wedding reception
-
మాజీ ఎమ్మెల్యే తనయుడి రిసెప్షన్‌కు హాజరైన వైఎస్ జగన్
గుంటూరు: జిల్లాలోని తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ తనయుడు సత్యనారాయణ చౌదరి వివాహ రిసెప్షన్ కు మాజీ ముఖ్యమంత్రి,వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తెనాలి ఏఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో వధూవరులు మధువంతి, సత్యనారాయణ చౌదరిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్.వైఎస్ జగన్ రెడ్డి రాకతో భారీ స్థాయిలో అభిమానం సంద్రం తరలివచ్చింది. భారీ సంఖ్యలోవైఎస్సార్సీపీ కార్యకర్తలు , అభిమానులు నాయకులు తరలివచ్చారు. తెనాలిలో జగనన్న కారు వెంట పరిగెడుతు జగనన్నకు ఘనస్వాగతం పలికారు అభిమానులు. -
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడి వివాహా రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్
-
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహా రిసెప్షన్లో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత అవుతు సునీతారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమం గురువారం గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు శ్రీవల్లి, రవితేజరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. -
వివాహ రిసెప్షన్లో తండ్రి ప్రతిమ
సింగరేణి (కొత్తగూడెం): ఇంటిపెద్ద మృతి చెందితే చాలామంది ఇంట్లో ఫొటో ఏర్పాటుచేసి సరిపెట్టుకుంటారు. కానీ ఓ యువకుడు రూ.లక్షలు వెచ్చించి తన తండ్రి ప్రతిమ చేయించి సోదరి వివాహ రిసెప్షన్ వేదికపై ఏర్పాటుచేసి మమకారాన్ని చాటుకున్నాడు. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో ఐటీ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన పెరికం బాలరాజు 2019లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత ఆయన కుమార్తె స్నేహకు యాజమాన్యం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగావకాశం కల్పించింది. ఆమెకు శ్రీరాంపూర్ ఏరియాలో అండర్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అవినాష్ తో పెళ్లి కాగా.. కొత్తగూడెంలో శనివారం రాత్రి రిసెప్షన్ నిర్వహించారు. ఈమేరకు ముంబైలో రూ.4 లక్షల వ్యయంతో వీల్‌చైర్‌లో కూర్చున్న రూపంలో చేయించిన బాలరాజు విగ్రహాన్ని వేదికపై ఏర్పాటుచేయగా.. స్నేహ దంపతులతో పాటు ఆమె సోదరుడు, తల్లి ఫొటోలు దిగారు. తండ్రి జ్ఞాపకాలు పదిలంగా ఉండాలనే భావనతో విగ్రహాన్ని తయారుచేయించినట్లు కుటుంబీకులు తెలిపారు. -
గ్రాండ్ గా పీవీ సింధు రిసెప్షన్.. సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
నేడు సింధు వివాహ రిసెప్షన్... ప్రముఖులు హాజరయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, వెంకటదత్త సాయి వివాహ వేడుకల్లో భాగంగా నేడు మరో కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరగనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అన్వయ కన్వెన్షన్స్ వేదికగా మంగళవారం రిసెప్షన్ జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున క్రీడా, సినిమా, రాజకీయ రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి మొదలు సచిన్ టెండూల్కర్ తదితరులను సింధు ఆహ్వానించింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఆదివారం రాత్రి రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో సింధు పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితులైన కొందరు అతిథులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివాహానికి హాజరైన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ వధూవరులను ఆశీర్వదించారు. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు సహా పలు గొప్ప విజయాలతో భారత అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా సింధు గుర్తింపు తెచ్చుకోగా... పొసిడెక్స్ టెక్నాలజీస్ కంపెనీకి దత్తసాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. -
కర్నూల్లో జగన్ కోసం జన కోలాహలం (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత రిసెప్షన్లో మెరిసిన చైతూ - శోభిత.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మోడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరయ్యారు.తాజాగా వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి జంటగా కనిపించారు చైతూ- శోభిత. ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురి వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్లో జంటగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. #SobhitaDhulipala and #NagaChaitanya, who recently tied the knot, attend #AaliyahKashyap and #ShaneGregoire’s reception as newlyweds. ✨#FilmfareLens pic.twitter.com/P5Dw8fmqA4— Filmfare (@filmfare) December 11, 2024 -
'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ రిసెప్షన్.. హాజరైన నిహారిక (ఫొటోలు)
-
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా రిసెప్షన్ (ఫొటోలు)
-
రామజోగయ్య శాస్త్రి కొడుకు రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
గ్రాండ్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ వెడ్డింగ్ రిసెప్షన్.. ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమార్తె మాళవిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. జయరాం-పార్వతి ముద్దులక కూతురైన మాళివిక నవనీత్‌ను పెళ్లాడింది. వీరి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో త్రిసూర్‌లోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. అయితే తాజాగా వీరి వివాహా రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.కొచ్చిలోని ప్రముఖ హోటల్లో మాళవిక-నవనీత్ రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ సినీ తారలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవేడుకలో మమ్ముట్టి, దిలీప్, జాకీ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి, శోభన, ఖుష్బు సుందర్ లాంటి ప్రముఖల తారలందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. .@mammukka #yusufAli @PrithviOfficial #Supriya @ #Jayaram’s daughter Malavika’s wedding reception in Kochi pic.twitter.com/ff1VoT9mVk— sridevi sreedhar (@sridevisreedhar) May 5, 2024 -
శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు సీఎం జగన్
సాక్షి, తిరుపతి: శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తాజ్ హోటల్లో జరిగిన వేడుకలో వధువు నిరీష, వరుడు సాగర్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. వారిని ఆశీర్వదించారు. -
రణదీప్ హుడా , లిన్ లైష్రామ్ వివాహ రిసెప్షన్ లో మెరిసిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
-
Niharika Konidela: వరుణ్ - లావణ్య రిసెప్షన్.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిహారిక (ఫొటోలు)
-
VarunLav : వరుణ్‌తేజ్-లావణ్యల రిసెప్షన్లో సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్ (ఫోటోలు)
-
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చేరుకున్న సీఎంకు వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. చదవండి: ‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’ -
నిర్మాత పెళ్లిలో అల్లు అర్జున్ సందడి.. వెల్కమ్ చెప్పిన స్టార్ హీరోలు!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన.. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబయిలో జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్ అగ్ర హీరోలు, పలువురు సినీతారలు హాజరయ్యారు. ముఖ్యంగా అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ హీరోలు పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. జూన్ 11న కుటుంబసభ్యుల, అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట వివాహాబంధంలో ఒక్కటయ్యారు. ( ఇది చదవండి: రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నటి ప్రగతి) అయితే పెళ్లి తర్వాత జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో ఐకాన్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న బన్నీ అమీర్ ఖాన్, అల్లు అర్జున్‌తో కరచాలనం చేశారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బన్నీని చూసిన బాలీవుడ్ స్టార్స్ అప్యాయంగా పలకరించారు. ( ఇది చదవండి: తమన్నా ఏంటీ ఇలా?.. డబ్బుల కోసమే అలాంటి సీన్స్ చేస్తోందా?) View this post on Instagram A post shared by Pinkvilla (@pinkvilla) -
హీరో శర్వానంద్ రిసెప్షన్లో టాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి..(ఫొటోలు)
-
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శర్వానంద్ ఆహ్వానం (ఫొటోలు)
-
స్నేహితురాలి వివాహ రిసెప్షన్.. డాన్స్ చేస్తూ ఇంజినీర్ మృతి
తిరువొత్తియూరు: చైన్నె ముగప్పేర్‌లో తన స్నేహితురాలి వివాహ రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తున్న ఇంజినీర్ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. చైన్నెలోని తాంబరం, చిట్లపాక్కానికి చెందిన ఇంజినీర్ మణిప్రసాద్ (21) సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతను తాంబరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనితో అదే సంస్థలో పని చేస్తున్న స్నేహితురాలికి ముగప్పేర్ వెస్ట్ లోని కల్యాణ మండపంలో వివాహం జరిగింది. ఇందులో మణిప్రసాద్, ఆయనతో పాటు పనిచేసే స్నేహితులు పాల్గొన్నారు. రిసెప్షన్ జరిగినప్పుడు ఓ పాటకు మణిప్రసాద్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ స్ఫృహతప్పి పడిపోయాడు. షాక్‌కు గురైన అతని స్నేహితులు శ్యామ్, భరత్ మణిప్రసాద్ను కీల్పాకం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మణిప్రసాద్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. నొలంబూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: నెల్లూరు జిల్లా గూడూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కల్పలత కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో నూతన వధూవరులు డా.యోషితా మీనాక్షి, డా.నవీన్ రెడ్డిలను సీఎం ఆశీర్వదించారు. చదవండి: వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి -
వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తిరువొత్తియూరు: స్నేహితురాలి సహోదరి వివాహ రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్యసాయిరెడ్డి (21) చైన్నె తురైపాక్కంలో ఉన్న హాస్టల్లో ఉంటూ శ్రీపెరంబుదూరులోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి కోయంబేడు నూరడుగుల రోడ్డులో ఉన్న వివాహ మండపంలో జరిగిన స్నేహితురాలి సహోదరి వివాహ రిసెప్షన్లో స్నేహితులతో కలిసి సత్యసాయి రెడ్డి పాల్గొన్నాడు. లైట్ మ్యూజిక్కు డ్యాన్స్ వేస్తున్న సమయంలో చెవి నుంచి రక్తం వచ్చింది. కొద్ది సేపటికే స్ఫృహ తప్పి కింద పడిపోయాడు. స్నేహితులు అతన్ని హుటాహుటిన అన్నానగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. స్నేహితుడి మృతదేహాన్ని చూసి స్నేహితులు బోరున విలపించారు. కోయంబేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. విచారనలో సాయికి ఫిట్స్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. -
వధూవరులను ఆశీర్వదించిన గవర్నర్ నజీర్
మంగళగిరి(గుంటూరు జిల్లా): జస్టిస్ కుంభజడల మన్మథరావు కుమారుడు కౌషిక్ వివాహ రిసెప్షన్‌కు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. గుంటూరు జిల్లా చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో కౌషిక్ వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి జరిగింది. వధువు ఉదయ, వరుడు కౌషిక్లను గవర్నర్ ఆశీర్వదించారు. కాగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: రెట్టించిన వృద్ధి -
పశ్చిమగోదావరి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడి గ్రామంలో ఆదివారం పర్యటించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కుమార్తె డాక్టర్ సింధు వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను సీఎం ఆశీర్వదించారు. సీఎం జగన్‌కు మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ రవి ప్రకాష్ స్వాగతం పలికారు. చదవండి: నాడు చంద్రబాబు అలా.. నేడు సీఎం జగన్ ఇలా.. -
సీఎం జగన్ పశ్చిమగోదావరి పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడిలో పర్యటించనున్నారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4.20 గంటలకు కలగంపూడి చేరుకుంటారు. 4.30 గంటలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. అనంతరం 5.15 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 5.55 తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. చదవండి: GIS: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్ -
విజయవాడ: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) వై.మధుసూదన్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం హాజరయ్యారు. నూతన దంపతులు తేజశ్రీ, అర్జున్‌లను సీఎం ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహుల్లా తదితరులు పాల్గొన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం జగన్ బుధవారం పర్యటించారు. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. చదవండి: నిడదవోలు: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన సీఎం జగన్ (ఫొటోలు)
-
నిడదవోలు: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
నిడదవోలు(తూ.గో. జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పర్యటనకు బయల్దేరివెళ్లిన సీఎం జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి నిడదవోలుకు బయల్దేరి వెళ్లిన సీఎం జగన్‌కు సుబ్బరాజుపేట హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ సుదీర్ కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గం.లకు వివాహ రిసెప్షన్ వేదికకు చేరుకున్న సీఎం జగన్.. వధూవరులను ఆశీర్వదించారు. హోం మంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వేణుగోపాల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు జక్కం పూడి రాజా, ఎంపీ మర్గాని భరత్ , పలువురు ప్రజా ప్రతినిధులు వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. \ -
తూర్పుగోదావరిలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
సాక్షి, నిడదవోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు నిడుదవోలు చేరుకుంటారు. 11 గంటలకు నిడుదవోలు గాంధీనగర్‌లో సెయింట్ ఆంబ్రోస్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. అనంతరం 11.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: దుష్టచతుష్టయానికి దత్తపుత్రుడు జతకలిశాడు: సీఎం జగన్ -
పెళ్లి రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూ.. గుండె ఆగి..
కుభీర్: మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ యువకుడు పెళ్లి రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తున్నాడు.. బంధువులంతా చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ ఉత్సాహపరుస్తున్నారు. కానీ ఆ యువకుడు డ్యాన్స్ చేస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. గుండెపోటుతో కన్నుమూశాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి(కె) గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సరదాగా డ్యాన్స్ చేస్తూ..: పార్డి(కె) గ్రామానికి చెందిన నాయుడు రాజుకు భైంసా మండలం కామోల్ గ్రామానికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిగింది. శని వారం సాయంత్రం పెళ్లికొడుకు నాయుడు రాజు ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నాయుడురాజు బంధువు, మహారాష్ట్రకు చెందిన తమ్మళ్ల ముత్యం (18) కూడా దీనికి హాజరయ్యాడు. రిసెప్షన్ కార్యక్రమం పూర్తికాగా.. బంధువులు సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ముత్యం కూడా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. కాసేప టికి డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. అతడు తిరిగి లేవకపోవడంతో బంధువులు వెంటనే భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముత్యం గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఆదివారం మహారాష్ట్రలోని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
గ్రాండ్‌గా కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా రిసెప్షన్...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
మాజీ బాయ్‌ఫ్రెండ్ రిసెప్షన్‌కు రానున్న ఆలియా భట్!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రాలు పెళ్లిబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, బంధుమిత్రల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక రిసెప్షన్‌ను ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. రేపు(ఆదివారం)ముంబైలోని ఓ స్టార్ హోటల్లో సాయంత్రం 8:30 గంటలకు సిద్-కియారాలు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఇక ఈ రిసెప్షన్‌కు వచ్చే బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ కూడా నెట్టింట లీక్ అయ్యింది. షారుక్ ఖాన్, ఆలియా భట్,రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, హిద్ కపూర్, కరణ్ జోహార్,వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, జుహీ చావ్లా, అనిల్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్లో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు మీడియాకు చెందిన పలువురు హాజరు కానున్నారు. కాగా ఈ లిస్ట్‌లో ఆలియా దంపతుల పేర్లు కూడా ఉండటం విశేషం. గతంలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీ షూటింగ్లో ఆలియా- సిద్దార్థ్‌లు ప్రేమలో పడి ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నారు. తర్వాత ఆలియా రణ్‌బీర్‌ను పెళ్లాడగా,సిద్-కియారాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. -
ఘనంగా కొండా విశ్వజిత్, రిషికల వివాహ రిసెప్షన్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సంగీతారెడ్డి దంపతుల కుమారుడు విశ్వజిత్, రిషికల వివాహ రిసెప్షన్ శుక్రవారం రాత్రి మాదాపూర్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నెల 17న థాయ్‌లాండ్‌లో పెళ్లి జరగగా, శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రిసెప్షన్‌కు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి దంపతులు, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రాంచందర్‌రావు, మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణ్యస్వామి, మాజీ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ టల రాజేందర్, రఘునందన్‌రావు, మాజీ మంత్రు లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రదర్స్, ఎంపీ, సినీ నటి నవనీత్‌కౌర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జీవీ కృష్ణారెడ్డి, జీవీ సంజయ్‌రెడ్డి, డాక్టర్ విజయానంద్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన వ«ధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. వారం రోజుల పాటు ఇక్కడే బస) -
డైరెక్టర్ గుణశేఖర్ కూతురు నీలిమ రిసెప్షన్ వేడుక ( ఫొటోలు)
-
డిసెంబర్ 6న వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 6న వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను సీఎం సందర్శిస్తారు. దర్గా ఉరుసు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. అనంతరం కడప నగర శివారులోని మాధవి కన్వెన్షన్‌లో ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: (సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్) -
అంగరంగ వైభవంగా పొంగులేటి కుమార్తె వివాహ రిసెప్షన్
సాక్షి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డి వివాహ రిసెప్షన్ విందు ఖమ్మంలో అంగరంగ వైభవంగా జరిగింది. పొంగులేటి కుమార్తె స్వప్నిరెడ్డి, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి మనవడు అర్జున్‌రెడ్డిల వివాహం ఈ నెల 12న ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో జరిగింది. అనంతరం ఖమ్మంలో రాజస్థాన్ ప్యాలెస్‌ను తలపించే భారీ సెట్టింగ్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (Nandamuri Balakrishna: చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన బాలయ్య) -
నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ
సాక్షి, సత్యసాయి జిల్లా: కదిరికి చెందిన ఏపీపీఎస్సీ సభ్యులు జీవీ సుధాకర్‌రెడ్డి కుమార్తె లక్ష్మి సైనా, వైఎస్సార్ జిల్లాకు చెందిన వీర ప్రతాప్‌రెడ్డి కుమారుడు వీర శివారెడ్డి వివాహ రిసెప్షన్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. చదవండి: (ఘనంగా ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్) -
ఘనంగా ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్
సాక్షి, సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కుమారుడు సూర్య, రాశిల వివాహ రిసెప్షన్ బీచ్ రోడ్డులోని ఎంజీఎం పార్కులో మంగళవారం ఘనంగా జరిగింది. నూతన వధూవరులకు ఉమ్మడి విశాఖ వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తిరుపతి ప్రసాదం అందించారు. తిరుమల నుంచి వచ్చిన అర్చక బృందం వేద మంత్రాలతో దంపతులను ఆశీర్వదించారు. వధూవరులను ఆశీర్వదిస్తున్న టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి రజిని, మంత్రి బూడి తదితరులు ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, రాజన్న దొర, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజిని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, మాజీ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కొలగట్ల వీరభద్రస్వామి, గంటా శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, బి.అప్పలనాయుడు, అప్పలనర్సయ్య, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, పి.వి.ఎన్.మాధవ్, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఏయూ వీసీ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డి, రైల్వే డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి, కలెక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ జి.లక్ష్మీశ, పోర్ట్ చైర్మన్ రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, వైఎస్సార్సీపీ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనందరావు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ మేయర్లు కటుమూరి సతీష్ జియ్యాని శ్రీధర్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు జాన్‌వెస్లీ, కోలా గురువులు, సీతంరాజు సుధాకర్, వడ్డాది మధుసూదనరావు, జీసీసీ చైర్పర్సన్ స్వాతిరాణి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, వివిధ విభాగాల అధికారులు కొత్తజంటను దీవించారు. -
శ్రీకాకుళం: స్పీకర్ తమ్మినేని కుమారుడి వివాహా వేడుకకు హాజరైన సీఎం జగన్
-
స్పీకర్ తమ్మినేని కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహా వేడుకలో వరుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, వధువు మాధురిలను సీఎం జగన్ ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన ఈ వివాహా రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరై నూతన వధూవరులు పల్లవి, కృష్ణతేజలను ఆశీర్వదించారు. చదవండి: (Divyavani: టీడీపీ నేతలపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు) -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
కావలి ఎమ్మెల్యే తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్ (ఫోటోలు)
-
కావలి ఎమ్మెల్యే తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
నెల్లూరు: కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి తనయుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఆదివారం కావలి మండలం గౌరవరం వద్ద ఉన్న రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరై వరుడు బాల సాకేత్‌రెడ్డి, వధువు మహిమలను ఆశీర్వదించారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి తదితర నేతలు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు. -
కావలి ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
-
12న కావలికి సీఎం వైఎస్ జగన్
కావలి (నెల్లూరు): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 12వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కావలికి రానున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు సాకేత్‌కుమార్‌రెడ్డి, మహిమల వివాహ రిసెప్షన్ కావలిలోని జాతీయ రహదారిపై ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో 12న జరుగనుంది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి సీఎం హెలికాప్టర్లో కావలికి వస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్పీ సీహెచ్ విజయారావు బుధవారం కావలికి విచ్చేసి హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించారు. కాగా సీఎం పర్యటనకు సంబంధించి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఎమ్మెల్యే కుమారుడి వివాహం హైదరాబాద్‌లో గురువారం ఉదయం జరుగుతుంది. చదవండి: (Maha Samprokshanam: మహా సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం జగన్) -
పెళ్లైన కాసేపటికే వరుడికి షాకిచ్చి వధువు.. ఏడుపు ఒక్కటే తక్కువ!
ఫేస్బుక్ ప్రేమ ఎంత పనిచేసింది. ఎన్నో ఆశలతో ఆమెతో కొత్త జీవితం ప్రారంభిలానుకున్న వరుడికి పెళ్లైన కాసేపటికే గుండె బద్దలయ్యే నిజం తెలిసింది. వధువు అంత పనిచేస్తుందని అతను కలలో కూడా అనుకొని ఉండడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాకు చెందిన అలోక్ కుమార్ మిస్త్రీకి ఒడిశాలోని పఢా జిల్లాకు చెందిన మేఘనతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా 15 రోజులకే ప్రేమగా మారింది. దీంతో మే 24న జాజ్పుర్లోని ఛండీఖోల్లో మేఘనను అలోక్ కలిశాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో, వీరి గురించి కుటుంబ సభ్యులకు చెప్పి వారిని ఒప్పించారు. అనంతరం వీరిద్దరికీ అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. కాగా, అదే రోజు సాయంత్రం వరుడి ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ అతిథి వరుడికి పెద్ధ షాకిచ్చాడు. పెళ్లికూతురును మేఘన అని కాకుండా మేఘనాథ్ అని పిలిచాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వధువు(అతని) పేరు మేఘన కాదు మేఘనాథ్ అని, అతను తమకు దగ్గరి బంధువే చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న కుబుంబ సభ్యులు కంగుతిన్నారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన వరుడు.. అతడిని చితకబాదుడు. గ్రామస్తులు కూడా ఫేక్ వధువును పట్టుకుని కొట్టారు. అనంతరం అతను అబ్బాయి అని తెలిశాక పొడవాటి జుట్టును కత్తిరించారు. అనంతరం మేఘనాథ్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా పెళ్లి పెటాకులు కావడంతో వరుడి హృదయం ముక్కలైంది. ఇది కూడా చదవండి: అందర్నీ ఆశ్చర్యపరిచేలా వధువు ఎంట్రీ!.. వరుడు షాక్ -
లండన్‌లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా’(పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఊ ఊ అంటావా హిందీ వెర్షన్) అంటూ తన గాత్రంతో బాలీవుడ్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన కనికా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని రెండో పెళ్లి చేసుకుంది. లండన్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉసాసన కామినేని హజరైంది. కనికా స్నేహితురాలైన ఉపాసన ఈ పెళ్లిలో సందడి చేసింది. ఇదిలా ఉంటే వీరి వెడ్డింగ్ రిసెప్షన్ విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియంలో గ్రాండ్ నిర్వహించారు. ఈ రిసెప్షన్లో బాలీవుడ్ స్టార్ కిడ్ సందడి చేసింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ కాజోల్ ముద్దుల తనయ నైసా దేవగన్ ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైంది. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ తన స్నేహితులతో కలిసి ఈ ఫంక్షన్లో పాల్గొన్న నైసా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బాడీకాన్ పింగ్ డ్రెస్‌లో లైట్ జ్యువెల్లరిలో మెరిసిన నైసా ఈ ఫంక్షన్లో సందడి చేసింది. కనికా, తన స్నేహితులతో పాటు ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ముంబైలో జరిగే సెలబ్రెటీలకు సంబంధించిన ఏ వేడుకకైన నైసా తన తల్లి కాజోల్, తండ్రి అజయ్ దేవగన్‌లతో కలిసి హజరవుతుంది. అయితే తొలిసారి ఆమె ఒంటరిగా ఈ కార్యక్రమంలో కనిపించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఇటీవల 19 ఏళ్లు నిండిన నైసా ప్రస్తుతం సింగపూర్‌లో డిగ్రీ చదువుతోంది. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry1) -
వివాహ వేడుకలో డ్యాన్స్ చేసి చివాట్లు తిన్న ఎమ్మెల్యే
సాక్షి పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపాల్ మండల్ తన నియోజకవర్గంలోని ఓ వివాహ వేడుకలో డ్యాన్స్‌లు చేసి విమర్శల పాలయ్యాడు. ఈ మేరకు బీహార్ అసెంబ్లీలో భాగల్పూర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గోపాల్ మండల్ ఫతేపూర్ గ్రామంలోని వివాహ వేడుకకు హాజరయ్యారు. అయితే ఆయన అక్కడ ఒక యువతితో కలిసి డ్యాన్స్ చేయడమే కాకుండా ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ డబ్బు విసరడం వంటి పనులు చేశాడు. అంతేగాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది కూడా. దీంతో పార్టీ సభ్యలు గోపాల్‌కి చివాట్లు పెట్టడమే కాకుండా జనతాదళ్ పార్టీ గౌరవాన్ని దిగేజార్చేలా ప్రవర్తించకండి, పదవికి తగ్గట్టుగా ప్రవర్తించమంటూ మందలించారు. కానీ గోపాల్ మాత్రం మ్యూజిక్ వింటూ ఆగలేనని, పైగా ఒక కళాకారుడి కళను ఎవరు ఆపలేరంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. ఐతే గోపాల్ ఈ విధంగా ప్రవర్తించడం తొలిసారికాదు. గతంలో కూడా ఓ వివాహ రిసెప్షన్లో బాలీవుడ్ పాటకి డ్యాన్స్ చేస్తూ విమర్శల పాలయ్యారు. అంతేగాదు ఆయన రైలు ప్రయాణంలో లోదుస్తులతో తిరుగుతూ వివాదస్పద వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. (చదవండి: ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ) -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి,అమరావతి: వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలాపురం వైఎస్సార్సీపీ నేత కుడుపూడి వెంకటేశ్వరరావు (బాబు) కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వరుడు ప్రభాకరరావు, వధువు భావనలను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. చదవండి: ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ? -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: తెలుగు ప్రొడ్యూసర్స్ సెక్టార్ మాజీ చైర్మన్ పులుసు సత్యనారాయణరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో సోమవారం వివాహ రిసెప్షన్ జరిగింది. ఈ సందర్భంగా వరుడు మణికంఠరెడ్డి, వధువు హరిచందనలను ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వదించారు. చదవండి: (దత్త పీఠాధిపతి పుట్టిన రోజు వేడుకలకు సీఎం జగన్‌కు ఆహ్వానం) -
పార్టీ కార్యకర్త వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్త సాయి ప్రశాంత్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో వరుడు సాయి ప్రశాంత్, వధువు శరణ్యను సీఎం జగన్ ఆశీర్వదించారు. చదవండి: (హవ్వ... మోసగాడికి వత్తాసా?) -
వెడ్డింగ్ రిసెప్షన్ కోసం కాబోయే జంట ప్రయత్నం.. వార్తల్లోకి!
Metaverse Reception In Tamil Nadu Soon: వెరైటీగా ఏం చేసినా చాలు.. వార్తలు, సోషల్ మీడియా ద్వారా జనాలకు చేరొచ్చని అనుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో విచిత్రమైన పోకడలకు పోతుంటారు. అయితే తమిళనాడులో ఓ యువకుడు మాత్రం చాలా ‘టెక్నికల్’గా ఆలోచించాడు. తద్వారా దేశంలోనే అరుదైన ఫీట్ సాధించబోతున్నాడు. మెటావర్స్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించడం ద్వారా అరుదైన ఫీట్ సాధించబోతోంది ఈ కాబోయే జంట. తమిళనాడు శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్ ఎస్పీ, జనగనందిని రామస్వామి ఫిబ్రవరి 6న వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కడున్న ఆంక్షల వల్ల కొద్ది మంది బంధువుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు. అయితే రిసెప్షన్ మాత్రం వర్చువల్‌గా నిర్వహించబోతున్నారు. అదీ మెటావర్స్ ద్వారా. ఇది గనుక సక్సెస్ అయితే భారత్‌లో ఈ తరహా ప్రయోగం చేసిన మొదటి జంట వీళ్లదే అవుతుంది. ఇన్‌స్టా పరిచయం దినేశ్ ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్‌గా పని చేస్తున్నాడు. జనగనందిని సాప్ట్వేర్ డెవలపర్‌గా పని చేస్తోంది. ఈ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. పెద్దలను వివాహానికి ఒప్పించారు. బ్లాక్‌చెయిన్, క్రిప్టోకరెన్సీ మీద విపరీతమైన ఆసక్తి ఉన్న దినేశ్.. మెటావర్స్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించాలన్న ఆలోచనను ఫియాన్సీతో పంచుకోగా.. సంతోషంగా అంగీకరించిందట. ఇక భారత్‌లో ‘ఫస్ట్ మెటావర్స్ మ్యారేజ్’ తమదేనంటూ దినేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు. హ్యారీ పోటర్ యూనివర్స్ థీమ్‌తో ఈ రిసెప్షన్‌ను నిర్వహించబోతున్నారు. సుమారు గంటపాటు ఈ రిసెప్షన్ జరగనుండగా.. ల్యాప్ ట్యాప్ ద్వారా ఆ జంట, అతిథులు రిసెప్షన్లో పాల్గొంటారు. అంతేకాదు వర్చువల్ రిసెప్షన్ ద్వారానే ఆశీర్వదించడంతో పాటు గిఫ్ట్‌లు(గిఫ్ట్ వౌచర్ల ట్రాన్స్ఫర్, గూగుల్‌పే, క్రిప్టోలు) ఇవ్వొచ్చు. అయితే భోజనాల సంగతి మాత్రం స్పష్టత ఇవ్వలేదు!. కిందటి ఏడాది అమెరికాలో ఇదే తరహాలో ఏకంగా ఒక వివాహమే జరిగింది. I feel so proud and blessed that I have seen and taken advantage of many great opportunities in this world before millions of people have seen them, Beginning of something big! India’s first #metaverse marriage in Polygon blockchain collaborated with TardiVerse Metaverse startup. pic.twitter.com/jTivLSwjV4 — Dinesh Kshatriyan 💜 (@kshatriyan2811) January 11, 2022 మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ ప్రపంచం. అసలైన రూపాలతో కాకుండా.. డిజిటల్ అవతార్లతో ఇంటెరాక్ట్ కావడం. అగుమెంటెడ్ రియాలిటీ, బ్లాక్‌చెయిన్, వర్చువల్ రియాలిటీ.. సాంకేతికతల కలయికగా పేర్కొనవచ్చు. విష్నేష్సెల్వరాజ్ టీం ‘తడ్రివర్స్’ అనే స్టార్టప్ ద్వారా ఈ మెటావర్స్ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. -
ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం వైఎస్ జగన్
-
ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
Adimulapu Suresh Daughter Wedding: యర్రగొండపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె శ్రిష్టి, సిద్ధార్థ్‌ల వివాహ రిసెప్షన్‌కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. రిసెప్షన్ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్ -
ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్‌కు హాజరైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నీహారిక వివాహ ఆశీర్వచన కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వివిధ రాజకీయపార్టీల ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్) -
వింతైన ఆహ్వానం: పెళ్లికి తలో ఏడేసి వేలు తీసుకురండి!
సాధారణంగా ఆడపిల్లలకు పెళ్లి చేసే కుటుంబానికి బంధువులు, స్నేహితులు డబ్బు, వస్తువులు సమకూర్చటం చూస్తూవుంటారు. అయితే వారు అడగకపోయినా పిలిచిమరీ ఖర్చులకు అవసరం అవుతుందని డబ్బు అందిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా తాజాగా ఓ వధువు తన బంధువులు, స్నేహితులను వింతమైన విన్నపంతో వివాహ రిషెప్షన్‌కు ఆహ్వానించింది. తన వివాహానికి వచ్చే అతిథులు, బంధువులు తలో రూ.7 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఎందుకంటే పెళ్లి రిషెప్షన్ చేయడానికి తగినంత డబ్బు లేదని పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే వధువు స్నేహితుడొకరు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ‘మా వద్ద పెళ్లివేడుకలు నిర్వహించడానికి తగిన డబ్బు లేదు. పెళ్లికి వచ్చే బంధువులు, అతిథులుకు తలో రూ.7వేలు ($99) ఇవ్వాలని కోరుతున్నాము’ అని పెళ్లి ఆహ్వాన పత్రికలో తెలిపారని చెప్పాడు. ఇక తను ఉండే ప్రాంతం నుంచి వివాహం జరిగే చోటు చాలా దూరమని తెలిపాడు. వివాహం జరిగే చోట ఏకంగా ఓ బాక్స్ ఏర్పాటు చేసి ఉందని చెప్పాడు. దానిపై ‘అతిథులారా మా భవిష్యత్తు, కొత్త నివాసం కోసం దయచేసి డబ్బు విరాళంగా ఇవ్వండి’ అని రాసిపెట్టి ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ వివాహ వేడుక అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి కూతురు డబ్బు డిమాండ్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘నేను అలాంటి పెళ్లి వేడుకలకు అస్సలు వెళ్లను.. వాళ్లు ఎంత దగ్గరవాళ్లు అయినా’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఆ జంట ఇలా చేసి ఉండాల్సింది కాదు.. అయితే వారు చెప్పింది నిజమై కూడా ఉండవచ్చు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ సత్యవతి, మేయర్ హరి వెంకటకుమారి, విశాఖ కలెక్టర్ మల్లికార్జున ఘన స్వాగతం పలికారు. చదవండి: MLA RK Roja: బ్యాడ్మింటన్ ఆడిన ఎమ్మెల్యే ఆర్కేరోజా -
కొత్త దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
కొత్త దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, మంగళగిరి: ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీతారామాంజనేయులు కుమారుడి వివాహ రిసెప్షన్ మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన వధూవరులు అనంత ప్రద్యుమ్న, సాహితిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ వెంట ఎమ్మెల్యే ఆర్కే, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. (చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి) -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
CM YS Jagan: అవనిగడ్డ ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
-
అవనిగడ్డ ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: అవనిగడ్డ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సింహద్రి రమేష్‌బాబు కుమారుడి రిసెప్షన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో గురువారం జరిగిన ఈ వేడుకలో నూతన దంపతులు వికాస్, రవళిని సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు హాజరయ్యారు. -
మరీ ఇంత దిగజారాలా; వధువుపై యువకుడి ముద్దుల వర్షం!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ హవా నడుస్తుండడంతో రకారకాల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఆతాజాగా వరుడు పక్కన ఉండగానే ఒక యువకుడు వధువు పక్కన కూర్చొని ఆమెకు ముద్దులు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూడడానికి ఫన్నీగా కనిపిస్తున్న పెళ్లికొడుకు ముఖం చూస్తుంటే జాలి కలుగుతుంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదో కానీ ఈ వీడియో మాత్రం నవ్వులు పూయిస్తుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. విషయంలోకి వెళితే.. రిసెప్షన్ సందర్భంగా వరుడు, వధువు స్టేజీపై కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక యువకుడు వేదిక మీదకు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుని వధువుకు ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారందరూ షాకయ్యారు. ఆ వ్యక్తి తన భార్యను ఏం చేస్తున్నాడోనని పక్కనే ఉన్న వరుడు ఆసక్తిగా గమనించడం విశేషం. ఆ సమయంలో యువకుడు చర్యలకు వరుడు ముఖం పాలిపోవడం స్పష్టంగా కనిపించింది. అయితే పెళ్లికొడుకును ఏడిపించడానికే అమ్మాయి తరపు బంధువులు ఇలా ప్లాన్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఏదేమైనా మరీ ఇంతలా దిగజారి ప్రవర్తించాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
వివాహ రిసెప్షన్ అడ్డుకున్న పోలీసులు
కర్నూలు ,పత్తికొండ రూరల్: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు పోలీసులు, వైద్యాధికారులు, ఇతర అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తుంటే మంగళవారం పత్తికొండలో తమకేమీ పట్టనట్లు వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసుకుని వందలాది మంది ఒకేచోట చేరారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ గుర్రప్ప, స్పెషల్‌బ్రాంచ్ ఎస్ఐ నరసప్ప అక్కడికి వెళ్లి హెచ్చరికలు జారీ చేసి పంపించి వేశారు. ఇందులో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉండటం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. -
వివాహ విందు ఏర్పాటు చేసిన వ్యక్తి అరెస్ట్
జంగారెడ్డిగూడెం రూరల్: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని అక్కంపేటలో వివాహ భోజనాలు ఏర్పాటు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. తమ్ముడి వివాహం అనంతరం తన ఇంట్లో ఆకుల సుధాకర్ సోమవారం పెద్దఎత్తున భోజన ఏర్పాట్లు చేశాడు. కరోనా ప్రభావం వల్ల ఐదుగురికి మాత్రమే భోజనాలు ఏర్పాటు చేసుకోవాలని, అంతకుమించి ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ నెల 22న పంచాయతీ కార్యదర్శి అతనికి నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి భోజనాలు ఏర్పాటు చేయడంతో సుధాకర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ చెప్పారు. ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులు, 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎటువంటి ఫంక్షన్లు, ఉత్సవాలు, జాతరలు నిర్వహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
నటి జయసుధ కుమారుడి వివాహ రిసెప్షన్
-
ప్రముఖ నటి ఇంట గ్రాండ్‌గా రిసెప్షన్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయసుధ పెద్ద కుమారుడు నిహార్ వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం స్థానికంగా జరిగిన ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ, నటుడు మోహన్‌బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇతర టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వివాహ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26న ఢిల్లీకి చెందిన అమృత కౌర్‌తో నిహార్ వివాహం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు సీనియర్ నటీమణులు జయప్రద, రాధిక తదితరులు హాజరై సందడి చేశారు. జయసుధకు నిహార్ కపూర్, శ్రీయాన్ కపూర్ ఇద్దరు కుమారులున్నారు. నిహాన్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. నటి జయసుధ ఇటు వరుస సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. -
సీఎం రాకతో రిసెప్షన్లో సందడి
అన్నా.. ఎలా ఉన్నారు, అమ్మా.. అంతా ఓకే కదా.. అంటూ ఆద్యంతం ఉత్సాహంగా అందరినీ పేరుపేరునా పలకరించడంతో వారంతా ఆనందంతో పులకించిపోయారు. అలా పలకరించిన నేత.. సాక్షాత్తు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కావడమే వారి ఆనందానికి కారణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలనే కాదు.. కార్యకర్తలను కూడా ఆత్మీయంగా, ఎంతో ఆదరంగా ఒక్కొక్కరినీ పేరు పెట్టి పిలిచిన అధినేతను చూసి సంబరపడ్డారు. ఈనెల 17న వివాహం చేసుకున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, శివప్రసాద్‌లను ఆశీర్వదించేందుకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు నేరుగా ఢిల్లీ నుంచి విచ్చేశారు. ఎయిర్‌పోర్టులోనూ, వివాహ రిసెప్షన్ వేదిక వద్ద.. తనను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ సీఎం ఆత్మీయంగా పలకరించారు. కేకే రాజు ది గ్రేట్.. అంటూ ఉత్తర నియోజకవర్గ అభ్యర్ధి కేకే రాజును, గౌరమ్మా ఎలా ఉన్నావంటూ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరిని, గురువులన్నా ఎలా ఉన్నావ్.. అంటూ కోలా గురువులును.. ఇలా ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలిచి ప్రేమగా పలకరించారు. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి రాకతో అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి రిసెప్షన్ వేదిక వద్ద సందడి వాతావరణం నెలకొంది. రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు విశాఖ విమాశ్రయానికి సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్‌కు సాయంత్రం 6.43 గంటలకు చేరుకున్నారు. వధూవరులు ఎంపీ మాధవి, శివప్రసాద్‌ను ఆశీర్వదించారు. నూతన దంపతులు, వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి కాసేపు మాట్లాడారు. మాధవి, శివప్రసాద్ దంపతులు ముఖ్యమంత్రి జగన్‌కు పాదాభివందనం చేశారు. వివాహానికి హాజరైన పార్టీ శ్రేణులకు, ప్రజలకు సీఎం అభివాదం చేశారు. రిసెప్షన్‌కు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, ఎంపీలు డా.భీశెట్టి వెంకట సత్యవతి, వంగా గీత, గోరంట్ల మాధవ్, డా.సంజీవ్‌కుమార్, చంద్రశేఖర్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, పార్టీ నేతలు అక్కరమాని విజయనిర్మల, పరిక్షిత్ రాజు, కుంభా రవిబాబు, కొయ్య ప్రసాదరెడ్డి, సతీష్‌వర్మ, సుధాకర్, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తదితరులు హాజరయ్యారు. జిల్లా సమస్యలపై సీఎంతో చర్చించిన దాడి సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు భేటీ అయ్యారు. మంగళవారం నగరానికి వచ్చిన సీఎంతో కారులో ప్రయాణిస్తూ జిల్లా సమస్యలపై మాట్లాడారు. విశాఖ నగరంలో రోజురోజుకీ కాలుష్యం పెరిగిపోతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒకప్పుడు పాతబస్తీకే పరిమితమైన కాలుష్యం ఇప్పుడు ఎంవీపీ కాలనీ వరకు విస్తరించిందని వివరించారు. దాని నియంత్రణపై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. దాడి చెప్పిన సమస్యలపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే కలెక్టర్ వినయ్‌చంద్‌తో మాట్లాడారు. తక్షణమే నగర కాలుష్యంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం పథకాల అమలుపై సీఎం జగన్.. దాడి వీరభద్రరావుని ఆరాతీశారు. ముఖ్యమంత్రిని సత్కరించి అభివాదం చేస్తున్న ద్రోణంరాజు శ్రీనివాస్ దీనిపై దాడి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదనీ, తన రాజకీయ అనుభవంలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వాన్ని చూడలేదని చెప్పారు. గతంలో కొన్ని వర్గాల ప్రజలకే మేలు జరిగేదనీ, కానీ ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలూ జీవితాంతం చెప్పుకునేలా పథకాలు అమలు చేస్తున్నారనీ.. ప్రజలందరి నుంచీ మంచి స్పందన వస్తోందని తెలిపారు. రైతు భరోసా పథకం గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ప్రస్తావించగా.. లక్షలాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో అన్నదాతల్లో ఎనలేని సంతోషం కనిపిస్తోందనీ దాడి చెప్పారు. -
ఘనంగా హోంమంత్రి కుమార్తె రిసెప్షన్
-
హోంమంత్రి కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, గుంటూరు : రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. సుచరిత, దయాసాగర్ దంపతుల కుమార్తె రిషిక వివాహం తాడేపల్లిగూడెంకు చెందిన అద్దంకి విజయ్‌కుమార్, లీలా పరంజ్యోతి దంపతుల కుమారుడు దీపక్ కుమార్‌తో తణుకులో బుధవారం ఘనంగా జరిగింది. కాగా, గురువారం మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో రిషిక-దీపక్‌ల రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్ నూతన దంపతులను ఆశీర్వదించి.. శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు మంత్రులు కూడా ఈ రిసెప్షన్‌కు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. రిసెప్షన్‌కు హాజరైన గవర్నర్ విశ్వభూషణ్ రిషిక-దీపక్ రిసెప్షన్‌కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులకు బొకేలు అందజేసి ఆశీర్వదించారు. -
జేసీబీ డోజర్‌లో వధూవరుల బరాత్
సంగెం (పరకాల): సాధారణంగా పెళ్లి పూర్తయ్యాక వధూ వరులతో కారు లేదా జీపు.. ఇంకా ఆసక్తి ఉంటే గుర్రాల బగ్గీపై బరాత్ నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం తనకు బతుకుదెరువు ఇచ్చిన జేసీబీపైనే బరాత్ ఏర్పాటు చేసుకున్నాడు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురానికి చెందిన ఉడుతబోయిన రాకేష్ చిన్నప్పటి నుంచి వాహనాలను ఇష్టపడేవాడు. తండ్రితో కలసి స్వయం ఉపాధి కోసం జేసీబీ తీసు కుని నడుపుకుంటున్నాడు. ఇదే మండలంలోని లోహిత గ్రామానికి చెందిన సుప్రియతో ఈనెల 8న రాకేష్ వివా హం జరిగింది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి తన జేసీబీ డోజర్‌ను అందంగా అలంకరించి దాని తొట్టెలో సుప్రియతో కలసి కూర్చుని బరాత్ నిర్వహించుకున్నాడు. దీనికి గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. -
పెళ్లికొచ్చి భోజనం బాగోలేదని..
-
సిబ్బందిని చితక్కొట్టిన అతిథులు!
న్యూఢిల్లీ : రుచికరమైన భోజనం వడ్డించలేదనే కారణంతో పెళ్లికొచ్చిన అతిథులు హోటల్ సిబ్బందిని చితక్కొట్టారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. జనక్‌పురిలోని పికాడిలీ హోటల్లో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాట్లు సరిగాలేవనే కారణంతో పెళ్లి అతిథులు హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం భోజనం రుచికరంగా లేదంటూ వారిపై దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హోటల్ ఫర్నీచర్ సహా ఇతర విలువైన సామాగ్రి పూర్తిగా ధ్వంసమైంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
సౌందర్యా రజనీకాంత్ వివాహ విందు
చెన్నై: రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ వివాహ విందు శుక్రవారం ఘనంగా జరిగింది. విశాగన్‌ను ఫిబ్రవరి 11న సౌందర్య వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో రజనీకాంత్ దంపతులు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులు కనబడలేదు. సౌందర్య, విశాగన్.. ఇద్దరికీ ఇది రెండో వివాహం. గతంలో పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌ను వివాహం చేసుకున్న సౌందర్య 2016లో విడాకులు తీసుకున్నారు. వాళ్లకు వేద్ అనే కుమారుడు ఉన్నాడు. విశాగన్ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. -
రజనీకాంత్ కూతురు సౌందర్య వెడ్డింగ్ రిసెప్షన్
-
ప్రియానిక్ ముచ్చటగా మూడో రిసెప్షన్
-
గ్రాండ్‌గా ప్రియానిక్ రిసెప్షన్
పెళ్లి తర్వాత ఇప్పటికే రెండు రిసెప్షన్స్ ఏర్పాటు చేశారు ప్రియానిక్ (ప్రియాంకా చోప్రా– నిక్ జోనస్). సినీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం ముచ్చటగా మూడో రిసెప్షన్ గురువారం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఈ వేడుకకి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. హీరో వెంకటేశ్, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, టెన్నిస్ స్టార్ సానియామీర్జా హాజరై సందడి చేశారు. -
ముచ్చటగా మూడోది!
బాలీవుడ్లో మ్యారేజ్ సీజన్ ఇంకా పూర్తయినట్టుగా లేదు. పెళ్లి తర్వాత ఫ్యామిలీ కోసం, ఇండస్ట్రీ స్నేహితుల కోసం రిసెప్షన్లు ఏర్పాటు చేయడంతో కొన్ని రోజులుగా పెళ్లి హడావిడే కనిస్తోంది. ప్రస్తుతం ప్రియానిక్ (ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్) ఆల్రెడీ ఢిల్లీ, ముంబైలలో ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు క్లోజ్ ఫ్రెండ్స్‌కు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. గురువారం సినిమా ఇండస్ట్రీ వాళ్లకోసం ఓ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ముంబై తాజ్ హోటల్లో జరిగిన ఈ వేడుకకు ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు హాజరయ్యారు. ఈ వేడుకకు ట్రెడిషనల్ డ్రెస్‌తో పాటు, ఇండో– వెస్ట్రన్ దుస్తులను డ్రెస్ కోడ్‌గా ఫిక్స్ చేశారని బాలీవుడ్ సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన మొదటి ఆహ్వానం దీపికా పదుకోన్‌కి వెళ్లిందట. ఇటీవలే పెళ్లి చేసుకున్న రెండు కొత్త జంటలను(దీపిక–రణ్వీర్, ప్రియాంక–నిక్ జోనస్) ఒకే వేదికపై చూసే అవకాశం కలిగిందంటూ సంబరపడుతున్నార దీప్‌వీర్, ప్రియానిక్ ఫ్యాన్స్. -
ఈశా, ఆనంద్‌ల రిసెప్షన్ ఫోటోలు
-
ప్రియానిక్ రిసెప్షన్‌కు మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ల వివాహం జోధ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అదేరీతిలో మంగళవారం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో రిసెప్షన్న్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. మోదీ, ప్రియానిక్లతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, వారికి విషెస్ చెప్పారు. (పైళ్లైపోయిందోచ్..!) రిసెప్షన్లో ప్రియాంక తన భర్త నిక్ జోనాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను మోదీకి పరిచయం చేశారు. మోదీ రాకతో ప్రియానిక్లతో పాటు వారి కుటుంబసభ్యులు తెగ సంబరపడిపోయారు. గతంలో కూడా విరాట్ కోహ్లి-అనుష్క శర్మల రిసెప్షన్‌కు కూడా మోదీ హజరైన విషయం తెలిసిందే. డిసెంబర్ 1, 2 తేదీల్లో నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లికి ముందు జరిగిన సంగీత్, మెహందీ వేడుకలతో పాటు పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. (కన్నీటి పర్యంతమైన ప్రియాంక!) థ్యాంక్స్ చెప్పిన ప్రియాంక ఎన్నికల బిజీలోనూ తమను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రియాంక చోప్రా ధన్యవాదాలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ మా రిసెప్షన్‌కు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు రావటం చాలా సంతోషంగా ఉంది. మీ దీవెనలు, మీరు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’అంటూ ప్రియాంక పేర్కొన్నారు. (సరదాల సంగీత్) View this post on Instagram Congratulations @priyankachopra and @nickjonas. Wishing you a happy married life. A post shared by Narendra Modi (@narendramodi) on Dec 5, 2018 at 1:15am PST View this post on Instagram A heartfelt thank you to our Hon'ble Prime Minister Shri @narendramodi ji for gracing us with your presence. Touched by your kind words and blessings. @nickjonas A post shared by Priyanka Chopra (@priyankachopra) on Dec 5, 2018 at 1:42am PST -
ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్‌ల రిసెప్షన్ ఫోటోలు
-
కొంగు విడువనులే...
పెళ్లిరోజున వధూవరుల పెళ్లి వస్త్రాలు ముడేస్తారు... జీవితాంతం కలిసుండాలని. భర్తను కొంగున కట్టేసుకోవాలనుకుంటారు కొందరు భార్యలు. రణ్వీర్ సింగ్ అయితే ‘నీ కొంగు విడవనులే’ అని భార్య దీపికా పదుకోన్‌కి హామీ ఇచ్చారు. దీప్‌వీర్ పెళ్లి రిసెప్షన్ బుధవారం బెంగళూర్‌లో జరిగింది. ఈ సందర్భంగా బయటికొచ్చిన ఫొటోల్లో కింద ఉన్న ఫొటో ఓ హైలైట్. మీడియాని ఉద్దేశించి ‘‘ఎల్లరికీ నమస్కార, ఎల్లా చనాయ్గా ఇద్దరా’ (అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారా) అని దీపికా కన్నడంలో మాట్లాడితే, ‘‘ఖానా కా కే జానా’ (భోజనం చేసి వెళ్లండి) అని రణ్వీర్ హిందీలో అన్నారు. ఈ వేడుకలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఇక నో సీక్రెట్
తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ నటాషా దలాల్‌తో వరుణ్ ధావన్ లవ్‌లో ఉన్నారని ఎప్పట్నుంచో బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. వరుణ్, నటాషా కెమెరా కంట పడకుండా అప్పుడప్పుడు రెస్టారెంట్స్, థియేటర్స్‌కు సీక్రెట్‌గా వెళుతున్నారని కూడా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు సీక్రెట్ మీటింగ్స్‌కి ఫుల్స్టాప్ పెట్టిందీ జంట. సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా రిసెప్షన్ వేడుకకు వీరిద్దరూ జోడీగా హాజరయ్యారు. దీంతో ఇక నో సీక్రెట్స్ అని చెప్పకనే చెప్పారు వరుణ్ అండ్ నటాషా. ఇలా జంటగా నలుగురికీ కనిపించడంతో వరుణ్, నటాషా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబో తున్నారన్న కొత్త రాగం బాలీవుడ్లో మొద లైంది. రీసెంట్గా తాను హీరోగా నటించిన ‘అక్టోబర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఏడాదిలో వివాహం చేసుకుంటానేమోనని వరుణ్ చెప్పడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో ‘కళంక్’ సినిమాలో నటిస్తున్నారు వరుణ్«. ఈ సినిమాలో న్యూ లుక్ కోసం ఆయన స్పెషల్ వర్కౌట్స్ చేస్తున్నారు. -
బిగ్ బి.. భుజానికి ఏమైంది?
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈమధ్య ఎక్కడికి వెళ్లినా, ‘భుజానికి ఏమైంది? భుజానికి ఏమైంది?’ అన్న ప్రశ్నలు ఎక్కువ వినిపిస్తున్నాయి. షూటింగ్ స్పాట్‌లోనూ అంతే! ఏదైనా ఫంక్షన్‌కి అటెండ్ అయినా అంతే!! ఆయన ఎడమ భుజానికి మొత్తం ఒక పట్టీ వేసి ఉండడం వల్ల అందరూ ఇలా అడుగుతున్నారు. సరే.. అందరూ అడుగుతున్నారు కదాని బిగ్ బి స్వయంగా తన బ్లాగ్‌లో దీనిగురించి చెప్పుకొచ్చారు. గతంలో షూటింగ్ స్పాట్లో జరిగిన గాయం ఇప్పటికీ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుందని, ఇప్పుడిది కూడా దానివల్లే అని చెప్పారు. మొదట్లో ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అనిపించినా, ఈ మధ్యే సెట్స్‌లో ఓ కీలక సన్నివేశం తీస్తున్న సమయంలో మరోసారి భుజం దగ్గరి ఎముకల్లో చిన్న బ్రేక్ వచ్చిందట. ఇందుకోసం ఐస్, పట్టీ వేసి అమితాబ్‌కు చికిత్సను అందిస్తున్నారు. ‘ఇదేమంత ఇబ్బంది పెడుతున్న విషయం కాదు’ అంటూ షూటింగ్స్‌తో ఆయన బిజీగా గడిపేస్తున్నారు. విరాట్ కోహ్లి – అనుష్క శర్మల రిసెప్షన్‌కు కూడా అమితాబ్ భుజానికి ఈ పట్టీ వేసుకొనే వచ్చారు. బాలీవుడ్లో కమర్షియల్ సినిమా అనేదానికి ఒక ఐకాన్ అనిపించుకున్న సూపర్‌స్టార్ అమితాబ్.. 75 ఏళ్ల వయసులో గాయాలను సైతం లెక్కచేయకుండా షూటింగ్స్‌తో బిజీగా గడుపుతూ ఉన్నారంటే ఆయన సూపర్‌స్టార్ ఊరికే అవ్వలేదు!! కుమార్తె శ్వేతానందాతో అమితాబ్. -
హాట్ టాపిక్‌గా రాయల్ కపుల్ డాన్స్
సాక్షి, న్యూఢిల్లీః ప్రేమ- పెళ్లి వార్తలో నిత్యం హెడ్ లైన్స్‌లో నిలుస్తున్న విరుష్క జోడీ వెడ్డింగ్ రిసెప్షన్లో కూడా సందడి చేశారు. జహీర్ పెళ్లిలో కలర్ఫుల్గా డాన్స్ చేసిన ఈ జంట తమ పెళ్లి రిసెప్షన్లో మరింత అదరగొట్టి హాట్ టాపిక్ గా నిలిచారు. అదిరిపోయే కాస్టూమ్స్‌తో రాయల్ లుక్‌లో కనిపించిన వీళ్లిద్దరూ అంతే హుషారుగా స్టెప్పులేశారు. పంజాబీ మ్యూజిక్ కు జోరుగా చిందేసిన విరుష్క జోడీ తాజా డాన్స్ క్లిప్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో గురువారం రాత్రి వెడ్డింగ్ రిసెప్షన్ తర్వాత పంజాబీ ట్యూన్స్‌కు చిందేశారు. ఈ సెలబ్రిటీ జోడీ ఇచ్చిన రిసెప్షన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోపాటు క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనా, గంభీర్ హాజరయ్యారు. ముఖ్యంగా నోట్లో ఓ కరెన్సీ నోటుతో అనుష్క చేసిన డ్యాన్స్ హైలైట్. విరాట్‌తోపాటు ధావన్‌తో కలిసి నుష్కీ స్టెప్పులేసింది. ఇక డిసెంబర్ 26న ముంబైలో రెండవ రిసెప్షన్లో మరెంత సందడి చేయనున్నారో.. మరోవైపు రాయల్ కపుల్ వెడ్డింగ్ రిసెప్షన్పై ట్విట్టర్లో అభినందనలు వెల్లువెత్తాయి. కాగా ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన జహీర్, సాగరిక ఘాట్గె రిసెప్షన్ లో కోహ్లీ-అనుష్క మ్యాచింగ్ డ్రస్‌తో హాజరై ఆ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడంతోపాటు ఉత్సాహంగా స్టెప్స్ వేస్తూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. Royal couple... Virushka entry.. #VirushkaReception @AnushkaSharma @imVkohli pic.twitter.com/nxAB7K980s — Nayana (@im_nayana18) December 21, 2017 Glad to be part of your special day @imVkohli & @AnushkaSharma! Wish you both a beautiful life ahead filled with eternal love and companionship! pic.twitter.com/IoACsnB7JE — Suresh Raina (@ImRaina) December 21, 2017 -
రిసెప్షన్లో అనుష్క క్రేజీ డ్యాన్స్
-
విరుష్క రిసెప్షన్‌కు అతిథిగా ప్రధాని మోదీ
-
విరుష్క రిసెప్షన్‌కు అతిథిగా మోదీ
న్యూఢిల్లీ : భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మల వివాహ విందు గురువారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో విరాట్ కోహ్లి-అనుష్కలు ఈ నెల 11న హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులే ఈ పెళ్లికి విచ్చేశారు. దీంతో తమ కుటుంబసభ్యులు, బంధువులు, మరికొందరు సెలబ్రిటీల కోసం నిన్న (శుక్రవారం రాత్రి) గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది విరుష్క జోడీ. కాగా ఈ నూతన జంట బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిసి, రిసెప్షన్ రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఈ నెల 26న ముంబైలో క్రికెటర్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు కోహ్లి రిసెప్షన్ ఇవ్వనున్నారు. -
విరుష్క...మరో హాట్ టాపిక్!
సాక్షి, ముంబై: నిన్నటిదాకా విరుష్క పెళ్లి హాట్ టాపిక్. ఇపుడిక కొత్త జంట విరాట్ కోహ్లి- అనుష్క శర్మ రిసెప్షన్ ఎక్కడజరుగుతోంది అని. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి రిసెప్షన్ కార్డు నెట్ లో హల్చల్ చేస్తోంది. దీంతో విరుష్క వెడ్డింగ్ కార్డ్ మిస్ అయ్యామని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ దీంతో ఫుల్ ఖుషీ. మరోవైపు ప్రముఖ కండోమ్ తయారీ కంపెనీ ఈ స్టార్ కపుల్‌కు విషెస్ తెలుపుతూ ట్విట్ చేయడం ఆసక్తికరంగామారింది. డిసెంబర్ నెల 21న ఢిల్లీలో తాజ్ డిప్లొమాటిక్ ఎంక్లేవ్‌లో బంధువులకు 26న ముంబైలో క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలకు గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆహ్వానితులకు ఇన్విటేషన్లు కూడా అందాయి. దీంతో చాలామంది సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా ఈ కొత్త జంటకు విషెస్ పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆహ్వాన పత్రికను డైరెక్టర్ మహేశ్ భట్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వేల రూపాయల విలువైన రిసెప్షన్ కార్డుతోపాటు అతిథులను ఆహ్వానించే సమయంలో మరో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది కొత్త జంట. విందుకు ఆహ్వానిస్తూ పంపే కార్డుతోపాటు ఓ మొక్కను కూడా జతచేశారు.. పర్యావరణానికి ఎటువంటి హాని చేయని పేపర్‌బ్యాగులో ఆ మొక్కని పెట్టి కార్డుతో అందిస్తున్నారట. ప్రముఖ కండోమ్ కంపెనీ డ్యూరెక్స్ ఇండియా విరాట్-కోహ్లీలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయడం విశేషం. దీంతో బిప్స్- జాన్ అబ్రహం కండోమ్ యాడ్‌ను గుర్తు చేసుకుంటున్నారట అభిమానులు. They made it ! Our heartiest congratulations to Anushka & Virat. We pray that this love story goes on forever and ever. Amen !@imVkohli @anushkasharma pic.twitter.com/dk9sqm4WgU — Mahesh Bhatt (@MaheshNBhatt) December 13, 2017 Finally, Virat Kohli bowled his maiden over. #VirushkaKiShadi pic.twitter.com/skZWdcn20y — Durex India (@DurexIndia) December 12, 2017 -
ఘనంగా నటుడి చిన్నా కుమార్తె వివాహ రిసెప్షన్
-
ఘనంగా నటుడి చిన్నా కుమార్తె వివాహ రిసెప్షన్
ప్రముఖ సినీ నటుడు చిన్నా కుమార్తె మోనిక వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఫిల్మ్ నగర్ క్లబ్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు , చిన్నా స్నేహితులు హాజరై వధూ వరులను ఆశ్వీరదించారు. వరుడు చైతన్యతో మౌనిక వివాహం ఈ నెల 23 న జరిగిన విషయం తెలిసిందే. తిరుమలలోని కర్ణాటక కల్యాణ మండపంలో పెళ్లి వేడుకను నిర్వహించారు. కాగా చిన్నా కుమార్తె పెళ్లి ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా కమెడియన్ హరీశ్ రిసెప్షన్
-
పెళ్లి విందుపై వివాదం
హైదరాబాద్: స్వల్ప వివాదం చినికిచినికి గాలివానైంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని వాల్మీకినగర్, సూర్యనగర్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాల్మీకినగర్ బస్తీలోని రోడ్డుపై వివాహ విందును ఏర్పాటు చేసుకోవడంపై బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. వారిని బస్తీవాసులు దూషించడంతో ఆగ్రహం చెందిన ఆ యువకులు చిక్కడపల్లి వెళ్లి సుమారు 50మందితో కలిసి వచ్చి బస్తీపై రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. బస్తీలో బీభత్సం సృష్టించి 2 కార్లు, 5 ఆటోలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారందరినీ గాంధి, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. ఫంక్షన్‌లోని వంట పాత్రలను పడేసి కుర్చీలను విరగొట్టారు. అల్లరిమూకల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవి ఫుటేజిని సేకరించారు. సెంట్రల్ జోన్ డీసీపీ డేవిడ్ జోయల్ హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
ఘనంగా తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్
-
ఘనంగా మంత్రి తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్
-
ఘనంగా మంత్రి తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్
-
ఘనంగా మంత్రి తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్
ఆశీర్వాదం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్ నోవాటెల్ హోటల్లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. సినీ నటులు నందమూరి బాలకృష్ణ, మహేశ్‌బాబు, పవన్‌కల్యాన్, నాగబాబు, రాజేంద్రప్రసాద్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. - సాక్షి, సిటీబ్యూరో [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
ఢిల్లీ రాజేశ్వరి కొడుకు రిసెప్షన్
-
ఆ ఫొటోల్లో ఆమె ఎందుకు లేదంటే..?
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు, బరోడా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పెళ్లి రిసెప్షన్ ఫొటోలు చూసి అభిమానులు నోరెళ్లబెట్టారు. ఈ ఫొటోల్లో పెళ్లికూతురు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. రిసెప్షన్ కు మీడియా ఫొటోగ్రాఫర్లను అనుమతించలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. పెళ్లికూతురిని చూసేందుకు పురుష అతిథులను కూడా అనుమతించలేదని వెల్లడించాయి. ఫొటోలు మీడియాకు ఇవ్వలేదని తెలిపాయి. ఈ విషయంపై ఇర్ఫాన్ పఠాన్ ను సంప్రదించగా.. తమ సొంతం ఫొటోగ్రాఫర్లతో రిసెప్షన్ వేదిక వద్ద తాము ఫొటోలు తీయించుకున్నామని చెప్పాడు. తన వ్యక్తిగత ఫొటోలు బయటకు వెల్లడి చేయడానికి తాను ఇష్టపడనని వెల్లడించాడు. స్వవిషయాల్లో ప్రచారానికి దూరంగా ఉంటానని అన్నాడు. అందుకే తన కుటుంబానికి సంబంధిచిన ఫొటోలు సోషల్ మీడియాలో కనబడవని చెప్పాడు. పెళ్లితో తన జీవితంలో కొత్తా అధ్యాయం ప్రారంభమైందన్నాడు. పరస్పరం ప్రేమాభిమానాలు పంచుకుంటే వివాహం ఆనందమయం అవుతుందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. మోడల్ సాఫా బేగ్ ను గత నెలలో మక్కాలో ఇర్ఫాన్ పఠాన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ప్రియాంకా దత్, నాగ్ అశ్విన్‌ల వివాహ రిసెప్షన్
-
ఆ హీరోయిన్లు ఆలింగనం చేసుకున్నారు!
ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమకు స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి, జయప్రద. అప్పట్లో వీరిమధ్య తెరమీదే కాదు తెరవెనుక బద్ధశత్రుత్వం ఉందని చెప్పుకొనేవారు. అయితే వీరిద్దరు కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఇటు దక్షిణాదిలోనే కాకుండా అటు బాలీవుడ్‌లోనూ తమ హవా కొనసాగించారు. 'దేవత', 'ఆఖిరీ రాస్తా', 'ఔలాద్' వంటి విజయవంతమైన చిత్రాల్లో జయప్రద, శ్రీదేవి కథానాయికలుగా మెప్పించారు. అయితే వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండేవి కావని ఓ ప్రముఖ దర్శకుడు కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు. అయితే వారిద్దరు కలిసి నటించే సీన్లు విషయంలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అలనాటి అందాల తారలు శ్రీదేవి, జయప్రద ఇటీవల ఒకే వేదికపై తళుక్కుమన్నారు. ఆత్మీయంగా హత్తుకొని సరదాగా మాట్లాడుకున్నారు. ఈ అరుదైన ఘట్టానికి జయప్రద కొడుకు సిద్ధార్థ వివాహ రిసెప్షన్ వేదిక అయింది. ఈ వేడుకకు భర్త బోనీ కపూర్‌తో హాజరైన శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలువగా.. కంచీవరం పట్టుచీర కట్టుకున్న జయప్రద వారికి స్వాగతం పలికారు. రిసెప్షన్ వేదికపై సరదా గడిపిన ఇరువురు తారలు ప్రస్తుతం తమ మధ్య ఉన్న ఆత్మీయతను చాటుకున్నారు. -
నటుడు గణేష్ వెంకట్రామన్ రిసెప్షన్
-
ప్రజల సొమ్ము సమీక్షల పాలు
గంటా కుమారుని వివాహ రిసెప్షన్‌కు తరలివచ్చిన ప్రముఖులు సర్కారు సొమ్ముతో మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటన విభాగాల వారీగా సమీక్షలు, సమావేశాలు ఉక్కిరిబిక్కిరైన ఉద్యోగులు, పోలీసులు ఇన్నాళ్లూ తమ శాఖలను కనీసం కన్నెత్తి చూడనివారు నగరంపై వరదలా విరుచుకుపడ్డారు. సమీక్షలు నిర్వహించారు. స్థానిక అధికారులపై చిందులేశారు. ‘పెళ్లి కొచ్చాడు.. భోజనం చేసి వెళ్లిపోతాడులే అనుకున్నారా’ అని భుజాలు తడుముకుంటూ మరోపక్క మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఇంతమంది మంత్రులు, ఉన్నతాధికారుల తాకిడి ఒకేరోజు నగరాన్ని చుట్టుముట్టడంతో స్థానిక అధికారులు, పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. గంటా వారి ఇంట పెళ్లి సందడికి హాజరైన పెద్దల హడావుడి ఇది. ఒక్క రోజు సమీక్షలకే స్టార్ హోటళ్లు, గెస్ట్ హౌస్‌లకు రూ.లక్షలు ఖర్చయ్యాయి. విశాఖపట్నం: రాష్ర్ట మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి వైభవంగా జరి గింది. ప్రముఖులంతా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేకపోయినా.. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించేందుకు పోటీ పడటమే ప్రహసనంగా మారింది. దీంతో జిల్లా అధికారులకు ఊపిరాడలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి వెంట పరుగులు దీశారు. ఒక్క రోజే సమీక్షల పేరుతో స్టార్ హోటళ్లకు రూ.లక్షలు ఖర్చు చేశారు. ఇప్పటి వరకూ చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులే ప్రభుత్వం క్లియర్ చేయలేదు, తాజా ఖర్చుతో ఆయా శాఖలకు దిగులుపట్టుకుంది. మామూ లు రోజుల్లో అయితే ప్రభుత్వ అతిధి గృహాల్లోనో, కార్యలయాల్లోనో సమావేశాలు నిర్వహించి ఖర్చు తగ్గించుకునేవారు. మరోవైపు ఇంతమంది వీవీఐపీ లు ఒకేసారి నగరానికి రావడం, వారు నగరమంతా కలియతిరగడంతో పోలీ సులకు ముచ్చెమటలు పట్టాయి. ప్ర ముఖులకు రక్షణగా వందలాదిమంది పోలీసు అధికారులు, సిబ్బంది క్షణం తీరిక లేకుండా కాపలా కాశారు. ఎలాగూ వస్తున్నాం కదా అని తమ శాఖకు చెందిన అధికారులతో సమీక్షలు జరిపారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్, సిద్ధా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీ త, పీతల సుజాత, కొల్లు రవీంద్రలు తమ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సునీత నగరంలోని రేషన్ డిపోలు, వాణిజ్య దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. శాసనసభ ఎస్యూరెన్స్ కమిటీ చైర్మన్ చెంగళరాయుడు ‘వుడా’లో సమీక్ష జరిపారు. ప్రజా ప్రతినిధులే కాదు ఉన్నతాధికారులు సైతం సమీక్షలతో బిజీబిజీగా గడిపారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూపై చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు చర్చించారు. ప్రధానమంత్రి మోదీతో కూడా విశాఖ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణారావు పాల్గొన్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా, ఆ శాఖ కమిషనర్ సంధ్యారాణి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ బి.శ్యామలరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి, వివిధ విశ్వ విద్యాలయాల ఉపకులపతులు తమ తమ శాఖల పనితీరును సమీక్షించారు. -
ఘనంగా హర్భజన్ రిసెప్షన్
-
అట్టహాసంగా ఆవిష్కార్ సింఘ్వీ వివాహ వేడుక
-
వైభవంగా వివాహ రిసెప్షన్
-
అపూర్వ స్వాగతం
తిరుపతిలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలిసి జిల్లా వ్యాప్తంగా అభిమాన సంద్రం కదలివచ్చింది. తమ ప్రియతమ నేతకు అడుగడుగునా ఘనస్వాగతం పలికింది. జైజగన్ అంటూ యువత నినదించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి తిరుపతికి విచ్చేసిన వైఎస్.జగన్మోహన్రెడ్డికి లభించిన అపూర్వ జన స్పందన ఇది. తిరుపతి తుడా : తిరుపతిలో జరిగిన ప్రవాస భారతీయుడు చెన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు వైఎస్.జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్‌లో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు కె.నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్ ఘనస్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తున్నట్లు తెలుసుకున్న నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చి.. ఘనస్వాగతం పలికారు. జగన్నినాదాలతో విమానాశ్రయం హోరెత్తింది. విమానాశ్రయం నుంచి నాయుడుపేట-బెంగళూరు రహదారి మీదుగా దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్దకు చేరుకున్న జననేతకు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి.. బంతిపూల వర్షం కురిపించారు. బాణ సంచా పేల్చి.. కర్పూర హారతులు ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు భారీగా తరలివచ్చి జగన్‌తో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దామినేడు, తిరుచానూరు కూడలి, వేదాంతపురం కూడలి ప్రాంతాల్లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎయిర్ బైపాస్‌రోడ్డు మీదుగా పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద నుంచి పద్మావతి అతిథిగృహం వరకూ భారీ స్కూటర్ ర్యాలీ చేపట్టారు. అప్పటికే పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, నేతలు, కార్యకర్తలను వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో చెన్నారెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. వధూవరులు అభినయ, మదన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించారు. రిసెప్షన్‌కు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం రోడ్డు మార్గంలో పులివెందులకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తిరుపతి నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీహర్ష, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు గాయత్రీదేవి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు దామినేడు కేశవులు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బీరేంద్రవర్మ, మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ అలీ ఖాద్రి, రైతు విభాగం అధ్యక్షులు ఆదికేశవులురెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు హనుమంతునాయక్, బీసీ సెల్ అధ్యక్షులు మిద్దెల హరి, యువజన విభాగం నేతలు ఓబుల్‌రెడ్డి, శ్రీనివాసులు, సదానందరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు హేమంత్‌యాదవ్, నేతలు గుణశేఖర్‌నాయుడు, ఎల్బీ.ప్రభాకర్‌నాయుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు, దామినేటి కేశవులు, శ్రీరాములు, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పి.రాజేంద్ర, పెంచలయ్య, చిన్ని యాదవ్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కిషోర్ వివాహ రిసెప్షన్ సందడి
నల్లగొండ రూరల్ : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్-కమల వివాహ రిసెప్షన్‌ను బుధవారం స్థానిక లక్ష్మీగార్డెన్స్‌లో వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆశీర్వదించిన వారిలో మంత్రులు నాయిని నర్సిం హారెడ్డి, హరీష్‌రావు, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, పద్మారావు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గొంగిడి సునీత, వేముల వీరేశం, సినీ డెరైక్టర్లు ఎన్.శంకర్, ఆర్.నారాయణమూర్తి, చిన్న చరణ్, కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, ఏఎస్పీ రామరాజేశ్వరి, జేసీ ప్రీతిమీనా, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీం దర్, నాయకులు బండా నరేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, గాయకుడు గోరటి వెంకన్న ఇరు కుటుం బాల బంధువులు, జిల్లా అధికారులు, వి విధ పార్టీల ప్రజా ప్రతినిధులు ఉన్నారు. సీఎంకు ఆతిథ్యం ఇచ్చిన బండా నరేందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జిల్లాకు మొదటిసారిగా వచ్చిన కేసీఆర్‌కు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. జిల్లా అధికారులు సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. బండా ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందు తీసుకున్నారు. సా యంత్రం 6.30 గంటలకు వచ్చిన సీఎం కేసీఆర్ అరగంట సేపు బండా ఇంట్లో పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడారు. అనంతరం రిసెప్షన్ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించి 7.30 గంట లకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు. పటిష్ట బందోబస్తు... సీఎం రోడ్డు మార్గం రావడంతో హైదరాబాద్ నుంచి నల్లగొండ వరకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అణువణువు క్షుణ్ణంగా డాగ్‌స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ప్రభాకర్‌రావు భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. కల్వర్టులు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను దారి మళ్లించారు. -
విందుకు వెళ్లొస్తూ... మృత్యుఒడిలోకి
పెళ్లింట్లో విషాదం కారును ఢీకొట్టిన లారీ వధువు బావ దుర్మరణం మరో ఐదుగురికి గాయాలు బెల్లంపల్లి : మరదలి రిసెప్షన్ విందుకు వచ్చి ఆనందోత్సాహాలతో ఇంటికి తిరిగెళ్తుండగా లారీ ఢీకొనడంతో బావ మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వన్‌టౌన్ ఏఎస్సై ఖాదర్‌పాషా కథనం ప్రకారం... ములుగు మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన స్వాతికి, కాగజ్‌నగర్‌కు చెందిన సురేంద్రచారితో ఈ నెల 20న వివాహం జరిగింది. గురువారం రిసెప్షన్ విందు కోసం స్వాతి కుటుంబ సభ్యులు, బంధువులు కాగజ్ నగర్‌కు రెండు వాహనాల్లో వచ్చారు. వారిలో స్వాతి అక్కాబావలు హన్మకొండకు చెందిన మహారాజ అంజలి, భాస్కరచారి(28) ఉన్నారు. విందు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున వధూవరులతో కలిసి కాట్రపల్లికి బయల్దేరారు. క్వాలిస్ వాహనంలో వధూవరులు, బంధువులు, మరో కారులో భాస్కరాచారి, బంధువులు ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో బెల్లంపల్లి శివారులో మూసివేసిన 68 గని సమీపంలో మంచిర్యాల వైపు నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఓ లారీ అతి వేగంగా వచ్చి వారి కారును ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న భాస్కరాచారి(28) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో భాస్కరచారి భార్య అంజలి, మామ మొగిలయ్య, తోడల్లుడు కృష్ణమాచారి, బావమరిది రామకృష్ణ, తోడల్లుడి కుమారుడు ప్రదీప్‌కు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. బైక్ మెకానిక్ అయిన భాస్కరచారికి కుమారులు స్నేహిత్, వర్షిత్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని సీఐ బానోతు బాలాజీ , తాళ్లగురిజాల ఎస్సై బి.రాజు పరిశీలించారు. మృతుడి తోడల్లుడు కస్పోజు సంజీవచారి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రిసెప్షన్ పార్టీలో 'ఆ జంట' స్పెషల్ ఎట్రాక్షన్
ఇటీవల కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్న హీరో, హీరోయిన్లు త్రిష, రానా దగ్గుబాటి మరోసారి హైలెట్ అయ్యారు. శనివారం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో ఈ జంట హల్చల్ చేసింది. వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇక గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా త్రిష మాత్రం ఎప్పటికప్పుడు మీడియాలో నానుతూనే ఉంది. తాజాగా దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్లోనూ వీరిద్దరూ కలిసే కనిపించారు. ఈ వేడుక తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇచ్చిన లేట్‌నైట్ పార్టీలో రానా, త్రిష బాగా ఎంజాయ్ చేశారనీ గుసగుసలు వినిపించాయి. అంతకు ముందు అమెరికాలో తెలుగు సంఘాల కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన రానా అక్కడ త్రిషతో ఊరంతా చక్కర్లు కొట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. చాలా ప్రయివేటు కార్యక్రమాల్లోనూ ఈ జంట ఎక్కువగా కనిపించింది. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనూ రానా, త్రిషల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని పుకార్లు షికార్లు చేసినా వారిద్దరు మాత్రం అబ్బే అదేమీ లేదు... మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చిలకపలుకులు చెప్పటం విశేషం. అలాగే వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు వెలువడినా అవన్ని రూమర్స్ అని కొట్టిపారేశారు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ బ్రేకప్ అయ్యిందనే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా త్రిష, రానా జంట మరోసారి వార్తల్లో నిలిచారనటంలో సందేహం లేదు. -
కె.రాఘవేంద్రరావు కుమారుడు వివాహ రిసెప్షన్
-
పెళ్లికి వచ్చి రక్తదానం చేసిన బంధువులు
-
గాయని చిన్మయి వివాహ రిసెప్షన్
ప్రముఖ యువ గాయని చిన్మయి, నటుడు రాహుల్ రవీంద్రన్‌ల వివాహ రిసెప్షన్ బుధవారం ఉదయం చెన్నైలో ఘనంగా జరిగింది. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో పలు పాటలు పాడి బహుభాషా గాయనిగా పేరు తెచ్చుకున్న చిన్మయి, యువ నటుడు రాహుల్ రవీంద్రన్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల సమ్మతంతో వీరి వివాహం సోమవారం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో నిడారంబరంగా సాగింది. బుధవారం జరిగిన వివాహ రిసెప్షన్‌కు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నటుడు విజయ్, కుటుంబం, కార్తీ, మిర్చి శివ, వివేక్, గాయని పి.సుశీల, దర్శకుడు గౌతమ్ మీనన్, ధరణి, గీత రచయిత వైరముత్తు తదితర ప్రముఖులు ఉండడం విశేషం. -
దీపికా,రణవీర్‌లు అలా చేశారట!
దీపికా పదుకొనే, రణవీర్ రొమాన్స్, అఫైర్‌పై వస్తున్న వార్తల్లో కొతేమి లేదు. ‘రామ్‌లీలా’ చిత్రం షూటింగ్లో దగ్గరైన వీరిద్దరూ మధ్య బంధం మరింత బలంగా మారిందని తరచుగా గాసిప్స్ రూపంలో వార్తలు వింటునే ఉన్నాం. అయితే వీరద్దరూ ఒకర్ని విడిచి మరొకరు ఉండడంలేదనే వార్తకు ధర్మెంద్ర, హేమామాలిని ముద్దుల కూతురు అహనా డియోల్ పెళ్లి మరింత బలం చేకూర్చింది. పెళ్లిలో దీపికా, రణ్‌వీర్‌ల హడావిడి కొత్త జంటను కూడా సిగ్గుపడేలా చేసిందట. పెళ్లికి హాజరైన వీరిద్దరూ ఒకరిచేతులో మరొకరు చేతులు వేసుకుని.. క్షణమైనా విడిచి ఉండలేమనే భావనను కలిగించారట. కలిసి ముచ్చటిస్తూ, ఒకరి చెవిలో మరొకరు గుసగుసలు, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇద్దరూ అతిధులకు ఆనందాన్ని పంచినట్టు ప్రత్యక్ష సాక్ష్యుల కథనం. అంతేకాకుండా వేదికపై రామ్‌లీలా, గుండే చిత్రాల్లోని పాటలకు జోష్‌తో స్టేప్పులేసి ఆనందంలో మునిగి తేలారు. చాన్స్ దొరికినప్పుడల్లా దీపికాను ముద్దులతో రణ్వీర్ ముంచెత్తారట. -
వివాహ రిసెప్షన్పై గ్రైనెడ్తో దాడి.. 9 మంది మృతి
ఫ్నోమ్ పెన్: వివాహ రిసెప్షన్పై ఓ దుండగుడు గ్రైనెడ్ విసిరి విధ్వంసం సృష్టించాడు. ఈ దుర్ఘటనలో తొమ్మిదిమంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. కంబోడియాలోని కంపాంగ్ దోమ్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో బంధువులు, మిత్రులు నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడని కంపాంగ్ దోమ్ మిలిటరీ పోలీస్ చీఫ్ తెలిపారు. ఈ దాడికి ముక్కోణపు ప్రేమకథ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్య కాదని, ముక్కోణపు ప్రేమకథే దాడికి ప్రేరేపించి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భావిస్తున్నారు. -
రిసెప్షన్ రోజే ఫిట్స్‌తో వరుడి మృతి
గోదావరిఖని, న్యూస్‌లైన్: మూడుముళ్లు.. ఏడడుగులతో ఏకమైన జంటకు మూడో రోజే ఎడబాటు ఎదురైంది. రిసెప్షన్ తంతు ముగిసి బంధువులు ఇళ్లకు కూడా వెళ్లకముందే వరుడు ఫిట్స్‌తో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా యైటింక్లయిన్‌కాలనీ సదానందటాకీస్ ఏరియాలో చెందిన పిడుగు రాజేశం ఆర్టీ-1 ఏరియా వకీల్‌పల్లి గనిలో కోల్‌కట్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజేశం దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు రాజు(26)కు పెద్దపల్లి మండలం కనగర్తికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిపించారు. ఆదివారం ఇంటివద్దే రిసెప్షన్ జరిగింది. బంధుమిత్రులు వచ్చి నూతన జంటను ఆశీర్వదించి భోజనాలు చేశారు. బంధువులు నిద్రకు ఉపక్రమించారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో రాజు ఫిట్స్‌తో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే వరుడు మృతి చెందాడు. ఈ ఘటనతో వధూవరుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది.