చిందులతో చించేశాడు.. వైరల్‌ | Pakistan Boy Laung Lachi Version Breaks Internet | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 13 2018 1:20 PM | Last Updated on Fri, Jul 13 2018 1:24 PM

Pakistan Boy Laung Lachi Version Breaks Internet - Sakshi

ఒక్క ఫోటో లేదా ఒక్క వీడియో చాలూ.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోడానికి. పాకిస్థాన్‌కు చెందిన ఓ కుర్రాడు కూడా ఇప్పుడు అలాంటి పనే చేసి హాట్‌ టాపిక్‌గా మారిపోయాడు. 6.8 మిలియన్‌పైగా వ్యూవ్స్‌తో ఆ వీడియో దూసుకుపోతోంది. అతను చేసిన పని అలాంటిది మరి... 

కరాచీలోని హైపర్‌స్టార్‌ మాల్‌.. మెహ్రోజ్‌ బైగ్‌ అనే విద్యార్థి ఫార్మల్‌ వేర్‌లో అక్కడికొచ్చాడు. ఇంతలో పంజాబీ  సెన్సేషన్‌ హిట్‌ సాంగ్‌ ‘లాంగ్‌ లాచీ’ ప్లే అయ్యింది. అంతే బైగ్‌.. స్టెప్పులేసి అక్కడున్న వారిని అలరించాడు. అతని డాన్సులకు ముగ్దుడైపోయిన ఓ పెద్దాయన కూడా బైగ్‌తో జత కలిశాడు. లయబద్ధంగా ఎక్స్‌ప్రెషన్లతోసహా బైగ్‌ ఇచ్చిన మూమెంట్స్‌కు అంతా ఫిదా అయిపోయారు. మెహ్రోజ్‌ వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది.

కొత్తేంకాదు.. మెహ్రోజ్‌ బైగ్‌కు ఇదేం కొత్త కాదు. అయితే అతనికి ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉంది. గతంలో తీస్‌మార్‌ ఖాన్‌ చిత్రంలోని షీలాకీ జవానీ పాటకు కత్రినా టైపులోనే ఈ కుర్రాడు స్టెప్పులేసి ఆకట్టుకున్న వీడియో కూడా వైరల్‌ అవుతోంది. అంతేకాదు అతనికి 1700 మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఒకటి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement