Ajay Devgn’s Daughter Nysa Devgan Attends Singer Kanika Kapoor Wedding Reception in London - Sakshi
Sakshi News home page

Kanika Kapoor: సింగర్‌ వెడ్డింగ్‌​ రిసెప్షన్‌లో స్టార్‌ హీరో కూతురు సందడి, ఫొటోలు వైరల్‌

Published Wed, May 25 2022 4:10 PM | Last Updated on Wed, May 25 2022 6:30 PM

Ajay Devgan Daughter Nysa Attends Kanika Kapoor Wedding Reception At Landon - Sakshi

బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా’(పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఊ ఊ అంటావా హిందీ వెర్షన్‌) అంటూ తన గాత్రంతో బాలీవుడ్‌ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన  కనికా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ హతిరమనిని రెండో పెళ్లి చేసుకుంది. లండన్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉసాసన కామినేని హజరైంది. కనికా స్నేహితురాలైన ఉపాసన ఈ పెళ్లిలో సందడి చేసింది. ఇదిలా ఉంటే వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ విక్టోరియా అండ్‌ అల్బర్ట్‌ మ్యూజియంలో గ్రాండ్‌ నిర్వహించారు. ఈ రిసెప్షన్‌లో బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ సందడి చేసింది. బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌, హీరోయిన్‌ కాజోల్‌ ముద్దుల తనయ నైసా దేవగన్‌ ఈ వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు హాజరైంది.

చదవండి: 'డెడ్‌' అని సమంత పోస్ట్‌.. ఆ వెంటనే డిలీట్‌

తన స్నేహితులతో కలిసి ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న నైసా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. బాడీకాన్‌ పింగ్‌ డ్రెస్‌లో లైట్‌ జ్యువెల్లరిలో మెరిసిన నైసా ఈ ఫంక్షన్‌లో సందడి చేసింది. కనికా, తన స్నేహితులతో పాటు ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ముంబైలో జరిగే సెలబ్రెటీలకు సంబంధించిన ఏ వేడుకకైన నైసా తన తల్లి కాజోల్‌, తండ్రి అజయ్‌ దేవగన్‌లతో కలిసి హజరవుతుంది. అయితే తొలిసారి ఆమె ఒంటరిగా ఈ కార్యక్రమంలో కనిపించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఇటీవల 19 ఏళ్లు నిండిన నైసా ప్రస్తుతం సింగపూర్‌లో డిగ్రీ చదువుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement