Kanika Kapoor
-
లండన్‌లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా’(పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఊ ఊ అంటావా హిందీ వెర్షన్) అంటూ తన గాత్రంతో బాలీవుడ్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన కనికా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని రెండో పెళ్లి చేసుకుంది. లండన్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉసాసన కామినేని హజరైంది. కనికా స్నేహితురాలైన ఉపాసన ఈ పెళ్లిలో సందడి చేసింది. ఇదిలా ఉంటే వీరి వెడ్డింగ్ రిసెప్షన్ విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియంలో గ్రాండ్ నిర్వహించారు. ఈ రిసెప్షన్లో బాలీవుడ్ స్టార్ కిడ్ సందడి చేసింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ కాజోల్ ముద్దుల తనయ నైసా దేవగన్ ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైంది. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ తన స్నేహితులతో కలిసి ఈ ఫంక్షన్లో పాల్గొన్న నైసా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బాడీకాన్ పింగ్ డ్రెస్‌లో లైట్ జ్యువెల్లరిలో మెరిసిన నైసా ఈ ఫంక్షన్లో సందడి చేసింది. కనికా, తన స్నేహితులతో పాటు ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ముంబైలో జరిగే సెలబ్రెటీలకు సంబంధించిన ఏ వేడుకకైన నైసా తన తల్లి కాజోల్, తండ్రి అజయ్ దేవగన్‌లతో కలిసి హజరవుతుంది. అయితే తొలిసారి ఆమె ఒంటరిగా ఈ కార్యక్రమంలో కనిపించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఇటీవల 19 ఏళ్లు నిండిన నైసా ప్రస్తుతం సింగపూర్‌లో డిగ్రీ చదువుతోంది. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry1) -
‘పుష్ప’ సింగర్ పెళ్లిలో ఉపాసన సందడి.. ఫోటోలు వైరల్
‘ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా’(పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఊ ఊ అంటావా హిందీ వెర్షన్) అంటూ తన గాత్రంతో బాలీవుడ్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన సింగర్ కనికాకపూర్ రెండో పెళ్లి చేసుకుంది. లండన్‌కు చెందిని ఓ వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని కనికా పెళ్లాడింది. లండన్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో రామ్ చరణ్ సతీమణి, కనికా స్నేహితురాలు ఉపాసన పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కనికకు ఇంతకు ముందే పెళ్లి అయింది. 1988లో లండన్‌కు చెందని వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని.. మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విడాకుల అనంతరం..కెరీర్‌పై దృష్టిపెట్టిన కనికా.. రాగిణి, ఎంఎంఎస్ సినిమా పాటలతో ఫేమస్ అయింది. వీటితో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. ఇక పుష్ప హిందీ వెర్షన్‌లోని ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో కనిక మరింత ఫేమస్ అయింది. -
ఫైవ్ స్టార్ హోటల్లో 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి
బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ పెళ్లి చేసుకుంది. లండన్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్లో వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని పెళ్లాడింది. శుక్రవారం జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లికి హాజరైన సింగర్ మన్మీత్ సింగ్ నూతన వధూవరులతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మీరెంత అందంగా ఉన్నారో మీరు కలిసి సాగించే జర్నీ కూడా అంతే అందంగా ఉండాలని కోరుకుంటున్నా అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా కనికాకు ఇంతకుముందే పెళ్లయింది. 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని లండన్‌కు వెళ్లిపోయింది. ఆమెకు ఆయనా, సమర, యువరాజ్ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలానికి దంపతుల మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి పిల్లల బాధ్యతను కనికానే చూసుకుంటోంది. లక్నోలో పెరిగిన ఆమె అప్పుడప్పుడూ తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్‌కు వస్తూ ఉంటుంది. కాగా కనికా.. బేబీ డాల్, చిట్టియక్కలాయాన్, టుకుర్ టుకుర్, జెండా ఫూల్ పాటలతో జనాలను ఉర్రూతలూగించింది. ఇటీవల పుష్ప మూవీలో ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో అలరించింది. View this post on Instagram A post shared by Kanika Kapoor (@kanik4kapoor) చదవండి 👉🏾 ఒక మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసి ఫ్రీగా నేర్పించాలనుకుంటున్నా మోహన్ లాల్ '12th మ్యాన్' రివ్యూ.. ఎలా ఉందంటే ? -
నిన్ను ఎప్పటికీ మిస్ అవుతా: సింగర్ ఎమోషనల్
Singer Kanika Kapoor Lost Her Grandmother: సింగర్ కనికా కపూర్ ఇంట విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నానమ్మ కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆదివారం నాడు సోషల్ మీడియాలో వెల్లడించిన కనికా నానమ్మతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'నువ్వంటే నాకెంతో ఇష్టం నానమ్మ.. నిన్ను చాలా మిస్ అవుతాను, నీ ఆత్మకు శాంతి కలుగుగాక' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు కనికా బామ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. నటుడు, నిర్మాత సంజయ్ కపూర్, సింగర్ సోఫీ చౌదరి ఆమెకు నివాళులు అర్పించారు. కాగా కనికా.. 'బేబీ డాల్', 'నచ్చా ఫరాటే', 'దేశీ లుక్' వంటి పలు హిట్ సాంగ్స్ పాడి పాపులారిటీ సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Kanika Kapoor (@kanik4kapoor) -
కనికా వాంగ్మూలం రికార్డు..
లక్నో : ఇటీవల కరోనా నుంచి బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ నుంచి లక్నో పోలీసులు పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత లక్నోలో ఆమె పాల్గొన్న పార్టీల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీటిపై ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. లండన్ నుంచి మార్చి10న ఇండియాకు తిరిగివచ్చిన క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించి పలు పార్టీలకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆమె కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఒక్కసారిగా సంచలనం రేపింది. దీంతో ఆమె హాజరైన పార్టీల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. దీంతో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కనికా కపూర్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే కనికాకు ఐదు సార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యుల్లో కొంత ఆందోళన వ్యక్తం అయింది. అయితే ఆ తర్వాత రెండుసార్లు జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. దీంతో కొద్ది రోజుల కిత్రం ఆమెపై నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు కనికాకు నోటీసులు అందజేశారు. మరోవైపు ప్రాణాంతక కరోనా నుంచి కోలుకున్న కనికా.. ఇటీవల కోలుకున్న కనికా కరోనా పేషెంట్ల కోసం తన ప్లాస్మాను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) అధికారులను సంప్రదించి తన రక్త నమూనాలను ఇచ్చారు. చదవండి : కనికా కపూర్ సంచలన నిర్ణయం -
కనికా కపూర్ సంచలన నిర్ణయం
సాక్షి, లక్నో: కరోనా వైరస్ వ్యాప్తిపై అనేక వివాదాలు,ఆరోపణలు, ఆఖరికి యూపీ పోలీసుల కేసును కూడా ఎదుర్కొన్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాంతక కరోనావైరస్ నుండి ఇటీవల కోలుకున్న కనికా కరోనా పేషెంట్ల కోసం తన ప్లాస్మాను దానం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ మేరకు ఆమె లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) అధికారులను సంప్రదించి రక్త నమూనాలను ఇచ్చారు. ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం అధిపతి తులికా చంద్ర ఆమె రక్త నమూనాను పరీక్ష కోసం తీసుకున్నట్టు వెల్లడించారు. పరీక్షల అనంతరం నిర్ణయం తీసుకుంటామనీ, అన్నీ సవ్యంగా వుంటే ఆమెను ప్లాస్మా స్వీకరణకు పిలుస్తామని తులికా చంద్ర చెప్పారు. కరోనా బారిన పడి వరుసగా నెగిటివ్ రిపోర్టులు వచ్చినా, ధైర్యం కోల్పోకుండా పూర్తిగా కోలుకున్న కనికా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లక్నోలో ఉంటున్నారు. తనపై అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేశారంటూ తన అనుభవాలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. (ఇన్నిరోజులు మౌనంగా భరించా : కనికా కపూర్) ప్లాస్మా థెరపీ సత్ఫలితాలనిస్తుండటంతో ఢిల్లీ, కేరళ సహా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా చికిత్స కోసం ప్లాస్మా థెరపీని అందిస్తున్నారు. కేజీఎంయూలో కోలుకున్న ముగ్గురు తమ ప్లాస్మాను దానం చేశారు. వీరిలో కేజీఎంయూ రెసిడెంట్ డాక్టర్, కెనడాకు చెందిన మహిళా వైద్యురాలు, మరొక రోగి వున్నారు. ఆదివారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 58 ఏళ్ల ఓ కరోనా పేషెంట్‌కు ప్లాస్మా థెరపీతో కోలుకుంటున్నాడని వైద్యులు ప్రకటించడం విశేషం. (కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం) కాగా కోవిడ్-19 రోగులకు ప్లాస్మా చికిత్సను ఒక ప్రయోగాత్మక ప్రక్రియగా గుర్తించారు. వైరస్ బారిన పడి కోలుకున్నఆరోగ్యకరమైన వ్యక్తి ప్లాస్మా(రక్త భాగం)ను స్వీకరించి కరోనావైరస్ రోగికి చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే ప్లాస్మా దాతలకు డయాబెటిస్, గుండె జబ్బులు, మలేరియా, సిఫిలిస్ వంటి వ్యాధులు ఉండకూడదు. మరోవైపు ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల రాష్ట్రాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఇన్నిరోజులు మౌనంగా భరించా : కనికా కపూర్
లక్నో: ఇటీవల కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్ కుటుంబంతో సరదాగా గడుపుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తల్లిదండ్రులతో కూర్చొని బాల్కనీలో సరదాగా టీని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా కనిపించారు. ఈ ఫోటోను కనికా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 21 రోజులు ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, ఈ సందర్భంగా ఎమోషనల్‌గా ఎంతో తోడ్పాడునందించిన వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. (కరోనాపై గెలిచిన బాలీవుడ్ గాయని) View this post on Instagram All you need is a warm smile, a warm heart and a warm cup of tea ☕️ #familytime #lucknowdiaries #stayhomestaysafe A post shared by Kanika Kapoor (@kanik4kapoor) on Apr 26, 2020 at 7:09am PDT కరోనాకు సంబంధించి తనపై చాలా ఆరోపణలు వచ్చాయని, వాటిలో తన తప్పేమి లేదని అంటోంది కనికా కపూర్. లండన్ నుంచి తిరిగి వచ్చాక తనలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, దీంతో అందరితో సాధారణంగా మెలిగానని చెప్పింది. అయితే లక్నోలో తను గ్రాండ్ పార్టీ ఏర్పాటుచేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, ఓ స్నేహితుడు ఏర్పాటు చేసిన పార్టీకి తాను హజరైనట్లు స్పష్టం చేసింది. ఇన్ని రోజులు తనపై పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు జరుగుతున్నా మౌనంగా ఉన్నానని, దీనర్థం తప్పు చేసినట్లుకాదు అని పేర్కొంది. ఈ కష్టకాలంలో తనకెంతో అండగా నిలిచిన కుటుంబసభ్యులు, స్నేహితులకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. కాగా విదేశాల నుంచి వచ్చి విషయం దాచిపెట్టి పలు కార్యక్రమాలకు హజరైన కనికా కపూర్‌పై సెక్షన్ 269, 270 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమెకు ఐదోసారి నిర్వహించిన కరోనా పరీక్షలో నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : (కనికాకు కరోనా : కేసు నమోదు) -
కరోనా నుంచి బయటపడ్డ కనికా కపూర్
-
కరోనాపై గెలిచిన బాలీవుడ్ గాయని
లక్నో: బాలీవుడ్ గాయని కనికా కపూర్ కరోనాపై గెలిచి ఇంటికి చేరుకన్నారు. ఆరోసారి ఆమెకు నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఆమెను డిశ్చార్జి చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు నిర్వహించిన కరోనా నిర్ధారిత తొలి నాలుగు టెస్ట్‌ల్లోనూ పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తమయింది. అయితే ఐదు, ఆరోసారి నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఆమెను డిశ్చార్ చేశారు. ఇంటికి చేరుకున్నా, వైద్యుల సూచనలమేరకు 14 రోజులపాటూ కనికా కపూర్ గృహ నిర్బంధంలోనే ఉండనున్నారు. కాగా, విదేశాల నుంచి వచ్చిన తర్వాత కనికా కపూర్ పలు వేడుకల్లో పాల్గోవడం, వాటికి రాజకీయ ప్రముఖులతోపాటు సినీ సెలబ్రిటీలు కూడా హాజరవ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనికాకు కరోనా సోకిందని నిర్ధారణ కాగానే ఆమెకు సన్నిహితంగా మెలిగిన వారందరూ స్వీయ నిర్బంధం విధించుకున్నారు. కనికా కపూర్‌కు కరోనా తగ్గిందని తెలియడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు. భౌతిక దూరం పాటిస్తే కరోనాను సమర్థవంతంగా నిరోధించవచ్చని దీంతో మరోసారి రుజువయింది. -
కరోనా: కనికాకు బిగ్ రిలీఫ్
లక్నో: బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు ఊరట లభించింది. ఐదోసారి ఆమెకు నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని ‘ఏఎన్ఐ’ శనివారం వెల్లడించింది. కోవిడ్-19 లేదని పరీక్షలో తేలినప్పటికీ ఆమెను వెంటనే డిశ్చార్జి చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెకు నిర్వహించే మరో పరీక్షలోనూ నెగెటివ్ వస్తేనే కనికా కపూర్ ఆస్పత్రి నుంచి బయటకు వస్తారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వ్యైదులు తెలిపారు. అంతకుముందు నిర్వహించిన కరోనా నిర్ధారిత నాలుగు టెస్ట్‌ల్లోనూ పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తమయింది. కాగా విదేశాల నుంచి వచ్చిన తర్వాత కనికా కపూర్ పలు వేడుకల్లో పాల్గొన్నారు. రాజకీయ ప్రముఖులతోపాటు సినీ సెలబ్రిటీలు హాజరవగా తీవ్ర కలకలం రేగింది. కనికాకు కరోనా సోకిందని నిర్ధారణ కాగానే ఆమెకు సన్నిహితంగా మెలిగిన వారందరూ స్వీయ నిర్బంధం విధించుకున్నారు. కనికా కపూర్‌కు కరోనా తగ్గిందని తెలియడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు. భౌతిక దూరం పాటిస్తే కరోనాను సమర్థవంతంగా నిరోధించవచ్చని దీంతో మరోసారి రుజువయింది. (కరోనాపై గెలిచి.. సగర్వంగా ఇంటికి..) -
ఊపిరి పీల్చుకున్న సఫారీలు
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తమ క్రికెటర్లకు కరోనా వైరస్ సోకిందేమోనన్న భయంతో వణికిపోతున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. మార్చి నెలలో భారత పర్యటనకు వచ్చిన సఫారీ క్రికెట్ జట్టు.. ఆ ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేయడంతో స్వదేశానికి వెళ్లకతప్పలేదు. దీనికి కారణం కరోనా వైరస్ వ్యాప్తి చెందడమే. అయితే భారత పర్యటన తర్వాత 14 రోజులు క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న ఈ క్రికెటర్లకు కరోనా వైరస్ సోకలేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వర్గాలు తాజాగా వెల్లడించాయి. విదేశాల నుంచి వచ్చిన నేపథ్యంలో క్రికెటర్లు అందరినీ క్వారంటైన్లో ఉంచింది. రోజువారీగా వారిని పర్యవేక్షించిన బోర్డు మెడికల్ టీమ్.. తాజాగా క్రికెటర్ల ఆరోగ్య పరిస్థితిని వెల్లడించింది. అందరూ క్రికెటర్లు ఆరోగ్యంగా ఉన్నారని, క్వారంటైన్ సమయంలో కరోనా అనుమానిత లక్షణాలేవి బయటపడలేదని పేర్కొంది. ఇక కరోనా నిర్దారిత పరీక్ష చేసుకున్న వారందరికీ నెగిటివ్ అని తేలిందని తెలిపింది.(కరోనా టెస్టింగ్ సెంటర్‌గా క్రికెట్ స్టేడియం..!) సఫారీలు తమ భారత పర్యటనలో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే తొలి వన్డే వర్షం వల్ల రద్దు కాగా, రెండో వన్డేకు సిద్ధం అయ్యే లోపే కరోనా వైరస్ ప్రభావంతో సిరీస్‌ను ఉన్నపళంగా రద్దు చేశారు. కాగా, రెండో వన్డే సందర్భంగా లక్నోలో ఒక హెటల్ దిగడం, ఆ హోటల్లోనే కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా బస చేయడం సఫారీ క్రికెటర్లలో భయం పట్టుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్ నుంచి వచ్చిన తమ దేశ క్రికెటర్లను సెల్ఫ్ ఐసోలేషన్(స్వీయ నిర్బంధం)లో ఉండమని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. ఇప్పుడు వారికి కరోనా సోకలేదని తేలడంతో టెన్షన్ కాస్తా పోయింది. -
గాయని కనికాను వదలని కరోనా
-
సింగర్‌కు ఐదోసారీ కరోనా పాజిటివ్
బాలీవుడ్ గాయని కనికా కపూర్ ఆశలు నిరాశలయ్యాయి. ఇప్పటికే నాలుగుసార్లు పాజిటివ్ అని రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, ఐదోసారి తప్పకుండా నెగిటివ్ వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. కానీ సోమవారం నిర్వహించిన కోవిడ్-19 టెస్ట్‌లో మరోసారి పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం గురించి ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొంటున్నాయి. (కనికా కపూర్‌కు కరోనా) కరోనా సోకిన పేషెంట్లకు ప్రతి 48 గంటలకొకసారి పరీక్షలు నిర్వహిస్తారు. అలా ఇప్పటివరకు నాలుగు సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతిసారీ ఆమెకు పాజిటివ్ అనే తేలింది. కాగా విదేశాల నుంచి వచ్చిన కనికా పలు పార్టీల్లో పాల్గొంది. వాటికి రాజకీయ ప్రముఖులతోపాటు సినీ సెలబ్రిటీలు హాజరవగా తీవ్ర కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. కనికాకు కరోనా సోకిందని నిర్ధారణ కాగానే ఆమెకు సన్నిహితంగా మెలిగిన వారందరూ స్వీయ నిర్బంధం విధించుకున్నారు. ఆమె ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. (కనికా కపూర్ ఓ రోగిలా ప్రవర్తించాలి) -
ఈసారైనా నెగెటివ్ వస్తే బాగుండు: సింగర్
కరోనాతో బాధపడుతున్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ తనకు ఇంటికెళ్లాలనుందని భావోద్వేగానికి లోనైంది. పిల్లలను, కుటుంబాన్ని ఎంతగానో మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇప్పటికే ఈ సింగర్‌కు నాలుగు సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతిసారీ కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈసారి టెస్ట్‌లోనైనా నెగెటివ్ రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. "జీవితం సమయాన్ని ఎలా వాడుకోవాలో నేర్పిస్తే, సమయం జీవితం విలువని బోధిస్తుంది" అని రాసి ఉన్న ఇమేజ్ను అభిమానులతో పంచుకుంది. తనపై ఎంతగానో ప్రేమను కురిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం తాను ఐసీయూలో లేనని, తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేసింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు కనికాను కరోనా వదలకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తరలిద్దామన్నా వీలులేకుండా ఉందని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించడం ఒక్కటే తమ ముందున్న ఏకైక మార్గమని వారు పేర్కొంటున్నారు. కాగా మార్చి 9న లండన్ నుంచి తిరిగివచ్చిన కనికా కపూర్ ఉత్తరప్రదేశ్‌లోని హోటల్లో బస చేసింది. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన పార్టీకి పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అదే సమయంలో ఆమెకు కరోనా సోకినట్లు వెల్లడి కావడంతో కలకలం రేగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స తీసుకుంటోంది. (నాలుగోసారి కూడా పాజిటివ్.. ఆందోళనలో కుటుంబం) -
నాలుగోసారి కూడా పాజిటివ్.. ఆందోళనలో కుటుంబం
లక్నో : కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించడంలేదు. నాలుగోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో కూడా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనికా 10 రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నప్పటికీ కరోనా బారి నుంచి బయటపడకపోవడం తమను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. ప్రస్తుతం విమాన సర్వీసులు కూడా నిలిచిపోవడంతో.. మెరుగైన చికిత్స కోసం కనికాను ఎక్కడికి తరలించలేకుండా ఉన్నామని తెలిపారు. కనికా కోలువాలని భగవంతున్ని ప్రార్థించడం ఒక్కటే ప్రస్తుతం తాము చేయగలిగిన పని అని అన్నారు. అయితే కనికా పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, అంతకుముందు మార్చి 9న లండన్ నుంచి తిరిగివచ్చిన కనికా కపూర్ ఉత్తరప్రదేశ్‌లోని హోటల్లో బస చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలిశారు. అదే సమయంలో ఆమెకు కరోనా సోకినట్లు వెల్లడి కావడంతో కలకలం రేగింది. దీంతో ఆమెను కలిసిన పలువురు ప్రముఖులు కూడా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. మరోవైపు కరోనాపై ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు, కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. -
వైరల్ : ప్రిన్స్ చార్లెస్‌తో కనికా..
కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పేరు ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఆమె లండన్ నుంచి తిరిగివచ్చాక కరోనా నిర్ధారణ కాకముందు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా పార్టీలకు హాజరుకావడం కొద్ది రోజుల కిందట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కరోనాపై ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు, కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. దీంతో కనికా నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా కనికా కపూర్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్‌ను కనికా కలిసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో ప్రిన్స్ చార్లెస్‌తో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. అయితే ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ఈ ఫొటోలు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అక్కడే సమస్య మొదలైందని ఒకరు, యూపీ టూ యూకే అని మరోకరు ట్వీట్లు చేస్తున్నారు. కాగా, ఆ ఫొటోలు ఇప్పటివి కావని.. 2015 ప్రిన్స్ చార్లెస్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి చెందినవిగా తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న కనికాకు మూడోసారి నిర్వహించిన పరీక్షలోనూ కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. చదవండి : కరోనా: ఇంకా కోలుకోని కనికా కపూర్ బ్రిటన్ యువరాజు చార్లెస్‌కూ కరోనా -
కరోనా: మూడో టెస్టులోనూ పాజిటివ్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ గాయని కనికా కపూర్‌కు మూడోసారి నిర్వహించిన కరోనా పరీక్షలోనూ పాజిటివ్‌గా తేలింది. లండన్ నుంచి వచ్చిన కనికా కపూర్ ఉత్తరప్రదేశ్‌లోని హోటల్లో బస చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువరు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను కలిశారు. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు వెల్లడి కావడంతో కలకలం రేగింది. ఇక కొన్నాళ్లపాటు స్వీయ నిర్బంధంలో ఉన్న కనికా కపూర్ ప్రస్తుతం సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం, మంగళవారం రాత్రి కనికాకు మరోసారి కరోనా టెస్టు నిర్వహించగా.. మరోసారి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె ఇంకా కోలుకోలేదని.. ఈ క్రమంలో మరో రెండుసార్లు పరీక్షలు నిర్వహించి నెగటివ్‌గా తేలిన తర్వాతే డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. ఇక కనికాతో పాటు హోటల్ తాజ్‌లో బస చేసిన ఆమె స్నేహితుడు ఓజాస్ దేశాయ్‌కు నెగటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. -
కనికాకు కరోనా.. సఫారీ ఆటగాళ్లలో గుబులు
సాక్షి, లక్నో: ఇటీవలే లండన్ నుంచి భారత్‌కు వచ్చిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. అయితే కనికాకు కరోనా సోకిన విషయం తెలియడంతో దక్షిణాఫ్రికా క్రికెటర్లుకు గుబులు పట్టుకుంది. ఎందుకంటే కనికా లండన్ నుంచి నేరుగా లక్నోలోని ఓ హోటల్లోకి దిగింది. అయితే ఇదే సమయంలో వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆ హోటల్లోనే బస చేశారు. అయితే వన్డే సిరీస్ రద్దు కావడంతో లక్నో నుంచి కోల్‌కతా మీదుగా సఫారీ క్రికెటర్లు తమ దేశానికి వెళ్లారు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్ నుంచి వచ్చిన తమ దేశ క్రికెటర్లను సెల్ఫ్ ఐసోలేషన్(స్వీయ నిర్బంధం)లో ఉండమని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. అయితే తాము బస చేసిన హోటల్లోనే కనిక కపూర్ స్టే చేసి ఉండటంతో ఇప్పుడు దక్షిణాఫ్రికా క్రికెటర్లలో టెన్షన్ మొదలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. లండన్ నుంచి వచ్చిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నో లోని ఓ స్టార్ హోటల్లో బస చేసింది. అంతేకాకుండా తన కుటుంబసభ్యులు, స్నేహితులకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ విందుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే కనికాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ విందులో ఎవరెవరు పాల్గొన్నరనే దానిపై వివరాలు సేకరిస్తోంది. అంతేకాకుండా హోటల్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి కరోనా టెస్టులు నిర్వహించింది. ఇదే క్రమంలో ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో రెండో వన్డే కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు లక్నో చేరుకున్నాయి. అయితే కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో వన్డే సిరీస్‌ను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో కోహ్లి అండ్ గ్యాంగ్ ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. కానీ దక్షిణాఫ్రికా క్రికెటర్లు మాత్రం రెండు రోజులు లక్నోలోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే సఫారీ క్రికెటర్లు స్వదేశం వెళ్లాలంటే అత్యంత సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీకి వెళ్లి అటు నుంచి దక్షిణాఫ్రికా బయల్దేరాలి. కానీ ఢిల్లీలో కరోనా వైరస్ విస్తరిస్తోందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో డి కాక్ బృందం దేశ రాజధాని వెళ్లడానికి నిరాకరించింది. దీంతో కరోనా అంతగా ప్రభావం లేని కోల్‌కతా నుంచి దుబాయ్‌కు చేరుకొని కనెక్టింగ్ ఫ్లైట్‌లో స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే ఈ రెండు రోజులు కనికా బస, పార్టీ చేసుకున్న హోట్లోనే తాము ఉన్నామన్న వార్త తెలుసుక్ను సఫారీ క్రికెటర్లు నిర్ఘాంతపోయినట్టు సమాచారం. చదవండి: ‘కనికా కపూర్ ఓ రోగిలా ప్రవర్తించాలి’ మార్చి 31 వరకు తెలంగాణ లాక్డౌన్ -
వాళ్లపై చర్యలు తీసుకోండి : సునీత
సోషల్ మీడియాలో అసందర్భంగా తన ఫొటోను వాడుకోవడంపై ప్రముఖ సింగర్ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్‌తోపాటు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. కోవిడ్-19 పాజిటివ్ తేలిన సింగర్ కనికా కపూర్ న్యూస్‌కు థంబ్‌నైల్‌గా తన ఫొటో ఉంచడంపై సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. అలాగే అందుకు సంబంధించిన స్ర్కీన్ షాట్ షేర్ చేశారు. అలాగే దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె కేటీర్, మహేందర్‌రెడ్డి, తెలంగాణ సీఎంవోను కోరారు. తను క్షేమంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. సునీత పోస్ట్ చేసిన ఫొటోను గమనిస్తే.. ‘ప్రముఖ సింగర్‌కు కరోనా పాజిటివ్ హాస్పిటల్‌కు తరలింపు’ అని పేర్కొన్నారు. ఆ పక్కన సునీత ఫొటోను బ్లర్ చేసి పెట్టారు. అలాగే ఓ మహిళ హాస్పిటల్ ఉన్న ఫొటోను కూడా ఉంచారు. ఈ విషయం సునీత దాకా వెళ్లడంతో ఆమె చాలా ఇబ్బందికి గురైనట్టుగా తెలుస్తోంది. కాగా, ఇటీవల బ్రిటన్ నుంచి తిరిగివచ్చిన కనికాకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. “Chandamama kathalu” FB page used my picture as a thumbnail to access the news of Singer Kanika Kapoor’s testing positive for Covid - 19!! Disgusting! My humble request to concerned officials,please take action. I am fine. @TelanganaDGP @MinisterKTR @TelanganaCMO @TelanganaCOPs pic.twitter.com/GQOoCkilZj — Sunitha Upadrasta (@OfficialSunitha) March 21, 2020 -
‘కనికా కపూర్ ఓ రోగిలా ప్రవర్తించాలి’
లక్నో : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గాయని కనికా కపూర్ ఓ స్టార్లా కాకుండా రోగిలా ప్రవర్తించాలని ఆమెకు చికిత్స అందచేస్తున్న లక్నో ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. బాలీవుడ్ సింగర్‌కు ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించామని, ఆమె ఓ స్టార్లా వ్యవహరించకుండా రోగిలా సహకరించాలని సంజయ్‌గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్) డైరెక్టర్ ఆర్కే ధిమన్ పేర్కొన్నారు. కనిక కపూర్ తన భద్రత కోసం ఆస్పత్రితో సహకరించాలని అన్నారు. (జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది?) ఆమెకు కోవిడ్-19 యూనిట్లో ఏసీ, టెలివిజన్ సహా అన్ని సదుపాయాలూ కల్పించామని ఆమె ముందు స్టార్లా కాకుండా రోగిలా మసులుకోవాలని హితవు పలికారు. దేశంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తొలి బాలీవుడ్ సెలెబ్రిటి కనికా కపూర్ కావడం గమనార్హం. తాను కరోనా వైరస్ బారిన పడినట్టు కనికా కపూర్ వెల్లడించిన వెంటనే బీజేపీ ఎంపీ, మాజీ రాజస్ధాన్ సీఎం వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. సింగ్ లక్నోలో ఓ పార్టీలో కనికా కపూర్‌ను కలిశారు. చదవండి : కనికా కపూర్‌కు కరోనా -
ఎగబాకుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: ఒకే రోజు భారత్ మొత్తమ్మీద 60 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 283కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. వీరిలో వ్యాధి కారణంగా మరణించిన ఐదుగురితోపాటు 39 మంది విదేశీయులు (ఇటలీ 17, ఫిలిప్పీన్స్ 3, యూకే 2, కెనడా, ఇండోనేసియా, సింగపూర్ల నుంచి ఒక్కొక్కరు) కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో వైరస్ బాధితుల సంఖ్య 63కు చేరుకోగా ఇందులో నలుగురు విదేశీయులు ఉన్నారు. కేరళలో ఏడుగురు విదేశీయులతో కలిపి 40 మంది వ్యాధి బారిన పడ్డారు. ఢిల్లీలో ఒక విదేశీయుడితో కలిపి 26 మంది, ఉత్తరప్రదేశ్‌లో ఒక విదేశీయుడు, 24 మంది, తెలంగాణలో 11 మంది విదేశీయులతో కలిపి 21 మంది, రాజస్తాన్‌లో ఇద్దరు విదేశీయులతో కలిపి 17 మంది హరియాణాలో 14 మంది విదేశీయులు, ముగ్గురు భారతీయులు వ్యాధి బారిన పడినట్లు అధికారులు చెప్పారు. కర్ణాటకలో మొత్తం 15 మంది కోవిడ్ బాధితులు ఉండగా, పంజాబ్, లడాఖ్‌లలో 13 మంది చొప్పున, గుజరాత్లో ఏడుగురు, కశ్మీర్లో నలుగురు ఉన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ముగ్గురు చొప్పున వ్యాధి బారిన పడ్డారు. పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్, చండీగఢ్‌లలో ఒక్కో కేసు నమోదైంది. విద్యా సంస్థల హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను అక్కడే ఉండనివ్వాలని, తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ దేశంలోని విద్యా సంస్థలకు సూచించింది. యూపీ మంత్రికి నెగెటివ్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గాయని కనిక కపూర్‌తో ఒక పార్టీలో గడిపిన ఉత్తరప్రదేశ్ మంత్రి జై ప్రతాప్ సింగ్ కోవిడ్ బారిన పడలేదని శనివారం స్పష్టమైంది. కనిక కపూర్ పార్టీలో గడిపిన తర్వాత జై ప్రతాప్ ఇంటికే పరిమితం కాగా.. ఆయన రక్త నమూనాల్లో వైరస్ లేనట్లు పరీక్షలు స్పష్టం చేశాయి. జై ప్రతాప్‌తో సన్నిహితంగా మెలిగిన 28 మందికీ వ్యాధి సోకనట్లు స్పష్టమైందని కింగ్ జార్జ్ మెడికల్ వర్సిటీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధీర్ సింగ్ తెలిపారు. తనకు కరోనా సోకినట్లు కనిక కపూర్ ప్రకటించిన తరువాత ఆ గాయనితో సన్నిహితంగా మెలిగిన రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే, కుమారుడు దుష్యంత్ సింగ్‌లు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లడం తెల్సిందే. ఆన్లైన్లో విలేకరుల సమావేశం కరోనా వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఇకపై విలేకరుల సమావేశాలన్నింటినీ ఆన్లైన్ మార్గంలో నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విలేకరులు వ్యాధి బారిన పడకుండా నివారించవచ్చునన్నది ప్రభుత్వ ఉద్దేశం. ‘కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న విలేకరులు తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇకపై ఢిల్లీ ప్రభుత్వపు అన్ని విలేకరుల సమావేశాలను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తాం’ అని సీఎం కేజ్రీవాల్ ట్వీట్‌చేశారు. ఢిల్లీలో పేదలను ఆదుకునేందుకు వచ్చే నెల యాభై శాతం రేషన్ సరుకులు ఎక్కువగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు వితంతు, దివ్యాంగుల, వృద్ధాప్య పింఛన్లను రెట్టింపు చేశారు పలు రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో మార్చి 31వరకు నియంత్రణలు విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల సీఎంలు తెలపగా గోవా మొత్తం 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో స్టార్హోటళ్లతోపాటు అన్నిచోట్ల మద్యం అమ్మకాలను నిలిపివేశారు. బెంగాల్లో అన్ని బార్లు, పబ్‌లు, హోటళ్లను బంద్ చేశారు. అత్యవసర వైద్యం కోసం శిక్షణ కరోనా వైరస్ ప్రభావం మరింత తీవ్రతరమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వ్యాధిపీడితులకు తగిన చికిత్స అందించేందుకు దేశంలోని వెయ్యి ప్రాంతాల్లో కొంతమందికి వీడియో ద్వారా శిక్షణ ఇచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్న అంశంపై ఆదివారం ఒక డమ్మీ డ్రిల్ చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు జరిగాయని, లక్షణాలు లేకున్నా వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న వారికి ఐదు, 14వ రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. మాస్కులు, శానిటైజర్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని, డియోడరెంట్లు తయారు చేసే కంపెనీలు శానిటైజర్లు తయారు చేసేందుకు రాష్ట్రాలు అనుమతివ్వాలని సూచించారు. మాస్కుల వాడకంపై చాలా అపోహలు ఉన్నాయని, ఇవి అందరికీ అవసరం లేదని మనుషులకు కొంచెం దూరంగా ఉండటం వైరస్ వ్యాప్తి నిరోధానికి ముఖ్యమని వివరించారు. ప్రభుత్వం ఇప్పటివరకు విదేశాల్లో చిక్కుకుపోయిన 1700 మంది భారతీయులను తిరిగి తెచ్చిందని తెలిపారు. సామూహిక వ్యాప్తి జరుగుతోందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అలా జరిగినప్పుడు ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కోవిడ్ బారిన పడ్డ వారికి సన్నిహితంగా ఉన్న స్ముఆరు 7000 మందిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణాలు వద్దు: మోదీ వలసదారులు సహా ప్రజలంతా ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని, కరోనా భయంతో సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చేయవద్దని ప్రధాని కోరారు. ఇలాంటి సమయాల్లో ప్రయాణాలు చేసే వారు, తమతోపాటు కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసినట్లేనని హెచ్చరించారు. ఎవరూ ఎక్కడికీ వెళ్లవద్దని కోరారు. నగరాల్లో కరోనా కేసులు బయటపడటంతో జనం భయంతో సొంతూళ్లకు వెళుతున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో మోదీ మాట్లాడారు. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లడం వల్ల వైరస్ ముప్పు మరింత పెరుగుతుందన్నారు. అలాగే, సొంతూళ్లకు వెళితే అక్కడి వారికి కూడా ఈ వ్యాప్తి విస్తరించే ప్రమాదముందని పేర్కొన్నారు. అందుకే, అత్యవసరమైతేనే బయటకు అడుగుపెట్టాలని దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. -
సంతోషంగా ఉంది: వసుంధరా రాజే
జైపూర్: తన, తన కుమారుడికి సంబంధించిన కరోనా వైరస్ పరీక్షల ఫలితాల్లో నెగటివ్ అని తేలిందని రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో జరిగిన ఓ పార్టీలో వసుంధరా రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన కనికాకు కరోనా సోకినట్లు వెల్లడికాడంతో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అంతేగాకుండా దుష్యంత్ సింగ్ వివిధ రాజకీయ నాయకులు, ఎంపీలను కలిసిన క్రమంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కనికా హాజరైన పార్టీకి వెళ్లిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.(ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక!) ఈ క్రమంలో వసుంధరా రాజే, దుష్యంత్ సింగ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ‘‘ కోవిడ్-19 పరీక్ష నిర్వహించిన తర్వాత.. నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. అయితే ఫలితాలు నెగటివ్‌గా వచ్చినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా మేం మరో 15 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటాం’’అని వసుంధరా రాజే ట్వీట్ చేశారు. అదే విధంగా తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక వైద్యుల సూచన మేరకు తాము నిర్బంధంలో ఉంటామంటూ దుష్యంత్ సింగ్ కూడా ట్విటర్లో పేర్కొన్నారు. కాగా వీరితో పాటు పార్టీకి వెళ్లిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రికి కూడా కరోనా నెగటివ్‌గా తేలడంతో అధికార వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా కనికా కపూర్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (మాస్కు ధర రూ. 8, శానిటైజర్ ధర రూ.100) After conducting a #Covid19 test, I’m happy to inform you that the results came back negative. However, as a preventive measure, my son and I will continue to be in isolation for 15 days. — Vasundhara Raje (@VasundharaBJP) March 21, 2020 -
‘ఇంట్లోనే ఉన్నా.. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు’
న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ నిబంధనలు ఉల్లంఘించి క్వారంటైన్ నుంచి బయటకు వచ్చారంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. జోర్డాన్‌లోని అమ్మన్లో జరిగిన ఆసియా- ఓషనియా ఒలంపిక్ క్వాలిఫైయర్స్‌లో పాల్గొన్న ఆమె ఇటీవలే భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ మార్చి 18న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో మార్చి 13న స్వదేశానికి చేరుకున్న మేరీ కోమ్.. 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిన నిబంధనను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి భవన్లో ఆమె ఎంపీ దుష్యంత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.(ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక! ) ఈ నేపథ్యంలో మేరీ కోమ్ శనివారం మీడియాతో మాట్లాడారు. జోర్డాన్ నుంచి వచ్చిన నాటి నుంచి తాను ఇంట్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. కేవలం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు మాత్రమే హాజరయ్యానని.. బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌ను తాను కలవలేదని తెలిపారు. తన క్వారంటైన్ ముగిసిందని... అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మరో మూడు నుంచి నాలుగు రోజులు ఇంట్లోనే ఉండటానికి తనకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ఓ పార్టీలో రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్ నుంచి వచ్చిన కనికాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెతో పాటు వీరిద్దరు, వీరిని కలిసిన మరికొందరు ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం విదితమే. ఇక ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. (మీ నాయకత్వం అచ్చం అలాగే: పీటర్సన్) MC Mary Kom: I am home since I came back from Jordan. I only attended the President's event and did not meet BJP MP Dushyant Singh or shake hands with him at all. My quarantine after Jordan ends, but I’m going to be at home only for the next 3-4 days. (File pic) #Coronavirus pic.twitter.com/itEfFuzWGO — ANI (@ANI) March 21, 2020 -
ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక!
ముంబై: ‘‘సర్.. మీ మెదడులో వైరస్ ప్రవేశించింది... ప్రతీ కనికను జైల్లో పెట్టాలని కోరుకుంటున్నారా? మెదడును వెలిగించుకోండి.. ప్రేమను పంచండి.. ఇంట్లో కూర్చోండి... సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోండి’’అని సినీ రచయిత కనికా థిల్లాన్ ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసత్య వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలంటూ హితవు పలికారు. సినీ నేపథ్య గాయని కనికా కపూర్ తనకు కరోనా వైరస్(కోవిడ్-19) సోకిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పలు పార్టీలకు హాజరుకావడంతో.. అక్కడికి వచ్చిన ఎంపీలు, మంత్రులు, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సహా ఇతర ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ క్రమంలో కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టారంటూ కనికా కపూర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.(కనికాకు కరోనా : కేసు నమోదు) ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ కనికా కపూర్‌కు బదులు.. కనికా థిల్లాన్ను ట్యాగ్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘ నీతో పాటు ఇతరులకు కూడా వైరస్ సోకేలా చేశావు. నిన్ను నువ్వు సెలబ్రిటీ అని చెప్పుకుంటూ తిరుగుతావు కదా. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటావు. నిన్ను జైల్లో కూర్చోబెట్టాలి’’అంటూ #కనికాకపూర్క్రిమినల్ అనే హ్యాష్‌ట్యాగ్ జతచేశాడు. ఇందుకు స్పందించిన కనికా థిల్లాన్ అతడి అవగాహనా రాహిత్యాన్ని ఎండగట్టారు. అంతేకాదు కరోనా వ్యాప్తి చెందకుండా మీ వంతు బాధ్యత నెరవేర్చాలని సూచించారు. కాగా సైజ్ జీరో, మన్మర్జియాన్, జడ్జిమెంటల్ హై క్యా తదితర చిత్రాలకు స్క్రిప్టు రైటర్‌గా పనిచేసిన కనికా థిల్లాన్... దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే తాము విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. ఇక ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దేశంలో ఇప్పటికే 271 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా నాలుగు కరోనా మరణాలు సంభించాయి. ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందికి పైగా ఈ మహమ్మారికి బలయ్యారు.(హీరోయిన్‌కు కరోనా.. బ్రేకప్ చెప్పిన ప్రియుడు..!) Sir virus apke dimaag mein chala gaya hai.. har Kanika ko utha ke jail mein daaloge? Naam suraj hai- dimaag andhkaar mein! Dimaag ki batti chalao! Pyaar phailao- ghar pe raho... haath-sabun se dho!! Namaste! #CoronaStopKaroNa https://t.co/IkWOLIpT9U — Kanika Dhillon (@KanikaDhillon) March 20, 2020 -
కనికాకు కరోనా : కేసు నమోదు
లక్నో : బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్‌పై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఐపీసీ 188, 269, 270 సెక్షన్ల్ ప్రకారం సరోజిని నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ పాండే తెలిపారు. అలాగే చట్టంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గుమికూడి ఉండటం వంటి చట్టాల ప్రకారం ఆమెపై మరో రెండు ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనట్లు వెల్లడించారు. కాగా కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్‌ను వైద్యులు నిర్థారించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె లక్నోలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. (కనికా కపూర్‌కు కరోనా) దీనిలో రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్‌లు పాల్గొన్నారు. రాజస్తాన్ నుంచి ఎంపీగా ఉన్న దుష్యంత్ పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్‌లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో వారు కూడా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక మార్చి 18న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన ఉపాహార విందుకు పలువురు ఎంపీలతోపాటు దుష్యంత్ కూడా హాజరయ్యారని, బుధవారం రవాణా, సాంస్కృతిక శాఖలు నిర్వహించిన సమావేశంలోనూ దుష్యంత్ 20 మంది ఎంపీలతో కలిసి ఉన్నారని డెరెక్ వివరించారు. (కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం) విమర్శలు వెల్లువ.. మరోవైపు కనికా బాధ్యతారాహిత్యంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి తిరిగివచ్చినవారు కచ్చితంగా రెండు వారాల స్వీయ నిర్బంధం పాటించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినా... కనిక ఇవేమీ పట్టనట్టు వ్యవహరించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రెటీ హోదాలో ఉండి కూడా నిర్లక్ష్యంగా దావత్‌లకు హాజరై ముప్పు తెచ్చారని విమర్శిస్తున్నారు. అయితే కనిక మాత్రం తన తప్పేమీ లేదని వాదిస్తున్నది. పదిరోజుల కిందట ఎయిర్‌పోర్టుల్లో పరీక్షించినప్పుడు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పింది. నాలుగురోజుల కిందట ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు పేర్కొంది.