
బాలీవుడ్ గాయని కనికా కపూర్ ఆశలు నిరాశలయ్యాయి. ఇప్పటికే నాలుగుసార్లు పాజిటివ్ అని రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, ఐదోసారి తప్పకుండా నెగిటివ్ వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. కానీ సోమవారం నిర్వహించిన కోవిడ్-19 టెస్ట్లో మరోసారి పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం గురించి ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొంటున్నాయి. (కనికా కపూర్‌కు కరోనా)
కరోనా సోకిన పేషెంట్లకు ప్రతి 48 గంటలకొకసారి పరీక్షలు నిర్వహిస్తారు. అలా ఇప్పటివరకు నాలుగు సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతిసారీ ఆమెకు పాజిటివ్ అనే తేలింది. కాగా విదేశాల నుంచి వచ్చిన కనికా పలు పార్టీల్లో పాల్గొంది. వాటికి రాజకీయ ప్రముఖులతోపాటు సినీ సెలబ్రిటీలు హాజరవగా తీవ్ర కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. కనికాకు కరోనా సోకిందని నిర్ధారణ కాగానే ఆమెకు సన్నిహితంగా మెలిగిన వారందరూ స్వీయ నిర్బంధం విధించుకున్నారు. ఆమె ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. (కనికా కపూర్ ఓ రోగిలా ప్రవర్తించాలి)
Comments
Please login to add a commentAdd a comment