
Singer Kanika Kapoor Lost Her Grandmother: సింగర్ కనికా కపూర్ ఇంట విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నానమ్మ కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆదివారం నాడు సోషల్ మీడియాలో వెల్లడించిన కనికా నానమ్మతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
'నువ్వంటే నాకెంతో ఇష్టం నానమ్మ.. నిన్ను చాలా మిస్ అవుతాను, నీ ఆత్మకు శాంతి కలుగుగాక' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు కనికా బామ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. నటుడు, నిర్మాత సంజయ్ కపూర్, సింగర్ సోఫీ చౌదరి ఆమెకు నివాళులు అర్పించారు. కాగా కనికా.. 'బేబీ డాల్', 'నచ్చా ఫరాటే', 'దేశీ లుక్' వంటి పలు హిట్ సాంగ్స్ పాడి పాపులారిటీ సంపాదించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment