'ఆ భాష నాకు తెలియదు'
ముంబై: తాను పంజాబ్ రాష్ట్రానికి చెందినదాన్ని కాదని గాయని కనిక కపూర్ వెల్లడించింది. తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని, పంజాబ్ భాష తనకు తెలియదని ఆమె తెలిపింది. బాలీవుడ్ లో పంజాబీ తరహా పాటలకు పేరు గాంచడంతో ఆమె పంజాబ్ రాష్ట్రానికి చెందినది అంతా భావించారు.
'నాకు పంజాబీ తెలియదు. ఉత్తరప్రదేశ్ లోని ఖత్రి నా స్వస్థలం. ఇటీవలే బెంగాలీ పాట పాడాను. రెండు వారాల్లో ఇది విడుదలవుతుంది. కన్నడ పాట కూడా పాడాను. నేను పాడిన పంజాబీ పాటలు బాగా హిట్ కావడంతో బాగా పేరొచ్చింది. పంజాబీలో ఎలా పాలకాలో తెలుకుని పాడుతున్నా'ని కనిక వెల్లడించింది.
'ఉడ్తా పంజాబ్'లో ఆమె పాడిన పాటను 'దాదా దాసే' పాటకు మంచి స్పందన వస్తోంది. బాలీవుడ్ లో నిలదొక్కుకోవడంతో పాటల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నానని కనిక తెలిపింది. వలర్డ్ మ్యూజిక్ డే సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. గాయనీగాయకులు తమ కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించింది.