జంటను చూస్తే తర్వాతెలా ఉంటారో? ఏంటో? అన్న అనుమానమే రాదు. వాళ్లిద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది. జంటగా సంతోషంగా ఉన్నారు. కానీ, తలరాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అయితే ఇద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలన్నదే మా అందరి కోరిక. విజయ్ను రౌడీ బాయ్‌లా చూస్తారు. కానీ తను చాలా ఎమోషనల్. టాక్సీవాలా రిలీజ్‌కు రెండురోజుల ముందే సినిమా మొత్తం లీకైంది. దుఃఖం ఆపుకోలేక..ఆ విషయం తెలిసి విజయ్ బోరున ఏడ్చాడు. ఇక రిలీజ్ చేయడం వృథా అనుకుంటున్న సమయంలో విజయ్ పోరాడి సినిమాను విడుదల చేయించాడు. తీరా అది పెద్ద హిట్టయింది. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎవరైనా ఏదైనా సాధించొచ్చు అని ఈ జనరేషన్‌కు ఒక నమ్మకాన్ని తీసుకొచ్చాడు అని యశ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ ఫోన్ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ -
'విజయ్ దేవరకొండ మామ.. రష్మిక అక్కా.. చిన్నారి క్యూట్ వీడియో'
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. గతనెల ఫిబ్రవరి 26న వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి తర్వాత ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంచిన ఈ జంట ప్రత్యేకంగా అన్నదానాలు నిర్వహించారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.అయితే ఓ చిన్నారి విజయ్ దేవరకొండకు అభిమానినని.. తనను ఎందుకు పెళ్లికి పిలవలేదని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన హీరో విజయ్.. బుజ్జి తల్లికి రిప్లై ఇచ్చాడు. మా ఇంటికి లంచ్‌కి వచ్చేయ్.. నీకిష్టమైన స్వీట్స్, ఫుడ్ ఇంట్లోనే చేయించి వడ్డిస్తానని చిన్నారికి బదులిచ్చాడు. ఇది చూసిన చిన్నారి నన్ను మీ ఇంటికి పిలిచినందుకు థ్యాంక్స్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేసింది. హాయ్ విజయ్ దేవరకొండ మామ.. రష్మిక అక్కా.. మీరు నాకు రిప్లై ఇచ్చి.. నన్ను ఇంటికి రమ్మని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.. బై బై అంటూ క్యూట్‌గా మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నన్ను ఇంటికి పిలిచినందుకు @TheDeverakonda మామకు & @iamRashmika కు థాంక్స్ #ViRoshWeddinghttps://t.co/Bgm2voxks6 pic.twitter.com/Ipv5Qg4hz1— greatandhra (@greatandhranews) March 8, 2026 -
బుజ్జి అభిమానిని సర్ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల పెళ్లి కొద్దిరోజుల క్రితం జరిగింది. వారి పెళ్లిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్వీట్స్ పంచడంతో పాటు పలు దేవాలయాల్లో అన్నదానం చేసి నెటిజన్ల చేత ప్రశంసలు అందుకున్నారు. ప్యాన్స్ కోసం ఒక స్టార్ హోటల్లో విందు ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే, ఒక చిన్నారి విరోష్ జోడీపై అలిగి వీడియో చేసింది. తాను కూడా విజయ్‌కు పెద్ద అభిమానినే కదా పెళ్లికి పిలవచ్చు కదా.. ఎందుకు పిలువలేదు. లడ్డూలు ఇవ్వచ్చు కదా అంటూ ఎంతో క్యూట్‌గా వీడియోతో రిక్వెస్ట్ చేసింది. విజయ్ నుంచి పిలుపువిజయ్ దేవరకొండపై అభిమానంతో ఆ చిన్నారి చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఏకంగా పది మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా రౌడీబాయ్ విజయ్ రియాక్ట్ అయ్యారు. తన వీడియో కింద కామెంట్ చేసి సర్ప్రైజ్ చేశారు. 'బుజ్జి తల్లి మా ఇంటికి రండి. మీకు నచ్చిన ఫుడ్, స్వీట్స్ ఎంటో నాకు చెప్పు. నీ కోసం ప్రత్యేకంగా ఇంట్లోనే చేపిస్తాను. ఇద్దరం కలిసి ఇక్కడే లంచ్ చేద్దాం.' అంటూ విజయ్ రిప్లై ఇచ్చారు. View this post on Instagram A post shared by urs lucky thalli 😍 (@urs_luckythalli) -
విరోష్ జంట రిసెప్షన్లో కనిపించని ఆ టాలీవుడ్ స్టార్స్.. అదే కారణమా?
విజయ్- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ ప్రేమజంట ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సందడి చేశారు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను విజయ్, రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే పెళ్లి తర్వాత విరోష్ జోడీ టాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించింది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు యంగ్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.స్టార్స్ డుమ్మా..అయితే కొందరు స్టార్స్ ఈ రిసెప్షన్ వేడుకకు డుమ్మా కొట్టడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ, రామ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నితిన్, కిరణ్ అబ్బవరం ఈ రిసెప్షన్లో ఎక్కడా కూడా కనిపించలేదు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు పెద్దగా బాండింగ్ లేకపోవడం వల్లే రాదని తెలుస్తోంది. మరోవైపు హీరో నితిన్ అందుబాటులో లేనని కొత్త జంటకు ముందే చెప్పినట్లు సమాచారం.అదే కారణమా?కొందరు టాలీవుడ్ స్టార్స్ విరోష్ రిసెప్షన్‌కు హాజరు కాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజయ్- రష్మిక స్వయంగా వెళ్లి ఆహ్వానించకోవపోవడమే కారణమని తెలుస్తోంది. పీఆర్ ఎజెన్సీ ద్వారా ఆహ్వానాలు పంపడం వల్లే కొందరు రాలేదని టాక్ వినిపిస్తోంది. పర్సనల్‌గా ఆహ్వానించలేదనే అసంతృప్తితోనే ఈ వేడుకలో పాల్గొనలేదని తెలుస్తోంది. ఏదేమైనా టాలీవుడ్ స్టార్స్ ఈ రిసెప్షన్‌కు రాకపోవడం సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది. -
విరోష్ రిసెప్షన్లో రాజకీయ నాయకులు
-
విజయ్, రష్మికల పెళ్లి ఖర్చు ఎంతంటే..?
టాలీవుడ్ కొత్తజంట విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారనేది సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లితో ఒక్కటైన ఈ జంట దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అతికొద్దిమంది సమక్షంలో పెళ్లి జరిగినప్పటికీ ఖర్చు భారీగానే అయినట్లు తెలుస్తోంది. సుమారు వారం రోజుల పాటు జరిగిన వీరి వివాహం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగింది.ఉదయ్‌పూర్‌లోనే అత్యధికంగా వారిద్దరూ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విజయ్ సొంతూరులో సత్యనారాయణ వ్రతంతో పాటు గ్రామస్తులకు గ్రాండ్‌గా విందు ఏర్పాట్లు.. సంగీత్ కార్యక్రమం, అభిమానులకు విందు, దేశవ్యాప్తంగా స్వీట్స్ పంపిణీ, పలు దేవాలయాల్లో అన్నదానం, చివరిగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వంటి కార్యక్రమాలు ప్రధానంగా ఉన్నాయి. దీంతో భారీగానే ఖర్చు అయినట్లు టాక్.విజయ్, రష్మికల పెళ్లి కోసం సుమారు రూ. 15 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దేశంలోనే ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి పెళ్లి బాధ్యతను అప్పజెప్పారట. అయితే ఏ కార్యక్రమం ఎలా జరగాలనేది విజయ్ పక్కా ప్లాన్‌తో వారికి వివరించారట. అయితే, ఈ ఖర్చును కూడా విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కలిసి భరించారని తెలుస్తోంది. పెళ్లి కోసం సుమారు 3కేజీల బంగారం వారు కొనుగోలు చేసినట్లు టాక్ ఉంది. అయితే, వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేయనుంది. అందుకోసం వీరిద్దరికి ఆ ఓటీటీ సంస్థ సుమారు రూ. 60కోట్లు చెల్లించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రకంగా వారికి రూ. 45కోట్ల వరకు లాభం వచ్చినట్లు అవుతుంది. పెళ్లితో ఎవరికైనా ఖర్చు అవుతుంది. కానీ, ఈ జోడీ మాత్రం తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ను పెంచుకుంది. -
స్వగ్రామంలో విజయ్.. ఎమోషనల్ ఫోటో షేర్ చేసిన మేనమామ
లక్షలమంది అభిమానులు, వేలమంది స్నేహితుల ఆశీస్సుల మధ్య విరోష్ జోడీ తమ వివాహాన్ని కనులవిందుగా చేసుకుంది. గత నెల 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లితో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక చాలామందికి ఆదర్శంగా నిలిచారు. మార్చి 1న దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్ల పంపిణీతో పాటు కొన్ని ఆలయాల్లో అన్నదానం చేసిన ఈ జంట చాలామంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచారు. ఆపై హైదరాబాద్‌లో తన ఫ్యాన్స్‌కు ప్రత్యేక విందు ఇచ్చింది.వివాహానంతరం సతీమణి రష్మిక మందన్నతో స్వగ్రామానికి విజయ్ తిరిగొచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని తుమ్మన్‌పేటకు చెందిన దేవరకొండ మాధవి, గోవర్ధన్రావుల మొదటి సంతానం విజయ్ దేవరకొండ అని తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అక్కడ ఆయన సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకుని తమ గ్రామప్రజలకు ఘనంగా విందు ఏర్పాటు చేశారు.సత్యనారాయణ వ్రతం తర్వాత విజయ్ తన గ్రాండ్ పేరంట్స్(నానమ్మ-తాతయ్య) సమాధుల వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను విజయ్‌కి మేనమామ, స్నేహితుడు, నిర్మాత యష్ రంగినేని సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. "ప్రపంచం ఆడంబరాన్ని చూస్తుంది. నేను వినయాన్ని చూస్తున్నాను . ఎంత ఎత్తుకు ఎదిగినా సరే తన మూలాలను మరిచిపోలేదు. అతను సాధించిన విజయాల చప్పట్లకు అతీతంగా.. అతను గొప్ప విలువలతో పాతుకుపోయాడు. తల వంచి తన పూర్వీకుల ఆశీర్వాదం కోరుకోవడానికి మా గ్రామానికి తిరిగి వచ్చాడు." అని యష్ రంగినేని రాసుకొచ్చారు.యశ్ రంగినేని ఎవరో తెలుసా..యశ్ రంగినేని నిర్మాతగా టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రానీ నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి. View this post on Instagram A post shared by Yash Rangineni (@yashrangineni) -
విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్
-
Virosh Reception: ఘనంగా ‘విరోష్’ వెడ్డింగ్ రిసెప్షన్
విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. స్నేహితులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరగ్గా, బుధవారం (మార్చి 4) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అతిథులుతెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి తదితరులు హాజరయ్యారు.అలాగే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలకు చెందిన చిరంజీవి, నాగార్జున- అమల, వెంకటేశ్, రవితేజ, రామ్‌చరణ్- ఉపాసన, అల్లు అర్జున్, నాగచైతన్య, నాని- అంజలి, రానా- మిహికా, కార్తీ, మహేశ్‌బాబు సతీమణి నమ్రత, కుమార్తె సితార, దర్శకుడు శేఖర్ కమ్ముల, సుకుమార్, ఆయన సతీమణి తబిత, నాగ్ అశ్విన్, నిర్మాత దిల్ రాజు, ఆయన సతీమణి వైఘా, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, నటి నీనా గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కోడలొచ్చింది.. మంచిగా చూసుకోండి: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ నేడు(మార్చి 4) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. అయితే ఈ విందు కంటే ముందే..తెలుగు మీడియాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన సతీమణి రష్మికతో కలిసి మీడియా ప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా విజయ్ మట్లాడుతూ.. తన కెరీర్లో మీడియా సహాకారం ఎంతో ఉందన్నారు.‘కెరీర్ ప్రారంభంలో నాకు మీడియా చాలా సపోర్ట్ చేసింది. నన్ను ప్రజల దగ్గరకు చేర్చేలా చేసింది మీడియాను. నా ప్రతి ఇంటర్వ్యూను తిరిగి చూసుకునేవాడిని. ఎలా మాట్లాడాను? ఇంకా ఎలా మట్లాడాలి?అనేది తెలుసుకునేవాడిని. ఇప్పుడు పెళ్లి చేసుకొని రష్మికతో కలిసి జంటగా మీ దగ్గరకు రావడం ఆనందంగా ఉంది. ఇదో విభిన్న అనుభూతి. కాలం గడిచిపోతోంది. మనం పెద్దవాళ్లం అయిపోతున్నాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ, మిమ్మల్ని మర్చిపోం. మీరు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు. తెలుగు మీడియా అనేది మా సొంత మీడియా. మీ ఆశీస్సులు మాకు కావాలి. తెలుగు రాష్ట్రాలకు ఒక కొత్త కోడలు వచ్చింది. మంచిగా చూసుకోండి’ అంటూ విజయ్ నవ్వులు పూయించాడు. కాగా, ఇప్పటికే విజయ్-రష్మిక జంట అభిమానుల కోసం ఓ ప్రత్యేక విందును ఇచ్చింది. అలాగే మార్చి 1న హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అహ్మదాబాద్‌తో సహా అనేక ఇతర ప్రధాన కేంద్రాలతో పాటు భారతదేశంలోని 23 నగరాల్లో వేలాది స్వీట్ బాక్స్‌లు పంపిణీ చేశారు.కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలోని పదహారు దేవాలయాలలో ‘అన్నదానం‘ నిర్వహించారు. వీటిలో బెంగళూరులోని శివోహం ఆలయం, బృందావనంలోని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్ వంటివి ఉన్నాయి. ఇక ఈ రోజు సాయంత్రం జరగనున్న రిసెప్షన్ పార్టీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. -
విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పుర్ వేదికగా ఈ శుభకార్యం జరిగింది. అనంతరం సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు నూతన గృహప్రవేశం కూడా చేశారు. తర్వాత గ్రామ ప్రజలందరికీ భోజనాలు కూడా విజయ్ పెట్టించాడు. ఈ సందర్భంగానే తన నియోజకవర్గంలలోని 9,10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తాం, తమ్ముడు ఆనంద్ పెళ్లి ఇక్కడే చేస్తామని తదితర విషయాలు పంచుకున్నాడు. ఇప్పుడు తమ ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో విజయ్ బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)సొంతూరి నుంచి తిరిగి హైదరాబాద్‌కి వచ్చేసిన విజయ్-రష్మిక.. ఈ రోజు(మార్చి 04) సాయంత్రం సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఇచ్చే రిసెప్షన్లో పాల్గొనున్నారు. అంతకు ముందు అనగా మంగళవారం దాదాపు 200 మంది అభిమానులతో కలిసి బంతి భోజనం చేశారు. ఈ సందర్భంగానే పలు విషయాలు మాట్లాడారు. విజయ్ మాట్లాడుతూ.. 'గీతగోవిందం' చేస్తున్నప్పుడు తాము స్నేహితులు మాత్రమేనని, 'డియర్ కామ్రేడ్' చేస్తున్న టైంలో తమ మధ్య ప్రేమ పుట్టిందని, తర్వాత కొన్నాళ్లకు రష్మికనే తనకు లవ్ ప్రపోజ్ చేసిందని విజయ్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక.. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'గీతగోవిందం'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. 'డియర్ కామ్రేడ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ చాలామంది విరోష్ ఫ్యాన్స్‌కి ఇది ఫేవరెట్. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ప్రస్తుతం 'రణబాలి'లో వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోతున్న మూవీ ఇదే. ఈ ఏడాది సెప్టెంబరు 11న పాన్ ఇండియా రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో తీస్తున్నారు.(ఇదీ చదవండి: విరోష్... సెలబ్రిటీ పెళ్లిళ్లలో ట్రెండ్ సెట్టర్..)Star couple #VijayDeverakonda and #Rashmika arranged banthi bojanalu for 200 of their fans.Served them and had lunch together.👌A special day for all🫶🏽#Virosh pic.twitter.com/ZGUPWMdY5o— Suresh PRO (@SureshPRO_) March 3, 2026 -
విరోష్... సెలబ్రిటీ పెళ్లిళ్లలో ట్రెండ్ సెట్టర్..
ఈ సంవత్సరంలో టాప్ హై ప్రొఫైల్ సెలబ్రిటీ ఈవెంట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక ల వివాహం ‘ విరోష్’ను సినీ పండితులు అభివర్ణిస్తున్నారు అయితే అంతకు మించి విరోష్ అర్థవంతమైన వేడుకగా కూడా నిలుస్తోంది. ఇది సెలబ్రిటీ వేడుకలలో మనం ఇకపై చూడబోయే సరికొత్త సంప్రదాయాలకు నాందిగా మారనుంది.స్టార్స్‌లో అరుదుగా కనిపించే మానవత్వాన్ని ప్రదర్శించిన ఈ జంట తమ ఆనందాన్ని ప్రైవేట్ ఉత్సవాలకు మించి విస్తరించారు, తమ ప్రయాణంలో తమకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరితో తమ ఆనందాన్ని పంచుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. పెళ్లి చేసుకున్న నవదంపతులకు అందరూ కానుకలు ఇవ్వడం రివాజు. అయితే దీనికి భిన్నంగా ఈ జంట... నిరుపేదలకు తామే కానుకలు పంచి మనసులు గెలుచుకున్నారు.నోరు తీపి చేశారు..గత మార్చి 1న, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అహ్మదాబాద్‌తో సహా అనేక ఇతర ప్రధాన కేంద్రాలతో పాటు భారతదేశంలోని 23 నగరాల్లో వేలాది స్వీట్ బాక్స్‌లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించబడిన కస్టమ్–డిజైన్డ్∙కవర్లతో ప్యాక్ చేసిన స్వీట్ బాక్స్‌లు, కీలకమైన నగరాల మీదుగా అందంగా అలంకరించిన ట్రక్కుల ద్వారా పంపిణీ చేశారు, ప్రత్యేకంగా రూపొందించిన ‘‘వి అండ్ ఆర్’ ’ టీ–షర్టులు టోపీలు ధరించిన ఆన్–గ్రౌండ్ బృందాలు ప్రజలకు వ్యక్తిగతంగా స్వీట్లు అందించాయి, ఇది ఓ ప్రైవేట్ వేడుక ను పబ్లిక్ ఫెస్టివల్‌గా మార్చింది. అంతేకాకుండా ప్రతి స్వీట్ బాక్స్‌లో క్యుఆర్ కోడ్ ఏర్పాటు చేశారు, దీనిని స్కాన్ చేసి నేరుగా నవదంపతులకు ఆశీర్వాదాలు కూడా పంపవచ్చు.ఆలయాల్లో... అన్నదానం...అదే సమయంలో, అన్నదానం – ఆహారాన్ని పవిత్రంగా సమర్పించడం – భారతదేశంలోని అనేక దేవాలయాలలో నిర్వహిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సేవ... ఆ దేవుళ్ల ఆశీర్వాదాలను కోరుతూనే తమ వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే రష్మిక విజయ్ ల ఉద్దేశ్యాన్ని నొక్కి చెబుతుంది, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలోని పదహారు దేవాలయాలలో ‘అన్నదానం‘ నిర్వహించారు. వీటిలో బెంగళూరులోని శివోహం ఆలయం, బృందావనంలోని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్ వంటివి ఉన్నాయి.తమ వివాహాన్ని ఒక ఖరీదైన వేదికకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు విస్తరించడం ద్వారా, ప్రముఖుల వివాహ వేడుక అర్ధాన్ని ఈ జంట పునర్నిర్వచించారు. ఇది కేవలం ఇద్దరు తారల మధ్య కలయిక మాత్రమే కాదు, సామూహిక ఆనందంతో మేళవించిన జాతీయ అనుభవంగా మార్చారు. నేషనల్ క్రష్ అనే బిరుదును ఆనందించడం మాత్రమే కాదు ఆ స్థాయి ఇచ్చిన వాళ్లను గుర్తుంచుకోవడం కూడా తనకు తెలుసని విజయ్ తోడుగా రష్మిక తెలియజెప్పారు. ‘ఈ దేశంలోని అందరు అందమైన ప్రజలకు, మీరు ఎల్లప్పుడూ మా ప్రయాణాలలో మా ప్రేమలో భాగమయ్యారు. మీ అందరికీ సన్నిహితంగా మా వివాహాన్ని జరుపుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంటుంది’’ అంటూ వీరు సోషల్ మీడియాలో ఇచ్చిన తమ వివాహ ప్రకటన రికార్డులను బద్దలు కొట్టింది, ఆసియాలో అత్యధికులు లైక్ చేసిన పోస్ట్‌గా విరాట్ కోహ్లీ గత రికార్డును అధిగమించింది.విద్యాదానం...తెలంగాణలోని తుమ్మన పేటలో విద్యార్థుల కోసం స్కాలర్షిప్లను ఈ విరోష్ జంట ప్రకటించారు. పెళ్లి తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్లోని విజయ్ స్వస్థలాన్ని ఈ జంట సందర్శించారు, నిరుపేదలకు విద్యాదానం చేయడానికి తమ వంతు సాయం అందించారు.దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించిన ఈ స్కాలర్షిప్లు, ఈ ప్రాంతంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న టీనేజర్లకు సహాయం చేయడం వారి చదువును కొనసాగించడానికి ప్రోత్సహించడం, ముఖ్యంగా వారు కీలకమైన పాఠశాల పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు వారికి ఆసరాగా నిలవడం ఈ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యం.తరచుగా ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామాభివృద్ధి కోసం తమ వంతు సాయం చేస్తామ ని ఈ సందర్భంగా ఈ జంట జనం సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. స్కాలర్షిప్ కార్యక్రమం ప్రత్యేకతలను వివరిస్తూ, విజయ్ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు జనంలో నుంచి వచ్చిన హర్షాతిరేకాలకు విజయ్ దేవరకొండ తల్లి మాధవి పొంగిపోయారు. మరి ఇది కదా పుత్రోత్సాహం అంటే... మార్చి 4న హైదరాబాద్‌లో ఈ జంట రిసెప్షన్ వేడుక నిర్వహించనుంది. మరోవైపు సెప్టెంబర్‌లో విడుదల కానున్న ’రణబాలి’ చిత్రంలో రష్మిక విజయ్ ఇద్దరూ కలిసి కనిపించనున్నారు. గీత గోవిందం తర్వాత ఇది వారి మూడవ చిత్రం కాగా పెళ్లి తర్వాత వీరు కలిసి నటించిన తొలి చిత్రం కానుంది. తారలంటే తెరమీద నుంచి ఆనందం పంచేవారు మాత్రమే కాదు తమను ఆదరించిన సమాజానికి కృతజ్ఞత పంచేవారు కూడా అని నిరూపించిన వీరిద్దరికీ ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని ఉండాలని కోరుకుందాం. -
పెళ్లిలో హైలైట్... రష్మిక నగలు!
-
సొంతూరులో సత్యనారాయణ స్వామి వ్రతం.. విజయ్, రష్మిక స్పెషల్ (ఫోటోలు)
-
సంగీత్ పార్టీలో విరోష్ జోడీ.. ఫోటోలు షేర్ చేసిన విజయ్ (ఫోటోలు)
-
విజయ్ సొంతూరుకు 'విరోష్' జోడీ
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెద్దల అంగీకారంతో ఉదయ్‌పూర్‌లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత తొలిసారి సతీమణితో పాటుగా తన సొంతూరుకు విజయ్ చేరుకున్నారు. దీంతో భారీగా అభిమానులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. తెలంగాణలోని మారుమూల గ్రామంలో జన్మించిన విజయ్ స్వశక్తితో ఎదిగి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపుని సాధించారు. తనకు ఇష్టమైన రష్మికని సినిమానే దగ్గర చేసింది. తమకు అభిమానులు పెట్టిన ‘విరోష్’ ట్యాగ్‌నే వివాహ వేడుకకి పేరుగా పెట్టుకుని వారికి ప్రథమ స్థానం ఇచ్చారు. అంతటితో ఆగని ఈ జంట దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు పంపిణీ చేసి ఫ్యాన్స్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఇప్పుడు వివాహ అనంతరం సొంత ఊరుకు తొలిసారి జంటగా చేరుకోవడంతో అక్కడ సందడి వాతావారణం నెలకొంది.విజయ్ దేవరకొండ స్వస్థలం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం తుమ్మనపేట. తన వివాహం తర్వాత తొలిసారి సతీమణి రష్మికతో సొంతూరు రావడంతో తన చిన్ననాటి స్నేహితులు అందరూ చేరుకున్నారు. నేడు (మార్చి 2న) తుమ్మనపేటలోని ఆయన ఫామ్ హౌస్‌లో సత్యనారాయణ వ్రతం జరిపించనున్నారు. ఇప్పటికే సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. విజయ్ అనుకుంటే హైదరాబాద్‌లోనే ఈ కార్యక్రమం జరిపించవచ్చు. కానీ, తన సొంతూరు గ్రామ ప్రజల సమక్షంలో ఈ వేడుక జరగాలని ఆయన కోరుకున్నట్లు తెలుస్తోంది. (వీడియో క్రెడిట్ — Telugu Scribe)స్వగ్రామానికి చేరుకున్న విజయ్ దేవరకొండ దంపతులునాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేట గ్రామానికి చేరుకున్న నవదంపతులు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్ననూతన ఫామ్ హౌస్‌లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్న నవ దంపతులు https://t.co/GUBdsVIVLA pic.twitter.com/9GRJBql2Uu— Telugu Scribe (@TeluguScribe) March 2, 2026 -
విజయ్ పెళ్లిలో ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ అట్రాక్షన్ (ఫోటోలు)
-
ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్' జోడీ (ఫొటోలు)
-
హైదరాబాద్‌కు విజయ్– రష్మిక.. తొలిసారి జంటగా (వీడియో)
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్‌కు రానున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న తర్వాత తొలిసారిగా కలిసి కనిపించారు. తాజాగా ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.పెళ్లికి ముందు కూడా వారిద్దరూ కలిసి ప్రయాణం చేసినప్పటికీ వేర్వేరుగా ప్లాన్ చేసుకునేవారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, ఇప్పుడు పెళ్లి తర్వాత ఒకరిచేయి మరోకరు పట్టుకుని సంతోషంగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇలా వారిద్దరూ కలిసి కనిపించడంతో ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
రికార్డ్ క్రియేట్ చేసిన విజయ్, రష్మిక పెళ్లి ఫోటో..
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో అతికొద్దిమంది సమక్షంలో ఒక్కటయ్యారు. విరోష్ పేరుతో తమ ఫ్యాన్స్ కోసం వారు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అయితే, తమ అభిమానులు ఈ జంటపై ప్రేమతో పాటు శుభాకాంక్షలు కురిపించారు. పెళ్లి ఫోటోలు సోషల్‌మీడియాలో సంచలనంగా మారాయి. మిలియన్ల కొద్ది లైక్స్‌తో రికార్డ్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్లో వీరి పెళ్లి ఫోటోకు అత్యధికంగా లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆ సందర్భంగా గతంలో వారు కూడా ఫోటోలు పంచుకున్నారు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ తమ పెళ్లి సమయంలో ఫోటోలు షేర్ చేస్తే 15.8 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఇదే రికార్డ్. కానీ, తాజాగా విరోష్ జోడీ 18.5 మిలియన్ల లైక్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ కూడా అవే ఫోటోలను షేర్ చేశారు. అక్కడ కూడా 15.2 మిలియన్ల లైక్స్ రావడం విశేషం. మరోసారి విజయ్- రష్మిక జోడీ తమ ఇమేజ్ను చిత్రపరిశ్రమకు చూపారని ఫ్యాన్స్ అంటున్నారు.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రణబాలి సినిమాలో నటిస్తున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ‘టాక్సీవాలా’ విజయం తర్వాత మరోసారి విజయ్‌తో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే ఏడాది సెప్టెంబర్ 11న ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
మండపంలో విరోష్ ఆనందభాష్పాలు.. కల్యాణి పోస్ట్
గతకొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విజయ్ దేవరకొడ- రష్మిక మందన్నా జంట మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని మెమొంటోస్ ప్యాలెస్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ పెళ్లి సెలబ్రేషన్స్‌కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.ఇది నా అదృష్టంవారిలో మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. విరోష్ (విజయ్-రష్మిక జంటను ఫ్యాన్స్ ముద్దుగా విరోష్ అనే పిల్చుకుంటారు) జంట పెళ్లి చూడటం తన అదృష్టమంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఎంతో మంచి మనసున్న అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన మధుర క్షణాలను కళ్లారా చూశాను. ఆమె అతడివైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు అతడు స్తబ్ధుగా కూర్చుని ఆ శబ్ధాన్ని వింటున్నాడు.ఆనంద భాష్పాలుఆమె అలా మండం వైపు వస్తుంటే ఇద్దరి కళ్లలో కనిపించిన ఆనంద భాష్పాలు వారి మధ్య ప్రేమను తెలియజేస్తున్నాయి. డీప్ ఫ్రెండ్షిప్, పరస్పర గౌరవంతో ఒక్కటైన ఈ జంటను ఇలా చూడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. రష్మిక- విజయ్‌కు ఇది మరో అందమైన ప్రారంభం అని రాసుకొచ్చింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇద్దరూ ఎంత చదువుకున్నారంటే? -
పెళ్లి తర్వాత మోదీ, అమిత్ షాలను కలిసిన 'విరోష్' జోడీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా సరే ‘విరోష్’ జోడీ పేరుతో వారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిన్న ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిన విషయం తెలసిందే. అయితే, మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్‌కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షాను విజయ్, రష్మిక ఆహ్వానించారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నూతన దంపతులు కలిసి అహ్వానం అందించారు. ఇప్పటికే వారిద్దరికీ శుభాంకాక్షలు చెబుతూ మోదీ ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగునుంది. ఈ రిసెప్షన్ కోసం ఇప్పటికే పలువురు రాజకీయ సినీ వ్యాపారవేత్తలను విజయ్, రష్మిక ఆహ్వానించారు.‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి ఇప్పుడు భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు. -
పెళ్లి వేళ.. రష్మిక, విజయ్ విద్యార్హతలు వైరల్.. ఎవరెంత చదువుకున్నారు?
టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ, రష్మిక భార్యభర్తలయ్యారు. ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి ఫోటోలను అటు రష్మిక, ఇటు విజయ్ ఒకేసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో రష్మిక, విజయ్‌లకు సంబంధించిన మరో విషయంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారు? వీళ్ల ఎడ్యుకేషన్ ఎలా సాగింది? తదితర వివరాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.విజయ్ ఏం చదువుకున్నాడు?విజయ్ దేవరకొండ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అనంతపురం జిల్లా పుట్టపర్తిలోనే సాగింది. శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో బోర్డింగ్ విద్యార్థిగా తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న విజయ్, అబిడ్స్‌లోని భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుండి బీకాం (B.Com) డిగ్రీని పూర్తి చేశాడు. ఆ తర్వాత చదువు ఆపేసి.. ప్యాషన్ వైపు అడుగులు వేశాడు. థియేటర్ ఆర్ట్స్ ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు.చదువులోనూ రష్మిక ‘స్టారే’రష్మిక నటిగానే కాకుండా చదవులోనూ ‘స్టార్’గానే కొనసాగింది. ఆమె పాఠశాల విద్య మొత్తం కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఉన్నత చదువుల కోసం బెంగళూరు వెళ్లిన రష్మిక, అక్కడ ఎం.ఎస్. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. కేవలం ఒకే సబ్జెక్టులో కాకుండా, రష్మిక సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో ట్రిపుల్ మేజర్ డిగ్రీని పూర్తి చేయడం గమనార్హం.మొత్తంగా విజయ్, రష్మిక ఇద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ.. డిగ్రీల పరంగా చూస్తే మాత్రం విజయ్ కంటే రష్మికనే కాస్త ముందంజలో ఉంది. ఆమె సైకాలజీ, జర్నలిజం లాంటి కీలక రంగాలలో డిగ్రీ పట్టాపొందింది. -
వైభవంగా... ఆహ్లాదకరంగా విరోష్ వివాహం
‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి, ఫిబ్రవరి 26న ‘విరోష్’ (ఫ్యాన్స్ ఈ ఇద్దర్నీ అలానే పిలుస్తారు. తమ వివాహ వేడుకకు ఆ పేరునే పెట్టారు విజయ్–రష్మిక) భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది.ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా తమ పెళ్లి ఫొటోలను షేర్ చేసి, ఒకరిపట్ల మరొకరికి ఉన్న మమకారాన్ని, నమ్మకాన్ని, ఇష్టాన్ని పంచుకున్నారు.ప్రాణ స్నేహితురాల్ని భార్యను చేసుకున్నాను: విజయ్ ‘‘ఒక రోజు ఆమెను నేను మిస్ అయ్యాను... ఆమె పక్కన ఉండి ఉంటే ఈరోజు ఇంకా బాగుండేది కదా అన్నంతగా ఆమెని మిస్ అయ్యాను. ఒకవేళ ఆమె నా పక్కన కూర్చుని ఉంటే.. నా భోజనం ఇంకా పరిపూర్ణంగా అనిపించేది కదా అనిపించింది... అలాగే నాతో కలిసి ఆమె వర్కవుట్స్ చేస్తే అది పనిష్మెంట్లా కాకుండా ఫన్‌లా ఉండేది అనిపించింది. నా జీవితానికి ఆమె అవసరం అనిపించింది. నేను ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్న అనుభూతిని, ప్రశాంతతను ఇచ్చే ‘ఇల్లు’ అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నేను నా ప్రాణ స్నేహితురాల్ని నా భార్యను చేసుకున్నాను... 26.02.2026’’ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) విజ్జూ... మాటలు సరిపోవడం లేదు: రష్మికహాయ్ మై లవ్స్, ఇప్పుడు మీకు ‘నా భర్త’ని పరిచయం చేస్తున్నాను! మిస్టర్ విజయ్ దేవరకొండ!! నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి. ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి. ప్రతి రోజూ పెద్ద కలలు కనడం మంచిదే అనీ, ఆ కలను సాకారం చేసుకునే సామర్థ్యం నీకు ఉందని చెప్పిన వ్యక్తి. ఎవరూ నన్ను చూడడంలేదనుకుంటూ నేను డ్యాన్స్ చేస్తుంటే నన్ను ఆపని వ్యక్తి. అలాగే స్నేహితులతో ప్రయాణం చేయడం ఎంత బాగుంటుందో చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి... ఈ వ్యక్తి గురించి ఓ పుస్తకం రాయొచ్చు. నేను ఎలాంటి స్త్రీగా ఉండాలని కలలు కన్నానో అలా ఉండేలా నువ్వు నన్ను మార్చావు.విజ్జూ... నీ గురించి ఎప్పుడు ఏం చెప్పాలన్నా నాకు మాటలు సరిపోవు. నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం... ఇవన్నీ హఠాత్తుగా నాకు అర్థవంతంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నందుకు.... వీటన్నింటికీ సాక్ష్యంగా నువ్వు ఉన్నందుకు... నేను నీ భార్యను కావడం, నీ భార్యగా పిలవబడడం నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇది పూర్తిగాపార్టీ టైమ్. మనిద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యు. -
ఒక రోజు రష్మికను చాలా మిస్ అయ్యా.. పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ విజయ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, నేడు (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, తన లవ్‌స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. తను నా పక్కనే ఉంటే బాగుంటుందని, తను ఎదురుగా ఉంటే నేను తినే భోజనానికి ఒక అర్థం ఉంటుందని గ్రహించాను. జిమ్‌లో తను తోడుంటే ఆ కష్టం శిక్షలా కాకుండా సరదాగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మనశ్శాంతిని ఇచ్చే 'ఇల్లు' అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌నే నా భార్యగా చేసుకున్నాను’ అని విజయ్ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. అటు రష్మిక కూడా ‘నా భర్తను పరిచయం చేస్తున్నా’ అంటూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
గ్రాండ్‌గా విరోష్ పెళ్లి.. విజయ్ దేవరకొండకు భారీ కట్నకానుకలు?
టాలీవుడ్ పవర్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న చుట్టూ ఇప్పుడు భారీ హైప్ నడుస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లి ఈ రోజు(ఫిబ్రవరి 26) ఉదయం ఉదయపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో కట్న, కానులకు సంబంధించి పలు గాసిప్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ రష్మిక నుంచి భారీ కట్నం తీసుకుంటున్నాడనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ రూమర్స్ నిజమా? లేక ఓవర్ హైప్‌నా?విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య లింకప్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. 2025 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సీక్రెట్ ఎంగేజ్మెంట్ జరిగిందని సోర్సెస్ చెబుతున్నాయి. కానీ ఇద్దరూ ఓపెన్‌గా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు వెడ్డింగ్ హడావిడి బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ డీటైల్స్ నెటిజెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఒక హెరిటేజ్ ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ వెడ్డింగ్‌ను 'విరోష్ వెడ్డింగ్' అని పిలుస్తున్నారు . ఇక్కడ విరోష్ అంటే విజయ్ + రష్మిక = విరోష్ అని అర్ధం.ఇకపోతే వీళ్ళ పెళ్ళి వార్తల్లో మెయిన్ కాంట్రవర్సీ డౌరీ క్లెయిమ్స్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం, రష్మిక సైడ్ నుంచి విజయ్‌కు భారీ డౌరీ ఇస్తున్నారని... గోల్డ్, లగ్జరీ ప్రాపర్టీలు, ఇండియాలో హై-ఎండ్ హోమ్స్, కార్లు, క్యాష్ వంటివి ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని పోస్టుల్లో "150 కోట్ల డౌరీ" అని కూడా రాస్తున్నారు! ఇది 'బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్' అని, టాలీవుడ్లో ఎప్పుడూ లేనంత గ్రాండ్‌గా జరగబోతోందని ట్రెండ్ అవుతోంది.కానీ ఈ క్లెయిమ్స్ ఎంత వరకు నిజం? చాలా ముఖ్యంగా – ఇవన్నీ *అన్‌వెరిఫైడ్* అలాగే *వైరల్ రూమర్స్* మాత్రమే! విజయ్ లేదా రష్మిక ఎవరూ ఈ డౌరీ గురించి కాదు కదా కనీసం వాళ్ళ పెళ్ళి గురించి కూడా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డౌరీ అనేది చట్టవిరుద్ధం, ఈ రకమైన రూమర్స్ సెలబ్రిటీల చుట్టూ తరచూ వస్తాయి – కొన్ని ట్రోల్స్, కొన్ని ఫేక్ న్యూస్ కోసం. గతంలో కూడా ఫిబ్రవరి 2 లేదా ఇతర డేట్స్‌పై ఫేక్ వీడియోలు వచ్చాయి, కానీ అవి తప్పు అని తేలాయి.ఈ కట్నకానుకలతో పాటు ఇంకా కొన్ని హాట్ రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ వీళ్ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 260 కోట్లు కూడా ఆఫర్ చేసిందని, కానీ విజయ్ రిజెక్ట్ చేశాడని చెబుతున్నారు .ఎందుకంటే తమ వెడ్డింగ్ మెమరీస్ పర్సనల్ అని వాటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచడం తమకు ఇష్టంలేదని విజయ్ చెప్పాడట. అంతేకాదు ఈ పెళ్ళికి సంబంధించి సెక్యూరిటీ టీమ్ 3 వారాలు ట్రైనింగ్ తీసుకుందని, స్టార్ గెస్ట్స్ లిస్ట్ భారీగా ఉందని కూడా లీక్ అయ్యాయి. అయితే పెళ్లి గురించి అయితే కొంతవరకు ఓకే కాసీ డౌరీ లాంటి సెన్సిటివ్ టాపిక్స్‌పై కూడా రూమర్స్ వ్యాప్తి చేయడం మంచిది కాదు. -
విరోష్ జంట గొప్పమనసు.. వారికి ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు..!
ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన తరుణం రానే వచ్చింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న విరోష్ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్ దేవరకొండ. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విరోష్ జంట తమ గొప్పమనసు చాటుకున్నారు. వీరి పెళ్లిని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులకు స్వీట్ బాక్సులు అందించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న చిన్నపిల్లలకు సైతం స్వీట్స్ పంచారు. ఐటీసీ మెమొంటోస్ హోటల్ బయట ఉన్న వారి దగ్గరికి వచ్చిన ఈ ప్రత్యేక స్వీట్ బాక్సులు అందజేశారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #TFNExclusive A 'Sweet' gesture!❣️Team #VIROSH share joy with the media at Udaipur!!🤩✨#VijayDeverakonda #RashmikaMandanna #TeluguFilmNagar pic.twitter.com/6PryBXwsEp— Telugu FilmNagar (@telugufilmnagar) February 26, 2026 -
కొడవ సంప్రదాయంలో ‘విరోష్’ వివాహం.. పెళ్లి ప్రత్యేకతలు ఇవే!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం ఉదయం 10:10 గంటలకు రష్మిక మెడలో విజయ్ దేవరకొండ మూడుమూళ్లు వేశాడు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ ఈ పెళ్లికి వేదికగా మారింది. ఈ రోజు సాయంత్రం మరోసారి రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారు. తొలుత తెలుగు హిందూ పద్దతిలో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రష్మిక కుటుంబ మూలలను గౌరవిస్తూ కొడవ సంప్రదాయంలో వివాహం చేసుకోబోతున్నారు.కొడవ పెళ్లి ఎలా జరుగుతుంది?రష్మికది కర్ణాటకలోని కొడగు (కూర్గ్) ప్రాంతానికి చెందిన కొడవ సామాజిక వర్గం. అక్కడి వారి పెళ్లి సంప్రదాయ భారతీయ వివాహాలన్నింటిలోకి చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి తంతుని వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. ఈ పెళ్లిళ్లలో హిందూ సంప్రదాయాల్లో కనిపించే పురోహితులు (బ్రాహ్మణులు), అగ్ని సాక్షి (హోమం) వంటివి ఉండవు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుందట.పెళ్లి రోజు ఉదయం వధూవరులు తమ తమ ఇళ్లలో అభ్యంగన స్నానం చేసి, సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు'కుప్య' (నల్లని కోటు), 'చేలే' (నడుముకు కట్టే పట్టీ) మరియు 'పీచే కత్తి' (చిన్న కత్తి) ధరిస్తాడు. పెళ్లి కూతురు వెనుక వైపు కుచ్చెళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కొడవ చీరను ధరిస్తుంది.పెళ్లి వేదిక వద్దకు వరుడు వచ్చే ముందు, అడ్డుగా ఉన్న అరటి చెట్టు కాండాలను నరకడం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీక.వధూవరులు పెళ్లి పీటలపై కూర్చున్నప్పుడు, కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి వారిని ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఎటువంటి మంత్రాలు ఉండవు. కేవలం పెద్దల దీవెనలే ప్రధానం. వధువుకి ఒడి బియ్యానికి బదులు ఒక చిన్న నాణేల మూట అందిస్తారట.ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతం.పెళ్లి తర్వాత వధువు తన అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు గంగా పూజ జరుగుతుంది. వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకుంటారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించే ఆహ్లాదకరమైన ఘట్టం ఇది. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా, కొడవ పెళ్లిళ్లలో మాంసాహారం (ముఖ్యంగా పంది మాంసం), మద్యం తప్పనిసరిగా వడ్డిస్తారు.కొడవ భాష మాట్లాడుతూ.. తన సంప్రదాయ బట్టల్లో రష్మిక#RashmikaMandana #Virosh #VijayDevarakonda pic.twitter.com/ZNNrxCCYgl— Milagro Movies (@MilagroMovies) February 26, 2026 -
ఇద్దరి మధ్య 16 ఏళ్ల గ్యాప్.. రష్మిక చెల్లి గురించి తెలుసా?
హీరోయిన్ రష్మిక ఎట్టకేలకు హీరో విజయ్ దేవరకొండని పెళ్లాడింది. ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయంలో ఏడడుగులు వేశారు. ఈ రోజు సాయంత్రం రష్మికకు చెందిన కొడవ పద్ధతిలోనూ వివాహం జరగనుంది. సరే ఈ విషయాలు కాసేపు పక్కనబెడితే విజయ్ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలుసు. కానీ రష్మిక విషయానికొస్తే ఈమె కుటుంబం గురించి చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. మరీ ముఖ్యంగా రష్మిక చిట్టి చెల్లెలు ఎవరు? ఈమెకు ఆమెకు 16 ఏళ్ల గ్యాప్ అని తెలుసా?రష్మిక విషయానికొస్తే.. కర్ణాటకలోని విరాజీపేటలో 1995లో పుట్టింది. తండ్రి మదన్‌కి స్థానికంగా ఓ కాఫీ ఎస్టేట్, ఫంక్షన్ హాల్ ఉంది. తల్లి సుమన్ హౌస్ వైఫ్. రష్మికతో పాటు వీళ్లకు మరో కూతురు కూడా ఉంది. పేరు షిమన్. ఈ పాపకు ఇప్పుడు 14 ఏళ్లు. అంటే రష్మిక కంటే 16 ఏళ్లు చిన్నది. ప్రస్తుతం స్కూలింగ్ చేస్తోంది. ఇంతలా వయసు వ్యత్యాసం వల్ల షిమన్‌ని చెల్లిలా కంటే కూతురిలా చూసుకుంటున్నాని రష్మిక గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: #Virosh.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక)రష్మిక కాస్త పెద్దయ్యాక షిమన్ పుట్టింది. దీంతో తన చిట్టి చెల్లిల్ని ఎంతో గారాబంగా చూసుకోవాలని రష్మిక అనుకుంది. కానీ నటిగా మారి వరస సినిమాలు చేయడం వల్ల చెల్లితో గడపడమే రష్మికకు చాలా కష్టమైపోయింది. షిమన్‌ని చాలా మిస్ అవుతున్నాననే విషయాన్ని ఏ మాత్రం దాచుకోలేదు. చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని రష్మిక బయటపెట్టింది కూడా. ఇండస్ట్రీలోకి రావడంతో గత ఎనిమిదేళ్లుగా ఆమెతో(చెల్లి) ఉండలేకపోతున్నాను. పెరిగి పెద్దవడాన్ని చూడలేకపోతున్నాను. ఇప్పుడు నా అంత ఎత్తు ఎదిగిపోయింది. ఒక్కోసారి తనని కలవలేకపోతున్నానని ఏడ్చేసేదాన్ని అని రష్మిక చెప్పుకొచ్చింది.రష్మిక ఇంతలా పాన్ ఇండియా స్టారడమ్ అనుభవిస్తున్నప్పటికీ.. తన కుటుంబాన్ని ఎప్పుడు పెద్దగా మీడియా కంటపడనివ్వలేదు. ఈమె తల్లిదండ్రులు కూడా షిమన్‌ని సాధారణ పిల్లల్లానే పెంచాలనుకున్నారు. అందుకే తల్లిదండ్రులతో కలిసి షిమన్.. మైసూరులో ఉండగా.. రష్మిక మాత్రం వరస సినిమాలతో హైదరాబాద్, ముంబైకి తిరుగుతూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఇంట్లో వాలిపోయి చెల్లితో సరదాగా ఆడుకుంటుంది. ఆ ఫొటోల్ని కూడా పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!) -
#Virosh.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక
హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసేశాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ఉదయం 10:10 గంటలకు కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితుల నడుమ వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. ఇదే రోజు సాయంత్రం 4 గంటలకు కన్నడ(కొడవ) సంప్రదాయంలోనూ విజయ్-రష్మిక పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లిలో నో ఫేన్ నిబంధన కారణంగా ఫొటోలు ఇంకేం బయటకు రాలేదు. అధికారికంగా విజయ్-రష్మిక వాటిని పోస్ట్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండ.. తొలుత చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాలు మంచి పాపులారిటీ తీసుకొచ్చాయి. గీతగోవిందం మూవీలో తనతో పాటు కలిసి నటించిన రష్మికనే ఇప్పుడు విజయ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ డియర్ కామ్రేడ్ అనే మూవీ కూడా చేశారు. ప్రస్తుతం 'రణబాలి'లో చాన్నాళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు.రష్మిక విషయానికొస్తే కర్ణాటకలోని కొడుగు ప్రాంతానికి చెందిన అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేశ్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది. 'పుష్ప' దెబ్బకు ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీలో వరస సినిమాలు చేస్తూ రష్మిక బిజీగా ఉంది.విజయ్-రష్మిక చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ తమ బంధాన్ని అస్సలు బయటపెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్లు డేటింగ్, ట్రిప్స్ గురించి ఎప్పటికప్పుడు ఫొటోలు బయటకొస్తూనే ఉండేవి. ఇప్పుడు పెళ్లి బంధంతో దాన్ని అధికారికం చేసేశారు.(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్?) -
#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)
-
#Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ రష్మిక పెళ్లికి అంతా సిద్ధం. ఈరోజు(ఫిబ్రవరి 26) ఉదయం 10:10 గంటలకు విజయ్ మూడు మూళ్లు వేయనున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో మెమొంటోస్ హోటల్.. ఈ వివాహానికి వేదిక. ఇప్పటికే బారాత్ మొదలైపోయింది. ఉదయం తెలుగు సంప్రదాయంలో పెళ్లి జరగనుండగా.. సాయంత్రం 4 గంటల తర్వాత (కొడవ) కన్నడ సంప్రదాయంలో మరోసారి వివాహ తంతు జరగనుంది.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)ఇకపోతే బుధవారం సాయంత్రం హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా.. వేడుకకు వచ్చిన అతిధులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా వెళ్లింది. హల్దీకి సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది హల్దీ కాదని ముందే హోలీ వచ్చేసిందని చెప్పుకొచ్చింది. ఇదే పెళ్లి కోసం హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కూడా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్ స్టాలో పెట్టిన ఓ ఫొటో చూస్తే.. ఈమె కూడా హల్దీ వేడుకల్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది.ఇదే పెళ్లి కోసం డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా, టాలీవుడ్ స్టైలిష్ట్ శ్రావ్య వర్మ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదితరులు ఇప్పటికే ఉదయ్‌పుర్ చేరుకున్నారు. ఈ రోజు గానీ రేపు గానీ వాళ్లు కూడా సోషల్ మీడియాలో కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మికకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడతారు. ఫొటోలు కూడా రిలీజ్ చేయడం గ్యారంటీ. అలానే మార్చి 4న హైదారాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్?) -
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో ఫుల్‌గా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. విజయ్- రష్మిక ఈనెల 26న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆన్ స్క్రీన్‌లో ఇప్పటికే పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. రియల్ లైఫ్‌లోనూ వివాహం చేసుకోబోతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.ముహుర్తం ఫిక్స్..ఫిబ్రవరి 26న అంటే గురువారం విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి జరగనుంది. ఉదయం ఏడున్నర గంటలకు బరాత్ కార్యక్రమం ఉంటుందని సన్నిహితులు తెలిపారు. రేపు ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయే దేవరకొండ. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం జరగనుంది. అంటే రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ క్షణం కోసమే విజయ్- రష్మిక ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. -
విజయ్, రష్మిక సంగీత్ వీడియో వైరల్.. క్రికెట్ బ్యాట్‌పై పెళ్లి డేట్!
రష్మిక, విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాలలో పెళ్లి సందడి మొదలైంది. మోహందీ, సంగీత్ సందడి కూడా జరిగిపోయింది. సంగీత్‌లో విజయ్, రష్మిక కలిసి నటించిన చిత్రాల్లోని క్యూట్ ఫోటోలతో కలర్పుల్గా డెకరేషన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో అధికారికంగా షేర్ చేయాలని కోరుతూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దీంతో పాటు సంగీత్‌లో ఇరుకుటుంబ సభ్యులు సరదగా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ను కూడా సెలెబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోని విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. అందులో క్రికెట్ బ్యాట్, సిల్వర్ మెడల్‌పై ఫిబ్రవరి 26 అని రాసి పెళ్లిడేట్ని డిఫరెంట్‌గా ప్రకటించారు. From the #Virosh Premier league! #VijayDeverakonda pic.twitter.com/ghf7F7TMDF— Hourly Vijay Deverakonda (@HourlyDVS) February 24, 2026ఈ రోజు హల్దీ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇదే రోజు సాయంత్రం కొడవ స్టైల్లో మరోసారి విజయ్-రష్మిక వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. ఉదయ్‌పూర్‌లోని మెమెంటోస్ హోటల్ జరిగే ఈ పెళ్లికి కేవలం 100 మంది లోపే అతిథులు హాజరుకానున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షెన్ ఏర్పాటు చేశారు.We need those original pictures @iamRashmika please 🥹❤️❤️#ViRosh pic.twitter.com/uVx2O2gWLz— Rahul (@The_pathbreaker) February 24, 2026


