Punjabi Songs
-
ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. ముఖ్యంగా మెట్రోలో లవర్స్ శ్రుతి మించి వ్యవహరించడం, యువతీ యువకుల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పాపులర్ అయ్యేందుకే కొంతమంది మెట్రోను ఉపయోగించుకుంటున్నారనే సందేహం కలుగుతోంది. మెట్రోలో వీడియోలు చిత్రీకరించడంపై బ్యాన్ విధించాలంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ యువతి తన డ్యాన్స్‌తో వైరల్‌గా మారింది. రెడ్ టాప్, గ్రే కలర్ స్కర్ట్ ధరించిన యువతి కాకా పాడిన 'షేప్' అనే పంజాబీ పాటకు డ్యాన్స్ చేసింది. మెట్రో మధ్యలో నిలబడి ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. ఈ వీడియోను సదరు యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసింది. అయితే.. మెట్రోలో డ్యాన్స్ చేయడానికి అనుమతి లేదని తెలుసని, కానీ మొదటిసారి ఢిల్లీ మెట్రోలో ఇలా ట్రై చేశానని చెబుతూ మరీ యువతి తన వీడియోను పోస్టు చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది యువతి డ్యాన్స్‌ను, ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొంతమంది మెట్రోలో ఇలాంటి పిచ్చి వేషాలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదవండి: ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిల ఫ్లాట్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. View this post on Instagram A post shared by self taught✨🤌 (@itz__officialroy) -
స్టెప్పులేసి అక్కడున్న వారిని అలరించాడు
-
చిందులతో చించేశాడు.. వైరల్
ఒక్క ఫోటో లేదా ఒక్క వీడియో చాలూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోడానికి. పాకిస్థాన్‌కు చెందిన ఓ కుర్రాడు కూడా ఇప్పుడు అలాంటి పనే చేసి హాట్ టాపిక్‌గా మారిపోయాడు. 6.8 మిలియన్‌పైగా వ్యూవ్స్‌తో ఆ వీడియో దూసుకుపోతోంది. అతను చేసిన పని అలాంటిది మరి... కరాచీలోని హైపర్స్టార్ మాల్.. మెహ్రోజ్ బైగ్ అనే విద్యార్థి ఫార్మల్ వేర్లో అక్కడికొచ్చాడు. ఇంతలో పంజాబీ సెన్సేషన్ హిట్ సాంగ్ ‘లాంగ్ లాచీ’ ప్లే అయ్యింది. అంతే బైగ్.. స్టెప్పులేసి అక్కడున్న వారిని అలరించాడు. అతని డాన్సులకు ముగ్దుడైపోయిన ఓ పెద్దాయన కూడా బైగ్తో జత కలిశాడు. లయబద్ధంగా ఎక్స్ప్రెషన్లతోసహా బైగ్ ఇచ్చిన మూమెంట్స్‌కు అంతా ఫిదా అయిపోయారు. మెహ్రోజ్ వీడియో ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. కొత్తేంకాదు.. మెహ్రోజ్ బైగ్‌కు ఇదేం కొత్త కాదు. అయితే అతనికి ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉంది. గతంలో తీస్మార్ ఖాన్ చిత్రంలోని షీలాకీ జవానీ పాటకు కత్రినా టైపులోనే ఈ కుర్రాడు స్టెప్పులేసి ఆకట్టుకున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. అంతేకాదు అతనికి 1700 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానెల్ కూడా ఒకటి ఉంది. -
'ఆ భాష నాకు తెలియదు'
ముంబై: తాను పంజాబ్ రాష్ట్రానికి చెందినదాన్ని కాదని గాయని కనిక కపూర్ వెల్లడించింది. తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని, పంజాబ్ భాష తనకు తెలియదని ఆమె తెలిపింది. బాలీవుడ్ లో పంజాబీ తరహా పాటలకు పేరు గాంచడంతో ఆమె పంజాబ్ రాష్ట్రానికి చెందినది అంతా భావించారు. 'నాకు పంజాబీ తెలియదు. ఉత్తరప్రదేశ్ లోని ఖత్రి నా స్వస్థలం. ఇటీవలే బెంగాలీ పాట పాడాను. రెండు వారాల్లో ఇది విడుదలవుతుంది. కన్నడ పాట కూడా పాడాను. నేను పాడిన పంజాబీ పాటలు బాగా హిట్ కావడంతో బాగా పేరొచ్చింది. పంజాబీలో ఎలా పాలకాలో తెలుకుని పాడుతున్నా'ని కనిక వెల్లడించింది. 'ఉడ్తా పంజాబ్'లో ఆమె పాడిన పాటను 'దాదా దాసే' పాటకు మంచి స్పందన వస్తోంది. బాలీవుడ్ లో నిలదొక్కుకోవడంతో పాటల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నానని కనిక తెలిపింది. వలర్డ్ మ్యూజిక్ డే సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. గాయనీగాయకులు తమ కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించింది.